Brahmamudi April 4th Episode : స్వప్న ట్రాప్‌లో రాహుల్.. రుద్రాణికి మెంటల్ తెచ్చేలా పథకం, రాజ్‌కి యామిని గిఫ్
రాజ్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా కావ్య రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో యామిని అక్కడికొచ్చి రాజ్ దగ్గరికి వెళ్తుంది. నేను కాఫీ తాగేశానని ఇంటికి వెళ్లిపోదామని చెబుతాడు రాజ్. టేబుల్‌పై రెండు కప్పులు కనిపించడంతో యామినికి డౌట్ వస్తుంది. ఓ కానిస్టేబుల్ .. యామినికి సంబంధించిన వివరాలన్నీ అప్పూకి చెబుతాడు. ఆమె గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కానిస్టేబుల్‌కి ఆర్డర్స్ వేస్తుంది అప్పూ.
రెస్టారెంట్‌లో తాను తీసిన వీడియోను దుగ్గిరాల ఫ్యామిలీకి చూపిస్తుంది రుద్రాణి. దాంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. ఇంతలో కావ్య రావడంతో ఆమెను రుద్రాణి నిలదీస్తుంది. నేను గాల్లో మాట్లాడటం లేదని, బ్లూటూత్ పెట్టుకుని క్లయింట్‌తో మాట్లాడుతున్నానని రుద్రాణి ప్లాన్ తిప్పి కొడుతుంది కావ్య. ఇంటికొచ్చిన యామిని .. ఈసారి నువ్వెక్కడికి వెళ్లినా నాకు చెప్పాల్సిందేనని రాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది. కావ్య చూపించిన వీడియోతో గుండె పగిలిన అపర్ణ బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్ 687లో ఏం జరిగిందంటే?

కావ్యని పదే పదే ఇబ్బండిపెడుతున్న రుద్రాణి సంగతి తేల్చాలని స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అప్పూ వచ్చి ఎందుకలా ఉన్నావ్? అని అడుగుతుంది. ఇంట్లో అందరూ రాజ్ చనిపోయాడని నమ్ముతుంటే ఒక్క కావ్య మాత్రమే బతికి ఉన్నాడని చాలా నార్మల్‌గా ఉందని చెబుతుంది స్వప్న. అది మా అత్తకి వెటకారంలా మారిందని బాధపడుతుంది. కావ్యకి తోడుగా నిలవాల్సిందిపోయి, కావ్య పరిస్ధితిని తనకు ఫేవర్‌గా మార్చుకోవడానికి ఆమెను పిచ్చిదానిలా చేయాలనుకుంటుందని అంటుంది స్వప్న. ఇంకోసారి అలా మాట్లాడకుండా వార్నింగ్ ఇద్దామని అప్పూ అనగా.. ముల్లుని ముల్లుతోనే తీయాలని చెబుతుంది స్వప్న.
కావ్యని పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్న మా అత్తని మనం పిచ్చిదాన్ని చేసి ఓ ఆట ఆడుకోవాలని అంటుంది. నాక్కూడా ఏదో ఒకటి చేయాలని అనిపించిందని, కానీ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు కదా వాళ్లే ఏం మాట్లాడనప్పుడు మనం ఏం చేస్తామని ప్రశ్నిస్తుంది అప్పూ. ఆవిడకి తోడుగా నా మొగుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని, ముందు వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపాలని చెబుతుంది స్వప్న. అప్పుడు మా అత్త ఒక్కటే ఒంటరిగా ఉంటుందని అంటుంది.
ఎప్పుడు చూసినా అమ్మాయిలకి పులిహోర కలుపుతూ ఉంటాడని ఆ వీక్‌నెస్‌ని వాడుకుని మనం దెబ్బకొడదామని చెబుతుంది స్వప్న. రాహుల్ పెద్ద కళాకారుడే అని అప్పూ అనగా.. మామూలు కళాకారుడు కాదు.. ఏదో ఒక రోజు జనాల చేతుల్లో తన్నులు తినే కళాకారుడని అంటుంది స్వప్న . ఇంట్లో సైలెంట్‌గా ఉంటే ఇలాంటి వాళ్లే ఈ పనులు చేస్తారని చెబుతుంది. మనం దుగ్గిరాల ఇంటి కోడళ్లమని మన వాళ్ల ఈ కుటుంబానికి ఏ సమస్యా రాకూడదని టైం చూసి దెబ్బ కొట్టాలని చెబుతుంది స్వప్న.
