Brahmamudi April 29th Episode: చలపతి మాటలతో ఇందూ కంటతడి.. రాజ్ మనసు ముక్కలు

Photo Courtesy: JioHotstar

రాజ్ ఇంట్లో ఇందూని, నందూని చూడటంతో లక్కీ షాక్ అవుతాడు. రాజ్‌ని పక్కకి పిలిచి దీని గురించి మాట్లాడతాడు. ఇందూని కిడ్నాప్ చేసినట్లు నందూకి తెలిస్తే మనిద్దరం జైళ్లో ఉంటామని భయపడతాడు. ఇంతలో నందూ వచ్చి.. మా అక్కని కిడ్నాప్ చేసింది మీరేనని నాకు తెలుసని చెప్పడంతో రాజ్- లక్కీలు షాక్ అవుతారు. మా అక్క మీతోనే ఉంటానని చెప్పడంతో ఈ విషయం వదిలేశానని లేదంటే జైళ్లో కూర్చోబెట్టే దాన్నని అంటుంది నందూ. రాజ్ కంట్లో నలక పడటంతో ఇందూ చూస్తుంది, అది చూసిన చలపతి- లక్ష్మీలు ఇందూ కోడలిగా వస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇందూకి డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు రాజ్.. అది చూసి ఆమె మురిసిపోతుంది.

మట్టి గ్లాసులలో నిమ్మకాయ జ్యూస్ ఇవ్వాలని ఇందూ వేసిన ప్లాన్‌తో అంతా సంతోషిస్తారు. మా ఇంట్లో ఉన్న వస్తువులతో ఇన్ని వంటలు చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అని ఇందూని మెచ్చుకుంటాడు చలపతి. ఫంక్షన్‌కి వచ్చినవాళ్లు ఏర్పాట్లు బాగున్నాయని, మన బస్తీలో ఎవరూ ఇలా చేసుకోలేదని చెబుతారు. ఇంతలో నిమ్మకాయ జ్యూస్ తీసుకొచ్చి అందరికీ పంచుతారు. నిమ్మకాయ జ్యూస్‌ని తక్కువగా చూసిన వ్యక్తికి తనదైన శైలిలో బుద్ధి చెబుతుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్ 1019లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 29th 2026 Episode 1019 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

చికెన్ కోసం లక్కీ- నందూలు గొడవపడటంతో నువ్వు లేకపోతే ఏం కాదు.. వెళ్లిపోమ్మని చెబుతుంది నందూ. దాంతో నేను వెళ్లిపోతానని అంటాడు లక్కీ. రాజ్ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో షాక్ అవుతాడు. నువ్వు కూడా నన్ను పట్టించుకోవడం లేదని మండిపడతాడు లక్కీ. ఇంతలో పూలదండలు తీసుకొచ్చి వాటిని మార్చుకోమని చలపతి, లక్ష్మీలకు ఇచ్చి మార్చుకోమని చెబుతుంది. దాంతో లక్ష్మీ సిగ్గుపడతుంది. అందరు నచ్చచెప్పడంతో సరేనని చెబుతారు. ఆ తర్వాత అందరికీ ఇందూ అక్షింతలు పంచుతుంది. ఆ తర్వాత స్వీట్‌ని ఇచ్చి ఒకొరికొకరు తినిపించుకోమని చెబుతుంది ఇందూ. మీ అమ్మనాన్నలకి స్వీట్ తినిపించి విష్ చేయమని చెబుతుంది ఇందూ. దాంతో రాజ్, లక్కీ, వెంకీలు స్వీట్ తినిపిస్తారు.

మీ పెళ్లయి ఈరోజుతో 25 సంవత్సరాలు పూర్తయ్యింది.. మీ ప్రయాణం గురించి షేర్ చేసుకోమని చెబుతుంది ఇందూ. మీరంతా ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే నేను పాతికేళ్లు వెనక్కి వెళ్లాను. పెళ్లికి ముందు మంచి జాబ్ చేయాలి, కారు కొనుక్కోవాలి అనుకున్నాం.. కానీ లక్ష్మీ నా జీవితంలోకి వచ్చాక పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకున్నాం. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే ప్రపంచం అని అంటాడు చలపతి. నా భర్త గురించి పిల్లలకు చాలా తక్కువ తెలుసు.. మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడడు, ఎప్పుడూ చిరాకు పడతాడు అనుకుంటారు. అదే మా అమ్మ అయితే మాకు నచ్చినవి చేస్తుంది, ప్రేమగా ఉంటుంది, ఎప్పుడూ ఏమీ అనదు అని అనుకుంటారు. కానీ మేం నచ్చినట్లు ఉండటానికి, మూడు పూటలా తినడానికి వాళ్ల నాన్న అని వాళ్లు గుర్తించలేకపోతున్నారు.

