Brahmamudi April 23rd Episode : అపర్ణ, కావ్య చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న రుద్రాణి.. నిజం చెప్పాల్సిందే
దుగ్గిరాల ఫ్యామిలీ భోజనానికి వెళ్తుండగా కొంతమంది కంపెనీ స్టాఫ్ వస్తారు. దేవుడు లాంటి రాజ్ చనిపోవడంతో మన స్టాఫ్ అంతా కలిసి శ్రద్ధాంజలి ఘటించాలని అనుకుంటున్నారని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో అపర్ణ రగిలిపోతుంది. రాజ్ వస్తాడని నేను చెబుతున్నాను కదా? ఇలాంటివేవి వద్దు అని అంటుంది. కావ్య కూడా వచ్చిన వాళ్లకి నచ్చచెప్పడంతో ఉద్యోగులు వెళ్లిపోతారు. కావ్య - అపర్ణలకి ఏదో నిజం తెలిసిందని, అదేంటో మనం కూడా తెలుసుకోవాలని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.
కావ్య దగ్గరికి ఎంతో ఉత్సాహంతో వస్తాడు రాజ్. మీరు నాకు గతం గుర్తు చేయనక్కర్లేదు.. నేనెవరో తెలిసిపోయిందని అంటాడు . నా పేరు రామ్ మనోహర్.. రా సీక్రెట్ ఏజెంట్‌ని అని చెప్పడంతో కావ్య షాకై, కాసేపు ఆడుకుంటుంది. కారులో వెళ్తుండగా దొంగతనాన్ని అడ్డుకుని దొంగని పోలీసుకు అప్పగిస్తాడు రాజ్. నువ్వెవరు అని రాజ్ అడగ్గా.. నేను సీక్రెట్ ఏజెంట్‌ని అని బిల్డప్ ఇవ్వడంతో పోలీసులు షాక్ అవుతారు. కంపెనీలో మేనేజర్‌కి ఫోన్ చేసి పెండింగ్ బిల్స్ గురించి కనుక్కొని రుద్రాణికి చెబుతాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్‌లో 703లో ఏం జరిగిందంటే?

ఆ మేనేజర్ మనికి పనికొచ్చే మేటర్ ఏమైనా చెప్పాడా? అని రాహుల్‌ని అడుగుతుంది రుద్రాణి. చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని అంటాడు రాహుల్. కావ్య ఇప్పుడు అర్జెంట్‌గా రా మెటీరియల్ సప్లై చేసేవాళ్లకి 2 కోట్లు కట్టాలని.. కానీ దీనిని కట్టాలంటే నవ్య జ్యూయెలర్స్ వాళ్లు బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలని, దానిని కనుక మనం ఆపగలిగితే చాలని చెబుతాడు. రాజ్ రాకపోతే డీల్ ఫినిష్ అవ్వదనే పరిస్ధితిని మనం సృష్టించగలిగితే చాలని అంటుంది రుద్రాణి. రాజ్ బతికే ఉన్నాడా లేడా? అనే విషయం కావ్య నోటితోనే చెప్పించొచ్చని ప్లాన్ చేస్తుంది రుద్రాణి.
ఆ వెంటనే నవ్య జ్యూయెలర్స్ మేనేజర్‌కి ఫోన్ చేస్తుంది రుద్రాణి. కొద్దిరోజులుగా మీ కంపెనీ నుంచి పేమెంట్స్ రావడం లేదని, నాలుగు కోట్ల వరకు పెండింగ్ పెట్టారా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. దానికి ఆ మేనేజర్ అవుతానని చెబుతాడు. మాకు రావాల్సిన పేమెంట్స్ డీలే కావడం వల్ల కొంచెం ఆలస్యమైందని, కావ్య మేడంకి ఆ విషయం చెప్పి టైం అడుగుతుంటే అస్సలు టైం ఇవ్వడం లేదని చెబుతాడు ఆ మేనేజర్. మీకు హెల్ప్ చేయడానికే నేను ఫోన్ చేశానని అంటుంది రుద్రాణి. నేను చెప్పినట్లు చేస్తే మీకు రెండు వారాల టైం దొరుకుతుందని చెబుతుంది.
మీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది రాజ్ కాబట్టి.. అతను చనిపోయాడు కాబట్టి, అతని డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి నెక్ట్స్ ఆ కంపెనీకి పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వాళ్లే డీల్ ఫినిష్ చేయాలి కదా అని అంటుంది రుద్రాణి. అంటే కావ్య మేడంకి పవర్ ఆఫ్ అటార్నీ లేదా అని అడుగుతాడు ఆ మేనేజర్. మీరు డబ్బులు కట్టాలంటే రాజ్ వచ్చి డీల్ ఫినిష్ చేయాలి..లేకపోతే ఆయన డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వాళ్లు మెయిల్ చేస్తేనే అమౌంట్ రిలీజ్ చేస్తామని కావ్యకి చెప్పమని సలహా ఇస్తుంది రుద్రాణి. అప్పుడు మీకు సులభంగా 2 వారాల సమయం దొరుకుతుందని చెప్పడంతో ఆ మేనేజర్ సంబరపడిపోతాడు.
ఆ వెంటనే మరొకరికి ఫోన్ చేసి 24 గంటల్లో మీ పేమెంట్ రిలీజ్ చేస్తామని కావ్య చెప్పిందా? అని అడుగుతుంది రుద్రాణి. రాజ్ చనిపోవడంతో కంపెనీకి రావాల్సిన పేమెంట్స్ అన్ని ఆగిపోయాయని, కావ్యకి పవర్ ఆఫ్ అటార్నీ లేదు కాబట్టే ఆ డీల్ ఫినిష్ చేసి మీకు డబ్బులిచ్చే అవకాశం ఇప్పట్లో లేదని చెప్పడంతో ఆ వ్యక్తి షాక్ అవుతాడు. నేరుగా ఇంటికే వచ్చి కావ్యని నిలదీస్తానని ఆ వ్యక్తి చెబుతాడు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుందని.. డీల్ ఫినిష్ చేయాలంటే రాజ్ రావాలి, ఒకవేళ తీసుకురాలేకపోతే వాడు చచ్చాడని డెత్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలని అంటుంది.
రాజ్, కావ్యలు ఫోన్‌లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఎప్పటి నుంచో మీ ఇంటి అడ్రస్ అడుగుతున్నానని కానీ మీరు చెప్పడం లేదని ప్రశ్నిస్తాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. మీరు నాకు చాలా పంపించారని నేను కనీసం కట్చీఫ్ అయినా పంపించలేదని బాధపడతాడు రాజ్. ఒక పొడుపు కథ లాగా మా ఇంటి అడ్రస్ చెబుతానని , దానిని మీరు విప్పితే మా ఇంటి అడ్రస్ కనుక్కోవచ్చని అంటుంది కావ్య. దాని గురించి ఎంత ఆలోచించినా రాజ్‌కు ఆ పొడుపు కథ అర్ధం కాదు.
ఉదయాన్నే నవీన్ జ్యూయెలర్స్ మేనేజర్ కావ్యకి ఫోన్ చేసి పవర్ ఆఫ్ అటార్నీ గురించి అడుగుతాడు. రాజ్ సార్ డెత్ సర్టిఫికెట్ మాకు సబ్మిట్ చేసి , పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరు మీదకి తెచ్చుకుంటే తప్ప మీ బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడం సాధ్యం కాదని అంటాడు. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. అప్పటి వరకు ఫండ్స్ లేకపోతే మా ప్రోడక్షన్‌లో ప్రాబ్లమ్ అవుతుందని చెబుతుంది కావ్య. కావ్యని టిఫిన్ చేసి వెళ్లమని అపర్ణ అడగ్గా అర్జెంట్‌గా వెళ్లాలని చెబుతుంది. ఈ హోమ్ మినిస్టర్‌కు అస్సలు టైం ఉండదని సూటిపోటి మాటలు అంటుంది రుద్రాణి.
