Brahmamudi April 30th Episode : రాజ్ - కావ్యల మధ్య పెరుగుతోన్న బంధం.. కళావతితో యుద్ధానికి యామిని సై

కావ్య , అపర్ణ, అప్పూలపై రుద్రాణి, రాహుల్‌కు డౌట్ వస్తుంది. కుటుంబ సభ్యులు ఎవ్వరూ చూడకుండా తలుపు వేసినప్పటికీ సరిగ్గా అప్పుడే సుభాష్ రావడంతో కావ్య ఉలిక్కిపడుతుంది. ఎదురుగా ఉన్న కొడుకుని చూసి సుభాష్ షాక్ అవుతాడు. రాజ్‌తో సుభాష్ మాట్లాడబోతుండగా కావ్య జోక్యం చేసుకుని ఈయన రామ్ అని చెప్పి పరిచయం చేస్తుంది. తన తండ్రి ఎవరో తెలియనట్లు రాజ్ సార్ అని పిలుస్తాడు. రాజ్ వెళ్లిపోయిన తర్వాత సుభాష్, అపర్ణ, అప్పూ, కావ్యలు ఓ గదిలో మాట్లాడుకుంటారు.

రాజ్ బతికే ఉన్నాడని మీ అందరికీ తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదని సుభాష్ బాధపడతాడు. ఆయన గతం మరిచిపోయారని మీకు నిజం చెబితే ఆయనతో మాట్లాడాలని అనుకుంటారని , అప్పుడు ఆయన గతం గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తారని అంటుంది కావ్య. అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని కావ్య చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు. ఎప్పుడో బయటికి వెళ్లిన రాజ్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో జీపీఎస్ చెక్ చేయగా అతను దుగ్గిరాల వారింట్లో ఉన్నట్లు తెలియడంతో యామిని టెన్షన్ పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్‌ 709లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 30th 2025 Episode 709 Here is Today s full story

నిద్ర పట్టకపోవడంతో కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్. రమ్మని పిలవకుండానే మీ ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టానని అంటాడు. మా ఇంటికి వస్తానని, సర్‌ప్రైజ్ ఇస్తానని నిన్నే చెప్పారు కదా అని అంటుంది కావ్య. అందులో మీరు చేసిన పొరపాటేం లేదని, ఇకనైనా కుదుటపడమని మీ మనసుకు చెప్పండి అని అంటుంది. నేను మీ ఇంట్లో అడుగుపెట్టాక మీరు చాలా కంగారు పడ్డారని చెబుతాడు రాజ్. మీరున్నంత సేపు చాలా సంతోషంగా ఉన్నానని, మీరేం బాధపడొద్దని అంటుంది కావ్య.

మీ మావయ్య గారు చూశారు కదా ఆయనేమైనా అడిగారా అని రాజ్ ప్రశ్నించగా.. మిమ్మల్ని చూసి ఆయన చాలా సంతోషించారని చెబుతుంది. నన్ను చూసి ఆయన సంతోషంగా ఫీల్ కావడం ఏంటని రాజ్ ప్రశ్నించడంతో కావ్య నాలుక కరచుకుంటుంది. మంచితనం మన బ్లడ్‌లోనే ఉందని, మనల్ని చూస్తే ఎవరైనా ఇట్టే ఇంప్రెస్ అవుతారని అంటాడు రాజ్. రాజ్‌తో మాట్లాడుతూ.. భర్త తన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టినట్లుగా ఫీల్ అవుతుంది కావ్య. తర్వాత ఊహల్లో నుంచి బయటికొచ్చి సిగ్గు పడుతుంది.

కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా పనివాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నావని మండిపడుతుంది. నిన్న నా కొడుకు మనింటికి వచ్చాడు కదా అని అంటుంది అపర్ణ. గతం మరిచిపోయినా , నేను తప్పు అడ్రస్ ఇచ్చినా నేరుగా సొంతగూటికి వచ్చిన పక్షిలా వెతుక్కుంటూ వచ్చాడు కదా అని చెబుతుంది కావ్య. వచ్చాడు వెళ్లిపోయాడు.. కానీ వాడు ఎక్కడున్నాడో కనుక్కుని దగ్గర అవ్వాల్సింది పోయి ఈ వంట పనులేంటీ అని మండిపడుతుంది అపర్ణ.

