Brahmamudi April 30th Episode: రాజ్‌కి సాహూ డెడ్‌లైన్.. కథలోకి రాజ్ పీఏ శృతి రీ ఎంట్రీ

Photo Courtesy: JioHotstar

రాజ్ తల్లిదండ్రుల కోసం ఇందూ చేసిన ఫంక్షన్ ఏర్పాట్లు గెస్ట్‌లందరికీ బాగా నచ్చుతాయి. ఇంతలో చలపతి- లక్ష్మీలు దండలు మార్చుకుని ఒకొరికకరు స్వీట్ తినిపించుకుంటారు. తమ పాతికేళ్ల ప్రయాణం గురించి చెబుతూ చలపతి, లక్ష్మీలు ఎమోషన్ అవుతారు. మా పిల్లలే మాకు ముఖ్యం.. వాళ్ల కోసమే బతుకుతున్నామని చెబుతారు. తాను ఒక్కడినే చదివించగలనని తెలుసుకున్న రాజ్.. తమ్ముడిని ప్రైవేట్ స్కూల్‌లో వేయమని చెప్పి తను మాత్రం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాడని చెబుతాడు చలపతి.

వారి మాటలను విన్న ఇందూ కంటతడి పెడుతుంది. దాంతో ఏం జరిగిందని నందూ అడుగుతుంది. నాకు తల్లిదండ్రులు లేరు.. వీళ్లని చూస్తుంటే నాకు అమ్మానాన్నలు లేని లోటు తెలుస్తోందని చెబుతుంది. నీకే కాదు.. నాకు కూడా అమ్మానాన్నలు లేరని అంటుంది నందూ. ఇంతలో రాజ్ - ఇందూ, వెంకీ- నందూలు అందరికీ భోజనాలు వడ్డిస్తారు. ఎక్కడ చికెన్ లేకుండా పోతుందోనని ముందే రెండు కప్పులు దాచేస్తాడు లక్కీ. అది చూసిన ఇందూ లక్కీపై కోప్పడుతుంది. భోజనాలు అద్భుతంగా ఉన్నాయని.. ఆ అమ్మాయిని మీ రాజ్‌కిచ్చి పెళ్లి చేయమని చెబుతారు గెస్ట్‌లు. ఆ మాటలు విన్న రాజ్, ఇందూలు షాక్ అవుతారు. భోజనాలకు వచ్చిన వాళ్ల నుంచి చదివింపులు వసూలు చేయాలని రాజ్- లక్కీలు ఏర్పాట్లు చేస్తుండగా ఇందూ మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్ 1020లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 30th 2026 Episode 1020 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్- లక్కీలు చదివింపులు వసూలు చేస్తుండటంతో ఇందూ మండిపడుతుంది. ఎవరైనా ఇలా చదివింపులు తీసుకుంటారా అని ఇందూ ప్రశ్నించగా.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలు చేస్తే ఇలాగే చేస్తామని అంటాడు లక్కీ. మనం పెళ్లి చేయలేదు.. పెళ్లిరోజు సెలబ్రెట్ చేశామని చెబుతుంది ఇందూ. మనం భోజనాలు పెట్టింది చదివింపుల పేరుతో డబ్బులు లాగడానికి కాదు.. వచ్చినవాళ్లు కడుపునిండా తిని మనసారా ఆశీర్వదించాలని అంటుంది ఇందూ. నేను కూడా అదే చెప్పానని రాజ్ ప్లేట్ మార్చేస్తాడు. ఈ ఐడియా నీదేనని నాకు తెలుసు.. తనకి అంత నాలెడ్జ్ లేదు, ప్లాన్ నీది ఫాలో అయ్యేది తను అని చెబుతుంది ఇందూ. నేనుండగా ఇలాంటి పనులు చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. తను మన క్యారెక్టర్స్‌ని బాగా చదివేసిందని చెబుతాడు లక్కీ.

