Brahmamudi April 22nd Episode : సీక్రెట్ ఏజెంట్‌గా రాజ్.. దుగ్గిరాల ఫ్యామిలీకి షాకిచ్చే ప్లాన్‌తో రుద్రాణి
అపర్ణతో కేక్ కట్ చేయించామని యామిని చెప్పడంతో ఇంతకీ ఆ అపర్ణ ఎవరని అడుగుతారు తల్లిదండ్రులు. రాజ్ కన్నతల్లి అని చెప్పడంతో వైదేహి, రఘునాథ్‌లు షాక్ అవుతారు. నువ్వు రాజ్ కుటుంబానికి దూరం చేస్తున్నావని మండిపడతాడు రఘునాథ్. రేపు బావని పెళ్లి చేసుకుంటే వాళ్లు నా ఫ్యామిలీయే కదా అని అంటుంది యామిని. మరి కావ్య పరిస్ధితి ఏంటి అని ప్రశ్నించగా.. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుందని అంటుంది యామిని.
గుడి నుంచి వచ్చిన అపర్ణ, కావ్యలు అందరికీ ప్రసాదం పంచుతారు. ఇన్ని రోజులు కావ్యే అనుకున్నాం.. ఇప్పుడు ఇంట్లో రెండో పిచ్చింది ఉందని అపర్ణ గురించి ఎగతాళిగా మాట్లాడటంతో అంతా షాక్ అవుతారు. కావ్యని కొన్నిరోజులు ఏం అడగొద్దని, ఇంట్లో మనశ్శాంతిని దూరం చేయొద్దని రుద్రాణికి చీవాట్లు పెడతాడు సుభాష్. కావ్యని ఎన్నిసార్లు అడిగినా తన గతం గురించి చెప్పకపోవడంతో తనకు పార్శిల్ పంపిన కొరియర్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తాడు రాజ్. పార్శిల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి రావడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్‌లో 702లో ఏం జరిగిందంటే?

కావ్య- అపర్ణలు అందరినీ భోజనానికి పిలుస్తుండగా ఆఫీస్‌కి చెందిన కొంతమంది ఉద్యోగులు ఇంటికి వస్తారు. రాజ్ దూరమయ్యాక మనం ఎంత బాధపడుతున్నామో, వీళ్లు కూడా అంతే బాధపడుతున్నారని అంటుంది రుద్రాణి. దేవుడు లాంటి మనిషి దేవుడి దగ్గరికి వెళ్లిపోయాక.. వీళ్లెవ్వరూ సంతోషంగా లేరని.. అందుకే రాజ్‌కి ఘనంగా శ్రద్ధాంజలి కట్టించాలని అనుకుంటున్నారని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో కావ్య, అపర్ణ రగిలిపోతారు. స్టాఫ్ అంతా మెయిన్ బ్రాంచికి వచ్చి రాజ్‌కి శ్రద్ధాంజలి ఘటించాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతుంది రుద్రాణి.
ముందు మెయిన్ బ్రాంచ్ వాళ్లే చేయాలని అనుకున్నారని.. వాళ్లు ఫోన్ చేసి చెప్పగానే నాకు చాలా కోపం వచ్చిందని అంటుంది. అన్ని బ్రాంచ్‌లలో ఉన్నవాళ్లకి కూడా రాజ్ బాసేనని చెబుతుంది. వాళ్లందరినీ ఇప్పుడు ఒకేచోటికి రప్పిస్తున్నానని అంటుంది. ఆ మాటలతో అందరూ కలిసి రుద్రాణికి చీవాట్లు పెడతారు. నన్నెందుకు తిడుతున్నావని రుద్రాణి ప్రశ్నించగా.. అత్తయ్య కాబట్టి మాటలతో సరిపెట్టిందని, అదే నేనైతే అని మండిపడుతుంది అపర్ణ. ఇప్పుడు ఇలాంటివేవీ వద్దని , నేను తర్వాత మాట్లాడతానని చెప్పి పంపించేస్తుంది కావ్య.
వాళ్లు రాజ్‌కు శ్రద్ధాంజలి ఘటించాలని ఎంతో గౌరవంతో ఇంతదూరం వస్తే అలా అవమానించి పంపిస్తావా? అని కావ్యపై మండిపడుతుంది రుద్రాణి. రాజ్ బ్రతికే ఉన్నాడు.. త్వరలోనే ఇంటికొస్తాడని నేను చెప్పాను కదా? ఇంతలోనే ఇదంతా ఏంటీ అని మండిపడుతుంది అపర్ణ. రాజ్ బ్రతికే ఉన్నాడని మీకు ఎవరు చెప్పారు? కావ్యే కదా అని అంటుంది. కొడుకు గురించి తల్లికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని , వాడు బ్రతికే ఉన్నాడని నా మనసుకు తెలుస్తుందని , వాడు తిరిగి వస్తాడు అనేదానికి నా మనస్సాక్షే సాక్ష్యం అని అంటుంది అపర్ణ. నా కొడుకు గురించి ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని వార్నింగ్ ఇస్తుంది.
