Brahmamudi April 22nd Episode: ఇందూకి దగ్గరవుతున్న రాజ్.. రోజా కోసం దేవదాస్‌లా మారిన వెంకీ

Photo Courtesy: JioHotstar

ఇందూ అడగ్గానే కాఫీ తెచ్చిస్తాడు రాజ్. ఇంతలో ఆ ఇంటి ఓనర్ రావడంతో ఇందూ- రాజ్‌ల్ని బీరువాలో దాస్తాడు లక్కీ. ఇంటి ఓనర్ మందు ఏర్పాట్లతో పాటు పెద్ద లిస్ట్ చెప్పడంతో లక్కీ, రాజ్‌లు షాక్ అవుతారు. వారికి వంట రాకపోవడంతో ఇందూ దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని ఇద్దరూ బతిమలాడతారు. రాజ్ కూడా బుజ్జగించడంతో వంట చేయడానికి ఒప్పుకుంటుంది ఇందూ. అయితే తనకు గోలీసోడా కావాలని అడుగుతుంది. ఎప్పుడో మా నానమ్మ చిన్నప్పుడు తాగించింది. మళ్లీ ఇప్పటి వరకు తాగలేదని ఇందూ చెప్పడంతో. సిటీ మొత్తం గాలించైనా తెచ్చిపెడతానని అంటాడు రాజ్.

ఇంటి ఓనర్‌కు మందు పోసి కబుర్లు చెబుతాడు లక్కీ. అతనికి కావాలని ఎక్కువగా మందు పోస్తాడు. దాంతో ఓనర్ మత్తులో తూగుతుండగా నాకు ఫుడ్ రాలేదు అంటూ మండిపడతాడు. కోపంతో ఊగిపోతూ కిచెన్‌లోకి వస్తాడు. అక్కడ ఇందూ వంట చేస్తూ ఉండటంతో షాక్ అవుతాడు ఓనర్. దాంతో నువ్వేం మాట్లాడొద్దు నేనే మాట్లాడతానని, నువ్వు లిప్స్ కదిలిస్తూ ఉండమని ఇందూకి చెబుతాడు ఓనర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్ 1013లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 22nd 2026 Episode 1013 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

లక్కీ వాయిస్‌తో ఇందూ ఎదురుగా కనిపించడంతో ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు ఇంటి ఓనర్. మీరు ఇందాక మీ వైఫ్‌తో మాట్లాడుతున్నారు కదా? తనే ఇక్కడున్నట్లుగా ఊహించకున్నారని అంటాడు రాజ్. నా వైఫ్ దున్నపోతులా? ఆకాశంలో మబ్బులా ఉంటుంది. .ఈమె ఎవరో కత్తిలా ఉందని చెప్పడంతో ఇందూకి కోపం వచ్చి లాగిపెట్టి కొడుతుంది ఇందూ. దాంతో లక్కీ ఆడపిల్లలా వేషం మార్చుకుంటాడు. ఏం జరిగిందని ఇంటి ఓనర్ లేచి అడగ్గా.. మీరు తూలిపడిపోయారని చెబుతాడు రాజ్. నేను తూలిపడిపోలేదు.. ఎవరో కొడితే పడిపోయానని అంటాడు ఓనర్. మిమ్మల్ని కొట్టేంత ధైర్యం ఎవరికి ఉందని లక్కీ అనడంతో నిజమే కదా అంటాడు ఓనర్.

నువ్వెందుకు శారీ కట్టుకున్నావని అడగ్గా.. మీరే కదా సార్ వంట చేయమన్నారని అంటాడు. నేను వంట చేయమన్నది వీడిని కదా? నువ్వెందుకు చేస్తున్నావని అడుగుతాడు ఓనర్. శారీ కట్టుకోవాల్సిన అవసరం ఏంటీ అంటాడు. హోమ్‌లీ ఫుడ్ కావాలని అడిగారు కదా? ఆ ఫీల్ కోసం తెలుగింటి గృహిణిలా వంట చేస్తున్నానని చెబుతాడు లక్కీ. చాలారోజుల తర్వాత ఇండియా మందు తాగడంతో తల గిర్రున తిరుగుతోందని అంటాడు ఓనర్. నేను పడుకుంటాను నా మీద దుప్పటి కప్పమని చెబుతాడు ఓనర్. శారీలో నువ్వు చాలా బాగున్నావని అనగా.. లక్కీ భయపడిపోతాడు. ఆ వెంటనే కళ్లుతిరిగి పడిపోతాడు ఓనర్.

