Brahmamudi April 23 th episode: పరువు పోతుందని భయపడుతున్న అపర్ణ.. రాజ్‌ను మీడియా ముందు ఇరికించేసిన రుద్రాణి!
కళ్యాణ్ చేత సంతకం పెట్టించాలన్న రాహుల్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. తల్లి స్పర్శ లేక బాబు హాస్పిటల్ పాలు అవుతాడు. రాజ్ ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఆర్డర్ వేస్తుంది అపర్ణ. బాబు ఎవరినే విషయం సుభాష్ కి తెలుసని కావ్య తెలుసుకుంటుంది. అతను కూడా నిజం చెప్పకపోవడంతో నిరాశ చెందుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్ 391 లో ఏం జరిగిందంటే..
శ్రీరామనవమి వేడుకలు ఎప్పుడూ మీ చేతుల మీదుగానే జరిగేవి, అలాంటిది మీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కంగారుపడి వచ్చాను అంటారు పూజారి. ఈ సంవత్సరం కూడా మా చేతుల మీదుగానే కళ్యాణం జరుగుతుంది ఆ కార్యక్రమాలన్నీ మా ప్రకాష్ చూస్తాడు అని చెప్పి ప్రకాష్ కి బాధ్యత అప్పగిస్తాడు సీతారామయ్య. పూజారి వెళ్ళిపోయిన తరువాత ఈ కళ్యాణం ఎలా జరిపిస్తాము అంటుంది అపర్ణ.

బాబుతో కళ్యాణానికి వెళ్తే పరువు పోతుందని అక్క భయపడుతున్నట్లుగా ఉంది అని వెటకారంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. రుద్రాణి కూడా అపర్ణ అని కించపరిచేలాగా మాట్లాడుతుంది. మన ఇంట్లోనే మనల్ని బాధపెట్టే సమాజం ఒకటి తయారయింది అలాంటిది బాబుని తీసుకొని బయటికి వెళ్తే వాడు ఎవరా అని అడగకుండా సమాజం ఊరుకుంటుందా అని తన భయాన్ని బయటపెడుతుంది అపర్ణ.
అలా అని తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మానుకుంటామా అది కుటుంబానికి అరిష్టం అంటుంది చిట్టి. అయితే మీ ఇష్టం అని చిట్టి తో చెప్పి నా పరువు తీయడానికే నువ్వు పుట్టావు అని కొడుకు మీద చిరాకు పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ. తనని నేను తీసుకు వస్తాను అని సుభాష్ తల్లికి మాటిస్తాడు. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత రాజ్ కల్యాణానికి రాను అంటాడేమో తనని నువ్వే ఒప్పించి తీసుకురావాలి అని కావ్యని రిక్వెస్ట్ చేస్తుంది చిట్టి.
మరోవైపు వాళ్లని ఎంత విడగొట్టాలని ప్రయత్నించినా మళ్లీ కలిసిపోతున్నారు అలా అయితే నాకు ఉన్న ఈ మేనేజర్ పదవి కూడా ఉండదు అని కంగారు పడతాడు రాహుల్. నువ్వేమీ కంగారు పడకు,గుడికి వచ్చినంత మాత్రాన వాళ్లు కలిసే ప్రసక్తి ఉండదు. రాజ్ బాబు తో సహా వస్తున్నాడని మీడియాకి తెలియజేయు చాలు మిగిలిందంతా వాళ్ళే చూసుకుంటారు అంటుంది రుద్రాణి.

మరోవైపు గుడికి రావటానికి ఇష్టపడని అప్పుని ఒప్పించి గుడికి తీసుకువెళ్తుంది కనకం. గుడికి రావడానికి ఇష్టపడని రాజ్ ని గుడికి రావడానికి ఒప్పిస్తుంది కావ్య. మరోవైపు అందరూ గుడికి చేరుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోమని భార్యకి చెప్తాడు సుభాష్. బాబుతో సహా కారు దిగిన రాజ్ అక్కడ మీడియా ఉండటం చూసి వాళ్ళని ఎందుకు పిలిచావు, ఇలాంటిదే ఏదో జరుగుతుందనే అమ్మ భయపడింది అని కళ్యాణ్ తో అంటాడు రాజ్. నేను వాళ్ళని పిలవలేదు అంటాడు కళ్యాణ్.
ఇంతలో మీడియా రాజ్ ఫ్యామిలీ ముందుకు వచ్చి ఈ సంవత్సరం ఎవరి చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుంది అని అడుగుతారు. ఈ సంవత్సరం కొత్త తరం అయిన మా మనవడు, మనవరాలు అయినా రాజ్ దంపతుల చేత కళ్యాణం చేయిద్దాం అనుకుంటున్నాము అంటుంది చిట్టి. రాజ్ చేతిలో ఉన్న బాబును చూసి ఎవరు ఈ బాబు అని అడుగుతుంది మీడియా.పోలికలు చూస్తే తెలియటం లేదా వాడు రాజ్ కొడుకు, మా ఇంటి వారసుడు అంటుంది రుద్రాణి.ప్రతి చిన్న విషయాన్ని మీడియా కి తెలియజేసే దుగ్గిరాల ఫ్యామిలీ బాబు విషయాన్ని ఎందుకు మీడియాకి తెలియజేయలేదు అని నిలదీస్తుంది యాంకర్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











