Brahmamudi April 29th Episode : సుభాష్‌కి దొరికిపోయిన రాజ్ .. నిజం చెప్పిన కావ్య, రగిలిపోతున్న యామిని

ఇంట్లోకి వచ్చిన రాజ్‌ని కిచెన్‌లోకి తీసుకెళ్తుంది కావ్య. ఆమె ఇచ్చిన జ్యూస్‌ను కావ్యకి షేర్ చేస్తాడు రాజ్. కడుపులో తిప్పడంతో అర్జెంట్‌గా బాత్‌రూమ్‌కి వెళ్లాలని చెబుతాడు రాజ్. దాంతో కావ్య నేరుగా తన బెడ్‌రూమ్‌లోకి దూసుకెళ్తుంది. ఎంతకీ రాజ్ వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లని ఎలా ఆపాలో తెలియక అప్పూ, అపర్ణలు టెన్షన్ పడుతుంటారు. పౌడర్ కోసం అపర్ణ గదిలోకి వచ్చిన ప్రకాశంతో చీరలు, నగలు గురించి గొడవ పడుతుంది ధాన్యలక్ష్మీ.

తాను తీసుకొచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో చూసి చెప్పమని అంటాడు రాజ్. అది ఓపెన్ చేసి చూడగా అది అందమైన చీర కావడంతో కావ్య సంబరపడిపోతుంది. మీరు గతం మరిచిపోయినా నా ఇష్టాయిష్టాలు మరిచిపోలేదని మనసులో అనుకుంటుంది. మా వాళ్లు వచ్చే టైం అయ్యిందని మీరు ఇక వెళ్లండని రాజ్‌తో చెప్పి కిందకి తీసుకొస్తుంది కావ్య. ఇంట్లో వాళ్లు రాజ్‌ను చూడకుండా తలుపు వేసేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్‌లో 708లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 29th 2025 Episode 708 Here is Today s full story

రాజ్ వెళ్లిపోవడంతో అపర్ణ, అప్పూలు చాలా సంతోషిస్తారు. అయితే వారిద్దరి ప్రవర్తనపై ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుంది. అసలు మీరిద్దరూ ఎందుకలా కంగారు పడుతున్నారని ఇందిర ప్రశ్నిస్తుంది. దానికి వారిద్దరూ ఏదేదో ఆన్సర్ ఇస్తారు. ఇంతకీ రాజ్ - కావ్యలు వెళ్లిపోయారా? లేదా? అని అపర్ణ- అప్పూలు పైకి వెళ్లి చూస్తారు. ఇప్పటి వరకు అపర్ణ, కావ్య కలిసి ఏదో గూడుపుఠానీ చేస్తున్నారని అనుకున్నానని , కానీ అప్పూ వెనుక అపర్ణ తిరుగుతోందని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఎప్పుడూ లేనిది రాజ్ గురించి చెబుతానని అప్పూ ఎందుకన్నది అని రాహుల్ కూడా డౌట్ పడతాడు.

రాజ్ బయటికి వెళ్తున్న సమయంలో సరిగ్గా సుభాష్ ఎదురుపడటంతో కావ్య షాక్ అవుతుంది. కొడుకు పోలికలతో ఉన్న వ్యక్తిని చూసి సుభాష్ కూడా ఉలిక్కిపడతాడు. సరిగ్గా అదే సమయంలో అపర్ణ, కావ్యలు కూడా బయటికొచ్చి చూస్తారు. రఘునాథ్, వైదేహిల దగ్గరికి వచ్చి బావ ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది యామిని. వాళ్లు లేదని చెబుతారు. ఇంతసేపు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు? లేట్ అవుతుందని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని కంగారు పడుతుంది. యాక్సిడెంట్ అయి గతం మరిచిపోయిన మనిషి ఇంతసేపు ఇంటికి రాకపోతే మీరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని అంటుంది.

జీపీఎస్‌తో కారు ట్రాక్ చేసి చూడమని వైదేహి చెప్పడంతో యామిని చెక్ చేసి షాక్ అవుతుంది. అయిపోయింది.. అంతా అయిపోయింది, ఏది జరగకూడదని అనుకున్నాననో అదే జరిగిందని యామిని టెన్షన్ పడుతుంది. రామ్ నేరుగా వాళ్ల సొంతింటికి వెళ్లాడని చెప్పడంతో వైదేహి - రఘునాథ్‌లు షాక్ అవుతారు. అంటే రాజ్‌కి గతం గుర్తొచ్చిందా? అని యామిని తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. నాకు నష్టం జరగబోతుందని నా సిక్స్త్‌ సెన్స్ నాకు చెబుతోందని అంటుంది యామిని.

