Brahmamudi April 25th Episode: రాజ్, వెంకీలకు ఇందూ టార్చర్.. ఇందూ ఫంక్షన్ ప్లాన్‌కి రాజ్ తల్లిదండ్రులు ఫిదా

Photo Courtesy: JioHotstar

మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగిన ఇందూ రోడ్ల మీద పరుగులు తీస్తూ ఉంటుంది, ఆమె వెనుకే రాజ్ పరిగెత్తుతాడు. ఇద్దరూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. నువ్వు ఏదైనా పనిచేసుకోవచ్చు కదా ఈ కిడ్నాప్‌లు ఎందుకు అని చెబుతుంది ఇందూ. పనిచేయాలంటే ఉద్యోగం కావాలి.. అయినా నాకు బిజినెస్ అంటే ఇష్టమని చెబుతాడు రాజ్. నువ్వు చదువుకున్నావా అని ఇందూని అడగ్గా.. మా నానమ్మ నన్ను సీక్రెట్‌గా చదివించిందని చెబుతుంది ఇందూ. మాటలు చెబుతూ రాజ్ ఒడిలో నిద్రపోతుంది ఇందూ.

ఇందూని విడిపించడానికి కావాల్సిన కోటి రూపాయలు ఇవ్వమని చక్రీని అడుగుతారు రేఖ, భూషణ్. మీరు ఇచ్చిన నగల్ని పాత బాకీ కింద జమ చేసుకున్నాను. వారం రోజుల్లోగా నా బాకీని వడ్డీతో సహా తీర్చాలని చక్రీ చెప్పడంతో రేఖ, భూషణ్ షాక్ అవుతారు. ఉదయాన్నే రాజ్‌కి వెంకీ కాల్ చేసి.. ఈరోజు అమ్మానాన్నల పెళ్లిరోజు చికెన్ తీసుకుని రమ్మని చెబుతాడు. ఈ మాటలు విన్న ఇందూ.. పెళ్లి రోజుని సెలబ్రెట్ చేసుకోవడం అలా కాదు, నేను జీరో బడ్జెట్‌లో సింపుల్‌గా చేస్తానని చెబుతుంది. రాజ్- ఇందూలు ఇంటికి రావడంతో చలపతి, లక్ష్మీ, వెంకీలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్ 1016లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 25th 2026 Episode 1016 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్‌తో కలిసి ఇంటికొచ్చిన ఇందూని చూసి చలపతి, లక్ష్మీ, వెంకీలు షాక్ అవుతారు. రాత్రి వీడి కోసం ఒక అమ్మాయి వచ్చింది.. ఇప్పుడు పెద్దోడు ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ ఇంట్లో ఏం జరిగిందని మండిపడుతాడు చలపతి. బయట చాలామంచి కుర్రోళ్లు, చదువుకున్న కుర్రోళ్లు చాలామంది ఉంటే మావాళ్లు ఎందుకు నచ్చారు? ఇలాంటి వెధవని ప్రేమించి నీ జీవితం నాశనం చేసుకున్నావని ఇందూని అడుగుతాడు. తను నా గర్ల్‌ఫ్రెండ్ కాదని చెబుతాడు రాజ్. ఆ తర్వాత అందరికీ ఇంట్లో వాళ్లందరినీ పరిచయం చేస్తాడు రాజ్. రాత్రి రాజ్ చెప్పిన మాటలన్నీ వాళ్లతో చెప్పి ఇరికిస్తుంది ఇందూ.

అమ్మా, తమ్ముడి గురించి గొప్పగా చెప్పి నా గురించి చెడుగా చెబుతావా అంటూ రాజ్‌పై మండిపడతాడు చలపతి. ఈ అమ్మాయి ఎవరు? ఎందుకొచ్చింది? అని అడుగుతాడు. ఈరోజు పెళ్లి అని రాజ్ చెప్పబోతుండగా.. మనకి చెప్పకుండా నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడని అంటాడు చలపతి. అందుకే ఇన్నిరోజులు ఇంటికి రాకుండా దూరంగా ఉన్నావని అంటాడు వెంకీ. నా మాట పూర్తికాకముందే ఏదేదో అనుకుంటున్నారని మండిపడతాడు రాజ్. ఈరోజు మీ పెళ్లిరోజు కాబట్టి ఫంక్షన్ చేద్దామని ఆ అమ్మాయిని తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. తను ఈవెంట్ ప్లానర్ అని అంటాడు. నీ ముఖానికి ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందా? అని అప్పుడే అనుకున్నా, కాకపోతే నీలాంటి వెధవల్ని కూడా ఇలాంటి అమ్మాయిలు ఇష్టపడుతున్నారు కదా అని కొంచెం అనుమానం వచ్చిందని చెబుతాడు చలపతి.

