Brahmamudi April 25th Episode : కళావతి కోసం రాజ్ సాహసం .. రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన కావ్య
రాజ్ సంతకం తీసుకొస్తావా? డెత్ సర్టిఫికెట్ కోసం సంతకం పెడతావా అంటూ రుద్రాణి నిలదీసే సరికి 24 గంటల్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తానని అంటుంది కావ్య. కావ్య ఆఫీస్‌కు వెళ్తూ రాజ్‌కి ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని అంటుంది. దాంతో కావ్య కోసం రాజ్ వెళ్తుండగా కింద యామిని తల్లిదండ్రులు పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. రాజ్‌ని ఉండమని చెప్పగా , మీ ఇష్టమని చెప్పి వెళ్లిపోతాడు. రెస్టారెంట్‌లో రాజ్‌ను కలిసిన కావ్య తాను పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నానని చెబుతుంది.
ఏం జరిగిందని రాజ్ అడగ్గా మా బాస్ ఇచ్చిన లెటర్ హెడ్‌ని నేను పొగొట్టానని , అది ఉంటేనే డీల్ క్లోజ్ చేయడం కుదురుతుందని చెబుతుంది. నేను మీకు ఏం సాయం చేయగలనని రాజ్ అడగ్గా.. మా బాస్ సంతకం ఫోర్జరీ చేయమని అంటుంది. ఆ మాటలకు భయపడిన రాజ్ నేను అలాంటి పనులు చేయనని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో చేసేది లేక రాజ్ సంతకాన్ని కావ్య ఫోర్జరీ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్‌లో 705లో ఏం జరిగిందంటే?

పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్ గురించి ఇంట్లో చర్చ జరుగుతుండగా కావ్య అప్పుడే ఇంటికి వస్తుంది. నువ్వు సృష్టించిన డాక్యుమెంట్స్ నీ కంటే ముందు నా చేతికి ఎలా వచ్చాయా? అని ఆశ్చర్యంగా ఉందా అని కావ్యని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నీ పేరు మీద వచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్ నవ్య జ్యూయెలర్స్‌కి పంపించావ్ , వాళ్లు బ్యాలెన్స్ క్లియర్ చేశారు. వెంటనే కంపెనీ పేరు మీదున్న బకాయిలు క్లియర్ చేసి మనింటి పరువు కాపాడావని ప్రశంసిస్తుంది రుద్రాణి. కానీ రాజ్ చేయాల్సినదంతా నువ్వు ఎలా చేశావు? రాజ్ లేకుండా నీ చేతికి పవర్ ఆఫ్ అటార్నీ ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తుంది.
సంపదలోనూ, సంస్కారంలోనూ తరతరాలుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వచ్చిన దుగ్గిరాల కుటుంబం ఇది. ఈ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి, మౌనం సమాధానం కాదని అంటుంది రుద్రాణి. తను అలా అడుగుతుంటే ఆ పేపర్లు నీకు ఎలా వచ్చాయో చెప్పవేంటీ అని ఇందిర కూడా ప్రశ్నిస్తుంది. కంపెనీ ఎండీ లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ మరొకరి పేరు మీదకి రాయడం సాధ్యం కానీ పని కదా అని సీతారామయ్య కూడా అంటాడు. నమ్మిన విలువల్ని పక్కనపెట్టే మనిషివి కూడా కాదు.. మరి ఈ పేపర్లు ఏంటనీ సుభాస్ అడుగుతాడు.
నన్ను ఇంత బాగా అర్ధం చేసుకున్న మీరు.. రుద్రాణి గారి మాటలు విని నిలదీస్తారా అని కావ్య ప్రశ్నిస్తుంది. రుద్రాణి సాక్ష్యాలతో వచ్చి ప్రశ్నిస్తోందని దానికి ఏం సమాధానం చెప్పమంటావ్ అని అడుగుతుంది ఇందిర. ఎప్పుడైనా అత్యవసర పరిస్ధితుల్లో పవర్ ఆఫ్ అటార్నీ అవసరం పడితే అప్పటికప్పుడు ఇబ్బంది పడకూడదని మీ అబ్బాయి ముందే రెడీ చేసి పెట్టారని చెబుతుంది కావ్య. ఇదంతా పచ్చి అబద్ధమని.. నేను నమ్మనని అంటుంది రుద్రాణి. ఇది నీకు, నాకు సంబంధించిన వ్యవహారం కాదని.. ఒక కంపెనీకి, ఒక వ్యవస్ధకి సంబంధించిన విషయమని అంటుంది.
