Brahmamudi April 27th Episode: ఇందూని కోడలిగా కావాలన్న రాజ్ తల్లి.. రేఖకి అపర్ఱ డెడ్‌లైన్

Photo Courtesy: JioHotstar

రాజ్‌తో కలిసి ఇంటికొచ్చిన ఇందూని చూసి చలపతి, లక్ష్మీ, వెంకీలు షాక్ అవుతారు. నీలాంటి వాడికి ఇంత అందమైన అమ్మాయి పడిందా? ఏం చూసి మా వాడిని ప్రేమించావంటూ ఇందూపై మండిపడతాడు చలపతి. తను నా లవర్ కాదని.. ఈవెంట్ ప్లానర్ అని, మీ పెళ్లిరోజు సెలబ్రేట్ చేయడానికి వచ్చిందని రాజ్ చెప్పడంతో చలపతి షాక్ అవుతాడు. మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని చలపతి అనడంతో నేను జీరో బడ్జెట్‌తో మీ పెళ్లిరోజు సెలబ్రేట్ చేస్తానని అంటుంది ఇందూ. రాజ్‌ చేత అంట్లు తోమించి, వెంకీ చేత కొబ్బరి మట్టలు కోయిస్తుంది.

ఓనర్ నుంచి తప్పించుకున్న లక్కీని చికెన్ తీసుకుని రమ్మని చెబుతాడు రాజ్. వెంకీ కోసం నందూ రావడంతో ఆమెను చూసి ఇందూ షాక్ అవుతుంది. ఇంతలో కొబ్బరి చెట్టుపై ఇరుక్కుపోతాడు వెంకీ. అతనిని ఇందూ జాగ్రత్తగా కిందకి దించుతుంది. జీరో బడ్జెట్‌తో వచ్చిన వాళ్లకి భోజనాలు పెట్టడానికి ఏం చేయొచ్చోనని ఇందూ ప్లాన్ చేస్తుంది. కిచెన్‌లో ఉన్న అన్నీ ఐటెమ్స్‌ని ఇందూకి చూపిస్తారు రాజ్, వెంకీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్ 1017లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 27th 2026 Episode 1017 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ తల్లిదండ్రుల ఫంక్షన్‌కి ఎలాంటి వంటలు చేయాలా? అని ఇందూ ప్లాన్ చేస్తుంది. నేను రెండు కేజీల చికెన్ మాత్రమే చెప్పాను.. అందరికీ సరిపోతుందా అని అడుగుతాడు రాజ్. దానిని కప్పుల్లో వేద్దామని ఇందూ చెప్పగా.. నేను ఒక్కడినే పావుకిలో తినేస్తాను, అందరికీ సరిపోతుందా అని రాజ్ కంగారుపడతాడు. వచ్చినప్పటి నుంచి చికెన్.. చికెన్ అంటున్నావు.. అంత పిచ్చా అంటూ మండిపడుతుంది ఇందూ. మీరంటే బాగా రిచ్.. వారానికి రెండు మూడు సార్లు చికెన్లు, మటన్లు తింటారు. కానీ మేం పూర్.. ఇలాంటి ఫంక్షన్లకే తింటామని చెబుతాడు రాజ్. చికెన్‌ని నేను అడ్జెస్ట్ చేస్తా.. ప్రతి కప్పులో ఒక్క పీస్ వేసి మొత్తం పులుసు పొస్తానని ఇందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నిమ్మకాయ షర్బత్ చేసి అందరికీ ఇచ్చేస్తే అంతా తక్కువగా తింటారు.. మీ ఇంటి బయట నిమ్మకాయల చెట్టుంది, దానికి బోల్డన్నీ నిమ్మకాయలు ఉన్నాయని అంటుంది ఇందూ.

ఆమె ప్లాన్‌కు అందరూ షాక్ అవుతారు. వీటితో ఇన్ని వెరైటీలు చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు మీరు గ్రేట్ అంటూ మెచ్చుకుంటాడు వెంకీ. నువ్వు నందూ, నేను మీఅన్నయ్య జనాన్ని పిలుద్దామని చెబుతుంది ఇందూ. ప్రతి ఇంటికి వెళ్లి పిలవడానికి రాజ్ చిరాకు పడటంతో నువ్వు నన్ను కిడ్నాప్ చేశావని మీ అమ్మానాన్నలకు చెబుతానని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. దాంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్‌ని చూడగానే పక్కింటి వ్యక్తి వచ్చి నీకు పెళ్లే కాదు అనుకున్నాం.. నీకు పెళ్లయ్యింది, మీ జంట చాలా బాగుందని మెచ్చుకుంటాడు. ఇంత అందమైన అమ్మాయి నిన్ను ఎలా పెళ్లి చేసుకుందని అనడంతో రాజ్ రగిలిపోతాడు. మా ఇద్దరికి పెళ్లి కాలేదు.. మా అమ్మానాన్నల పెళ్లిరోజు ఫంక్షన్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలని అంటాడు రాజ్.

