Brahmamudi April 2nd Episode: రేఖ ప్లాన్ పసిగట్టిన అపర్ణ.. పీకల్లోతు కష్టాల్లో స్వరాజ్

Photo Courtesy: JioHotstar

ఇందూ ఆస్తిని కొట్టేయడానికి లాయర్‌ని కలుస్తుంది రేఖ. ఇందూ ఒక్క వేలు ముద్ర వేస్తే చాలు.. దుగ్గిరాల వారి ఆస్తి మొత్తం మీ సొంతం అయిపోతుందని చెబుతాడు లాయర్. ఆ ఇందూయే కోర్టులో కేసు వేసినా ఏం చేయలేని విధంగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశానని చెబుతాడు లాయర్. పోలీసులు వెంటాడుతూ ఉండటంతో ఓ బంగ్లాలో దాక్కుని కంగారు పడతారు స్వరాజ్- లక్కీ. అసలు ఆ బ్యాగ్‌లో ఏముందో చూడగా అందులో డ్రగ్స్ ఉంటాయి. ఇది మార్కెట్‌లోకి వెళితే అమాయకులైన పిల్లల జీవితాలు పాడైపోతాయి.. ఇది వాళ్లకి దక్కనివ్వకూడదని అనుకుంటాడు రాజ్. వెంటనే ఆ డ్రగ్స్ ప్యాకెట్ చించి పౌడర్ మొత్తాన్ని నీటిలో కలిపేస్తాడు. ఇదంతా చూసిన డ్రగ్స్ ముఠా.. 10 లక్షలు కట్టాలని లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో రాజ్ షాక్ అవుతాడు.

ఇందూతో భ్రమరాంబ పనులు చేయిస్తుండగా అప్పుడే వచ్చిన రేఖ ఆమెపై అరుస్తుంది. ఇందూ ఈ ఇంటికి యజమనురాలు, దుగ్గిరాల కుటుంబానికి ఏకైక వారసురాలు అని చెబుతుంది. ఇక నుంచి ఇందూ ఇంట్లో ఏ పనులు చేయదు, అందరూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని వార్నింగ్ ఇస్తుంది రేఖ. డైనింగ్ టేబుల్ మీద వెరైటీలు చూసి భ్రమరాంబకు నోరూరిపోతుంది. ఇందూ తిన్నాకే అందరూ తినాలని చెప్పడంతో ఐశ్వర్యకు కోపం వచ్చి వెళ్లిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 2వ తేదీ ఎపిసోడ్ 996లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 2nd 2026 Episode 996 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేఖ నీకు నాలుగు బట్టలు తీసుకొచ్చి.. నాలుగు మంచి మాటలు తీసుకొచ్చింది అంటే మంచిది అనుకోకు. నీ మీద రేఖ ఎందుకు ప్రేమ కురిపిస్తుందో అర్ధం కాలేదా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. త్వరలో నా పుట్టినరోజు రాబోతోంది, ఆ రోజు మన ఆస్తి మొత్తం నా సొంతం కాబోతుంది కాబట్టి అని అంటుంది ఇందూ. నీ దగ్గర సంతకం పెట్టించుకుని ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తోందని చెబుతుంది అపర్ణ. ఇన్నేళ్లుగా ఆ రేఖ ఎదురుచూస్తున్నది దాని కోసమే కదా అని అంటుంది ఇందూ. మీ ఇద్దరినీ కాపాడాలి, నేను సంతకం పెట్టలేదు కాబట్టే మీ ఇద్దరినీ ఆ రేఖ ఏం చేయలేదు.. ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాత నేను మిమ్మల్ని కాపాడలేనని చెబుతుంది ఇందూ.

