Brahmamudi April 2nd Episode: కావ్యకి పిచ్చి .. రుద్రాణి చేతికి బలమైన ఆధారం, రాజ్‌‌పై యామిని నిఘా

కావ్యని కలవాలని ఛాటింగ్‌లో మెసేజ్ చేస్తాడు రాజ్. భర్త మాటలతో కళావతి సంబరపడిపోతుంటుంది. రాజ్‌కు నిజం చెప్పబోయిన తండ్రిపై రగిలిపోతుంది యామిని. కత్తి తీసుకుని తండ్రి మీదకి వెళ్లి నా ప్రేమకు, రాజ్‌కు ఎవరైనా అడ్డొస్తే నేను క్షమించనని అంటుంది. తండ్రిని చంపేంత శాడిస్ట్‌ని కానని, నన్ను నేను చంపుకుంటానని చేయి కోసుకోబోతుండగా యామినిని అడ్డుకుంటారు. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదని.. నీకోసం ఏది ఎక్కువ కాదని అంటాడు తండ్రి.

రాజ్‌ను కలవడానికి ఉదయాన్నే కావ్య అందంగా అలంకరించుకుని బయల్దేరుతుంది. ఆమెను చూసిన రుద్రాణి , దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇంత అందంగా రెడీ అయి ఎక్కడికి వెళ్తున్నావని రుద్రాణి అడగ్గా.. ఆఫీస్‌కు వెళ్తున్నానని చెబుతుంది కావ్య. ఆ మాటలతో అంతా రుద్రాణిపై మండిపడతారు. అయితే కావ్య ప్రవర్తనకు రుద్రాణికి అనుమానం వచ్చి ఆమెను ఫాలో అవుతుంది. అమ్మానాన్నలు గుర్తొచ్చారని ఒక్కసారి వారి సమాధుల దగ్గరికి వెళ్లొస్తానని యామిని తల్లిదండ్రులకు చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 2వ తేదీ ఎపిసోడ్ 685లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 2nd 2025 Episode 685 Here is Today s full story

కావ్య కారుని ఫాలో అవుతూ వెళ్తారు రుద్రాణి - రాహుల్. కావ్య చెప్పినట్లు ఒకవేళ రాజ్ బతికే ఉండి తనని కలవడానికే వెళ్తే మన పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తాడు రాహుల్. ఇంట్లో వాళ్లే అనుకున్నా నువ్వు కూడా తయారయ్యావా అంటూ మండిపడుతుంది రుద్రాణి. మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికే కావ్యని ఫాలో అవుతున్నానని చెబుతుంది. ఉదయాన్నే నిద్రలేచిన యామిని .. రాజ్ గురించి అడుగుతుంది. రాజ్ బయటికి వెళ్లాడని తల్లిదండ్రులు చెప్పగానే యామిని షాక్ అవుతుంది. రాజ్‌ని ఒక్కడినే పంపించావా? అసలు నీకు పరిస్దితి అర్ధమవుతుందా? అని పేరెంట్స్ మీద అరుస్తుంది. ఇదే ఊరిలో తన ఫ్యామిలీ, తన వైఫ్ కూడా ఉందని ఎవరో ఒకరు చూసి నువ్వే రాజ్ అని చెబితే ఏమవుతుందో మీకు అర్ధమవుతుందా అని అడుగుతారు.

అమ్మాయి లేచే వరకు ఆగండి.. మీకు తోడుగా వస్తుందని చెప్పానని, కానీ మీ అమ్మే పంపిందని చెబుతాడు యామిని తండ్రి. అల్లుడుగారు సరదాగా తిరగడానికి వెళ్లాడంటే నేను కూడా పంపేదాన్ని కాదని.. మీ బావకి నువ్వు సృష్టించిన అమ్మానాన్న గుర్తొచ్చారట అందుకే సమాధుల దగ్గరికి వెళ్లి వాళ్లకోసారి హాయ్ చెప్పి వస్తానని చెప్పాడని అంటుంది వైదేహి. సెంటిమెంట్ చూసి కరిగిపోయానని, నువ్వు సృష్టించిన సెంటిమెంట్ ఇంకా బాగా వర్క్ అవుతుందని చెబుతుంది . ఆ మాటలు విన్న యామిని తల్లిపై మండిపడుతుంది.

మన ఇంటికి స్మశానానికి చాలా దూరం ఉందని, మధ్యలోనే ఎవరైనా కనిపించి రాజ్‌ని పలకరిస్తే పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తుంది యామిని. మీ సొంత బుర్రలు వాడొద్దు.. ఏం చేసినా నాకు చెప్పి చేయమని ముందు నుంచి మొత్తుకుంటున్నానని అంటుంది. వెంటనే రాజ్‌కు ఫోన్ చేయగా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో యామినికి టెన్షన్ పెరిగిపోతుంది. వెళ్లింది స్మశానానికే కదా? నేను కూడా వెళ్లి తేల్చుకుంటానని చెబుతుంది. అలా చేస్తే నన్ను అనుమానిస్తున్నావని రాజ్ అనుకుంటాడని తండ్రి హెచ్చరిస్తాడు. ఇప్పుడు తనని వదిలేస్తే తర్వాత నేను ఒంటరి దానిని అయిపోతానని చెబుతుంది యామిని.

కావ్య రెస్టారెంట్‌కు రాగానే తనని ఫాలో అవుతూ వస్తారు రాహుల్ - రుద్రాణి . రాజ్‌గాడు పోయాక దీని వెర్రీ మరీ పీక్స్‌కి వెళ్లిపోయిందని దానిని ఈరోజు ప్రూఫ్స్‌తో సహా ఇంట్లో వాళ్ల ముందు పెట్టాలని రాహుల్‌తో చెబుతుంది కావ్య. ఓ చోట కావ్య కనిపించి మీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమైపోయారు? అంటూ ఎదురుగా ఎవరు లేకపోయినా మాట్లాడుతుంది. ఆ మాటలతో రాహుల్ - రుద్రాణి షాక్ అవుతారు. ఎదురుగా ఎవరూ లేకున్నా , ఎవరో ఉన్నట్లు ఊహించుకుని మాట్లాడుతుందని , కావ్యకి నిజంగానే పిచ్చి పట్టిందని నువ్వు చెప్పింది నిజమేనని రాహుల్ అంటాడు.

కావ్య రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని.. దీనిని ఆధారాలతో సహా ఇంట్లో వాళ్ల ముందు పెట్టాలని చెప్పి కావ్యను వీడియో తీస్తారు. వీడియో తీస్తున్నాను కానీ తను ఏం మాట్లాడుతుందో వినిపించడం లేదని రాహుల్ అంటాడు. వెళ్లి తన శారీకి మైక్ ఫిక్స్ చేయమని రుద్రాణి అనగా.. రాహుల్ సరేనంటాడు. ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది. ఇన్ని రోజులు అది నన్ను ఆడుకుందని ఇకపై దీన్ని నేను ఆడుకుంటానని అంటుంది. వీడియో తీసుకుని రుద్రాణి- రాహుల్ ఇంటికి బయల్దేరుతుండగా రాజ్ అప్పుడే రెస్టారెంట్‌లోకి వస్తాడు.

ఇంతలో రాజ్ చేతిని పట్టుకుంటుంది కావ్య. రుద్రాణి - రాహుల్‌ వెళ్లిపోవడం గమనించి ఊపిరి తీసుకుంటుంది. ఇంట్లో మేనేజ్ చేసి వచ్చేసరికి లేట్ అయ్యిందని చెబుతాడు రాజ్. సమాధుల దగ్గరికి యామిని వచ్చి చూస్తుంది. అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో షాక్ అవుతుంది. ఇక్కడికే వస్తానని చెప్పాడు, మరి ఎక్కడికి వెళ్లాడు.. ఒకవేళ రాజ్ అబద్ధం చెప్పాడా అని మనసులో అనుకుంటుంది. అలా చెప్పాల్సిన అవసరం తనకేం ఉంది? ఒకవేళ నాకు చెప్పకుండా ఎవరినైనా కలవాలని అనుకున్నాడా? అని రకరకాలుగా ఆలోచిస్తుంది యామిని. రాజ్‌కి కాల్ చేసి ఎక్కడో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఒకవేళ స్మశానంలోనే ఉన్నానని అంటే అతను అబద్దం చెబుతున్నట్లని ప్లాన్ చేస్తుంది యామిని.

మాట్లాడాలని పిలిచి మౌనంగా ఉంటారేంటీ అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది కావ్య. మీకు గుర్తొచ్చినప్పుడు కాల్ చేయండి.. ఈలోపు నేను వర్క్ చేసుకుని వస్తానని అంటుంది. అనంతరం ఇద్దరూ కలిసి కాఫీ తాగుతారు. ఆరోజు మీరు రోడ్డు మీద పడిపోయినప్పుడు మిమ్మల్ని చూశాకా మీరు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించారని కావ్యతో చెబుతాడు రాజ్. హాస్పిటల్‌లో మిమ్మల్ని జాయిన్ చేసి మీరు లోపలికి వెళ్తుంటే నాకు బాగా దగ్గరైన వ్యక్తి దూరంగా వెళ్తున్నట్లు అనిపించిందని అంటుంది కావ్య. ఆ మాటలతో కావ్య బాధపడుతుంది.

ఆరోజు నుంచి నేను ఏ పని చేస్తున్నా మీరే గుర్తొస్తున్నారని.. నాకు తెలియకుండా మీ గురించే ఆలోచిస్తున్నానని చెబుతాడు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశామా? మనిద్దరికి ఇంతకుముందే పరిచయం ఉందా? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఇంతలో యామిని కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పటిదాకా మా అమ్మనాన్నల స్మశానం దగ్గరికి వచ్చానని.. తలనొప్పిగా ఉంటే పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వచ్చినట్లు చెబుతాడు. నేను కూడా వస్తాను అక్కడే ఉండమని యామిని అంటుంది. రాజ్ మాటలతో బాధపడ్డ కావ్య ఎక్కువసేపు అక్కడ ఉండకూడదని భావించి వెళ్లిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X