Brahmamudi April 3rd Episode: డబ్బు కోసం తెగించిన ఐశ్వర్య... ఇందూ కిడ్నాప్‌కు స్వరాజ్‌తో డీల్

Photo Courtesy: JioHotstar

నీకు నాలుగు బట్టలు తీసుకొచ్చి, ప్రేమగా మాట్లాడిందని రేఖ బుట్టలో పడొద్దని ఇందూతో చెబుతుంది అపర్ణ. రెండ్రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది.. ఆ రోజు నాతో ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకునేందుకు ఆ రేఖ డ్రామాలు ఆడుతుందని నాకు తెలుసు అంటుంది ఇందూ. ఆస్తి కన్నా నాకు మీ ప్రాణాలు ముఖ్యం.. నేను సంతకాలు పెట్టకపోతే ఆ రేఖ మిమ్మల్ని ఏమైనా చేస్తుందని నా భయం. కాకపోతే నా తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చేందుకు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను... ఆ దేవుడే దారి చూపుతాడని అంటుంది ఇందూ. రేఖ ప్రవర్తన అనుమానంగా ఉండటంతో గట్టిగా నిలదీస్తుంది భ్రమరాంబ. ఆస్తి మన చేతికి రావడానికి ముందు ఇవన్నీ తప్పదని నచ్చజెబుతుంది రేఖ.

డ్రగ్స్ మాఫియా 10 లక్షల రూపాయలు కట్టమని బెదిరించడంతో స్వరాజ్- లక్కీలు మందు తాగుతారు. ఆ రోజు ఇందూ ఎదురు రావడం వల్లే ఇదంతా జరిగిందని మండిపడ్డ స్వరాజ్.. వెంటనే ఆమెకు ఫోన్ చేసి తిడతాడు. రాకేష్ బాకీ తీర్చడానికి 10 లక్షల రూపాయలు కావాలని ఐశ్వర్య అడగ్గా.. రేఖ నో చెబుతుంది. కారణం చెబితేనే ఇస్తాను, లేదంటే ఇవ్వనని చెప్పడంతో ఐశ్వర్య కోపంగా వెళ్లిపోతుంది. ఈ ఆస్తిని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి.. వారిని ఆదుకోవడానికి నాకు దారి చూపించమని కృష్ణుడి ముందు వేడుకుంటుంది ఇందూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 3వ తేదీ ఎపిసోడ్ 997లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 3rd 2026 Episode 997 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నా బాకీ తీర్చాల్సిందే.. నువ్వు కిడ్నాప్ చేస్తావో? బ్లాక్ మెయిల్ చేస్తావో? నాకు అనవసరం ఇక వెయిట్ చేయను. ఈరోజు దాటితే నా నుంచి నీకు ఫోన్ కూడా రాదు. నేరుగా వెళ్లి మీ ఆంటీతో సెటిల్ చేసుకుంటానని రాకీ వార్నింగ్ ఇవ్వడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. పదివేల కోసం కక్కుర్తిపడి ఇరుక్కుపోయాను.. నీ మాట వినకపోతే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదని అంటాడు కార్తీక్. నువ్వు కూడా ఆశపడ్డావు కదా అని లక్కీ అంటాడు. ఇప్పుడు నన్ను తిట్టి ప్రయోజనం ఏముంది? ఆ సాహో నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించమని చెబుతాడు స్వరాజ్. ఇప్పుడు ఎటూ వెళ్లలేని లూప్‌లో ఇరుక్కుపోయామని చెబుతాడు స్వరాజ్.

ఇప్పటి వరకు రేఖ ఆంటీ వల్ల నీకు వచ్చిన ప్రాబ్లమ్ అన్నింటి నుంచి నీ తెలివితేటలతోనే బయటపడ్డావు.. శివరామ్ గారిని ఒప్పించిమరి యబటకు వెళ్లేలా చేసుకున్నావు. చేయని దొంగతనాన్ని నీ మీద వేయాలని ఇంట్లో వాళ్లంతా ప్రయత్నిస్తే ఆ నెక్లెస్ ‌దొంగతనం చేసినవాళ్లని భయపెట్టి సమస్య నుంచి బయటపడ్డావు. ఇప్పుడు కూడా అలాగే ఆలోచించమని ఇందూకి చెబుతుంది స్వాతి. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. రాకీ మాటలు గుర్తొస్తాయి ఐశ్వర్యకి. ఈ ఇందూ వల్ల కోట్లు వచ్చేస్తాయని ఆశపడుతున్న రేఖ ఆంటీకి దీనిన కిడ్నాప్ చేసి షాకిస్తాను అనుకుంటుంది ఐశ్వర్య.

ఇంతలో లక్కీ నుంచి మెసేజ్ వస్తుంది. ఏం చేసినా నా చేతికి మట్టి అంటకూడదని లక్కీగాడితో చేయించాలని అనుకుంటుంది ఐశ్వర్య. వెంటనే లక్కీకి ఫోన్ చేస్తుంది. నీ దగ్గర డబ్బులు లేవన్న సంగతి నాకు తెలుసు.. ఇప్పుడు చెప్పే పని కనుక నువ్వు చేస్తే నాతో పాటు నీకు కూడా లాభం ఉంటుందని చెబుతుంది ఐశ్వర్య. ఆ మాటలతో లక్కీ, స్వరాజ్‌లు షాక్ అవుతారు. నేరుగా కలుస్తానని ఐశ్వర్య చెప్పడంతో ఆమెను కలుద్దామని రాజ్‌ని లాక్కెళ్తాడు లక్కీ.

నా ప్రేమలో సాయం చేస్తానని చెప్పి నన్ను మధ్యలోనే వదిలేశావు అని నందూపై మండిపడతాడు వెంకీ. కొంచెం అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడంతో బయటికి వెళ్లానని చెబుతుంది నందూ. ఆ రోజా నీకు కరెక్ట్ కాదు.. తను నీకు సెట్ అవ్వదు, తన వల్ల నువ్వు చాలా బాధపడతావు. అది నిన్ను వాడుకుంటోందని చెబుతుంది నందూ. దాంతో వెంకీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓ కారు వేగంగా వచ్చి తనని గుద్దడంతో కిందపడిపోతాడు. అది చూసి నందూ టెన్షన్ పడుతుంది. అయినా నేను వద్దంటే అలాగే స్పీడ్‌కి వెళ్లిపోతావా అని వెంకీపై మండిపడుతుంది నందూ. దెబ్బలకి తనే దగ్గరుండి మందు రాస్తుంది. నేను కోపంగా వెళ్లలేదు.. వాడెవడో వచ్చి గుద్ధాడని చెబుతాడు వెంకీ.

రాజ్- లక్కీలను రెస్టారెంట్‌లో కలుస్తుంది ఐశ్వర్య. ఇంతకీ పనేంటీ? మమ్మల్నే ఎంచుకోవడానికి కారణం ఏంటీ? ఇందులో మాకు వచ్చే లాభం ఏంటీ? అని రాజ్ నిలదీస్తాడు. ఒకసారి మీకు చెప్పాక.. ఆ పని మీరు చేయకపోతే నేను ప్రాబ్లమ్‌లో పడతానని అంటుంది ఐశ్వర్య. ఒకరిని కిడ్నాప్ చేయాలని చెప్పడంతో రాజ్, లక్కీలు షాకై ఆమెపై కోప్పడతారు. తేడా వస్తే జైలుకు వెళ్తాం.. జీవితాలే నాశనమైపోతాయని నాకు కూడా తెలుసు కానీ ఈపని చేస్తే మీరు జీవితంలో చూడనంత డబ్బులు వస్తాయని అంటుంది ఐశ్వర్య. కిడ్నాప్ అయిన తర్వాత మేం జైళ్లో ఉంటాం.. ఆ డబ్బంతా నువ్వే తీసుకోమని చెబుతాడు స్వరాజ్. నీకు కిడ్నాప్‌లు, దోపిడీలు చేసేవాళ్లలా ఉన్నామా అని మండిపడతాడు. మేం డబ్బులు సంపాదించి జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నామని అంటాడు స్వరాజ్. మేం కిడ్నాప్‌లు చేసేవాళ్లలా కనిపిస్తున్నామా అని మండిపడతాడు.

రేఖ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక చీకట్లో ఏడుస్తూ ఉంటుంది ఇందూ. నీకు మిగిలింది ఈ ఒక్కరాత్రి మాత్రమే, ఏం నిర్ణయం తీసుకున్నావని అడుగుతుంది స్వాతి. ఎన్నిరకాలుగా ఆలోచించినా నేను ఒక్కదారిలోనే ఆగుతున్నాను.. మా తాతయ్య, నానమ్మల ప్రాణాలే నాకు ముఖ్యమని అంటుంది ఇందూ. నాకు మరో దారి లేదని, సంతకం పెట్టాలని కూడా లేదని చెబుతుంది. నేను ఒంటరి దానిని అయిపోయాను, ఆ రేఖని ఎదిరించగలను కానీ తాతయ్య, నానమ్మలని చూసి బెదిరిస్తుంది. వాళ్ల రక్తంతో నా గెలుపుని రాయలేను, నేను జీవితాంతం సంతోషంగా బతకలేనని చెబుతుంది ఇందూ. ఆ దేవుడే నీకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని అంటుంది స్వాతి.

లక్కీ, స్వరాజ్‌లు ఇంటికి లేట్‌గా రావడంతో లక్ష్మీ మండిపడుతుంది. నీ ఫ్రెండ్స్ మూడు కేజీల చేపలు తీసుకొచ్చారని చెప్పడంతో స్వరాజ్, లక్కీలు షాక్ అవుతారు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో సాహూ అతని మనుషులు ఉండటంతో లక్కీ కంగారుపడతారు. మీ రాజు డైమండ్ లాంటివాడు, వాడిని సానపెడితే బాగా పైకి వస్తాడని చెబుతాడు. ఆయనను మాత్రం సాహూ గారని పిలవమని చలపతితో అంటాడు లక్కీ. మా వాడికి బిజినెస్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని షాక్ అవుతాడు స్వరాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X