వీడు చిల్లీ చికెన్ అన్నాడు, మందు అన్నాడు.. ఇలా పడిపోయాడేంటీ అని రాజ్ అడగ్గా.. ఎందుకైనా మంచిదని నాలుగు పెగ్గులు రా తాగించానని లక్కీ చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. ఈ మధ్య నువ్వు బుర్ర వాడుతున్నావని లక్కీని మెచ్చుకుంటాడు రాజ్. ఇంతలో ఇందూ వచ్చి గోలీసోడా కావాలని అడుగుతుంది. అంతా వెతికాను.. ఎక్కడా గోలీసోడా దొరకలేదని చెబుతాడు రాజ్. నువ్వు వెతకలేదు నాకు తెలుసు.. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లుగా ఉంది నీ పరిస్ధితి అని రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. నన్ను ఇంతసేపు కష్టపెట్టి.. బోల్డెన్నీ వంటలు చేయించారు, మీ ఓనర్‌కి కనిపించకుండా చూడాలి. ఇంత చేస్తే నా కోసం ఒక గోలీసోడా తీసుకురాలేకపోయావని మండిపడుతుంది ఇందూ.

ఒక ఆడపిల్ల నోరుతెరిచి అడిగింది తీసుకొద్దామని లేదా? నేనేమైనా మణులు అడిగానా? మాణిక్యాలు అడిగానా? ఒక్క గోలీసోడానే కదా అంటుంది ఇందూ. ఆ వెంటనే రాజ్.. గోలీసోడాలు తీయడంతో సర్‌ప్రైజ్ అవుతుంది. నేను ఒక్కటే కదా తీసుకురమ్మన్నాను రెండు ఎందుకు తీసుకొచ్చావని అడగ్గా.. నువ్వు రెండు కావాలని అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తానని చెబుతాడు రాజ్. గోలీసోడా కొట్టి తాగి ఎంజాయ్ చేస్తుంది. అసలు నీ స్టోరీ ఏంటీ? నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఎక్కడో ఉంది.. అసలు నీకు ఈ పరిస్ధితి ఎందుకొచ్చిందని ఇందూని అడుగుతాడు రాజ్. గోలీసోడా ఇస్తే నా కథంతా చెబుతానని అనుకున్నావా? ఇందూ మండిపడుతుంది. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు.. లేకపోతే లేదని అంటాడు రాజ్.

ఉదయాన్నే ఆ డల్లాస్ గాడు నిద్రలేచాక వాడికోసం బ్రేక్‌ఫాస్ట్ చేయమని రాజ్ అడగ్గా.. ఇందూ సీరియస్ అవుతుంది. నువ్వు స్వార్ధపరుడివి అని అంటుంది. నువ్వు అడిగింది చేసిపెడితాను.. నన్ను కాసేపు బయటికి తీసుకెళ్లాలని అడుగుతుంది ఇందూ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నీ సరదాలు తీర్చడానికి నేనేమైనా నీ బాయ్‌ఫ్రెండ్‌నా? కిడ్నాపర్‌నా? అని మండిపడతాడు. నేను భయపడేరకం కాదని రాజ్ అనడంతో డల్లాస్ గారు.. డల్లాస్ గారు అని గట్టిగా కేకలు వేస్తుంది ఇందూ. దాంతో బయటికి తీసుకెళ్లడానికి రాజ్ ఒప్పుకుంటాడు.

రాజ్ కోసం చలపతి - లక్ష్మీ కంగారుపడుతుండగా ఇంటికి నందూ వస్తుంది. ఫోన్ ఇచ్చేసి వెళ్దామని వచ్చానని నందూ చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. పెద్దోడి వల్ల ఒకమ్మాయి ఇంటికొస్తుందని అనుకున్నాను. కానీ వీడి కోసం అమ్మాయి రావడం ఏంటీ? అని చలపతి ఆలోచిస్తుండగా మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, అంతగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దని చెబుతుంది నందూ. మేడపైన వెంకీ మందు కొడుతూ కనిపించడంతో నందూ షాక్ అవుతుంది. నేను మందు కొట్టడం లేదు.. యాపిల్ జ్యూస్ అని చెబుతాడు. నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసినందుకు కాదు.. మోసపోయినందుకు బాధపడుతున్నానని చెబుతాడు లక్కీ. నువ్వు కూడా తనని వదిలేసి నీ జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెబుతుంది నందూ. నా కోసం ఎక్కడో ఒక మంచి అమ్మాయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని పడేస్తానని చెబుతాడు. ఈ విషయంలో నువ్వే హెల్ప్ చేయాలని నందూని అడుగుతాడు లక్కీ.

ఇందూని తీసుకుని రాజ్ బయటికి తీసుకొస్తాడు. ఐస్‌క్రీమ్ బండి కనిపించగానే.. చిన్నప్పటి నుంచి నాకు ఐస్‌క్రీములు దొంగతనం చేయాలని ఉండేది. కానీ ఎప్పుడూ కుదరలేదు. ఇప్పుడు మాత్రం దొంగతనం చేస్తానని చెబుతుంది ఇందూ. ఆ మాటలు వినగానే రాజ్ షాక్ అవుతాడు. నీ ముఖం చూస్తే అమాయకంగా ఉంది.. కోట్ల ఆస్తి పెట్టుకుని ఐస్‌క్రీములు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటీ? అని అడుగుతాడు రాజ్. తప్పక నిన్ను కిడ్నాప్ చేశాం కానీ.. నా క్యారెక్టర్ అది కాదని అంటాడు. కిడ్నాప్ చేయడం కూడా ఒక బిజినెస్ అంటుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X