Brahmamudi April 28th Episode: ఇందూ ప్రేమకు రాజ్ ఫిదా.. కిడ్నాప్ డ్రామాపై రాజ్- లక్కీలకి నందూ షాక్
Photo Courtesy: JioHotstar
రాజ్ తల్లిదండ్రుల పెళ్లిరోజు ఫంక్షన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది ఇందూ. కిచెన్‌లో ఉన్న వెరైటీలతో ఏమేం చేయాలో చెబుతుంది. 2 కేజీల చికెన్‌ని కప్పుల్లో వేసి.. ఒక్కొక్కరికి ఒక్కో పీస్ వేద్దామని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీ ఇంటి బయట ఉన్న నిమ్మకాయ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. దాంతో షర్బత్ చేసి వెల్‌కమ్ డ్రింక్ కింద ఇచ్చేద్దామని అంటుంది. ఇందూ తెలివితేటలు చూసి అంతా షాక్ అవుతారు. రాజ్ తల్లిదండ్రులతో పూజ చేయించి.. వారి దగ్గరి నుంచి ఆశీర్వాదం తీసుకోమని రాజ్, వెంకీలకు చెబుతుంది ఇందూ. రాజ్ తల్లిదండ్రుల పెళ్లి రోజు విందు గురించి చుట్టుపక్కల అందరినీ ఆహ్వానించడానికి రాజ్- ఇందూ, వెంకీ- నందూలు వెళ్తారు.
చక్రీ మోసం చేశాడని.. మన నగల్నీ వాడి బాకీ కింద జమ చేసుకున్నాడని భూషణ్ చెప్పడంతో భ్రమరాంబ ఏడుస్తుంది. నా నగలన్నీ పోయినట్లేనని బాధపడుతుంది. మనకి ఎక్కడా డబ్బులు దొరకడం లేదు. డబ్బులు వస్తేనే ఇందూ వస్తుంది, ఇందూ వస్తేనే మనకి డబ్బులు వస్తాయని చెబుతుంది. ఇంతలో అపర్ఱ వచ్చి.. కంపెనీ నుంచి నెల నెలా వస్తున్న డబ్బుని మీరేం చేస్తున్నారు? అని నిలదీస్తుంది. రెండ్రోజుల్లో నా మనవరాలిని క్షేమంగా తీసుకురాకపోతే.. మీడియాకు విషయం చెప్పి, పోలీస్ కంప్లయంట్ ఇస్తానని అపర్ణ వార్నింగ్ ఇవ్వడంతో రేఖ షాక్ అవుతుంది. రాజ్ తల్లిదండ్రుల ఫంక్షన్ కోసం దగ్గరుండి వంట చేస్తుంది ఇందూ. ఇదంతా చూసి లక్ష్మీ, చలపతి సంతోషిస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన లక్కీ.. ఇదంతా చూసి కంగారుపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 28వ తేదీ ఎపిసోడ్ 1018లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూని కిడ్నాప్ చేసింది మనమేనని నందూకి తెలిస్తే మనల్ని జైళ్లో వేస్తుందని రాజ్‌తో లక్కీ చెబుతాడు. ఇంతలో నందూ వచ్చి ఇందూని మీరు కిడ్నాప్ చేశారన్న విషయం నాకు తెలుసని చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఆరోజు మీరు గురకపెట్టి నిద్రపోతుంటే నేను ఇంట్లోకి వచ్చానని చెబుతుంది నందూ. ఇందూని మేమే కిడ్నాప్ చేశామని ఎలా కనిపెట్టావని లక్కీ అడగ్గా.. ఇంట్లో కిడ్నాప్ చేసిన అమ్మాయిని పెట్టుకుని, బయట తన బట్టలు ఆరేస్తే గుర్తుపడతాం కదా అని అంటుంది నందూ. తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒకరోజు దొరికిపోతారని వార్నింగ్ ఇస్తుంది. మా అక్క మీ దగ్గరే ఉందని తెలిసినా? ఎందుకు తీసుకెళ్లేదని అనుకుంటున్నారా? అని అడుగుతుంది.
మా అక్కే నన్ను ఇంటికి తీసుకెళ్లొద్దని నందూ చెప్పడంతో రాజ్, లక్కీలు షాక్ అవుతారు. కిడ్నాప్ అయినట్లు మీ దగ్గరే ఉంటానని చెప్పింది, లేదంటే మీరిద్దరూ జైళ్లో చిప్పకూడు తినేవాళ్లని హెచ్చరిస్తుంది. మా అక్క కోసం నేను సైలెంట్‌గా ఉంటా.. మీరు కూడా సైలెంట్‌గా ఉండండి అని చెబుతుంది. ఇందూ ఎన్ని ప్లాన్లు వేసినా సరే డబ్బులు వదిలే వరకు తనని వదిలేది లేదని లక్కీతో చెబుతాడు రాజ్. ఇంతలో రాజ్ వంట చేస్తుండగా కళ్లలో ఏదో నలక పడటంతో ఇందూ కంగారుపడి, కళ్లలో ఊదుతుంది.
