Brahmamudi April 23rd Episode: రాజ్‌ని హత్తుకున్న ఇందూ.. బావ మరదళ్ల మధ్య చిగురించిన ప్రేమ

Photo Courtesy: JioHotstar

ఇంట్లోకి ఆడపిల్ల ఎలా వచ్చిందంటూ ఓనర్ నానారకాల ప్రశ్నలు వేయడంతో రాజ్, లక్కీలు వణికిపోతారు. ఈ అమ్మాయి కత్తిలాగా ఉందని అనడంతో లాగిపెట్టి కొడుతుంది ఇందూ. ఆ దెబ్బకి కిందపడిపోయి లేస్తాడు ఓనర్. ఆ వెంటనే అమ్మాయిలా చీరకట్టుకుంటాడు లక్కీ. హోమ్ ఫుడ్ ఫీలింగ్ రావడానికి నేను ఇలా చీరకట్టుకున్నానని చెబుతాడు లక్కీ. భోజనం తినకుండానే ఓనర్ పడిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. మీ కోసం భోజనం వండిపెడితే నాకు గోలీసోడా ఇవ్వవా అంటూ రాజ్‌పై మండిపడుతుంది ఇందూ.

అతను సర్‌ప్రైజ్‌గా గోలీసోడా ఇవ్వడంతో సంతోషంగా తాగుతుంది. రేపొద్దున కూడా బ్రేక్ ఫాస్ట్ చేయమని రాజ్ చెప్పగా.. నన్ను బైక్ మీద ఊరంతా తిప్పితే తీసుకెళ్తానే చేస్తానని అంటుంది. దాంతో చేసేదేం లేక ఇందూని బయటికి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు రాజ్. చలపతి- లక్ష్మీ మాట్లాడుకుంటూ ఉండగా నందూ వచ్చి వెంకీ ఎక్కడ అని అడగటంతో ఇద్దరూ షాక్ అవుతారు. నందూ పైకి వెళ్లేసరికి వెంకీ మందు తాగుతున్నట్లు దేవదాస్‌లా బిల్డప్ ఇస్తాడు. నా కోసం ఓ మంచి అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది.. నువ్వే మా ప్రేమకి హెల్ప్ చేయమని నందూకి చెబుతాడు వెంకీ. ఇందూని తీసుకుని బజారుకి రాగానే నాకు ఐస్‌క్రీమ్ దొంగతనం చేయాలని ఉందని ఆమె చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్ 1014లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 23rd 2026 Episode 1014 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఐస్‌క్రీమ్‌ని దొంగతనం చేయాల్సిందే అంటుంది ఇందూ. నువ్వు నాతో పాటు ఉండి.. దగ్గరుండి నాతో దొంగతనం చేయించాలని అంటుంది ఇందూ. రాజ్ ఇవేవీ ఒప్పుకోకపోవడంతో ఇంటికెళ్లి ఆ డల్లాస్ గాడి దగ్గరే తేల్చుకుందామని అంటుంది. నువ్వు నన్ను ఇన్‌సల్ట్ చేశావు.. నన్ను కొట్టబోయావని గొడవ చేస్తుంది ఇందూ. దాంతో రాజ్ సరేనని ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి ఓ ఐస్‌క్రీమ్ బండి దగ్గరికి వెళ్లి.. రకరకాల ఐస్‌క్రీమ్‌లు తీయమంటారు. అన్ని బాగానే ఉంటాయని బండివాడు చెబుతాడు. కానీ ఇంకా లోపలికి తలపెట్టి చూడమని చెప్పి ఇందూ చేత ఐస్‌క్రీమ్‌లు కొట్టేలా ప్లాన్ చేస్తాడు రాజ్. ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్‌లు తింటారు.

రాజ్ ఐస్‌క్రీమ్‌ని చాలా స్పీడుగా తినేయడంతో ఇందూ షాక్ అవుతాడు. నీకు ఇంకో ఐస్‌క్రీమ్ కావాలి కదా? నాకు అనిపిస్తోంది. వెంటనే వెళ్లి ఇద్దరం కొట్టేద్దామని చెబుతుంది ఇందూ. ఇందాక చేసిన దానికే ఏదోలా ఉంది, ఈసారి వెళ్తే దొరికిపోతామని రాజ్ భయపడతాడు. నాకు కోపం వస్తోంది.. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా? నేను ఇంటికెళ్లి అని ఇందూ అంటుండగా.. రాజ్ భయపడిపోతాడు. ఇద్దరూ కలిసి మళ్లీ అదే ఐస్‌క్రీమ్ బండి దగ్గరికి రావడంతో ఇందూ చేతిలో చూసిన ఐస్‌క్రీమ్‌ని చూసి బండివాడు షాక్ అవుతాడు. పక్కబండి దగ్గర కొన్నామని రాజ్ చెప్పగా.. ఇందాకే రెండు ఐస్‌క్రీమ్‌లు కొట్టేశాడని రాజ్‌ని ఇరికిస్తుంది ఇందూ.

ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. డబ్బులు ఇవ్వకుండా తీసుకుంటే కొట్టేయడమే అంటారని ఇందూ ఇంకా రెచ్చగొడుతుంది. చూడటానికి బాగానే ఉన్నావు కదా? ఈ దొంగ బుద్ధులు ఏంటీ? అని బండివాడు రాజ్‌పై గొడవపడతాడు. దాంతో ఇందూ నచ్చజెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది. బంగారం లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇవేం పనులు, నీ గర్ల్ ఫ్రెండ్ వాల్యూ తీసేశావని షాప్ వాడు మండిపడతాడు. తనేం నా గర్ల్ ఫ్రెండ్ కాదు అంటాడు రాజ్. తనకి నాకు ఏ సంబంధం లేదు... మా ఇద్దరి మధ్య ఏ బంధుత్వం, బంధం లేదని చెబుతాడు రాజ్. అయితే నువ్వు ఖచ్చితంగా దొంగవే అంటాడు బండివాడు. ఆ మాటలతో రాజ్ కోప్పడతాడు.

ముందు తనకి డబ్బులు ఇవ్వమని చెబుతుంది. ఎంత అని రాజ్ అనగా.. 100 రూపాయలు అంటుంది ఇందూ. 20 రూపాయలు ఐస్‌క్రీమ్‌ని 100 రూపాయలు చెబుతారా అంటూ మండిపడతాడు రాజ్. అది కొన్నవారికి కొట్టేసిన వాళ్లకి కాదని అంటుంది ఇందూ. ఆ కోటిరూపాయలు మీ చేతిలో పడ్డాయంటే అప్పుడు నీ పని చెబుతానని అనుకుంటాడు రాజ్. జరిగిందంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇందూ. నేను దొంగని, కిడ్నాపర్‌ని అని మెడలో బోర్డ్ వేసుకుని అందరికీ టాం టాం చేయకపోయావా అని మండిపడతాడు రాజ్. నాకేం ఇగో లేదని ఇందూ చెబుతుంది. భయపడటం మన హిస్టరీలోనే లేదని చెబుతాడు రాజ్.

ఐస్‌క్రీమ్ దొంగిలించి తినాలన్నది నీ కోరిక కదా? మళ్లీ డబ్బులెందుకు ఇచ్చావని అడుగుతాడు రాజ్. దొంగిలించాలన్నది నా చిన్న సరదా.. కానీ దాని కోసం అతనిని ఎందుకు మోసం చేయడం. అందుకు డబ్బులు ఇవ్వాలని అనుకున్నానని చెబుతుంది ఇందూ. పాపం తను రాత్రంతా నిద్రపోకుండా కష్టపడుతున్నాడు. అలాంటి తన పొట్ట కొడితే పుట్టగతులు ఉండవు తెలుసా అంటుంది. ఇంకా నీ కోరికలు ఏమైనా ఉంటే త్వరగా చెప్పు తీరుస్తానని రాజ్ అనడంతో ఇందూ సంతోషిస్తుంది. నాకు బెలూన్లతో ఆడుకోవాలి, స్ట్రీట్ ఫుడ్ తినాలని అంటుంది ఇందూ. ఆ లిస్ట్ చూసి షాక్ అవుతాడు రాజ్. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది ఏది చేయలేకపోయా? నాకు రాకరాక అవకాశం వచ్చింది.. హెల్ప్ చేయడానికి నువ్వు ఉన్నావని అంటుంది ఇందూ. ఇలాంటి అవకాశం మళ్లీ రావొచ్చు, రాకపోవచ్చని చెబుతుంది ఇందూ.

నువ్వు ఇక్కడే ఉంటే రెండు నిమిషాలలో రీచార్జ్ అయి వస్తానని మందు కొడతాడు రాజ్. ఆ వెంటనే కోక్ టిన్‌లో మందు కలిపి తీసుకొచ్చి ఇందూకి ఇస్తాడు. ఇది తాగగానే మత్తెక్కుతుందా? అని ఇందూ అడగటంతో రాజ్ షాక్ అవుతాడు. నీ కోరికలు తీరాలంటే చాలా ఎనర్జీ కావాలి, అందుకే తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. ఆ మాటలకి పడిపోయిన ఇందూ.. మందు కలిపిన కోక్‌టిన్ తాగేస్తుంది. దాంతో రోడ్డంతా పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తుంది. అది చూసి రాజ్ నవ్వుకుంటాడు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందని.. రాజ్‌కి థ్యాంక్స్ చెబుతూ హత్తుకుంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

ఆకాశంలో నక్షత్రాల్ని చూపించి.. నక్షత్రాలకు పేర్లు పెట్టి రిజిస్టర్ చేసుకుంటున్నారట తెలుసా నీకు అని అడుగుతుంది ఇందూ. ఒక స్టార్ పేరు ఇందూ స్టార్ అంటుంది. అక్కడ బెలూన్స్ చూసి అక్కడికి పరిగెత్తుతుంది ఇందూ. మత్తెక్కి పడిపోతుంది అనుకుంటే పిచ్చిపట్టిన కోతిలా పరిగెడుతుందని అనుకుంటాడు రాజ్. బెలూన్స్ పట్టుకుని ఊరంతా పరుగులు తీయడంతో ఇందూ వెనకే రాజ్ పరుగులు పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X