నీ వల్లే ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిగిందని ఇందూని మెచ్చుకుంటాడు చలపతి. మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ ఏ రోజు ఇలా చేయలేదు.. నువ్వు మా ఇంట్లో మనిషిలా చేశావు, నీలాంటి పిల్ల మా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందోనని అంటుంది లక్ష్మీ. జీరో బడ్జెట్ అన్నావు.. పరువు పోతుందేమో అనుకున్నా కానీ ఏ చిన్నలోటు లేకుండా ఫంక్షన్ చాలా బాగా చేశావని ఇందూని చలపతి మెచ్చుకుంటూ ఉండగా సాహూ రావడంతో రాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఒకటి తగ్గింది.. కేక్ తగ్గిందని సాహూ చెప్పి కేక్ తెప్పించడంతో అంతా సంతోషిస్తారు. మావాడి కన్నా నీకే నా మీద అభిమానం ఎక్కువగా ఉందని చెబుతాడు చలపతి.

మా అభిమానం మామూలుగా ఉండదు. ఇప్పుడు కేక్ వరకే, భవిష్యత్తులో పాలాభిషేకాలు కూడా చేస్తామని అంటాడు. చలపతి కేక్ కట్ చేసి భార్యకు తినిపిస్తుండగా.. అందులో సాహూ ఏదైనా విషం కలిపాడేమోనని భయపడుతూ కేక్ మీరు తినొద్దని గట్టిగా అరుస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అందులో విషం లేదని మీరు హ్యాపీగా తినిపించండని చెబుతాడు సాహూ. దాంతో చలపతి అందరికీ కేక్ తినిపిస్తాడు. ఆ వెంటనే రాజ్, లక్కీలను బయటకు తీసుకెళ్లిన సాహూ.. ఫంక్షన్ చేసి మీ అమ్మానాన్నలకి ఆనందాన్ని ఇచ్చావు? చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు కూడా పెట్టావు? మరి నా డబ్బులు నాకెందుకు ఇవ్వలేదని సాహూ బెదిరించడంతో రాజ్ కంగారుపడతాడు. డబ్బులు రాగానే ఇచ్చేస్తామని చెబుతాడు రాజ్.

మత్తు పదార్ధాలని నువ్వే నీళ్లలో కలిపావు, అలాంటి నిన్ను ఎలా నమ్మాలని అంటాడు సాహూ. కిడ్నాప్ చేసి మా డబ్బులు ఇస్తున్నావా? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు.. కానీ డబ్బుల విషయంలో జాలి దయ ఉండకూడదు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఈలోపు నువ్వు ఆ అమ్మాయి ద్వారా డబ్బులు సంపాదించుకుంటావో ఏం చేస్తావో నాకు అనవసరం 24 గంటల్లో నా డబ్బులు నాకు తెచ్చివ్వమని డెడ్‌లైన్ పెడతాడు సాహూ. ఒక్క నిమిషం దాటినా నేనేం చేస్తానో నాకు తెలియదు.. నా వెహికల్స్ ఎవరి మీద నుంచైనా వెళ్లొచ్చని చెబుతాడు సాహూ. నీ అందమైనా ఫ్యామిలీ... వాళ్ల నవ్వులు అలాగే ఉండాలో, చెదిరిపోవాలో డిసైడ్ చేసేది నువ్వే. గంట గంటకి మీ వాళ్ల ఆయుష్షు రేఖ కొంచెం కొంచెం తగ్గిపోతుందని వార్నింగ్ ఇస్తాడు సాహూ.

