Brahmamudi April 24th Episode: చక్రీ చేతిలో ఘోరంగా మోసపోయిన రేఖ.. రాజ్ ఇంట్లో అడుగుపెట్టిన ఇందూ
Photo Courtesy: JioHotstar
ఐస్‌క్రీమ్‌ని దొంగతనం చేయాలంటూ రాజ్ దగ్గర గోల గోల చేస్తుంది ఇందూ. ఆమె పోరు పడలేక ఐస్‌క్రీమ్ దొంగతనానికి ఒప్పుకుంటాడు. ఓ ఐస్‌క్రీమ్ బండి దగ్గరికి వెళ్లి వాడిని మాటల్లో పెట్టి ఐస్‌క్రీమ్ కొట్టేస్తారు ఇందూ, రాజ్. ఇద్దరూ ఐస్‌క్రీమ్‌ని తిన్న తర్వాత మరో ఐస్‌క్రీమ్ కొట్టేద్దామని చెబుతుంది ఇందూ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వు నేను చెప్పినట్లు వినకపోతే ఇంటి ఓనర్ దగ్గర తేల్చుకుందామని ఇందూ బెదిరిస్తుంది. దాంతో చేసేదేం లేక రాజ్ సరేనని అంటాడు.
ఐస్‌క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి మీ ఐస్‌క్రీమ్‌లు కొట్టేశాడని ఇరికిస్తుంది. దాంతో ఐస్‌క్రీమ్ బండివాడికి డబ్బులు కట్టేస్తాడు రాజ్. ఇందాకే డబ్బులు ఇచ్చేద్దామంటే నువ్వు వినలేదు.. ఇప్పుడు నన్నెందుకు ఇరికించావని ఇందూపై మండిపడతాడు రాజ్. పాపం అతను కుటుంబం కోసం రాత్రంతా నిద్ర మానుకుని కష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని మనం మోసం చేయకూడదని చెబుతుంది ఇందూ. ఇంకా నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో చెబితే తీరుస్తానని చెబుతాడు రాజ్. దాంతో ఇందూ పెద్ద లిస్ట్ చెబుతుంది. ఇందూ గోల తట్టుకోలేక ఆమెకు కూల్‌డ్రింక్‌లో మందు కలిపి ఆమెతో తాగిస్తాడు. మత్తులో గోల గోల చేస్తుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్ 1015లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మందు తాగిన ఇందూ దెబ్బకి రాజ్ కంగారుపడతాడు. నువ్వు కిడ్నాప్‌లు కాకుండా ఏం చేయగలవని అడుగుతుంది ఇందూ. ఏం చేయాలో ఆలోచిస్తుంటానని చెబుతాడు రాజ్. అంటే ఏం పనిచేయవా అని అడుగుతుంది. ఏ పని పాటా లేకుండా ఖాళీగా తిరిగే పొకిరివా? నువ్వు అంటుంది. ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా? చదవుకోలేదా అని అడుగుతుంది ఇందూ. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లాను, పెద్దయ్యాక కాలేజీకి వెళ్లాను.. చదువుకున్నంత మాత్రాన్న ఉద్యోగాలు దొరుకుతాయా ఏంటీ అని ప్రశ్నిస్తాడు రాజ్. నువ్వు కనీసం స్కూల్‌కి, కాలేజీకి అయినా వెళ్లావు. నేనైతే ఎక్కడికి వెళ్లలేదు.. నన్నెవరూ స్కూల్‌కి పంపించలేదని చెబుతుంది ఇందూ. కానీ నేను డిగ్రీ వరకు చదువుకున్నా, డిగ్రీ సర్టిఫికెట్ కూడా వచ్చిందని అంటుంది.
కాలేజీకి వెళ్లకుండా ఎలా వచ్చిందని రాజ్ అడుగుతాడు. మా నానమ్మ ఇంట్లోనే ఉండి.. నన్ను ప్రైవేట్‌గా చదివించిందని చెబుతుంది పారిజాతం. నేను అనుకున్న దానికంటే నీ లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉందని అంటాడు రాజ్. అందుకే నీకు చిన్న చిన్న కోరికలు మిగిలిపోయాయని చెబుతుంది ఇందూ. మీ ఫ్యామిలీ కూడా ఖాళీగా తిరుగుతుందా అని అడుగుతుంది. ఫ్యామిలీ అంతా ఖాళీగా ఉంటే ఇల్లు ఎలా గడుస్తుందని రాజ్ మండిపడతాడు. మీ అమ్మానాన్న నీతో ప్రేమగా ఉంటారా అని ఇందూ అడగ్గా.. అమ్మ ఉంటుంది కానీ, నాన్న ఉండడని చెబుతాడు రాజ్. మా నాన్న శాడిస్ట్ అంటాడు. నా తమ్ముడి క్రెడిట్ కార్డ్ మొత్తం వాడేసినా అమాయకంగా క్షమిస్తాడని చెబుతాడు. నువ్వు మాయగాడివి అయితే, నీ తమ్ముడు అమాయకుడన్న మాట అంటుంది ఇందూ. నాకు నిద్ర వస్తుంది.. పాట పాడమని అడుగుతుంది ఇందూ. రాజ్ పాట పడుతుండగా అతని ఒడిలో పడుకుంటుంది ఇందూ..
