Brahmamudi April 24th episode: రాజ్ ఏకపత్నీవ్రతుడు కాదు.. సీతారామ కల్యాణానికి అనర్హుడు అంటూ పూజా
తల్లి స్పర్శ లేక బాబు హాస్పిటల్ పాలు అవుతాడు. రాజ్ ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఆర్డర్ వేస్తుంది అపర్ణ. బాబు ఎవరినే విషయం సుభాష్ కి తెలుసని కావ్య తెలుసుకుంటుంది. అతను కూడా నిజం చెప్పకపోవడంతో నిరాశ చెందుతుంది. సీతారామ కళ్యాణం రాజ్ దంపతుల చేతులమీదుగా చేయిస్తాను అంటుంది చిట్టి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్ 392 లో ఏం జరిగిందంటే..
మీడియా వాళ్ళు బాబు గురించి నిజం చెప్పమనటంతో రాజ్ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడకుండా ఉండిపోతారు. నా కూతురికి ఇంత అన్యాయం చేసి ఏమీ మాట్లాడకుండా ఉంటారా నిజాన్ని నేనే చెప్పేస్తాను అనుకుంటూ మీడియాకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది కనకం. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది కావ్య, పూజకి టైం అవుతుంది అని చెప్పి మీడియా వాళ్ల నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతుంది.

గుడిలోకి వచ్చిన తర్వాత తల్లిని మందలిస్తుంది కావ్య. నా కూతురికి అన్యాయం జరుగుతుంటే నేను చూడలేను అంటుంది కనకం. ఆ బిడ్డ ఆయనకి పుట్టలేదని జరిగిందంతా చెప్తుంది కావ్య. మరి ఆ బిడ్డ ఎవరు అంటుంది కనకం. అది తెలుసుకొనే ప్రయత్నమే కావ్య చేస్తుంది అంటుంది చిట్టి. అది సరేగాని మీరు మా చేతుల మీదుగా కళ్యాణం చేయిస్తానన్నారు ఏమిటి, అసలే అత్తయ్య గారు మా మీద కోపంగా ఉన్నారు అంటుంది కావ్య.
అయినా పర్వాలేదు మీ ఇద్దరూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ సీతారాముల్లాగా కలకాలం కాపురం చేయాలనేదే నా కోరిక అందుకే అలా చెప్పాను అంటుంది చిట్టి. నిజం తెలియక మీ గురించి మా అల్లుడు గారి గురించి తప్పుగా మాట్లాడాను క్షమించండి అంటుంది కనకం. ముగ్గురు బిడ్డల తల్లివి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా, నీది ఓవరాక్షన్ అంటూ కనకానికి చివాట్లు పెడుతుంది చిట్టి. మరోవైపు అనామిక దగ్గరికి వచ్చిన రుద్రాణి కళ్యాణం మీరు చేయిస్తేనే బాగుంటుంది.

రాజ్ కి ఆ అర్హత లేదు అంటు అనామికని రెచ్చగొడుతుంది. మీరు అన్నది నిజమే ఇప్పుడే వెళ్లి పూజ ఆపి నేను,కళ్యాణ్ సీతారామ కళ్యాణం చేయిస్తాం అని ఆవేశంగా పూజ దగ్గరికి వెళ్తుంది. బావగారికి ఈ పూజ చేసే అర్హత లేదు, రాముడు ఏకపతివ్రతుడు కానీ బావగారు ఏకపత్ని వ్రతుడు కాదు అందుకే పూజ మేము చేయిస్తాము అంటుంది అనామిక. కళ్యాణాన్ని సీత లాంటి భార్యతో చేయాలనుకుంటారు కానీ సూర్పణక లాంటి నీతో చేయటానికి నాకు ఇష్టం లేదు అంటాడు కళ్యాణ్.
కోడల్ని వెనకేసుకొస్తుంది ధాన్యలక్ష్మి. ఇంట్లో చేసిన రచ్చ చాలదని ఇక్కడ కూడా రచ్చ చేస్తున్నారా అంటూ మందలిస్తుంది సుమిత్ర. అప్పుడు కనకం కోపం భరించలేక మాట్లాడితే బిడ్డ తండ్రి అంటున్నావు, ఆ బిడ్డ ఎవరికి పుట్టాడో నువ్వు చూసావా, ఆ బిడ్డ తల్లిని ఎవరైనా చూశారా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పూజ మాత్రం నా కూతురు అల్లుడు మాత్రమే చేస్తారు అంటుంది. చిట్టి కూడా అనామిక కి చివాట్లు పెడుతుంది. కళ్యాణం రాజ్ దంపతుల చేతుల మీదుగానే జరుగుతుంది.
తర్వాత రాహుల్ మీడియా కి ఫోన్ చేసి కళ్యాణం దగ్గర జరిగిన గొడవ గురించి చెప్పి పూజ ముగించే కిందికి వస్తారు అప్పుడు వీటి గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించమని రెచ్చగొడతాడు. ఈ మాటలు పక్కనుంచి విన్న అప్పు విషయం కళ్యాణ్ కి చెప్పాలి అనుకుంటుంది. మరోవైపు దండం పెట్టుకుంటున్న కనకంతో నీ అల్లుడు నీ కూతురికి అన్యాయం చేశాడు కదా నువ్వేమీ నిలదీయవా అంటూ ప్రశ్నిస్తుంది. నవ్వుతూనే రుద్రాణి తల తిరిగిపోయేలా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది కనకం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