దాంతో రేఖకి రాజ్ ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా? అని టెన్షన్ పడతాడు. డబ్బులు ఎందుకు లేట్ అవుతున్నాయని రాజ్ ప్రశ్నించగా.. నేను చాలా ట్రై చేస్తున్నాను. కానీ దొరకడం లేదని చెబుతుంది రేఖ. రేపటిలోగా నాకు డబ్బులు ఇవ్వాలి.. లేదంటే మీ అమ్మాయిని మట్టిలో కలిపేస్తానని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఆ మాటలు విన్న లక్కీ షాక్ అవుతాడు. మనం అడగ్గానే డబ్బులు ఇస్తుందా అని అడుగుతాడు. ఈ అమ్మాయి వల్ల తనకి ఆస్తి వస్తుంది.. చంపేస్తామని చెప్పి భయపెడితే డబ్బులు తనే ఇస్తుందని అంటాడు రాజ్. నా ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టలేను.. అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిందే నా ఫ్యామిలీని కాపాడుకోవడానికే అంటాడు రాజ్.

డబ్బులు ఎలా ఏర్పాటు చేయాలో అర్ధంకాక తలపట్టుకున్న రేఖ దగ్గరికి పీఏ వచ్చి ఈ నెల శాలరీల ఫైల్ మీద మీరు సంతకం చేయాలని శృతి చెబుతుంది. శాలరీకి సంబంధించిన 20 లక్షల రూపాయలు నా అకౌంట్‌లో వేయమని అడుగుతుంది. స్టాఫ్ అంతా ఇబ్బందిపడతారని చెప్పినా వినిపించుకోదు. దాంతో గతంలో రాజ్- కావ్యలు ఉండగా ఉద్యోగులను ఎలా చూసుకున్నది గుర్తుచేసుకుంటుంది శృతి. ఒక్కరోజు శాలరీ కూడా లేట్ చేయకూడదని కావ్య చెప్పిన మాటలు శృతికి గుర్తొస్తాయి. ఒక కుటుంబం మొత్తం ఈ శాలరీ కోసం వెయిట్ చేస్తుంది, ఒక్క గంట కూడా మన కంపెనీ నుంచి శాలరీ లేట్ కాకూడదని చెబుతుంది కావ్య.

మీరు ఈ లోకం నుంచి వెళ్లిపోయాక మమ్మల్ని పట్టించుకునేవారే లేరు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లని అన్యాయం చేసి వెళ్లిపోయారు. కనీసం మీ కూతురిని ఆఫీసులో అడుగుపెట్టకుండా చేసేసింది ఆ రేఖ. మీ ఫోటోని కూడా కనీసం ఆఫీసులో లేకుండా చేసింది. మా ఉద్యోగాలు పోతాయన్న భయంతో నేనే దాచుకున్నాను, ఈ ఆఫీస్‌కి మంచి రోజులు ఎప్పుడొస్తుందా అని బాధపడుతుంది శృతి. డబ్బుల కోసం ఆలోచిస్తున్న రాజ్ దగ్గరికి ఇందూ వచ్చి నీ ఫేస్‌లో ఏదో టెన్షన్ కనిపిస్తుందని చెబుతుంది ఇందూ.

డబ్బుల విషయంలో నువ్వు టెన్షన్ పడుతున్నావని మాకు తెలుసు. డబ్బులు చేతికి రావడం ఒక కష్టమైతే.. వాటిని మేనేజ్ చేయడం మరో కష్టమని అంటుంది ఇందూ. నీకు మంచి ఫ్యామిలీ ఉంది.. అయినాసరే డబ్బు కోసం ఎందుకిలా అడ్డదారులు తొక్కుతున్నావని అడుగుతుంది ఇందూ. డబ్బులు లేకపోతే సంతోషం ఉండదు, మా దగ్గర లేనిది డబ్బు దాని విలువ మాకు మాత్రమే తెలుసు. నిద్రలో కూడా మాకు డబ్బే గుర్తొస్తుంది. మా మిడిల్ క్లాస్ ఆలోచనలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతాయని చెబుతాడు రాజ్. ఏ క్షణంలో ఎవరికి ఏ ప్రమాదం వస్తుందోనని టెన్షన్ పడతామని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X