Brahmamudi April 3rd Episode: రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన కావ్య.. యామినిని వెంటాడుతోన్న అప్పూ .. అపర్ణ ఆశలు

కావ్యని కారులో ఫాలో అయి రెస్టారెంట్ దగ్గరికి వస్తారు రాహుల్ - రుద్రాణి. వారు వెళ్లేసరికి కావ్య గాలిలో కబుర్లు చెబుతూ ఉంటుంది. కళావతికి నిజంగానే పిచ్చి పట్టిందని డిసైడ్ అయిన రుద్రాణి ఆమెను వీడియో తీసి దానిని ప్రూఫ్‌గా ఇంట్లో వాళ్లకి చూపించాలని అనుకుంటుంది. ఇంతలో రాజ్ అక్కడి రాగా కావ్య చేయి పట్టుకుని పక్కకి లాగుతుంది. రుద్రాణి - రాహుల్ వెళ్లిపోయారని నిర్ధారించుకున్న తర్వాత రాజ్‌ను తీసుకుని రెస్టారెంట్‌లోకి వస్తుంది.

రాజ్‌ను ఒంటరిగా ఎందుకు పంపించారంటూ తల్లిదండ్రులపై కోప్పడుతుంది యామిని. రాజ్‌ను స్మశానానికి పంపించామని చెప్పగా యామిని కూడా అక్కడికి వెళ్లి చూస్తుంది. రాజ్ కనిపించకపోవడంతో అతనికి పదే పదే ఫోన్ చేస్తుంది. తాను రెస్టారెంట్‌లో కాఫీ తాగడానికి వచ్చానని చెప్పడంతో నేను కూడా వస్తున్నట్లు చెబుతుంది యామిని. రాజ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కావ్య కన్నీళ్లను ఆపుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 3వ తేదీ ఎపిసోడ్ 686లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 3rd 2025 Episode 686 Here is Today s full story

రాజ్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా తనకు వేరే వర్క్ వుందని బయల్దేరుతుంది కావ్య . నా వల్ల ఏమైనా జరిగిందా అని రాజ్ అడగ్గా.. తర్వాత మళ్లీ కలుద్దామని చెబుతుంది. దీంతో రాజ్ చాలా బాధపడతాడు. ఇంతలో యామిని రెస్టారెంట్‌కు వచ్చి ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. చెప్పకుండా వచ్చేశావ్.. పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని అంటుంది యామిని. పొద్దు పొద్దున్నే డిస్ట్రబ్ చేయడం ఎందుకని అలా వచ్చేశానని అంటాడు రాజ్. నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏదోలా ఉంటుందని నువ్వు మరిచిపోయినంత మాత్రాన నేను అన్ని మరిచిపోలేదని చెబుతుంది యామిని.

కాఫీ తాగుదామని యామిని అడగ్గా.. నేను తాగేశానని నువ్వు తాగి ఇంటికి రమ్మని చెబుతాడు రాజ్. టేబుల్‌పై రెండు కాఫీ కప్పులు కనిపించడంతో యామినికి అనుమానం వస్తుంది. యామినిని ఫాలో అవ్వమని కానిస్టేబుల్‌కు అప్పూ చెప్పడంతో అతను రాజ్ - కావ్యలను ఫోటో తీస్తాడు. యామిని వివరాలన్నీ అప్పూకి చెబుతాడు. పదేళ్లుగా యామిని ఫారిన్‌లో ఉందని, ఇటీవలే ఇండియాకు వచ్చిందని కానిస్టేబుల్ చెబుతాడు. తనో డ్రగ్ అడిక్ట్ అని.. దాని నుంచి బయటపడటానికి ట్రీట్‌మెంట్ కోసం ఫారిన్ పంపించినట్లు చెబుతాడు. తను ఎక్కడ చదువుకుంది? ఫారిన్‌కు వెళ్లడానికి ముందు ఏం చేసింది? అనే వివరాలు నాకు కావాలని చెబుతుంది అప్పూ.

తన గతం గురించి ఎవరూ తెలుసుకోకకూడదని కావాలనే అన్ని దాచి పెట్టిందని అంటుంది అప్పూ. ఆ యామిని ఇంట్లో ఇళ్లో పనివాళ్లు, వంటవాళ్లు , ఫ్యామిలీ డాక్టర్స్ అందరి వివరాలు సేకరించాలని ఆర్డర్స్ వేస్తుంది అప్పూ. యామిని ఇంటికి వెళ్లేటప్పుడు మఫ్టీలో వెళ్లాలని, తనకు ఏ మాత్రం అనుమానం రాకుండా చూసుకోమని అంటుంది. నువ్వు ఎన్ని ప్లాన్లు వేస్తున్నా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా నుంచి తప్పించుకోలేవని మనసులో అనుకుంటుంది అప్పూ. నువ్వు మా అక్కకి చేసిన ద్రోహానికి నిన్ను సెల్‌లో కూర్చోబెట్టే వరకు వదలనని చెబుతుంది.

ఏడుస్తూ బాధపడుతున్న అపర్ణకి ధాన్యలక్ష్మీ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. కనీసం ఫ్రూట్స్ తినడానికైనా ఒప్పుకున్నావ్ నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది ఇందిర. నాకు కావ్య మాటలు, తన నమ్మకం ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని .. నాక్కూడ ఎక్కడో చిన్న ఆశ మొదలైందని చెబుతుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి వచ్చి నేడే చూడండి .. మీ అభిమాన నటి నట విన్యాసం అంటుంది. నీకు పర్ఫెక్ట్ పని సెట్ అయ్యిందని.. మన కంపెనీ పోస్టర్లు కూడా ఓ నాలుగు ఇస్తానని వెళ్లి గోడలకి అతికించి ప్రమోట్ చేయ్ అంటుంది.

పోస్టర్లు గోడకి అతికిస్తే ఏం వస్తుంది? అదే మీ చెల్లెలు నటించిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఆడిస్తే దాని పర్ఫార్మెన్స్‌కి 100 రోజులు గ్యారెంటీగా ఆడుతుందని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఎవ్వరికీ నమ్మకం కుదరడం లేదు కదా? వీడియో చూస్తే నమ్ముతారా? అని ప్రశ్నిస్తుంది. ఫోన్‌ని టీవీకి కనెక్ట్ చేసి చూపించగా కావ్య గాల్లో మాట్లాడుతూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. అది చూసి దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇంతలో కావ్య ఇంటికి వస్తుంది.

కావ్య మాటలు వింటుంటే ధైర్యం వచ్చిందని అన్నావు కదా? తన నమ్మకాన్ని చూసి నీలో ఆశలు చీగురించాయా? అని రుద్రాణి అడిగేసరికి అపర్ణ కంటతడి పెడుతుంది. కావ్యని నేను టార్చర్ పెడుతున్నానా? అడుగడుగునా అడ్డుపడుతున్నానా అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. కావ్యకి పిచ్చి పట్టింది.. రాజ్ బతికే ఉన్నాడనే భ్రమలో బతుకుందని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని అంటుంది రుద్రాణి. దీని మాటలు పట్టించుకోకుండా రాజ్‌కు చేయాల్సిన కార్యాలన్నీ సక్రమంగా జరిపిద్దామని చెబుతుంది . ఇది నా గొంతు పట్టుకుంటే వావ్ అంటూ చప్పట్లు కొట్టారని అంటుంది.

ఇంకా ఈ కావ్య మాటలు నమ్మడానికి ఈ ఇంట్లో ఎవరైనా మిగిలి ఉన్నారా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కావ్యని ఇకనైనా పిచ్చాసుపత్రికి పంపిద్దామా? 30 రోజులు వెయిట్ చేద్దామా? అని అంటుంది. ఆ మాటలతో కావ్య మండిపడుతుంది. అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఫాలో అయి నా వీడియో తీసి నా విషయంలో జోక్యం చేసుకుంటారని ప్రశ్నిస్తుంది. నువ్వు ఒక్కదానివే రాజ్ ఉన్నాడని ఊహించుకుని మాట్లాడటం నిజమా? కాదా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నేనేమీ గాల్లో మాట్లాడలేదని, ఫోన్‌లో మాట్లాడానని చెప్పి వీడియోలో తాను బ్లూటూత్ పెట్టుకున్న విషయం చూపిస్తుంది కావ్య. ఆ దెబ్బతో రాహుల్ - రుద్రాణి షాక్ అవుతారు.

నేను క్లయింట్స్‌తో మీటింగ్‌‌ కోసం రెస్టారెంట్‌కు వచ్చానని త్వరగా రమ్మని వాళ్లతో మాట్లాడానని చెబుతుంది కావ్య. ఈవిడగారు ఇంకో ఐదు నిమిషాలు అక్కడే ఉండి ఉంటే క్లయింట్స్ వచ్చే వాళ్లు విషయం అర్ధమయ్యేదని అంటుంది. నన్ను ఎందుకు ఫాలో అయ్యారు? నాకు తెలియకుండా వీడియో ఎందుకు తీశారని? ప్రశ్నిస్తుంది కావ్య. ఆ దెబ్బకు ఏం చెప్పాలో తెలియక తడబడుతుంది కావ్య. మా ఆయన బతికే ఉన్నారని.. ఇంకోసారి ఇంట్లో వాళ్ల ముందు తనను తప్పుడు మనిషిలా చూపిస్తే సహించనని వార్నింగ్ ఇస్తుంది కావ్య.

ఈసారి బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిందేనని యామిని చెప్పగా.. నన్ను నీ కంట్రోల్‌కి తీసుకుంటున్నావా? అని రాజ్ రగిలిపోతాడు. నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వమని చెప్పి వెళ్లిపోతాడు. నువ్వు ఇలాగే చేస్తే రాజ్ శాశ్వతంగా దూరమవుతాడని యామినికి తల్లి వార్నింగ్ ఇస్తుంది. రుద్రాణి చూపించిన వీడియోతో అపర్ణ బాగా డిజప్పాయింట్ అవుతుంది. ఇందిర, సుభాష్‌లు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్లిపోతుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X