భర్త ప్రమేయం లేకుండా భార్య తల్లి కావొచ్చు.. దానికి ఐవీఎఫ్ అనే టెక్నాలజీ ఉందని కానీ ఒక కంపెనీ ఎండీ ప్రమేయం లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ రావడానికి అవకాశం లేదని కాబట్టి నువ్వు చేసినదంతా ఫ్రాడే అవుతుందని అంటుంది రుద్రాణి. దీని మీద ఎవరైనా కంప్లయంట్ చేస్తే నువ్వు జైలుకి వెళ్తావ్? కానీ మా కుటుంబ పరువు ప్రతిష్టల పరిస్ధితి ఏంటి అని నిలదీస్తుంది. అలాంటి పనికిమాలిన పనులు నువ్వు చేస్తావేమో కానీ, కావ్య ప్రాణం పోయినా చేయదని అంటుంది అపర్ణ.
క్లయంట్స్ కోర్టుకెళితే అప్పుడిది దొంగ సంతకమని తెలిస్తే అప్పుడు మన పరిస్ధితి ఏంటీ? అని నిలదీస్తుంది రుద్రాణి. ఇది నిజంగా రాజ్ చేసిన సంతకమా? లేక రాజ్ లాగా కావ్య చేసిన ఫోర్జరీ సంతకమా అనేది తేలాల్సిందే అని అంటుంది. దానిని ఎలా తెలుసుకుంటావ్ అని ప్రకాశం అడగ్గా.. వెంటనే ఓ ఎక్స్‌పర్ట్‌ని పిలిపిస్తుంది రుద్రాణి. రాజ్ బతికున్నప్పుడు చేసిన పేపర్స్, కావ్య పేరు మీదకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ చేసిన సంతకాలలో ఏది ఒరిజినల్? ఏది డూప్లికేట్? అని తేల్చాల్సిందిగా చెబుతుంది. దాంతో ఆ వ్యక్తి రెండు సంతకాలను పరిశీలిస్తాడు.
హాల్‌లో సెంట్రల్ ఏసీ ఉన్నా నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయని సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఇంతలో ఇవి రెండు ఒరిజినల్ సంతకాలేనని ఆ ఎక్స్‌పర్ట్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. దీంతో కావ్య జరిగినది గుర్తుచేసుకుంటుంది. హోటల్‌లో సంతకం చేయనని వెళ్లిపోయిన రాజ్.. తర్వాత తిరిగి వచ్చి ఫోర్జరీ సంతకం చేస్తాడు. మీరు గతం మరిచిపోయినా సంతకం మరిచిపోలేదని మనసులో అనుకుంటుంది కావ్య. ఒక్కసారి చూడగానే చాలా బాగా సంతకం చేశారని మెచ్చుకుంటుంది.
నేను ఇచ్చిన డబ్బు సరిపోలేదా? సరిగ్గా చూసి చెప్పండి అని ఆ ఎక్స్‌పర్ట్‌పై మండిపడుతుంది రుద్రాణి. మీరు ప్రపంచంలో ఎంత పెద్ద ఎక్స్‌పర్ట్ దగ్గరికి తీసుకెళ్లినా ఇదే చెబుతాడని కోపంగా వెళ్లిపోతాడు ఆ వ్యక్తి. వయసులో చిన్నదైనా ఈ కుటుంబం కోసం , కంపెనీ కోసం అంత కష్టపడుతున్న పిల్లని అనుమానిస్తావా? అంటూ రుద్రాణిపై మండిపడుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ. రాజ్ నీకు ముందే పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తే ఉదయం మన క్లయింట్స్ వచ్చినప్పుపుడు ఎందుకు మౌనంగా ఉన్నావని కావ్యని నిలదీస్తుంది రుద్రాణి.
ఆయనకు నాకు ఎప్పుడో ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారని.. అవి ఉన్నాయో లేదో? చెక్ చేయకుండా వాళ్లకి మాట ఇవ్వలేను కదా? అని అంటుంది కావ్య. ఆ మాటలతో రుద్రాణికి చీవాట్లు పెడుతారు దుగ్గిరాల ఫ్యామిలీ. కావ్య ఇచ్చిన పొడుపు కథ ఆథారంగా ఆమె అడ్రస్ కనుక్కుంటాడు రాజ్. వెంటనే ఈ విషయాన్ని కావ్యకి ఫోన్ చేసి చెబుతాడు. అయితే రాజ్ కనుక్కున్న అడ్రస్ తప్పు కావడంతో కళావతి నవ్వుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