ఆ దేవుడు కనుక లేచి నడిచే అవకాశం ఇస్తే దానిని చంపేసి జైళ్లో కూర్చొనే వాడిని అంటాడు సుభాష్. ఒకప్పుడు మీరంతా రుద్రాణియే మీ సమస్య అనుకున్నారు, ఆమె చనిపోయింది మీ సమస్య తీరిందా? అని ప్రశ్నిస్తుంది ఇందూ. రుద్రాణి స్థానంలో తన కూతురు వచ్చి కూర్చొంది? ఇప్పుడు తను చనిపోతే తన స్థానంలో దాని కొడుకు వస్తాడని అంటుంది ఇందూ. మరి దీనికి పరిష్కారం ఏంటీ? అని అడుగుతుంది రేఖ. నేను సంతకం పెట్టకూడదు, మీ అందరినీ కాపాడుకోవాలని చెబుతుంది ఇందూ. ఆ రేఖ మారదని అంటుంది అపర్ణ. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో మనమంతా చనిపోయేవాళ్లం.. కానీ ప్రాణాలతో బయటపడ్డాం, దానికి కారణం మన అదృష్టం కాదు, నేను చేయాల్సిన పని ఇంకా ఉంది కాబట్టి అంటుంది ఇందూ. యుద్ధంలో గెలవడానికి ఆ దేవుడు ఎప్పుడైనా సాయం చేయొచ్చని, దానికి సిద్ధంగా ఉండాలని చెబుతుంది.

చావు నుంచే బయటపడ్డాం.. ఇంక భయపడటానికి, పోగొట్టుకోవడానికి ఏం మిగల్లేదు. దేన్నయినా తిరిగి సాధించాల్సిందే అంటుంది ఇందూ. సాయం చేయాలని ఉన్నా ఏం చేయలేని పరిస్ధితుల్లో ఉన్నామని అపర్ణ బాధపడుతుంది. ఇందూకి తోడుగా నిలబడే ఒక మనిషిని ఆ దేవుడే ఎవరో ఒకరూపంలో చేయిని అందించాలని అంటాడు సుభాష్. ఇందూ విషయంలో చేస్తున్న దానిపై రేఖపై మండిపడుతుంది భ్రమరాంబ. దానికి నువ్వు సేవలు చేయడం ఏంటీ అని నిలదీస్తుంది.

ఇంటికొచ్చి ఆస్తి మొత్తం మన చేతికి వస్తుందంటే నా తమ్ముడితో పెళ్లి చేశాను.. తీరా ఇంటికొచ్చిన తర్వాత తెలిసింది ఆస్తి మొత్తం ఇందూ పేరు మీద ఉందని తెలిసింది. 20 ఏళ్లు ఎదురుచూస్తే ఆస్తి దక్కుతుందని అనుకుంటే సడెన్‌గా ఇప్పుడొచ్చి ఇందూనే వారసురాలని చెబితే ఒప్పుకోనని చెబుతుంది భ్రమరాంబ. నీ పగ చల్లారిపోయిందా? భయం మొదలైందా? అని నిలదీస్తుంది. నేను నీకు అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను చచ్చే వరకు కావ్య మీద నా పగ చావదు, ఆ ఇందూ బతికి ఉన్నంత వరకు దానిని వదిలిపెట్టనని చెబుతుంది రేఖ. రెండ్రోజుల్లో దాని పుట్టినరోజు, ఆస్తి మొత్తం మన చేతికి వచ్చే రోజు.. ఏం జరుగుతుందో చూడమని చెప్పి వెళ్లిపోతుంది రేఖ.