ఇదంతా చూసిన చలపతి, లక్ష్మీలు సంతోషిస్తారు. ఇలాంటి అమ్మాయి మనింటికి కోడలిగా వస్తే బాగుంటుందని అంటుంది లక్ష్మీ. ఇలాంటి అమ్మాయి ఎందుకు? ఈ అమ్మాయే వస్తే బాగుంటుందని అంటాడు చలపతి. ఈ అమ్మాయి ఎవరో ఏంటో? తన ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలని అంటుంది లక్ష్మీ. వాడు చేసే వెధవ పనులకు ఈ అమ్మాయి అయితేనే కరెక్ట్.. వాడిని దారిలో పెడుతుందని అంటాడు చలపతి. ఈరోజు మనం పెళ్లిరోజు చేసుకుంటామని అనుకున్నామా? ఆ దేవుడు వీరిద్దరి మధ్య బ్రహ్మముడి వేయాలని అనుకుంటున్నాడేమో అనుకుంటాడు చలపతి. నిజంగానే ఆ దేవుడు బ్రహ్మముడి వేస్తే బాగుంటుందని అంటుంది లక్ష్మీ. ఇదంతా చూసిన లక్కీ.. మీరు త్వరగా చికెన్ వండితే చూస్తామంటూ లక్కీ .. వాళ్లిద్దరినీ డిస్ట్రబ్ చేయడంతో చలపతి కొడతాడు.
ఇందూకి రాజ్ డ్రెస్ గిఫ్ట్ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. మా కోసం వంట చేశావు, ఎంతో కష్టపడ్డావని మెచ్చుకుంటాడు రాజ్. మేం కూడా మంచి మనుషులమే, అప్పుడప్పుడు గుర్తించమని అంటాడు రాజ్. దాంతో ఇందూ సిగ్గుపడుతూ రాజ్‌కి థ్యాంక్స్ చెబుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే జీరో బడ్జెట్‌తో ఇదంతా చేశారా అని చలపతి సంతోషిస్తాడు. కిచెన్‌లో ఉన్న మట్టి గ్లాసుల్లో లెమన్ షర్బత్ పంచుదామని ఇందూ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మట్టి గ్లాసుల్లోనే జ్యూస్ ఇస్తే ఇప్పుడు అంతా కాస్ట్‌లీగా చూస్తున్నారని చెబుతుంది ఇందూ. మట్టి గ్లాసులను రాజ్, లక్కీలతో కడిగిస్తుంది.
భోజనాలు సరిపోతాయా అని నందూని అడుగుతాడు వెంకీ. ప్లాన్ చేసింది మా అక్క.. ఫంక్షన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అంటుంది నందూ. ఇంతలో ఫంక్షన్‌కి జనాలు రావడంతో ఇళ్లంతా కళకళలాడిపోతుంది. ఇదంతా చూసి చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. వీళ్లందరినీ చూస్తుంటే కనీసం చికెన్ ముక్క కూడా మిగిలేలా కనిపించడం లేదని రాజ్‌తో అంటాడు లక్కీ. ఫంక్షన్‌కి వచ్చిన గెస్టులు డెకరేషన్ చూసి.. చాలా అందంగా, నేచురల్‌గా చేశారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్లెవరూ ఇలా పెళ్లిరోజు చేసుకోలేదు, ఖర్చు ఎంత అయ్యిందని అడుగుతారు. జీరో బడ్జెట్ అని చలపతి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీ కోడుకులిద్దరూ చాలా తెలివైనవాళ్లు.. రూపాయి ఖర్చుపెట్టకుండా ఇదంతా చేశారని అందరూ మెచ్చుకుంటూ ఉండగా.. ఇదంతా చేసింది మా పిల్లలు కాదు ఈ అమ్మాయి అని ఇందూని ప్రశంసిస్తాడు. ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుందని చెబుతాడు.
మనల్ని మీ నాన్న ఎప్పుడు పొగడలేదు. కానీ ఇందూని మాత్రం వచ్చిన రోజే పొగుడుతున్నాని రాజ్‌తో అంటాడు లక్కీ. ముందు వచ్చిన వాళ్లందరికీ జ్యూస్ ఇవ్వకపోతే మనకి చికెన్ మిగలదని అంటాడు రాజ్. వెంకీ, లక్కీలు కలిసి నిమ్మకాయ జ్యూస్ ఇస్తారు. అయితే ఇది నిమ్మకాయ జ్యూస్.. ఫ్రూట్ పంచ్ అంటారని గెస్ట్‌ల్లో ఒకడు అనడంతో ఇందూ ప్లాన్ ప్రకారం లక్కీ అతనిపై కోప్పడతాడు. దెబ్బకి ఆ వ్యక్తి నేను కూడా హోటల్‌కి వెళ్లినప్పుడు ఇలాంటి జ్యూస్ ఇచ్చారని సైలెంట్ అయిపోతాడు. ఇందూ తెలివితేటలు చూసి రాజ్ మెచ్చుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications