Brahmamudi April 29th episode: అరెస్ట్ చేపించి అవమానిస్తే.. సారీ చెప్పాలా? అప్పుకు కల్యాణ్ షాక్

ఇంట్లో గొడవలన్నీ మీడియాకి చెప్పి రాజ్ ఫ్యామిలీ మీదకి మీడియాని రెచ్చగొడతాడు రాహుల్. అప్పు గురించి తప్పుగా మాట్లాడితే అనామిక చెంప పగలగొడతాడు కళ్యాణ్. రాజ్ ని ఇంట్లోంచి బయటికి గెంటేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే తానే చనిపోతానంటూ బెదిరిస్తుంది అపర్ణ. అనామిక కళ్యాణ్ మీద, అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్ 396 లో ఏం జరిగిందంటే..

కొడుకుని తప్పు పట్టి కోడలు చేసిన తప్పుని వెనకేసుకొచ్చావు, ఇప్పుడు అనుభవించు. నిన్ను చేసుకున్నందుకు నేను, ఆ పిల్లని చేసుకున్నందుకు కళ్యాణ్ జీవితాంతం ఏడవాల్సిందే అంటాడు ప్రకాష్. ధాన్య లక్ష్మి బాధపడుతూ నీకోసం ఎంత చేశాను, ఎవరో పరాయి దాని కోసం నా కొడుకుని ఇంత అవమానిస్తావా.. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే గౌరవం అని కోడల్ని నిలదీస్తుంది. ఏం చేయమంటారు అత్తయ్య అప్పుతో తిరగొద్దని చాలాసార్లు చెప్పాను అయినా వినలేదు అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది అంటుంది అనామిక.

Brahmamudi serial April 29th Episode of 396 Here is full story

ఆ మాటలకి కోపంతో రెచ్చిపోతుంది స్వప్న. అది నిజంగా కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే లేపుకుపోయి మరీ పెళ్లి చేసుకోగలదు.ఇంట్లో ఇద్దరు అక్కలు ఉన్నాం కాబట్టి నోరు మూసుకొని ఊరుకుంటుంది లేదంటే నిన్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తుంది అంటుంది. నువ్వు ఆవేశ పడొద్దు అని స్వప్నని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు రుద్రాణి ధ్యానలక్ష్మిని తీసుకొని పక్కకు వెళుతుంది. తను కళ్యాణ్ ని అరెస్టు చేయించడం మంచిదే ఇకనైనా ఆ అప్పు తో తిరగటం మానేస్తాడు అంటుంది. నువ్వు చెప్పిందీ నిజమే కళ్యాణ్ ఇకనైనా మారితే అదే మంచిది అంటుంది ధాన్యలక్ష్మి.

మరోవైపు అనామిక అప్పు మీద కేసు పెట్టినందుకు బాధపడతాడు కళ్యాణ్. నా ఒక్కడి మీద కేసు పెట్టి ఉంటే బాగుండేది అంటాడు. అనామిక చేసిన పనికి నువ్వెందుకు బాధపడతావ్ అంటూ అతనికి ధైర్యం చెప్తుంది అప్పు. ఇంతలో రాజ్ దంపతులు పోలీస్ స్టేషన్ కి వస్తారు. కళ్యాణ్ వాళ్ళకి ధైర్యం చెప్పి పోలీసులతో కేసు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు రాజ్. కావ్య కూడా అప్పు జైలుకు వెళ్తే తన కెరీర్ పాడైపోతుంది అని పోలీసులని రిక్వెస్ట్ చేస్తుంది.

అనామిక పెట్టినవి చిన్న కేసులు కాదు అయినా కేసు లేకుండా చేయాలంటే ఆమెని ఒప్పించి కేసు వెనక్కి తీసుకునేలాగా చేయండి అంటాడు పోలీస్. అనామిక గట్టి పంతం మీద ఉంది, తను వింటుందో లేదో అంటాడు రాజ్. తనని ఒప్పిస్తాను, ఎవరు చెప్తే ఇతని వింటుందో నాకు బాగా తెలుసు అని భర్తని తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటపడుతుంది కావ్య. మరోవైపు దుగ్గిరాల ఇంటికి వచ్చిన కనకం కోపంతో అనామిక మీద కేకలు వేస్తుంది. అనామిక అప్పు గురించి తప్పుగా మాట్లాడితే మరిన్ని చీవాట్లు పెడుతుంది.

Brahmamudi serial April 29th Episode of 396 Here is full story

అసలు నువ్వు చదువుకున్న దానివేనా కళ్యాణ్ బాబుని తను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ ఇద్దరినీ కలపాలని ఎందుకు ప్రయత్నిస్తుంది అంటుంది. కూతురు కోసం అంత బాధపడేటట్లయితే కళ్యాణ్ తో అప్పుని కలవకుండా కట్టడిలో పెట్టుకుంటానని రాసి ఇవ్వండి, పోలీసులు దయతలిస్తే వదిలేస్తారు అంటుంది అనామిక. చచ్చినా అలా చేయను అలా రాసి ఇస్తే నా కూతురు తప్పు చేసిందని నేనే ఒప్పుకున్నట్లు అవుతుంది అంటుంది కనకం.

దుగ్గిరాల వారి ఇంటికి ఒక పరువు ఉంది ఇలా ఇంటి మీదకు వచ్చి రచ్చ చేస్తావేంటి అంటుంది రుద్రాణి. అలా అయితే మొగుణ్ణి వదిలేసి నువ్వు ఎందుకు వచ్చి పుట్టింట్లో కూర్చున్నావు, ఇంటి పరువు తీయాలనుకునేదాన్ని అయితే రోడ్డుమీద కేకలు వేస్తాను ఇలా ఇంట్లో వెయ్యను అంటుంది కనకం. ఆవేశంలో ఉన్న కనకానికి నచ్చచెప్పాలని చూస్తారు చిట్టి, అపర్ణ. నాకు న్యాయం కావాలి అని భీష్ముంచుకొని కూర్చుంటుంది కనకం. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X