టైం బాగోనప్పుడు ఆచితూచి అడుగులు వేయాలని రుద్రాణితో అంటాడు రాహుల్. అందరి చేత చీవాట్లు పడితే పడ్డాయి కానీ నాకొక క్లారిటీ వచ్చిందని చెబుతుంది రుద్రాణి. కావ్య, వదిన కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారని , వీళ్లకి ఏదో నిజం తెలిసిందని .. అదేంటో మనం కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది రుద్రాణి. రాజ్ లేకపోతే కొన్ని పనులు ఆగిపోతాయని.. వాడు రావాల్సిందేనన్న అవసరాన్ని ఇంట్లో కల్పించాలని చెబుతుంది రుద్రాణి. నువ్వు రేపు ఆఫీస్‌కి వెళ్లి అక్కడ కాంట్రాక్ట్‌కు సంబంధించిన విషయాలన్నీ కనుక్కోమని రాహుల్‌కి చెబుతుంది. రాజ్ లేకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయో తెలుసుకో.. అప్పుడు నిజాలు ఎందుకు బయటపడవో నేను కూడా చూస్తానని అంటుంది.
రాజ్ కోసం పార్క్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. రంగు రంగుల షర్ట్ వేసుకుని , కళ్లజోడు పెట్టుకుని వస్తున్న రాజ్‌ని చూసి కావ్య షాక్ అవుతుంది. మొత్తం స్టైల్ మార్చేశారని కావ్య ప్రశ్నించగా.. నాకు నేనెవరో తెలిసిపోయిందని , గతం మొత్తం గుర్తొచ్చేసిందని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. నేను ఒకప్పుడు రా ఏజెంట్‌నని, నిన్న మీరు పంపించిన గిఫ్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లు పంపించారని తెలిసిపోయిందని అంటాడు రాజ్. నేను రామ్ మనోహర్.. సీక్రెట్ ఏజెంట్‌నని అంటూ మురిసిపోతాడు. రా ఏజెంట్ అంటే ఇన్సూరెన్స్‌లు కట్టించుకుంటుందా ? అని కావ్య సెటైర్ వేయగా.. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని, భారతదేశ గూఢచార సంస్థ అని చెబుతాడు . ఇవన్నీ ఏ బుక్‌లో చదివారని అంటుంది.
మనిద్దరం అండర్ కవర్ పోలీసులమని నాకు తెలిసిపోయిందని అంటాడు. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. ఇంకా మీకేం గుర్తొస్తున్నాయని అంటుంది. రా లో పనిచేసినప్పుడు ఎన్నో సక్సెస్‌ఫుల్ ఆపరేషన్లు చేశామని చెబుతాడు. ఓ పెద్ద ఆపరేషన్ చేస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో నా గతం మొత్తం మరిచిపోయానని అంటాడు . మొన్న మొన్ననే కోమాలో నుంచి బయటపడి నా ఫ్యామిలీతోనే ఉంటున్నానని చెబుతాడు రాజ్. మీరు సీక్రెట్ ఏజెంట్ కదా? మీరు చెప్పినదంతా విన్న తర్వాత నా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోవాలని అనుకున్నానని రాజ్‌పై సెటైర్లు వేస్తుంది. ఐయామ్ కళావతి.. రిపోర్టింగ్ సార్ అని అంటుంది కావ్య. మీరు పనిచేసే ఆఫీస్ కూడా బయటి ప్రపంచాన్ని నమ్మించడానికే కదా అని అంటాడు రాజ్.తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి హోటల్‌కి వెళ్తారు.
రుద్రాణి చెప్పినట్లుగానే ఆఫీస్‌లోని తన మనిషికి ఫోన్ చేస్తాడు రాహుల్. రాజ్ లేకపోవడం వల్ల చాలా బిల్స్ పెండింగ్‌లో పడ్డాయి కదా? వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారని అడుగుతాడు. వాటిని కావ్య మేడం చూసుకుంటున్నారని చెబుతాడు. ఆ విషయాలు నాకు కావాలని రాహుల్ అడగ్గా.. గతంలో ఇలాంటి పనులు చేసినందుకే పాత మేనేజర్‌ని తీసేశారని చెబుతాడు మేనేజర్. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఎవ్వరికీ చెప్పానని రాహుల్ అనడంతో కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయని అంటాడు. ఈ విషయాన్ని వెంటనే తల్లికి చెప్పడానికి వెళ్తాడు రాహుల్.
ఓ దొంగ ఓ అమ్మాయి పర్స్ కొట్టేయబోతుండగా రాజ్ చూసి వాడిని పట్టుకుంటాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజ్‌తో మాట్లాడతారు. పట్టపగలు దొంగతనాలు జరుగుతుంటే మీరు పబ్లిక్‌కి ఇచ్చే రక్షణ ఇదేనా అని అడుగుతాడు రాజ్. ముందు మీరెవరో చెప్పండని ఎస్ఐ అడగ్గా కావ్య అతనిని పక్కకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. ఈ ఎస్ఐ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడని అనడదంతో నాకు మీ డిటెయిల్స్ కావాలని అడుగుతాడు ఎస్ఐ. నేను సీక్రెట్ ఏజెంట్‌నని చెప్పడంతో ఎస్ఐ షాక్ అవుతాడు. ఎస్ఐ దగ్గర గన్ లాక్కొని స్టైల్‌గా తిప్పుతుంటాడు రాజ్.
దాంతో టెన్షన్ పడ్డ కావ్య .. రాజ్‌ని పక్కకి తీసుకెళ్తుంది. మీరు రా ఏజెంట్ కాదు కదా .. కనీసం ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా కాదని అంటుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. మరి నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి కొరియర్ ఎందుకొచ్చిందని అడుగుతాడు రాజ్. నా చెల్లెలు పోలీస్ కాబట్టి.. తను కొరియర్ చేసిందని చెబుతుంది కావ్య. నేను ఆఫీస్‌కి వెళ్లకుండా మేనేజర్ నుంచే వివరాలు కనుక్కున్నానని రుద్రాణికి చెబుతాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