ఇందూని విడిపించడానికి కావాల్సిన డబ్బు కోసం చక్రీ దగ్గరికి వస్తారు రేఖ, భూషణ్. మేం అడిగినట్లుగా కోటి రూపాయలు నువ్వు ఇవ్వవని మాకు అర్ధమైంది. కానీ నువ్వు ఇస్తావన్న 50 లక్షల రూపాయలైనా ఇవ్వమని అడుగుతుంది రేఖ. ఆ మాటలు వినగానే చక్రీ నవ్వుతాడు. నువ్వు నా దగ్గర పది సంవత్సరాలుగా అప్పు తీసుకుంటూనే ఉన్నావు కదా? తిరిగి ఇచ్చావా? ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంటాడు చక్రీ. డబ్బులు తీసుకునే వరకు నా ఇంటి చుట్టూ తిరిగావు.. ఆ డబ్బుని వసూలు చేసుకోవడం కోసం నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావని మండిపడతాడు చక్రీ. చెప్పిన టైంకి డబ్బులు ఇస్తేనే నమ్మకం వస్తుందని చెబుతాడు.
అసలు నేను డబ్బులిస్తానని చెబితే మీ ఇద్దరూ ఎలా నమ్మారని చక్రీ అనడంతో రేఖ, భూషణ్ షాక్ అవుతారు. ఇస్తానని మా నగలన్నీ తీసుకున్నావు కదా అని రేఖ అడగ్గా.. వాటిని నా పాతబాకీ కింద జమ చేసుకున్నానని చెబుతాడు చక్రీ. వారం రోజుల్లో మిగిలిన అప్పుని తీర్చాలని డెడ్‌లైన్ పెట్టడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఇందూని తీసుకొస్తేనే తప్ప .. నాకు డబ్బులు రావని అంటుంది రేఖ. నీ సమస్య నీకుంటే నా సమస్యలు నాకు ఉన్నాయని చెబుతాడు చక్రీ. డబ్బులు ఇస్తానని చెప్పి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదని అంటుంది రేఖ. దీనిని మోసం అనరు.. జాగ్రత్త అంటారు. మిమ్మల్ని నమ్మి ఒక రూపాయి ఇచ్చినా కూడా నేను వెధవలా మారిపోతానని అంటాడు చక్రీ. మేం నిన్నే నమ్ముకున్నాం.. నువ్వు డబ్బులిస్తే కిడ్నాపర్లకు ఇచ్చి ఇందూని తీసుకొద్దామని అనుకున్నామని అంటుంది రేఖ. ఇప్పుడు నువ్వు కాదంటే మాకు వేరే దారిలేదని చెబుతుంది. నేనైతే మీకు డబ్బులు ఇవ్వను.. నాకు మాత్రం వారం రోజుల్లో నా డబ్బులు వడ్డీతో సహా కట్టాలని డెడ్‌లైన్ పెడతాడు చక్రీ. ఆ మాటలతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు.
ఉదయాన్నే వెంకీ ఫోన్ చేయడంతో రాజ్, ఇందూలు ఉలిక్కిపడి నిద్రలేస్తారు. ఈరోజు అమ్మానాన్నల పెళ్లిరోజని వెంకీ చెప్పడంతో చికెన్ పట్టుకుని వస్తానని చెబుతాడు రాజ్. నా తమ్ముడు చాలా మంచోడని రాజ్ చెప్పడంతో.. నువ్వు మంచోడివి కాదు కదా అని సెటైర్లు వేస్తుంది ఇందూ. ఈరోజు మా అమ్మనాన్నల పెళ్లిరోజు.. చికెన్ వండుకుని సెలబ్రెట్ చేసుకుంటామని చెబుతాడు రాజ్. మీ ఇంట్లో ఏం జరిగినా చికెన్ వండుకుని సెలబ్రేట్ చేసుకుంటారా? ముక్క లేనిదే ముద్ద దిగదా ఏంటీ? అంటూ మండిపడుతుంది ఇందూ. ఇళ్లంతా డెకరేట్ చేసి, స్వీట్స్ పంచి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతుంది ఇందూ. మాది మీలాగా ప్యాలెస్ కాదు.. ఏదో చిన్న కొంప, రిచ్ పర్సన్స్ కూడా కాదని అంటాడు రాజ్.
నువ్వు ఎలాగూ మంచి దారిలో నడవవు.. నీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలని చెబుతుంది ఇందూ. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తే నేనే సెలబ్రేట్ చేస్తానని ఇందూ చెప్పగా వద్దని అంటాడు రాజ్. అయితే డల్లాస్ గారి దగ్గరే న్యాయం అడుగుదామని ఇందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. జీరో బడ్జెట్‌తో మీ అమ్మనాన్నల పెళ్లిరోజుని సెలబ్రేట్ చేస్తానని అంటుంది ఇందూ. మా వాళ్లు అడిగితే నేను ఏం చెప్పాలని రాజ్ అడగ్గా.. నేనొక ఈవెంట్ ప్లానర్‌ని అని చెప్పమని ఇందూ చెప్పడంతో రాజ్ గట్టిగా నవ్వుతాడు. డల్లాస్ పేరు చెప్పి బెదిరించడంతో రాజ్ ఒప్పుకుంటాడు. రాజ్ ఇంటికెళ్లి చూసేసరికి ఆ వాతావరణం ఇందూకి కొత్తగా ఉంటుంది. మీ అమ్మానాన్నల పెళ్లిరోజైతే ఆ హడావుడి కనిపించడం లేని అడుగుతుంది ఇందూ. వాళ్లిద్దరి గొడవ చూసి వెంకీ గట్టిగా అరుస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications