Brahmamudi April 24th Episode : రాజ్ మిస్టరీపై రుద్రాణి ఆపరేషన్ .. కావ్యకి షాకిచ్చిన రాజ్, ఇరుక్కుపోయిన కళావతి

రాహుల్ ఇచ్చిన సమాచారంతో కంపెనీకి పెండింగ్ బిల్స్, రావాల్సిన పేమెంట్స్‌‌ను ఆపిస్తుంది రుద్రాణి. నవ్య జ్యూయెలర్స్ మేనేజర్‌కి ఫోన్ చేసి కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలంటే రాజ్ డెత్ సర్టిఫికెట్ పంపించమని కావ్యతో చెప్పాల్సిందిగా సలహా ఇస్తుంది. మరో క్లయింట్‌కి ఫోన్ చేసి ఇదే మాట చెప్పడంతో వారు రుద్రాణి మాటలకు సరేనని ఒప్పుకుంటారు. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్తున్న కావ్యకి నవ్య జ్యూయెలర్స్ మేనేజర్ ఫోన్ చేసి ఫండ్స్ ఇప్పుడే రిలీజ్ చేస్తానని.. కానీ తమకు రాజ్ డెత్ సర్టిఫికెట్ , పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయించాలని చెబుతాడు.

మెట్లు దిగి కిందకి రాగానే క్లయింట్స్ వచ్చి మా పేమెంట్ పెండింగ్‌లో పడిపోయిందని వెంటనే క్లియర్ చేయాలని అడుగుతారు. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆ ఇష్యూ త్వరగా క్లియర్ చేయమని సీతారామయ్య, సుభాష్, ప్రకాశంలు కావ్యకి చెబుతారు. అసలు ఆఫీసులో ఫండ్స్ లేవని బిల్స్ క్లియర్ చేయాలంటే రాజ్ రావాలి సంతకం పెట్టాలి అని అంటుంది. లేదంటే రాజ్ పేరిట పవర్ ఆఫ్ అటార్నీ కావ్య పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలని లేదా రాజ్ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో కావ్య, అపర్ణ షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్‌లో 704లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 24th 2025 Episode 704 Here is Today s full story

రాజ్ బతికి ఉంటే తీసుకురావాలి.. లేదంటే డెత్ సర్టిఫికెట్‌కి అప్లయ్ చేయాలని అంటుంది రుద్రాణి. మీకు కావాల్సింది డీల్ పూర్తి చేసి క్లయింట్స్‌కు డబ్బులు ఇవ్వడమే కదా.. 24 గంటల్లో ఆ పని నేను పూర్తి చేసి చూపిస్తానని అంటుంది కావ్య. కోట్లంటే రాజ్ వేసుకునే కోట్లు అనుకుంటుందా ఏంటీ అంటూ కావ్యపై సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఎందుకంత తొందర సాయంత్రం వస్తుంది కదా మీకు క్లారిటీ వస్తుందిలే అని స్వప్న మండిపడుతుంది. కారులో ఆఫీసుకు బయల్దేరుతున్న కావ్యని అపర్ణ ఆపి ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. వయసులో పెద్దదని ఊరుకుంటున్నానని, లేదంటే ఆమె చేసిన పనికి చెంప పగలగొట్టేదాన్నని మండిపడుతుంది.

రాజ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి అసలు వాడికి గతం గుర్తులేదు కదా? , అలాంటప్పుడు రేపటి లోగా వాళ్లకి రెండు కోట్లు ఎలా ఇస్తావని ప్రశ్నిస్తుంది అపర్ణ. వాళ్లకి 2 కోట్లు ఇవ్వడానికి ఆయన రావాల్సిన అవసరం లేదని, నా పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ వస్తే చాలని పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నేను పూర్తి చేస్తానని అంటుంది కావ్య. కానీ నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్లుగా రాజ్ సంతకం చేయాలి కదా అని చెబుతుంది అపర్ణ. ఆయనని కలిసి ఈ సమస్యని ఏదో ఒక రకంగా పరిష్కరిస్తానని అంటుంది కావ్య. వాడు ఉన్నట్లు ఒప్పుకోలేము.. అలా అని వీళ్లు అడిగినట్లు సర్టిఫికెట్ తీసుకురాలేమని బాధపడుతుంది అపర్ణ.

మన వైపు న్యాయం ఉన్నప్పుడు, ఎటు వెళ్లాలో దిక్కు తోచనప్పుడు , ఈ పంచ భూతాలు మనకు తోడుగా నిలబడి మనల్ని ముందుకు నడిపిస్తాయని అంటుంది కావ్య. తాతయ్య గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన జైలుకు వెళ్లినప్పుడు కూడా నేను ఇలాంటి పరిస్ధితుల్లోనే ఉన్నానని గుర్తుచేస్తుంది కావ్య. కానీ ధైర్యంగా ముందుకు అడుగు వేశాక.. నాకు న్యాయం జరిగిందని చెబుతుంది. ఆ దేవుడే మనకి తప్పకుండా దారి చూపిస్తాడని అపర్ణకి ధైర్యం చెబుతుంది కావ్య. కారులో వెళ్తూ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ రాజ్‌కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతుంది కావ్య.

మీతో అర్జెంట్‌గా మాట్లాడాలని , ఇంపార్టెంట్ వర్క్ ఉందని కొంచెం కలవాలని చెబుతుంది కావ్య. మనం ఎప్పుడు కలిసే కాఫీ షాపుపలో ఉంటానని రమ్మని అంటుంది. రాజ్ కిందకి దిగుతుండగా పంతులుగారితో యామిని, అతని తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. మా అమ్మాయి పెళ్లి ఇప్పటికే ఆలస్యమైందని, వీలైనంత త్వరలో మంచి ముహూర్తం చూడమని చెబుతుంది వైదేహి. మనం ఇలా పెళ్లికి ముహూర్తం పెడుతున్న విషయం తనకి చెప్పలేదని ఫీల్ అవ్వొచ్చని యామినితో అంటాడు రఘునాథ్. మీరు ఎలా చెబితే అలా చేస్తానని బావ హాస్పిటల్‌లోనే ఒప్పుకున్నాడని గుర్తుచేస్తుంది యామిని.

హాల్‌లో అందరూ ఉన్నా చూసీ చూడనట్లుగా వెళ్లిపోతాడు రాజ్. దాంతో అతనిని పిలుస్తాడు రఘునాథ్. మీ ఇద్దరి జాతకాలు చూపించి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టిస్తున్నామని చెబుతుంది వైదేహి. పెద్దవాళ్లు మీరున్నారు కదా? మీరు ఎలాగంటే అలాగే చేస్తానని అంటాడు రాజ్. దాంతో వాళ్లు సంతోషిస్తారు. వచ్చే నెల 26న మంచి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పడంతో అన్ని రోజులు వెయిట్ చేయడం నా వల్ల కాదని, త్వరగా చేసేయమని అంటుంది యామిని. జాతకం ప్రకారం మీరిద్దరికీ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తేనే బాగుంటుందని చెబుతుంది వైదేహి. ఇక నన్ను, నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరని అనుకుంటుంది యామిని.

పవర్ ఆఫ్ అటార్నీ గురించి కావ్య ఆలోచిస్తుండగా రాజ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. నేను ఓ చిన్న తప్పు చేశానని, దాని వల్ల నా జాబ్ పోయేలా ఉందని రాజ్‌తో చెబుతుంది కావ్య. నా వల్ల ఆయన హెల్ప్ చేస్తానని రాజ్ చెప్పగా.. కావ్య చేతులు పట్టుకుని నిజంగా హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. దాంతో రాజ్ మురిసిపోతాడు. మా బాస్ ఫారిన్ వెళ్లాడని, తను వెళ్తూ వెళ్తూ నన్ను ఓ డీల్ ఫినిష్ చేయమని చెప్పారని దానికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇస్తూ లెటర్ హెడ్‌ మీద సంతకం చేసి వెళ్లారని చెబుతుంది కావ్య. కానీ మా బాస్ ఇచ్చిన లెటర్ హెడ్‌ని నేను పొగొట్టానని అంటుంది కావ్య.

ఆయన సంతకం చేసిన లెటర్ హెడ్ లేకుంటే డీల్ ఫినిష్ కాదు కదా అని అంటాడు రాజ్. ఆ డీల్ క్లోజ్ చేస్తే కానీ మనీ రాదు, మనీ వస్తే కానీ రా మెటీరియల్ వాళ్లకి డబ్బులు ఇవ్వలేనని చెబుతుంది కావ్య. తను సంతకం చేసిన లెటర్ హెడ్ నా చేతిలో ఉంటే మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేయగలనని అంటుంది . మీరు అనుకుంటే దానిని తిరిగి తీసుకురావచ్చని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. మా బాస్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్లుగా ఓ లెటర్ హెడ్ తయారు చేశానని, దాని మీద ఓ సంతకం కావాలని అడుగుతుంది. మీరు మా బాస్‌లా ఓ సంతకం చేయమని అడుగుతుంది. నన్ను ఫోర్జరీ చేయమని అడుగుతున్నారా? అని రాజ్ షాక్ అవుతాడు.

ఇలాంటి పనులంటే నాకు చాలా భయమని, మీ బాస్‌లా నేను సంతకం చేయడం తప్పని అంటుంది. నా కోసం చిన్న సాయం చేయలేరా అని బతిమలాడుతుంది కావ్య. నా సంతకం నేనే చేసుకుంటానని మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండని అంటుంది . రాజ్ మాటలతో కావ్య షాకై సంతకం ఫోర్జరీ చేస్తుంది. కావ్య డబ్బులు ఇచ్చిన విషయాన్ని క్లయింట్ .. రుద్రాణికి ఫోన్ చేసి చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. రాజ్ సార్ తనకు పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లుగా లీగల్ డాక్యుమెంట్స్ పంపించారని అతను చెబుతాడు.

రాజ్ సంతకం ఫోర్జరీ చేసి కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకుంటావా? అని మండిపడుతుంది రుద్రాణి. కావ్యకి రాజ్ ఇచ్చిన పవర్ అటార్నీని కుటుంబ సభ్యులకు చూపిస్తుంది రుద్రాణి. ఆ పత్రాలు చూసిన సుభాష్.. కావ్య పేరు పవర్ ఆఫ్ అటార్నీ వచ్చిందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రాజ్ లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ ఎలా వస్తుందని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. కావ్యకి పవర్ ఆఫ్ అటార్నీ ఎలా వచ్చిందా అని నేను కూడా షాక్ అయ్యానని అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య రావడంతో చనిపోయిన రాజ్ ఎప్పుడు బతికొచ్చాడు? నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పుడు రాసిచ్చాడని అడుగుతుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X