వేరే నెంబర్ నుంచి రాహుల్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుంది స్వప్న. నేను టీనాని లాస్ట్ టైం మనం ఒక పార్టీలో కలిశామని చెబుతుంది. ఎప్పుడో ట్రై చేస్తే ఇప్పుడు గుర్తొచ్చానా అని అంటాడు రాహుల్. ఈ రోజు నీతో మీట్ అవ్వాలని అనుకుంటున్నానని స్వప్న చెప్పడంతో ఎక్కడికి రావాలని అడుగుతాడు రాహుల్. ఇంట్లో మీ వైఫ్ ఏమి అనదా అని అడగ్గా.. అసలు నాకు పెళ్లే కాలేదని అంటాడు రాహుల్. ఒక కూతురు ఉన్నా కూడా వీడి వేషాలు చూశావా అని అప్పూతో అంటుంది స్వప్న. సంతోషంతో బయటికి వస్తున్న రాహుల్‌ని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది స్వప్న. నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్తున్నానని అంటాడు.
కళావతితో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా అని బాధపడుతుంటాడు రాజ్. ఆ వెంటనే ఆమెకు మెసేజ్ చేస్తాడు. మీ తప్పేం లేదని నాకు తలనొప్పిగా ఉండి వచ్చేశానని చెబుతుంది కావ్య. మీ ఇంటి అడ్రస్ పెట్టండి ఇద్దరం కలిసి ఆసుపత్రికి వెళ్దామని రాజ్ ఫోన్ చేయడంతో కావ్య ఏడుస్తుంది. మీ ఆరోగ్యం గురించి మీరు ఎంత బాగా పట్టించుకుంటారో రోడ్డు మీద కళ్లు తిరిగి పడిపోయినప్పుడే అర్ధమైందని అంటాడు రాజ్. ఆ ప్రేమ తట్టుకోలేక ఏడుస్తుంది కావ్య.ఇంత అభిమానం చూపిస్తున్న వారికి అబద్ధం అస్సలు చెప్పనని అంటుంది కావ్య.
నాకు మీరు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తోందని, నాకు గతం గుర్తులేదని.. ఏది నిజమో? ఏది అబద్ధమో అర్ధం కావడం లేదని అంటాడు రాజ్. నిజంగానే నేను నీకు తెలియదా? అని అడిగేసరికి కావ్య బాధపడుతుంది. ఏం చెప్పాలో తెలియక అమ్మమ్మ గారు పిలుస్తున్నారని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో యామిని రావడంతో రాజ్ షాక్ అవుతాడు. నాకు గతం గుర్తులేదని, కాని నేను చిన్నపిల్లాడిని కాదు కదా అంటాడు రాజ్. నీకోసం గిఫ్ట్ కొనుక్కోని వచ్చానని చెప్పి కారు తాళాలు రాజ్ చేతిలో పెడుతుంది యామిని. ఈ కారు నీదేనని నువ్వు ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఏమైనా చేయొచ్చని చెబుతుంది.
తమ పెళ్లి ఫోటోను చూసుకుని ఏడుస్తుంది కావ్య. ఇది చూసిన సుభాష్.. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్ అని ప్రశ్నిస్తాడు. అంటే మీరు కూడా రుద్రాణి గారి మాటలు నమ్ముతున్నారా అని అడుగుతుంది. నీ మాటలే నమ్ముతున్నా.. ఎందుకంటే నువ్వు చెప్పే మాటల్లో నా కొడుకు బతికే ఉన్నాడని అంటాడు. కేఫేలో నీ ప్రవర్తన చూసి మీ అత్తయ్యకి నీ మీద నమ్మకం పోయిందని చెప్పడంతో కావ్య బాధపడుతుంది. ముందు నువ్వు నీ ఊహల్లో నుంచి బయటికి రా? నీకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనని అంటాడు సుభాష్. నువ్వు నిజంగా రాజ్‌ని చూసుంటే ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు అని నిలదీస్తాడు. ఆమె నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో సుభాష్ బయటికి వెళ్లిపోతాడు.
రుద్రాణిని ఏడిపించడానికి స్వప్న, అప్పూలు ప్లాన్ చేస్తారు. ఇంతలో రుద్రాణికి అక్కడికొచ్చి టైంకి ఇంట్లో వాళ్లు భోజనం చేయకుండా హెల్త్ పాడు చేసుకుంటున్నారని అనుకుంటుంది. కాసేపటికీ స్వప్న, అప్పూలు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. వంటలు అదిరిపోయాయని ఘుమఘుమలాడిపోతున్నాయని చెప్పడంతో ఏం స్పెషల్ చేశారోనని రుద్రాణి చూడగా అందులో చేపలు కనిపిస్తాయి. ఆ దెబ్బతో రుద్రాణి వణికిపోతుంది. చేపల పులుసు బాగుంటుందని స్వప్న చెప్పగా అది బతికున్న చేపలని అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











