Brahmamudi April 26th Episode : నేరుగా దుగ్గిరాల నిలయానికి రాజ్.. షాక్‌లో కావ్య , అపర్ణ మాస్టర్ ప్లాన్
రాజ్ లేకుండా నీ చేతికి పవర్ ఆఫ్ అటార్నీ ఎక్కడి నుంచి వచ్చిందని కావ్యని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నాకు డౌట్‌గా ఉందని రాజ్ ఉన్నప్పటి సిగ్నేచర్, నువ్వు తీసుకొచ్చిన పేపర్స్ మీద సంతకం రెండూ మ్యాచ్ చేయాలని అంటుంది. వెంటనే ఫోన్ చేసి ఎక్స్‌పర్ట్‌ను పిలిపించి పరిశీలించగా అవి రెండూ రాజ్ సంతకాలేనని ఆయన చెబుతాడు. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉపయోగపడటానికి వీలుగా నాకు ముందుజాగ్రత్తగా పవర్ ఆఫ్ అటార్నీ రాయించారని చెబుతుంది కావ్య .
అయితే తాను ఫోర్జరీ సంతకం కోసం బాధపడుతుండగా రాజ్ వచ్చి సంతకం చేస్తాడు. మీకోసం రిస్క్ చేస్తున్నానని అనడంతో మీరే నా బాస్ అని అంటుంది. పాత సైన్ చూసి చాలా ఈజీగా సంతకం చేస్తాడు రాజ్. అది చూసిన కావ్య మీరు గతం మరిచిపోయినా, సంతకం మరిచిపోలేదని మనసులో అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్‌లో 705లో ఏం జరిగిందంటే?

కావ్య ఇచ్చిన పొడుపు కథ ఆధారంగా ఆమె అడ్రస్ కనుక్కున్నట్లు బిల్డప్ ఇస్తాడు రాజ్. అది తప్పు అడ్రస్ కావడంతో కావ్య నవ్వుకుంటుంది. రేపు మీ ఇంటికొచ్చి సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పడంతో ఆయన ఎవరింటికి వెళ్తాడోనని అనుకుంటుంది. రాజ్ - యామినిల పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటారు వైదేహి- రఘునాథ్. ఇంతలో యామిని రావడంతో వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉందో చూసి ఓకే చేయమని అంటారు. నాకు రాజ్‌తో పెళ్లి జరగడం ఇంపార్టెంట్, పెళ్లి ఎలా చేసినా పర్లేదని చెబుతుంది యామిని. నీ వరకు ఓకే కానీ అల్లుడు గారికి కూడా చెప్పమని వారిద్దరూ అంటారు.
కావ్య , అపర్ణలు రాజ్‌ని కలిశారు. కావ్యతో రాజ్ రోజూ మాట్లాడుతున్నాడని అలాంటప్పుడు ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదని అంటాడు రఘునాథ్. మా పెళ్లిని ఎవరూ ఆపలేరని యామిని చెప్పగా.. కావ్యని తక్కువ అంచనా వేయొద్దని అంటారు. ఆ కావ్యే నన్ను రెచ్చగొడుతోందని.. తనతో నేరుగా యుద్ధం చేసేలా చేస్తోందని అంటుంది యామిని. ఆవేశంలో నోరు జారి నిజాలు బయట పెట్టేస్తానని అనుకుంటుందని చెబుతుంది. కావ్య ఉద్దేశం నీ నుంచి నిజాలు చెప్పించడమే అయితే ఎప్పుడో చేసేదని, కానీ తనకు కావాల్సింది అది కాదని తన భర్తకు ఎటువంటి ప్రమాదం కలగకుండా గతాన్ని గుర్తు చేయడమే తనకు ముఖ్యమని అంటాడు రఘునాథ్.
ఎన్ని ప్రయత్నాలు చేసినా రామ్‌కి ఎప్పటికీ గతం గుర్తురాదని అంటుంది యామిని. భార్యాభర్తల బంధం వేరని , అలాంటిది కావ్యని కలవడానికే ఎందుకు వెళ్తున్నాడని ప్రశ్నిస్తాడు. మనపాటికి మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నామని.. కానీ అల్లుడుగారు మాత్రం ఏదో పట్టనట్లు దూరంగా ఉంటున్నారని తను కూడా ఈ పెళ్లి పనులు చూసుకుంటే మంచిదని అంటుందని వైదేహి. మీరు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి.. మన బంధువులకి నేను రామ్ కలిసి వెడ్డింగ్ కార్డ్స్ పంచుతామని అంటుంది యామిని. ఆ కావ్య మీద ఓ కన్నేసి ఉంచమని కూతురిని హెచ్చరిస్తుంది వైదేహి.
ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి క్యారం బోర్డ్ ఆడుతుంటారు. అపర్ణ హడావుడి చూసి ఈమెకు ఉన్న మతి కూడా పోయిందని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. మీరు కూడా వచ్చి ఆడండి అని అపర్ణ పిలవగా వేరే పని ఉందని చూసుకుని వచ్చేస్తామని అంటాడు రాహుల్. పాపకి డైపర్స్ కూడా నేనే మారుస్తున్నానని.. ఇంకా మీకేం పని ఉందని ప్రశ్నిస్తుంది స్వప్న. మనుషులతోనే కాదు అప్పుడప్పుడు వీటితోనూ గేమ్స్ ఆడొచ్చని అంటుంది. అపర్ణ పరిస్ధితి ఏం జరిగింది? ఇలా మారిపోయావ్? ఇలాంటి ఆటలెందుకు అని ఇందిర ప్రశ్నిస్తుంది. చానాళ్లుగా ఈ ఇల్లు బోసిపోయింది కదా? కాస్త సందడిగా మారుద్దామని అంటుంది అపర్ణ. అంతేనా? లేక కావ్య నీకు ఎక్కించినట్లు మాక్కూడా పిచ్చి ఎక్కిస్తారా అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది.
ఎప్పుడో నా స్నేహితురాలితో ఆడినట్లు గుర్తని, మళ్లీ ఇన్ని రోజులకు క్యారమ్స్ ఆడుతున్నానని అంటుంది ఇందిర. అంటే బ్రిటీష్ కాలంలోనా అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. మీరెంత పెద్ద వాళ్లయినా మాకంటే మీరే స్ట్రాంగ్ అని అంటుంది అప్పూ. ఆ రోజుల్లో వాళ్లు తిన్న తిండి అలాంటిదని అపర్ణ చెబుతుంది. తర్వాత అపర్ణ- ధాన్యలక్ష్మీ ఒక జట్టుగా, ప్రకాశం - ఇందిర ఒక జట్టుగా క్యారమ్స్ ఆడతారు. మరోవైపు .. రాజ్ కావ్య అడ్రస్ వెతుక్కుంటూ వస్తాడు . పొడుపు కథలో చెప్పినట్లుగా కాకుండా తన మనసు చెప్పినట్లుగా వస్తాడు. ఆ దారిలో ఎప్పుడో వచ్చినట్లుగా రాజ్‌కి అనిపిస్తుంది. ఇంతలో కావ్య వచ్చి అందరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. జ్యూస్ చాలా బాగుందని అంతా కావ్యని మెచ్చుకుంటారు.
రాజ్ కారు సరాసరి దుగ్గిరాల నిలయం వద్దకు వచ్చి ఆగుతుంది. దాంతో ఏం జరుగుతుందో తెలియక రాజ్ తికమకపడతాడు. ఆ వెంటనే డోర్ తీసుకుని రాజ్ లోపలికి వెళ్లిపోతుండగా కావ్య చూసి షాక్ అవుతుంది. అడ్రస్ ఫోన్‌లో తప్పుగా చెబితే ఎవరో ఇంటికి వెళ్తారనుకుంటే నేరుగా ఇంటికే వచ్చేశారని టెన్షన్ పడుతుంది. ఆ వెంటనే అప్పూ వైపు సైగలు చేసి చెబుతుంది కావ్య. వీరిద్దరిని చూసిన రుద్రాణికి డౌట్ వస్తుంది. అక్కాచెల్లెళ్లు గుసగుసలు ఆడుకుంటున్నారు.. అపర్ణకి ఎక్కించినట్లుగానే మీ అక్క నీక్కూడా పిచ్చెక్కిస్తుందని అప్పూతో అంటుంది రుద్రాణి. దాంతో రాజ్ వచ్చిన విషయం అపర్ణకి కావ్య చెప్పడంతో ఆమె కూడా టెన్షన్ పడుతుంది. ఏదో ఒకటి చేసి ఈ క్యారమ్ బోర్డ్ సెటప్‌ని లోపలికి మార్చేయమని అంటుంది కావ్య.
ఇక్కడ గేమ్ అంతగా బాలేదని రూమ్‌లోకి వెళ్లి అక్కడ ఆడుకుందామా? అని అంటుంది. ఎలాగోలా అందరినీ రూమ్‌కి తీసుకెళ్తుంది అపర్ణ. రాజ్ యాక్సిడెంట్ కేసు గురించి చెప్పాలని రుద్రాణి, రాహుల్‌లను అప్పూ పైకి తీసుకెళ్తుంది. రాజ్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న ఫోటోలను తీసి దాస్తుంది కావ్య. అనంతరం రాజ్‌కి ఎదురుపడి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారని అడుగుతుంది. దారి అదే గుర్తొచ్చి నా చేతులు తీసుకొచ్చేశాయని చెబుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