ఫంక్షన్ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా? ఎప్పటిలాగే చికెన్ వండుకుని తినేద్దామని అంటాడు చలపతి. ఈవిడగారు జీరో బడ్జెట్‌లోనే ఫంక్షన్ మొత్తం చేసేస్తారట అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అయితే సరేనని అంటాడు చలపతి. నువ్వు డబ్బులు లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తావని అడుగుతుంది లక్ష్మీ. నేను చేసి చూపిస్తాను.. ఆకాశమంత పందిరి వేసి అని అంటుంది. ఆ కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి.. మీ 25 సంవత్సరాల పెళ్లిరోజు సంబరాలు అంబరం అంటేలా చేస్తానని అంటుంది ఇందూ. లోపలికి వెళ్లి రెడీ అయి రమ్మని చెబుతుంది. మీకున్న దానిలోనే రిచ్‌గా కనిపించేలా బట్టలు కట్టుకోమని చెబుతుంది ఇందూ. గిన్నెలు కడగటం మధ్యలోనే ఆపేశానని.. తర్వాత కట్టుకుంటానని లక్ష్మీ చెబుతుండగా.. ఆ పని చేయడానికి ఇక్కడ మీ ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబుతుంది ఇందూ. దాంతో గిన్నెలు కడగటానికి రాజ్, వెంకీలు కొట్టుకుంటారు. వెంకీని చెట్టు ఎక్కించి.. రాజ్‌తో గిన్నెలు కడిగిస్తుంది ఇందూ.

ఉదయాన్నే లక్కీ గురకలు పెట్టి నిద్రపోతుండగా ఇంటి ఓనర్ నీళ్లు కొట్టి నిద్రలేపుతాడు. రాత్రి నన్నెవరు కొట్టారని ఇంటి ఓనర్ అడగటంతో నేనే కొట్టానని లక్కీ చెప్పడంతో ఇంకా కొడతాడు ఓనర్. నేను చీరకట్టుకుని వంట చేస్తుంటే నా మీద అఘాయిత్యం చేయబోరని లక్కీ అనడంతో ఇంటి ఓనర్ షాక్ అవుతాడు. వంటలు పద్ధతిగా రుచిగా ఉండాలని మీరే చెప్పారు కదా? అందుకే చీరకట్టుకుని వంట చేశానని చెబుతాడు లక్కీ. మీ ఫ్రెండ్‌ని టిఫిన్ చేయమని చెబితే నేను ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతానని అంటాడు ఓనర్. ఇళ్లంతా వెతికినా రాజ్, ఇందూ కనిపించకపోవడంతో లక్కీ కంగారుపడతాడు. వెంటనే రాజ్‌కి ఫోన్ చేసి నానామాటలు అంటాడు. అయితే 2 కేజీలు చికెన్ తీసుకుని మా ఇంటికి రమ్మని చెబుతాడు రాజ్. నువ్వు కోటి రూపాయలు నొక్కేసి నాకు కోడికూర పెడతావా అని మండిపడతాడు లక్కీ. ఇందూ ఇక్కడే ఉందని రాజ్ చెప్పడంతో లక్కీ టెన్షన్ పడతాడు. ఇంతలో ఈ మాటలన్నీ విన్న ఓనర్ నేను వెళ్లిపోతున్నానని చెబుతాడు.

చెట్టుపైకి ఎక్కిన వెంకీని చూసిన నందూ కంగారుపడుతుంది. మా అమ్మానాన్నల పెళ్లిరోజు కోసమని కొబ్బరి మట్టలు నరుకుతున్నాను.. నాకు చెట్లు ఎక్కడం వచ్చు కానీ, దిగడం రాదని చెబుతాడు వెంకీ. ఇంతలో అక్కడికి ఇందూ వస్తుంది. అక్కని చూడగానే నందూ సంతోషిస్తుంది. నన్ను కిందకి దించమని రాజ్‌ని అడుగుతాడు వెంకీ. దాంతో ఇందూ, రాజ్‌ కలిసి ఓ లుంగీని పట్టుకుని అందులో దూకేయమంటారు. ఇంతలో నందూ వచ్చి నిచ్చెన తీసుకొచ్చి వెంకీని కాపాడుతుంది. ఈరోజు మా అమ్మనాన్నల పెళ్లిరోజు ఉండమని నందూని అడుగుతాడు వెంకీ. నువ్వు నిన్న రాత్రి చెప్పలేదు కాబట్టి వెళ్లిపోతున్నానని అంటుది నందూ. ఇందూ మాటలతో నందూ సరేనని అంటుంది. ఇందూని కిచెన్‌లోకి తీసుకొచ్చి ఏం కావాలో చేసుకోమని చెబుతాడు రాజ్. కానీ ఏ వస్తువు ఎక్కడుందో తెలియకపోవడంతో వెంకీ ఆటపట్టిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X