Brahmamudi April 26 th episode: రాహుల్ తో క్షమాపణ చెప్పించిన స్వప్న.. అనామికని రెచ్చగొడుతున్న రుద్రాణి!
బాబు ఎవరనే విషయం సుభాష్ కి తెలుసని కావ్య తెలుసుకుంటుంది. అతను కూడా నిజం చెప్పకపోవడంతో నిరాశ చెందుతుంది. సీతారామ కళ్యాణం రాజ్ దంపతుల చేతులమీదుగా చేయిస్తాను అంటుంది చిట్టి. ఇంట్లో గొడవలన్నీ మీడియాకి చెప్పి రాజ్ ఫ్యామిలీ మీదకి మీడియాని రెచ్చగొడతాడు రాహుల్. అప్పు గురించి తప్పుగా మాట్లాడితే అనామిక చెంప పగలగొడతాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్ 394 లో ఏం జరిగిందంటే..
ఇంటికి వచ్చిన అపర్ణ అందరి ముందు తన బాధని వెళ్ళగక్కుతుంది. పెళ్లయిన తర్వాత ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఈరోజు అబద్ధం చెప్పాను ఇదంతా ఎవరివల్ల అని కోప్పడుతుంది. మీరు అబద్ధం చెప్పాను నేను అనుకుంటున్నారు కానీ ఈ ఇంటి గౌరవాన్ని కాపాడారు అంటుంది కావ్య. నువ్వు నోరు ముయ్యి అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నీకే ఈ ఇంట్లో గతి లేదు అలాంటిది నువ్వు ఎలా ఆ బాబు ఈ ఇంటి వారసుడని చెప్తావు..

నా బిడ్డ సవ్యంగా ఉండి ఉంటే, నాకు నచ్చిన కోడలు వచ్చి ఉంటే పుట్టిన మనవడికి నా ప్రేమను అంతా ధారపోసి పెంచుకునే దాన్ని కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా అంటుంది అపర్ణ. నిజమే ఈ ఇంట్లో నాకు గతి లేదు అయినా కుటుంబం పరువు కాపాడాలని ప్రయత్నించాను. గతిలేక ఇంట్లో ఉంటున్నాను అని మన ఇంటి మహిళా మణులు అనుకుంటున్నారు. అయినా నేను ఓపిక పట్టాను కానీ మీరేం చేశారు మీ కొడుకుని అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను అంటున్నారు.
అసలు ఆ బాబు ఈ ఇంటి వారసుడు కాదు అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు అని నిలదీస్తుంది కావ్య. ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన అపర్ణ నువ్వెంత నీ బ్రతుకెంత నువ్వు నన్నే నిలదీసే అంత స్థాయికి ఎదిగి పోయావా తప్పంతా నాదే అంటున్నావా నిజమే తప్పు నాదే వీడు బాబుతో సహా ఇంటికి వచ్చిన రోజే వీళ్ళని బయటికి గెంటేసి ఉండి ఉంటే బాగుండేది అంటుంది. చిట్టి కలుగజేసుకొని అపర్ణకి సర్ది చెప్తుంది. కానీ అపర్ణ మాత్రం కొడుకు కి ఇచ్చిన గడువులో ఐదు రోజులు అయిపోయాయి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నాయి.
ఈ రెండు రోజుల్లో నిజం తేల్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను, అందుకు ఎవరైనా అడ్డుకుంటే నా చావుని కళ్ళ చూస్తారు అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత బయట రుద్రాణి వాళ్ళతో మాట్లాడుతూ అసలు మీరు మనుషులేనా, మీరు కూడా ఈ ఇంటి మనుషులే కదా ఈ ఇంటి పరువు పోతే మీ పరువు పోతుంది అనే జ్ఞానం కూడా లేదా.. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పాలు పోసి పెంచుతున్నారు అయినా మీకు ఏమాత్రం కృతజ్ఞత లేదు అని చీవాట్లు పెడుతుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న కృతజ్ఞత గురించి వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నావా.. ఎవరు దొరుకుతారా, ఎవరిని కాలికింద చెప్పు లాగా తొక్కేద్దామా అని గోతి కాడ నక్కల్లాగా ఎదురు చూస్తారు అంటుంది. ఏంటి ఇద్దరూ కలిసి రెచ్చిపోతున్నారు నేనే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఏంటి అని పొగరుగా మాట్లాడుతుంది రుద్రాణి. సరే ఇదే విషయాన్ని ఇంట్లో చెప్తాను, పంచాయతీ పెడతాను రండి అంటూ వెళ్లబోతుంది స్వప్న. ఆమెని ఆపుతుంది కావ్య.
పంచాయతీ ఏమీ వద్దు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు రాహుల్. సారీ చెప్పమంటుంది స్వప్న. రాహుల్ సారీ చెప్తాడు రుద్రాణి సారీ చెప్పకపోవడంతో ఆమెను కూడా సారీ చెప్పమంటుంది స్వప్న పెద్దావిడతో సారీ ఎందుకులే అంటుంది కావ్య. మిమ్మల్ని వీధిలో పెడితే మీతో పాటు మా అక్క కూడా వీధిలో పడుతుందనే మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. తర్వాత స్వప్నతో నువ్వేంటి ఓవరాక్షన్ చేస్తున్నావు.

ఒకవేళ మేము రోడ్డున పడితే మాతో పాటు నువ్వు కూడా రోడ్డున పడతావు అంటాడు రాహుల్. తాతయ్య నాకిచ్చిన ఆస్తితో నేను ధనవంతురాలినవుతాను మీరు మాత్రం బికారుల్లాగా రోడ్డున పడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. కోపంతో రగిలిపోతున్న రుద్రాణి ఇప్పుడు ఈ ఇంట్లో నేను పెట్టబోయే మంటని ఎవరూ ఆపలేరు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మా అమ్మ ఇంత కోపంగా వెళుతుంది అంటే ఎవరినో కాల్చేస్తుంది అనుకుంటాడు రాహుల్.
లోపలికి వచ్చిన రుద్రాణి ఏడుస్తున్న అనామికని చూస్తుంది. గుడిలో జరిగినదంతా చూశాను అయినా వాళ్లని ఏడిపించకుండా నువ్వు ఏడుస్తున్నావ్ ఏంటి అంటుంది రుద్రాణి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే నన్ను చెంప దెబ్బ కొట్టాడు ఇంక నేనేం చేయగలను అంటుంది అనామిక. వాళ్ల మానం మీద కొట్టు మధ్య తరగతి వాళ్ళకి ధనం కంటే మానం ముఖ్యం అంటూ ఏదో సలహా ఇస్తుంది రుద్రాణి. అందుకు సరే అంటుంది అనామిక. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










