Brahmamudi April 27 th episode: అప్పుని అరెస్ట్ చేసిన పోలీసులు.. జీవితాంతం జైల్లో ఉంటానంటున్న కళ్యాణ్!

సీతారామ కళ్యాణం రాజ్ దంపతుల చేతులమీదుగా చేయిస్తాను అంటుంది చిట్టి. ఇంట్లో గొడవలన్నీ మీడియాకి చెప్పి రాజ్ ఫ్యామిలీ మీదకి మీడియాని రెచ్చగొడతాడు రాహుల్. అప్పు గురించి తప్పుగా మాట్లాడితే అనామిక చెంప పగలగొడతాడు కళ్యాణ్. రాజ్ ని ఇంట్లోంచి బయటికి గెంటేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే తానే చనిపోతానంటూ బెదిరిస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్ 395 లో ఏం జరిగిందంటే..

రుద్రాణి ఇచ్చిన సలహాకి ముందు భయపడుతుంది అనామిక, కళ్యాణ్ ఇబ్బంది పడతాడేమో అంటుంది. నీకు నీ మొగుడు కావాలా వద్దా.. ఆ అప్పు నీ మొగుడికి దూరంగా ఉండాలా వద్దా.. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఈ పని చేసి తీరాల్సిందే అంటుంది రుద్రాణి.నా మొగుడు నా మాట వింటాడు అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం అని ఆవేశంగా అక్కడ నుంచి బయలుదేరుతుంది అనామిక. కాసేపటి తర్వాత ధాన్యలక్ష్మి కోడల్ని వెతుకుతూ కనిపించకపోవడంతో ఇంట్లో అందరినీ అడుగుతుంది.

Brahmamudi serial April 27th Episode of 395 Here is full story

ఎవరూ తెలియదు అని చెప్తారు. కళ్యాణ్ ని అడిగితే నీ ముద్దుల కోడలు నాకేమైనా చెప్పి చేస్తుందా? చెప్పి వెళుతుందా? అంటూ ఆవేశంగా మాట్లాడుతాడు. వీడి ఆవేశం చూస్తుంటే ఏదో గొడవ పడినట్లుగానే ఉన్నాడు అంటుంది రుద్రాణి. మరోవైపు భోజనం చేస్తూ అప్పు, కనకం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి అప్పుని అరెస్టు చేయటానికి పోలీసులు వస్తారు. కంగారుపడిన కనకం కారణం అడుగుతుంది. తన భర్తతో కలిసి తనని హింస్తున్నారని అనామిక కేసు పెట్టింది అంటుంది పోలీస్.

అలాంటిదేమీ లేదు నేను నా బిడ్డను పంపించను అని గొడవ పెడుతుంది కనకం. అలా అయితే మిమ్మల్ని కూడా అరెస్టు చేయవలసి వస్తుంది అంటాడు పోలీస్. తల్లికి సర్ది చెప్పి పోలీసులతోపాటు స్టేషన్ కి బయలుదేరుతుంది అప్పు. మరోవైపు ఏం జరిగిందో చెప్పు మీ ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అని ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ ని ప్రశ్నిస్తారు. తన చెంప పగలగొట్టాను అని చెప్తాడు కళ్యాణ్. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఆడదాన్ని కొట్టడం ఏమిటి విషయం మాకు చెప్పాలి కదా అని కళ్యాణ్ ని మందలిస్తారు. ఆవేశం వచ్చినప్పుడు, పట్టరాని కోపం వచ్చినప్పుడు మీ అందరితో చర్చించాక అప్పుడు కొట్టమంటారా అంటాడు కళ్యాణ్. అప్పుడే పోలీసులతో సహా అక్కడికి వచ్చిన అనామిక చూశారా భార్యని కొట్టాను అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడో అంటుంది. పోలీసులతో సహా ఇంట్లోకి వచ్చిన అనామికని చూసి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. ఏం జరిగింది అని అడుగుతారు.

కళ్యాణ్ ఇంకా అప్పుతో తిరగటం మానడం లేదు, ఎప్పుడో ఒకరోజు తనని నాకు సవతిగా ఈ ఇంట్లోకి తీసుకువచ్చి పెడతాడు. నేను ఈ డొమస్టిక్ వైలెన్స్ భరించలేను అందుకే కేసు పెట్టాను అంటుంది అనామిక. వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ ఆ విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు, కేసులు పెడితేనే సమస్యలు తీరుతాయి అంటే నేను రాహుల్ మీద రోజుకు కేసు పెట్టాలి అంటుంది స్వప్న. చాలా చిన్న సమస్య సార్ మేము తేల్చుకుంటాము మీరు వెళ్ళండి అని పోలీసులతో చెప్తాడు రాజ్.

అలా చేస్తే నేను మీ పై ఆఫీసర్లను కలుస్తాను అంటుంది అనామిక. ఇంట్లో జరుగుతున్న గొడవలు కి రుద్రాణి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. నాకు మీ ఫ్యామిలీ గురించి తెలుసు సార్ ఆమెకు గా ఆమె కేసు వాపస్ తీసుకుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అంటాడు పోలీసు. ఇంట్లో వాళ్ళందరూ అనామిక కి నచ్చ చెప్పాలని చూస్తారు కానీ ఆమె వినదు. పోనీ మేము ఏమి చేస్తే నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావో చెప్పు అంటుంది రుద్రాణి. కళ్యాణ్ నాకు సారీ చెప్పాలి, లైఫ్ లో ఎప్పుడూ అప్పుని కలవకూడదుఅంటుంది అనామిక.

ఇంత జరిగాక కూడా నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావు, ఏం జరిగితే అదే జరుగుతుంది, నీతో కాపురం చేయటం కన్నా జైల్లో ఉండడమే బెటర్ అని పోలీసులతో పాటు స్టేషన్ కి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మి ఏడుస్తుంటే కొడుకుని తప్పు పట్టి కోడలు చేసిన తప్పుల్ని పక్కన పెట్టుకున్నావు, అనుభవించు. నిన్ను కట్టుకున్నందుకు నేను, ఆ పిల్లను కట్టుకున్నందుకు కళ్యాణ్ ఇద్దరు జీవితాంతం ఏడవాల్సిందే అని ఎమోషనల్ అవుతాడు ప్రకాష్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X