రాజ్‌తో సుభాష్ మాట్లాడబోతుండగా కావ్య అడ్డుకుంటుంది. నాకు ఈ మధ్యే రామ్ అని ఒకరు పరిచయం అయ్యారని మీకు చెప్పాను కదా ఇతనేనని అంటుంది. ఈయన మా మావయ్య గారు అని కావ్య చెప్పడంతో సుభాష్ ఎవరో తెలియనట్లు షేక్ హ్యాండ్ ఇస్తాడు రాజ్. మీ మావయ్య గారి గురించి నాకెప్పుడు చెప్పలేదని అంటాడు రాజ్. కారు దగ్గరికి వెళ్తూ రాజ్ ఈ ఇంటి వంక, మనుషుల వంక అనుమానంగా చూస్తాడు. తర్వాత అపర్ణ, సుభాష్, కావ్య, అప్పూలు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నా వెనుక ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాటైనా చెప్పాలని అనిపించలేదా అని ప్రశ్నిస్తాడు సుభాష్.

రాజ్ బతికున్నాడో లేదో తెలియక నరకం అనుభవించానని, అప్పుడు కూడా మీకు చెప్పాలని అనిపించలేదా అని నిలదీస్తాడు. ప్రతిరోజు రాత్రి నిద్రపట్టక ఏడుస్తూ నీ ముందే ఉన్నాను కదా అప్పుడైనా చెప్పాలని అనిపించలేదా? అని ప్రశ్నిస్తాడు. అత్తయ్య గారి తప్పేం లేదని నాకిచ్చిన మాట కోసమే అత్తయ్య మీ దగ్గర నిజం దాచారని అంటుంది కావ్య. నేను వాడి కన్న తండ్రినే కదా నా దగ్గర కూడా ఈ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బాధపడతాడు సుభాష్.

ఆయన్ని మీరు గుర్తుపట్టారు కానీ.. ఆయన మిమ్మల్ని గుర్తుపట్టారా? అని అడుగుతుంది కావ్య. ఆయన గతం మరిచిపోయారని.. ఆయనకు గతం గుర్తుచేయాలని ప్రయత్నిస్తే అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని అంటుంది కావ్య. ఆ మాటలతో సుభాష్ షాక్ అవుతాడు. కనీసం వాడు బతికే ఉన్నాడని చెప్పినా నేను ఊపిరి పీల్చుకునే వాడినని అంటాడు సుభాష్. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని, కానీ మీరే నా మాట వినలేదని బాధపడుతుంది కావ్య.

దొరికిన ప్రతి ఆధారం కూడా రాజ్ చనిపోయాడనే చెప్పిందని, అలాంటప్పుడు ఎలా నమ్మమంటావని సుభాష్ ప్రశ్నిస్తాడు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఆయనకు గతం గుర్తొస్తుందని చెబుతుంది కావ్య. ఒకవేళ ఆయనకు గతం గుర్తురాకపోతే అని సుభాష్ అనుమానపడతాడు. వాడు గతం మరిచిపోయినా కావ్యతో బంధాన్ని మాత్రం మరిచిపోలేదని.. తప్పుగా అడ్రస్ ఇచ్చినా నేరుగా మనింటికే వచ్చేశాడని అపర్ణ చెప్పడంతో సుభాష్ సంతోషిస్తాడు.

మరోవైపు.. నాకు రామ్ కావాలంటూ యామిని చిన్నపిల్లలా మారాం చేయడంతో రఘురామ్, యామినిలు టెన్షన్ పడతారు. ఇంతలో రామ్ కారు సౌండ్ వినిపించడంతో ఊపిరి పీల్చుకుంటారు. చాలా లేట్ అయ్యిందని యామిని అడగ్గా.. నా పని పూర్తి చేసుకుని వస్తుండగా ఫ్రెండ్ కనిపించడంతో ఇద్దరం రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేసి వస్తున్నానని అంటుంది. రామ్ నాకు అబద్ధం చెప్పాడని యామిని మండిపడుతుంది. రాజ్‌ని కావ్య వదిలేలా కనిపించడం లేదని వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయమని అంటుంది.

నువ్వు తప్పు చేస్తున్నావ్ ఒకసారి ఆలోచించమని యామినితో అంటాడు రఘునాథ్. నేను వాళ్ల మధ్యలోకి వెళ్లలేదు.. ఆ కావ్యే మా ఇద్దరి మధ్యలోకి వచ్చిందని మండిపడుతుంది యామిని. మీ ఇద్దరిది ప్రేమేనని, కానీ వారిద్దరూ భార్యాభర్తలని చెబుతాడు రఘునాథ్. వెడ్డింగ్ కార్డ్స్ పంచాలని చెప్పి ఇకపై బావని నా పక్కనే పెట్టుకుంటానని చెబుతుంది యామిని. రాజ్ ఇచ్చిన చీరని కట్టుకుని మురిసిపోతుంది కావ్య. ఇంతలో కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X