డ్రగ్స్ మాఫియా తనకు 10 లక్షలు కట్టమని డెడ్‌లైన్ పెట్టడంతో లక్కీ, స్వరాజ్‌లు మందుకొడతారు. 10 వేల కోసం ఆశపడి 10 లక్షల మీదకి తెచ్చుకున్నామని రాజ్ టెన్షన్ పడతాడు. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశామో కానీ లైఫ్ మొత్తం నాశనమైపోయిందని అంటాడు లక్కీ. ఆ ఇందూనే వీటన్నింటికీ కారణం.. అది ప్రశాంతంగా పడుకుంటే వదలనని చెప్పి ఇందూకి ఫోన్ చేస్తాడు స్వరాజ్. యమగండాలకు కేరాఫ్ అడ్రస్.. అపశకునాల ఇందూ కావాలని అంటాడు స్వరాజ్. ఆ మాటలతో సీరియస్ అవుతుంది ఇందూ. అసలు ఎవర్రా నువ్వు అని నిలదీయగా.. రాజు అని చెబుతాడు. నువ్వు చేసిన నష్టం వల్ల తాగుతున్నానని అంటాడు స్వరాజ్. నువ్వొక యమగండానివి, రాహు కాలానివి, నువ్వొక బీభత్సానివి అని నానామాటలు అంటాడు స్వరాజ్. నన్నే ఇన్ని మాటలు అంటాడా? ఈసారి కనిపించని అప్పుడు చెబుతానని అనుకుంటుంది ఇందూ.

రాకేష్ బాకీ తీర్చడానికి డబ్బుల కోసం రేఖని అడగాలని అనుకుంటుంది ఐశ్వర్య. ఆ ఇందూ ఉండాల్సిన స్థానంలో నిన్ను కూర్చొబెట్టాను.. కానీ నువ్వు చీప్‌గా దొంగతనం చేశావు. నీ కోసం చేయించిన నెక్లెస్‌ని కొట్టేస్తావా అని మండిపడుతుంది రేఖ. ఆ పరిస్ధితుల్లో అలా జరిగిపోయిందని చెబుతుంది ఐశ్వర్య. నాకొక 10 లక్షలు కావాలని అడుగుతుంది ఐశ్వర్య.. ఇస్తానని చెబుతుంది రేఖ. ఆ మాటలతో ఐశ్వర్య సంతోషిస్తుంది. నీకు అంత డబ్బు ఎందుకు కావాలో రీజన్ చెప్పమని రేఖ అడగటంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని అడగటంతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. నువ్వు రీజన్ చెప్పకపోతే డబ్బులు ఇవ్వనని తేల్చేస్తుంది రేఖ. నిన్ను చూస్తుంటే మా రాహుల్ అన్నయ్యని చూస్తున్నట్లే ఉంది, వాళ్లు ఫెయిల్ అవ్వడానికి ఇదే కారణం, ఆ తప్పు నేను చేయనని అంటుంది రేఖ. దాంతో కోపంగా వెళ్లిపోతుంది ఐశ్వర్య.

నా తలరాత ఎందుకిలా ఉందని ఎవరినీ ప్రశ్నించలేదు.. ప్రతిక్షణం పోరాడుతూనే వచ్చాను, కానీ ఈరోజు మాత్రం నా మీద నాకే కోపం వస్తోంది. నా కన్నవాళ్ల ఆశల్ని, ఆశయాల్ని నా చేతులతో నేనే నాశనం చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. నేను సంతకం పెట్టకూడదని నానమ్మ అంటుంది. నేను సంతకం పెడితే తప్ప వాళ్ల ప్రాణాలు నిలబడవు, ప్రాణం కన్నా ఆస్తి గొప్పది కాదని నా మనసు చెబుతున్నా.. ఆ ఆస్తి మీద కొన్ని వేలమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇది నీకు పరీక్షలా లేదు.. శిక్షలా ఉంది. ఈ గెలుపు నన్ను నమ్ముకున్న వాళ్లది.. నాకు సాయం చేయ్, న్యాయం కోసం పోరాడుతున్న నాకు దారి చూపించు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒంటరిదానిని అయిపోయాను, నన్ను నడిపిస్తావా? నా వాళ్ల కోసం ఈ యుద్ధంలో గెలిపిస్తావా అని కృష్ణుడిని వేడుకుంటుంది ఇందూ. ఇంతలో స్వాతి వచ్చి ఆ దారిని నువ్వే వెతుక్కోవాలని చెబుతుంది. అడుగు ముందుకు పడటం లేదు, దారి కనిపించడం లేదని అంటుంది స్వాతి. ఒక్కసారి ఆలోచించు, ప్రయత్నించమని చెబుతుంది స్వాతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X