ఇంతలో కావ్య దగ్గరికి క్లయింట్స్ వస్తారు. రాజ్ సార్ ఉన్నప్పుడు మా బిల్స్ అన్ని కరెక్ట్ టైంలో క్లియర్ చేసేవారని, ఆయన చనిపోయాక బిల్స్ పెండింగ్‌లో పడిపోతున్నాయని వాళ్లు చెబుతారు. ఇంతలో సుభాష్ జోక్యం చేసుకుని.. మా పద్ధతులు ఎప్పటికీ మారవని, మా పేమెంట్స్ విషయంలో ఎవరికీ ఏ సమస్యలు రావని అంటాడు. కానీ ఇప్పుడొచ్చింది అని అంటారు క్లయింట్స్. నమ్మినవాళ్లని మోసం చేసేవాళ్లం కాదని అంటాడు ప్రకాశం. వాళ్ల బిల్స్ ఎందుకు లేట్ అయ్యాయని సీతారామయ్య కూడా ప్రశ్నిస్తాడు. మీ ప్రశ్నలకు సమాధానం నేనే చెబుతానని అంటుంది రుద్రాణి.
అకౌంట్‌లో డబ్బులు లేకపోతే బిల్స్ ఎలా క్లియర్ చేస్తుందని రుద్రాణి ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. రాజ్ చనిపోయాక క్లయింట్స్ నుంచి రావాల్సిన పేమెంట్స్ పెండింగ్‌లో పడిపోయాయని అంటుంది. వెంటనే ఇవ్వాల్సిన వాళ్లకి ఫోన్ చేసి సెటిల్ చేయమని అంటాడు ప్రకాశం. ఇది చెక్‌లు, సంతకాలతో కూడుకున్న పని అని .. అప్పుడే రావాల్సిన డబ్బులు వస్తాయని చెబుతుంది రుద్రాణి. రాజ్ లేకపోతే పవర్ ఆఫ్ అటార్నీ కావ్యకి రావాలని.. అది కూడా రాజే ఇవ్వాలని అంటుంది. కాబట్టి కావ్యకి ఆ డీల్స్ క్లోజ్ చేసే అధికారం లేదని.. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని అంటుంది రుద్రాణి.
రాజ్ చనిపోయాడు కాబట్టి డెత్ సర్టిఫికెట్ తీసుకుని దానిని సబ్మిట్ చేసి కావ్య పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ వచ్చేలా చేయాలని చెబుతుంది రుద్రాణి. డెత్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ తీసుకొచ్చానని.. దీని మీద సంతకాలు చేసేస్తే నేను వెళ్లి డెత్ సర్టిఫికెట్ తీసుకొస్తానని అంటుంది. ఆ మాటలతో కావ్య, అపర్ణ షాక్ అవుతారు. దీనికి నువ్వు ఒప్పుకోకుంటే కంపెనీ లాస్‌లోకి వెళ్తుందని, ఫ్యామిలీ రోడ్డున పడుతుందని అంటుంది అపర్ణ. ఆయన బతికే ఉన్నారని చెబుతుంది కావ్య. నా కొడుకు బతికే ఉన్నాడని అపర్ణ చెప్పడంతో వెంటనే ఇంటికి రమ్మని చెప్పండి అంటుంది రుద్రాణి.
రుద్రాణికి ధాన్యలక్ష్మీ కూడా మద్ధతుగా మాట్లాడుతుండటంతో కావ్య, అపర్ణలు షాక్ అవుతారు. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వమని కావ్య అడగటంతో క్లయింట్స్ గడువుచ్చి వెళ్లిపోతారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావని కావ్యని అడుగుతుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











