Brahmamudi April 28th Episode : సుభాష్‌కి దొరికిపోయిన కావ్య.. రాజ్‌లో అనుమానం
కావ్య చెప్పిన పొడుపు కథ ఆధారంగా అడ్రస్ కనిపెట్టేశానంటూ సంబరపడిపోయిన రాజ్ అర్ధరాత్రి ఆమెకు ఫోన్ చేసి చెబుతాడు రాజ్. అది రాంగ్ అడ్రస్ కావడంతో కావ్య నవ్వుకుని ఏదో ఒక ఇంటికి వెళ్లి బుక్ అవుతాడని మనసులో అనుకుంటుంది. యామిని- రాజ్‌ల పెళ్లికి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తూ బిజీగా ఉంటారు రఘునాథ్ , వైదేహి. ఇంతలో యామిని రావడంతో వెడ్డింగ్ కార్డ్ నచ్చిందా అని అడుగుతారు. నాకు రాజ్‌తో పెళ్లి ముఖ్యమని.. మిగిలిన విషయాలు నాకు అనవసరమని, మీరు ఎలా అంటే అలా అని చెబుతుంది యామిని.
అల్లుడుగారికి ఈ పెళ్లి ఇష్టమేనా అని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పెళ్లి పత్రికలు నేను, రాజ్ కలిసి పంచుతామని చెబుతుంది యామిని. ఆ కావ్యను తక్కువ అంచనా వేయడానికి లేదని జాగ్రత్తగా ఉండమని యామినికి వార్నింగ్ ఇస్తుంది వైదేహి. ఉదయాన్నే ప్రకాశంతో కలిసి క్యారం బోర్డ్ ఆడటానికి అపర్ణ హడావుడి చేస్తుంది. ఆ వెంటనే కావ్య వచ్చి అందరికీ జ్యూస్ ఇచ్చి సరదాగా కబుర్లు చెబుతుంది. కావ్యను వెతుక్కుంటూ రాజ్ దారి తనకు బాగా తెలిసినట్లుగా నేరుగా దుగ్గిరాల నిలయం ముందు ఆగుతాడు. రాజ్‌ని చూసి కావ్య, అపర్ణ, అప్పూలు ఫ్యామిలీ మొత్తాన్ని మరో గదిలోకి తీసుకెళ్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 28వ తేదీ ఎపిసోడ్‌లో 707లో ఏం జరిగిందంటే?

మీ ఇంటికి నాకు ఏదో బంధం ఉందని అందుకే నా సిక్స్త్ సెన్స్ నేరుగా ఇక్కడికి తీసుకొచ్చిందని రాజ్ చెప్పడంతో కావ్య బాధపడుతుంది. ఇల్లు చాలా బాగుందని రాజ్ చెప్పగా.. ఇది మా తాతయ్య గారు చాలా ఇష్టంగా కట్టుకున్నారని చెబుతుంది. కావ్యకి గిఫ్ట్ ఇవ్వగా.. మీరు ఇది ఇచ్చి వెళ్లిపోతారు కదా అని అనడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంటికి వచ్చిన వారికి కనీసం కాఫీ, టీ కూడా ఇవ్వరా అని ప్రశ్నిస్తాడు. రాజ్ అక్కడి నుంచి కదలకపోవడంతో కావ్య టెన్షన్ పడుతుంది. కావ్య - రాజ్‌ల మాటలు విన్న ఇందిర .. ఎవరొచ్చారు? కావ్య ఎవరితో మాట్లాడుతోంది? అని అపర్ణని అడుగుతుంది. అవే మాటలు రుద్రాణికి కూడా వినిపించడంతో ఎలా మేనేజ్ చేయాలో తెలియక అప్పూ కూడా టెన్షన్ పడుతుంది.
రాజ్‌ను ఇంట్లో వాళ్లు చూస్తారని టెన్షన్ పడుతున్న కావ్య అతనిని కిచెన్‌లోకి తీసుకెళ్తుంది. ఇంట్లో ఎవరూ లేరా? అని రాజ్ ప్రశ్నించగా .. అంతా గుడికి వెళ్లారని చెబుతుంది. అయితే మనం చాలాసేపు మాట్లాడుకోవచ్చని అంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్లాలా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అని కావ్యని రాజ్ ప్రశ్నిస్తాడు. తర్వాత తాను తాగుతున్న జ్యూస్‌ని కావ్యకి కూడా ఇస్తాడు. ఇంతలో నేను ఎంగిలి చేసిన జ్యూస్ మీకు ఇచ్చానని రాజ్ ఆమెను అడుగుతాడు. దాంతో కావ్య సిగ్గు పడుతుంది. జ్యూస్ చాలా బాగుందని మరో గ్లాస్ ఇస్తారా అని అడుగుతాడు రాజ్. దాంతో కావ్య మళ్లీ పోస్తుంది.
ఇంతలో ప్రకాశం ఏదో వెతుక్కుంటూ అటు ఇటూ తిరుగుతాడు. అది చూసిన కావ్య కిచెన్‌లో స్పూన్స్ కింద పడేస్తుంది. రాజ్ అవి వెతుకుతుండగా ప్రకాశానికి సైగలతో ఆన్సర్ ఇస్తుంది కావ్య. ప్రకాశం అపర్ణ గదిలోకి వెళ్లి పౌడర్ కావాలని అడుగుతాడు. పౌడర్ సంగతి సరే కానీ .. ఈ చీర చూశారా? 75 వేలు .. అక్కకి బావగారు కొనిచ్చారట అంటూ మండిపడుతుంది. నేను కొందామని అనుకునే లోపు నువ్వు బీరువా మొత్తం నింపేశావు కదా అని మండిపడతాడు ప్రకాశం. అయినా నువ్వేంటి వదిన దీనికి అన్ని షో కేస్‌లో పెట్టినట్లు అన్ని దీనికి ఇలా చూపిస్తున్నావని మండిపడతాడు ప్రకాశం.