చక్రీ డబ్బులు ఇవ్వలేదు.. మనం ఇచ్చిన నగల్ని వాడి పాతబాకీ కింద జమ చేసుకున్నాడని భూషణ్ చెప్పడంతో భ్రమరాంబ ఏడుస్తుంది. మీరు ఆ చక్రవర్తిని బెదిరించో, నాలుగు తన్నో నా నగలు తీసుకురావాల్సిందని అంటుంది భ్రమరాంబ. అప్పుడు అందరం కలిసి జైళ్లో కూర్చోనేవాళ్లమని భూషణ్ చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతుంది భ్రమరాంబ. నగలు వస్తేనే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే ఇందూ వస్తుంది. ఇందూ వస్తేనే మనకి డబ్బులు వస్తాయని అంటుంది రేఖ. నగలు పోయేసరికి మొత్తం ప్లాన్ ఫెయిల్ అయ్యిందని రేఖ అంటుంది. ఇందూని తీసుకురాలేమని చెప్పడంతో ఈ మాటలు విన్న అపర్ణ సీరియస్ అవుతుంది.

అయితే నా మనవరాలు కనిపించడం లేదని మీడియాకి, అధికారికంగా పోలీసులకు కంప్లయంట్ ఇస్తానని చెబుతుంది అపర్ణ. నువ్వు అంత సీరియస్ అవ్వాల్సిన పనిలేదు.. ఇందూ కిడ్నాప్ అయినందుకు నీకన్నా 100 రెట్లు మేం బాధపడుతున్నాం. తనని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.. ఎక్కడా చిల్లిగవ్వ కూడా దొరకడం లేదని అంటుంది రేఖ. ఇన్నాళ్లుగా ఆఫీస్ నుంచి వస్తున్న డబ్బులన్నీ మీరే నొక్కేస్తున్నారు కదా? ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టారు? ఆ డబ్బుతో నా మనవరాలిని తీసుకురండి అంటుంది అపర్ఱ. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది. నా మనవరాలి కోసమే మీ చేతుల్లో అవమానాలు భరిస్తున్నాను.. తనకి ఏమైనా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. మీకు రెండ్రోజులు టైం ఇస్తున్నా.. లేదంటే నేను ఏం చేయాలో అదే చేస్తానని డెడ్‌లైన్ పెడుతుంది అపర్ణ. నిజంగానే అపర్ణ ఏదో ప్లాన్ చేస్తోంది.. మనం ఊబిలో కూరుకుపోయాం అనిపిస్తోందని అంటుంది భ్రమరాంబ.

రాజ్ అమ్మానాన్నల పెళ్లిరోజు కావడంతో ఇళ్లంతా డెకరేట్ చేస్తుంది ఇందూ. మీ పేరుకు తగ్గట్టుగానే మీరు లక్ష్మీలా ఉన్నారని అంటుంది ఇందూ. పేరులోనే లక్ష్మీ ఉంది.. ఇంట్లో మాత్రం డబ్బులు లేవని అంటాడు చలపతి. ఆ తర్వాత లక్ష్మీ పూజ చేస్తుంది. మీరిద్దరూ మీ అమ్మనాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ఇందూ చెప్పడంతో రాజ్, వెంకీలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. మీరిద్దరికి పెళ్లిళ్లు జరిగి.. మంచి కోడళ్లని తీసుకురమ్మని అడుగుతారు. వంట సామాగ్రిలు మొత్తం వచ్చాయా? లేదా అని ఇందూ అడగ్గా.. మొత్తం వచ్చేశాయని చెబుతాడు వెంకీ. ఇవన్నీ ఎందుకు? చికెన్ వండుకుని తినేస్తే సరిపోతుంది కదా అని అంటాడు చలపతి.

ఈసారి అంతకన్నా పెద్దగానే ప్లాన్ చేస్తున్నాం.. ఇరుగుపొరుగు వాళ్లని భోజనాలకు పిలిచామని చెప్పడంతో చలపతి గుండె పట్టుకుంటాడు. జీరో బడ్జెట్ అని ముందే చెప్పాం కదా.. రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్లాన్ చేశామని చెబుతుంది ఇందూ. అందరి సాయంతో ఇందూ వంట చేస్తుంది. అదంతా చూసి చలపతి- లక్ష్మీలు సంతోషిస్తారు. ఇంతలో లక్కీ చికెన్ తీసుకొస్తూ లోపల ఇందూని, నందూని చూసి షాక్ అవుతాడు. ఇదంతా చూసిన నందూ.. వెంటనే రాజ్‌కి చెబుతుంది. వాడు రాడు కానీ నువ్వే వెళ్లి వాడి బాధేంటో చూడమని అంటుంది. లక్కీ వచ్చి ఇక్కడేం జరుగుతుందని రాజ్‌ని అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X