Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
రాజ్ ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఆర్డర్ వేస్తుంది అపర్ణ. బాబు ఎవరనే విషయం సుభాష్ కి తెలుసని కావ్య తెలుసుకుంటుంది. అతను కూడా నిజం చెప్పకపోవడంతో నిరాశ చెందుతుంది. సీతారామ కళ్యాణం రాజ్ దంపతుల చేతులమీదుగా చేయిస్తాను అంటుంది చిట్టి. ఇంట్లో గొడవలన్నీ మీడియాకి చెప్పి రాజ్ ఫ్యామిలీ మీదకి మీడియాని రెచ్చగొడతాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్ 393 లో ఏం జరిగిందంటే..
ఆస్తి కోసం నీ కూతురికి సవతి వచ్చినా పర్వాలేదా అని కనకాన్ని అడుగుతుంది రుద్రాణి. ఆస్తి లేదని భర్తని వదిలేసి నువ్వు పుట్టింట్లో అడుక్కొని తింటున్నావు కదా ఆ పరిస్థితి నా కూతురికి రానివ్వను, నువ్వే మాకు ఆదర్శం అని వెటకారంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కనకం. అప్పుడే అక్కడికి వచ్చిన అనానిక ఆవిడ అన్నది నిజమేనా అంటుంది. కాదు అంటుంది రుద్రాణి. మరి మావయ్య గారు ఏరి అని వెటకారంగా అడుగుతుంది స్వప్న.

అయినా గుడిలో దెయ్యాల కథలు మనకెందుకు అని అక్కడి నుంచి అనామికని తీసుకొని వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు రాముని కళ్యాణం జరిపిస్తూ ఉంటారు పూజారి. రాముడి విశిష్టతను, సీతాదేవి పతిభక్తి గురించి చెప్తూ ఉంటారు. అదే సమయంలో కళ్యాణ్ ని బయటికి తీసుకువచ్చి తాను విన్నదాని గురించి చెప్తుంది అప్పు. మీడియా వాళ్ళు కావాలని రాలేదు మీ ఇంట్లో వాళ్ళే ఎవరో ప్లాన్ చేసి రప్పించారు అంటుంది.
ఈ విషయం ఇప్పుడే ఇంట్లో వాళ్ళు చెప్తాను అని అక్కడినుంచి వెళ్లబోతాడు కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళందరూ పూజలో ఉన్నారు, వాళ్లకి చెప్పటం కన్నా మనమే ఏదో ఒకటి చేయాలి అని కళ్యాణ్ చేయి పట్టుకొని ఆపుతుంది అప్పు. అప్పుడే అది చూసిన అనామిక కోపంతో రగిలిపోతుంది. ఒక అక్క మోసం చేసి పెళ్లి చేసుకుంది, మరో అక్క ఆస్తికోసం భర్త బిడ్డని భరిస్తుంది.
అలాగే నువ్వు కూడా నా మొగుడిని తగులుకుందామనుకుంటున్నావా అంటుంది. అనామికని కోప్పడతాడు కళ్యాణ్, నువ్వు అనుకుంటున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అని చెప్తాడు. అయినా అనామిక వినకుండా నువ్వు కూడా మీ అన్నయ్య లాగా దీంతో బిడ్డను కని ఇంటికి తీసుకు వద్దామనుకుంటున్నావా అంటుంది. ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన కళ్యాణ్ ఆమె చెంప పగలగొడతాడు. నన్నే కొట్టావు కదా ఇంతకింత బదులు తీర్చుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక.
కళ్యాణ్ వాళ్ళు నేరుగా మీడియా దగ్గరికి వచ్చి మీకు మా ఫ్యామిలీ గురించి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు చేస్తున్నది తప్పు అంటాడు. మేము ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఊరుకోవటానికి మీరేమీ నార్మల్ పీపుల్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మా డ్యూటీ ఒకవేళ తప్పయితే మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు మీడియా. తర్వాత కళ్యాణ్ రాజ్ ని తీసుకొని ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపోవాలి అనుకుంటాడు.

కానీ అప్పటికే మీడియా అక్కడికి వచ్చేసి ఈ బిడ్డని మీరు వేరే స్త్రీతో కన్నారంట కదా, మీ ఫ్యామిలీ మిమ్మల్ని దూరం పెట్టింది అంట కదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. వాటన్నింటికీ సమాధానం చెప్తాడు కళ్యాణ్. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎవరిస్తున్నారు అంటూ స్వప్న, కనకం మీడియాని కోప్పడతారు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా ఫ్యామిలీ లో ఎలాంటి గొడవలు లేవు మేమందరం కలిసే ఉన్నాము అంటుంది కావ్య.
అయితే ఆ బిడ్డకి తల్లి ఎవరు అని అడుగుతుంది మీడియా. నేనే అని అబద్ధం చెప్తుంది కావ్య. ఆవిడ చెప్పేది నిజమేనా అని అపర్ణ అని నిలదీస్తుంది మీడియా.నిజమే అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకున్నదే జరిగింది, రాను అంటే బలవంతంగా తీసుకువెళ్లారు ఇప్పుడు చూడండి నేను అనుకున్నదే జరిగింది అని కోపంగా అంటుంది అపర్ణ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











