Brahmamudi April 30th Episode: ధాన్య లక్ష్మికి సవాల్ విసిరిన కనకం.. భద్రకాళిలా మారిన కావ్య!

అప్పు గురించి తప్పుగా మాట్లాడితే అనామిక చెంప పగలగొడతాడు కళ్యాణ్. రాజ్ ని ఇంట్లోంచి బయటికి గెంటేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే తానే చనిపోతానంటూ బెదిరిస్తుంది అపర్ణ. అనామిక కళ్యాణ్ మీద, అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది. అప్పుని అరెస్టు చేయించినందుకు దుగ్గిరాల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది కనకం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్ 397 లో ఏం జరిగిందంటే..

మీరు నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటూ భీష్మించుకొని కూర్చుంటుంది కనకం. మీ అమ్మ ఇలా చేస్తుందేంటి? మేము పరువుగా బ్రతకాలా వద్దా అంటుంది రుద్రాణి. పరువు గురించి మీరే మాట్లాడాలి అని వెటకారంగా అంటుంది స్వప్న.

Brahmamudi serial April 30 Episode of 397 Here is full story

మరోవైపు కావ్య దంపతులు అనామిక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అనామిక అపార్థం చేసుకుని కేసు పెట్టింది మీరైనా తనకి నచ్చ చెప్పండి అంటుంది కావ్య. తను మంచి పనే చేసింది అలా చేస్తే అయినా మా అల్లుడు దారిలోకి వస్తాడు అంటారు అనామిక తల్లిదండ్రులు. దారిలోకి రాడు, జైల్లో కూర్చుంటాడు ఇంత జరిగిన తర్వాత అతను మీ కూతురుతో కాపురం చేస్తాడు అనుకుంటున్నారా అంటుంది కావ్య.

బెదిరిస్తున్నావేంటి ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా అంటారు అనామిక తల్లిదండ్రులు. నిజంగా నా చెల్లిని కవిగారికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని, పెళ్ళి వరకు వచ్చిన తర్వాత అప్పుల వాళ్ళు రెండు కోట్లు ఇస్తేనే పెళ్లి జరుగుతుంది అన్నప్పుడు నేనే మా ఆయనతో మాట్లాడి మీ సమస్యలు తీర్చాను మర్చిపోయారా.. మీ తీరు చూస్తుంటే మీరే అనామికని రెచ్చగొడుతున్నట్లుగా ఉన్నారు, పదండి ఈ విషయం అందరికీ చెప్తాను అంటుంది కావ్య.

లేదు మా కూతురిదే తప్పు, మేము తను చెప్పిందే నిజం అనుకున్నాము ఇప్పుడు నిజాలు అదీ మాట్లాడటం ఎందుకులే అంటారు. అయితే మీ కూతుర్ని తీసుకొచ్చి కేసు వాపస్ చేయించండి అంటుంది కావ్య. అలాగే అంటూ ఆనామికతో ఫోన్ లో మాట్లాడుతారు ఆమె తల్లిదండ్రులు. విషయం తెలియని అనామిక నేను ఎంత ఘనకార్యం చేశానో చూశారా అని తల్లిదండ్రులని అడుగుతుంది. అంత ఘనకార్యం ఏం చేశావు ముందు కేసు వెనక్కి తీసుకో, ఆ కావ్య మొగుని రెచ్చగొట్టి మన ఇంటికి తీసుకువచ్చింది, పరిస్థితి చేయి దాటిపోయింది అంటారు.

Brahmamudi serial April 30 Episode of 397 Here is full story

నేను కేసు వెనక్కి తీసుకోను అంటే ఆమెని ఒప్పించి పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తారు. మరోవైపు రాజ్ కావ్య తో మాట్లాడుతూ నీలో కనిపించని రౌడీ ఉంది అంటాడు. మా అమ్మ బయటికి కనిపిస్తుంది నేను కనిపించను అంతే అంటుంది కావ్య. తర్వాత అనామిక పోలీస్ స్టేషన్ కి వస్తుంది అక్కడ కాఫీ తాగుతున్న అప్పు ని,కళ్యాణ్ ని చూసి ఇక్కడ కూడా వీళ్ళు రొమాన్స్ ఆపడం లేదు నేను కేస్ విత్ డ్రా చేసుకోను అంటుంది.

అయినా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం తప్పనిసరి పరిస్థితులలో కేసుని విత్ డ్రా చేసుకుంటుంది. మరోసారి సాక్షాలు లేకుండా ఇలాంటి కేస్లు పెట్టొద్దు అంటూ అనామికని పోలీస్ హెచ్చరిస్తాడు. అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. కావ్య వాళ్ళు ఇంటికి రావడం చూసిన చిట్టి అదిగో అప్పు ని తీసుకొని రాజ్ వాళ్ళు వస్తున్నారు, ఇంక నువ్వు దిగు కనకం అంటుంది. అప్పు ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది కనకం.

ఆ తర్వాత కావ్య మాట్లాడుతూ ధాన్య లక్ష్మి గారు, రుద్రాణి గారు, ఆనానిక మీలో ఎవరైనా నా చెల్లెలు జోలికి వచ్చారంటే ఊరుకునేది లేదు భద్రకాళి నవుతాను అంటూ హెచ్చరిస్తుంది. కావ్య నువ్వే ఇలా మాట్లాడుతున్నావా నా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ చెల్లెల్ని ఎంకరేజ్ చేస్తుంది స్వప్న. ఇంట్లో వాళ్ళందరూ అనామికని మందలిస్తారు. అత్తగారు హెచ్చరించడంతో అనామిక అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అపర్ణ మాట్లాడుతూ అనామిక అన్న దాంట్లో తప్పేముంది.

తను బావగారిలాగే తన భర్త కూడా వేరే వాళ్ళతో బిడ్డను కనీ తీసుకొస్తాడేమో అని భయపడింది అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో అనామిక ని చిటికె వేసి పిలుస్తుంది స్వప్న. నీ చెల్లెల్ని అరెస్టు చేయించేసరికి నోరు పడిపోయిందా అంటుంది అనామిక.అరెస్టు చేయించి ఏం సాధించావు, అక్కడ కూడా కళ్యాణ్ అప్పుకి టీ కాఫీ అంటూ సేవలు చేశాడంట కదా అని వెటకారంగా అంటుంది స్వప్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X