ఆయన్ని మనింటికి తీసుకొచ్చి ఇక్కడే శాశ్వతంగా ఉంచేయాలని నాక్కూడా ఉందని , కానీ ఇప్పుడు ఆయన మీ కొడుకు రాజ్ కాదని.. ఇంకెవరికో కాబోయే అల్లుడు రామ్ అని అంటుంది కావ్య. నువ్వే దగ్గరుండి వాళ్ల పెళ్లి చేస్తావా ఏంటీ? అని మండిపడుతుంది అపర్ణ. మాట్లాడాలని నాక్కూడా ఉందని కానీ ఏ కారణం చెప్పి ఆయనని కలవాలో నాకు అర్ధం కావడం లేదని చెబుతుంది కావ్య . కొడుక్కి సైట్ కొట్టమని నేనే చెప్పాల్సిన పరిస్ధితి వచ్చిందని చిరాకు పడుతుంది అపర్ణ. నిన్న వాడిచ్చిన చీర కట్టుకుని నేరుగా వెళ్లి కలవమని చెబుతుంది. ఇంటిని, ఆఫీస్‌ని చక్కబెట్టడమే కాదు కట్టుకున్న భర్తని మామూలు మనిషిని చేయడం కూడా నీ బాధ్యతేనని అంటుంది అపర్ణ.

ఉదయాన్నే రామ్‌ని బయటికి తీసుకెళ్లాలని యామిని రెడీ అయి అటు ఇటు తిరుగుతుంది. ఈరోజు రామ్‌ని వదిలే ప్రసక్తే లేదని తల్లిదండ్రులతో చెబుతుంది. ఇంతలో రామ్ కిందకి రావడంతో మనం ఓ ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్లాలని ముందే చెప్పాను కదా అని అంటుంది. యామినితో బయటికి వెళితే తర్వాత నేను కళావతిని కలిసినా డిస్ట్రిబ్ చేయకుండా ఉంటుందని అనుకుంటాడు రాజ్. యామినిని తీసుకుని బయటికి వెళ్తుండా రాజ్‌కి కావ్య ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని ఒకసారి కలవాలని అనుకుంటున్నానని కావ్య చెప్పగా సాయంత్రం కలుద్దామని అంటాడు రాజ్. ఇప్పుడే అర్జెంట్‌గా కలవాలని ఆమె చెప్పడంతో రాజ్ టెన్షన్ పడతాడు. మనం ఎప్పుడూ కలిసే రెస్టారెంట్‌ దగ్గరికి రమ్మని చెప్పడంతో రాజ్ సరేనంటాడు.

ఫ్రెండ్‌కి ఏదో ప్రాబ్లమ్ అని నేను వెంటనే వెళ్లాలని యామినితో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. రాజ్‌ని నీతోనే ఉంచుకుంటానని వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని అంటుంది వైదేహి. రాజ్ నన్ను వదిలించుకుందామని అనుకున్నా నేను మాత్రం తన చిటికెన వేలిని వదలనని చెప్పి అతనిని ఫాలో అవుతుంది. కావ్యని రాజ్ ఓ రెస్టారెంట్‌లో కలవడంతో చూసి షాక్ అవుతుంది యామిని. మాటల్లో పెట్టి నా చేత మర్డర్ చేయించేలా ఉన్నారని కావ్యతో అంటాడు రాజ్. మీరిచ్చిన చీర నాకు చాలా నచ్చిందని, మీరు ఫోర్జరీ చేసిన సంతకం ద్వారా కాంట్రాక్ట్ పూర్తి చేశానని రాజ్‌కి చెబుతుంది కావ్య. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి యామిని రగిలిపోతుంది.

మీకు ప్రమోషన్ వచ్చినందుకు నాకు పెద్ద పార్టీ ఇవ్వాలని అడుగుతాడు రాజ్. అతనికి బాయ్ చెప్పి వస్తుండగా కావ్యకి యామిని ఎదురవుతుంది. ఒక్క నిమిషం ముందు వచ్చుంటే రామ్ గారితో కలిసి వెళ్లే దానివి కదా అని సెటైర్ వేస్తుంది కావ్య. ఎంత ధైర్యం ఉంటే నా బావని నాకు కాకుండా చేస్తావ్ అని విరుచుకుపడుతుంది యామిని. నీకు ఆయన బావ ఎలా అయ్యాడు? నువ్వు నాటకాలు ఆడుతూ అదే నిజమన్న భ్రమలో బతికేస్తున్నావని మండిపడుతుంది కావ్య. నా భర్తని లాక్కుని, తనని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంది నువ్వు అని మండిపడుతుంది.

నిన్ను మోసం చేసింది నేను కాదు ఆ దేవుడు.. నీకంటే ముందే రాజ్ జీవితంలోకి నేనొచ్చానని, రాజ్‌తో జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నానని చెబుతుంది యామిని. నీ ప్రేమలో నిజాయితీ ఉండి ఉంటే ఆయన నీకే దక్కేవారని అంటుంది కావ్య. ఇప్పుడు రాజ్‌ని నడిపించేది నేనే అని యామిని చెప్పగా.. అదే నిజమైతే ఆయన నిన్ను వదిలేసి నాతో ఎందుకు తిరుగుతున్నాడని నిలదీస్తుంది కావ్య. మా ఇద్దరి మధ్య ఉన్నది జన్మజన్మల బంధమని అదే మమ్మల్ని ఒక్కటి చేస్తుందని చెబుతుంది కావ్య. నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా మా ఇద్దరిని విడదీయలేవని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X