మీ నాన్న ఊరికే కోప్పడటం లేదు, అది ఆయన బాధ. ఎక్కడ నువ్వు తప్పటడుగు వేస్తావో? ఏ క్షణంలో నీ జీవితం ఏమవుతుందోనని ఆయన భయం.. అది కాస్తా కోపంగా మారిపోయిందని లక్ష్మీ చెప్పడంతో రాజ్ బాధపడతాడు. పెళ్లికి ముందు మా ఆలోచనలు వేరైనా, పెళ్లయి మీరు పుట్టిన తర్వాత మీరే నా ప్రపంచం. మీరు బాగుంటేనే మేం బాగుంటామని చెబుతుంది లక్ష్మీ. మా ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌లో చదివించాలని అనుకున్నాం. కానీ ఒక్కడిని చదివించడానికే నాకు స్తోమత ఉంది. పెద్దోడినా, చిన్నోడినా అని ఆలోచిస్తుండగా.. నా పెద్దకొడుకు మాత్రం తమ్ముడిని మాత్రమే ప్రైవేట్ స్కూల్‌లో చదివించమని చెప్పాడు. మా పిల్లలు బంగారం, దానికి కారణం వాళ్లే కదా అంటాడు చలపతి.

ఈ మాటలన్నీ విన్న ఇందూ ఏడుస్తుండగా నందూ ఓదారుస్తుంది. మా అమ్మానాన్న గుర్తొచ్చారు.. వాళ్లు బతికుంటే నా జీవితం చాలా బాగుండేదని అంటుంది ఇందూ. నా జీవితం కూడా చాలా బాగుండేదని అంటుంది నందూ. మా అమ్మనాన్నలు బతికిలేరు చనిపోయారు. నేను పెద్దింట్లో అందరి మధ్యలో ఉంటాను. కానీ మా అమ్మనాన్న లేని లోటు ప్రతిక్షణం తెలుస్తుందని ఏడుస్తుంది ఇందూ. మీ అమ్మానాన్న ఏం చేస్తారని అడగ్గా.. నందూ కూడా లేరని చెబుతుంది. నాకున్నది బాబాయ్ మాత్రమే.. మనకి తెలిసో తెలియక ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని అంటుంది నందూ.

ఇంతలో రాజ్ వచ్చి నా గురించి మా నాన్న ఎంత బాగా చెప్పాడో చూశావా? అని ఇందూతో అంటాడు. అందరిముందు నిన్ను తిట్టకూడదని మీ నాన్న ఇలా అన్నారని అంటుంది. వారిద్దరి గొడవ చూసి లక్కీ నవ్వుకుంటాడు. ఆ వెంటనే అందరూ కలిసి భోజనాలు వడ్డీస్తారు. ఇదంతా చూసిన చలపతి- లక్ష్మీ.. మనం మన కొడుకుల పెళ్లిళ్లకి ఇలా భోజనాలు పెడదామని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి.. మన పెళ్లిరోజునే రూపాయి ఖర్చు లేకుండా అందరికీ భోజనాలు పెడుతోందని అంటాడు చలపతి. ఇంతలో ఒకతను వచ్చి చికెన్ ఉందా అని లక్కీని అడగ్గా.. ఇందూ- రాజ్ కలిసి వడ్డిస్తారు. చికెన్ మిగిలేలా లేదని బాధపడిన లక్కీ.. రెండు కప్పులు దాచేస్తుండగా ఇందూ చూసి పట్టుకుంటుంది.

ఇప్పుడు చికెన్ మిస్ అయితే మళ్లీ ఎన్నిరోజులు వెయిట్ చేయాలో.. అందుకే తినేస్తానని అంటాడు లక్కీ. ఇందూ దెబ్బకి చికెన్ అక్కడే పెట్టేస్తాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి రెండు కప్పులు చికెన్ కావాలని అడగటంతో లక్కీ షాక్ అవుతాడు. వంటలు చాలా బాగున్నాయి.. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో ఫంక్షన్లకి వెళ్లాం కానీ ఇంత రుచికరమైన భోజనం ఎక్కడా తినలేదని అంటాడు ఆ వ్యక్తి. ఆ అమ్మాయి చాలా గుణవంతురాలు.. ఇక ఆలస్యం ఎందుకు మన రాజ్‌కిచ్చి పెళ్లి చేసేయమని అడుగుతాడు. ఆ మాట వినగానే రాజ్- ఇందూలు షాక్ అవుతారు. ఈ ఫంక్షన్‌లో చదివింపులు పెట్టాలని లక్కీని తీసుకొచ్చి మాట్లాడుకుంటారు. రోజా నన్ను మోసం చేయకపోతే నేను పెళ్లి చేసుకునేవాడిని అప్పుడు కూడా ఇలాగే వడ్డించే దానివా అని నందూని అడుగుతాడు వెంకీ. నా పెళ్లిలో నువ్వు ఉంటావా? అని అడుగుతాడు వెంకీ. నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుందని అంటుంది నందూ. లక్కీ, రాజ్‌లు చదివింపులకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇందూ వచ్చి మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X