భార్యను సంతోషంగా చూసుకోవాలి కదా .. ఎన్ని చీరలు, నగలున్నా భార్యలకు ఇంకా ఇంకా కావాలని ఉంటుందని, నువ్వు కొనిపెట్టాలని చెబుతుంది అపర్ణ. దాంతో అపర్ణ, ఇందిరల ముందే ప్రకాశం- ధాన్యలక్ష్మీలు గొడవ పడతారు. దాంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. మీ ఫేస్ చూస్తుంటే నాకొక ఫ్రూట్ గుర్తొస్తుందని.. కానీ మీరు ఫీల్ అవ్వనంటే చెబుతానని అంటాడు . పర్లేదు చెప్పమని కావ్య అడగ్గా మామిడి పిందెలా ఉందని చెప్పడంతో షాక్ అవుతుంది. తర్వాత రాజ్‌ను కావ్య హాల్‌లోకి తీసుకొస్తుంది. ఇంతలో రాజ్‌కి కడుపులో తిప్పడంతో నా బెడ్‌రూమ్‌కి వెళ్దాం రమ్మంటూ తీసుకెళ్తుంది.
ఏదైనా కామన్ బాత్‌రూమ్‌కి తీసుకెళ్లమని అడుగుతాడు రాజ్. బెడ్‌రూమ్‌లోకి వచ్చిన రాజ్‌కి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. మరోవైపు అప్పూ మాటలతో రుద్రాణికి అనుమానం వస్తుంది. రాజ్ యాక్సిడెంట్ గురించి చెబుతానని తీసుకొచ్చి ఏదేదో చెబుతోందని అనుకుంటుంది. ఇంట్లో వాళ్లు కిందకి వచ్చారేమోనని కావ్య చూస్తుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి నేను ఇచ్చిన బహుమతి ఎలా ఉందో కొంచెం చూసి చెప్పమని అడుగుతాడు. ధాన్యలక్ష్మీ - ప్రకాశంల గొడవ ఎటూ తేలకపోగా ప్రకాశం బయటికి వెళ్తుండగా అపర్ణ ఆపుతుంది.
మనం ఇండోర్ గేమ్స్ ఆడుకుందామా? అని అడుగుతుంది. క్యారం బోర్డ్ ఇండోర్ గేమే కదా అని అంటాడు ప్రకాశం. రాముడు, సీత ఆడటం వచ్చా అని ప్రశ్నించగా.. చిన్నప్పుడు నేను, అన్నయ్య, రుద్రాణి ఆడుకునే వాళ్లమని అంటాడు ప్రకాశం. నేను ఆడతాను కానీ ఇది మాత్రం శూర్పణకే అని అనడంతో ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. రాజ్ తీసుకొచ్చిన చీరను చూసి కావ్య మురిసిపోతుంది. ఎలా ఉందో చెప్పలేదని రాజ్ అడగ్గా.. మీరు తెచ్చింది నాకు నచ్చకుండా ఉంటుందా అని మనసులో అనుకుంటుంది కావ్య . మీరు గతం మరిచిపోయినా నా ఇష్టం ఏంటో మీ మనసు చెబుతూనే ఉందని అంటుంది.
చీర బాగుందని కావ్య చెప్పడంతో మీకు నచ్చుతుందో లేదోనని చాలా టెన్షన్ పడ్డానని అంటాడు రాజ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.. నాకు నచ్చిన కలర్ శారీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చినందుకు అని చెబుతుంది కావ్య. మనిద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒకేలా ఉన్నాయని అంటాడు రాజ్. మన ఇద్దరికీ ఇంతకు ముందు ఏ పరిచయం లేదా? మనిద్దరం ఎప్పుడూ కలవలేదా? అని ప్రశ్నిస్తాడు. కలిసి కాపురమే చేశామని చెప్పాలని ఉందని కానీ చెప్పలేనని బాధపడుతుంది కావ్య.
ఏ పరిచయం లేకుండానే, మన మధ్య ఏ బంధం లేకుండానే మిమ్మల్ని చూడగానే మీరు నాకు బాగా తెలుసనే ఫీలింగ్ నాకు ఎందుకొస్తుందని అడుగుతాడు రాజ్. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ఏదో అడ్రస్ ఇస్తే నేను నేరుగా ఈ ఇంటికి వచ్చేశానని అంటాడు. ఇది నా సొంతింటిలా ఉందని, మీరు నన్ను పంపించాలని అనుకుంటున్నా నాకు వెళ్లాలని అనిపించడం లేదని చెబుతాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని రాజ్ అనడంతో మా ఇంట్లో వాళ్లు వచ్చే టైం అయ్యిందని మీరు వెళితే మంచిదని కావ్య అంటుంది. రాజ్‌ను బయటికి తీసుకొచ్చే సమయానికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కిందకి రావడంతో కావ్య తలుపులు మూసేస్తుంది. అపర్ణ, కావ్యల ప్రవర్తన తేడాగా ఉండటంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











