Brahmamudi April 4th Episode: స్వరాజ్‌కు సాహూ ఫైనల్ వార్నింగ్.. ఇందూ కిడ్నాప్‌‌కి ఐశ్వర్య‌తో డీల్

Photo Courtesy: JioHotstar

నా బాకీ తీర్చాలంటే రాకేష్ ఒత్తిడి చేయడంతో ఐశ్వర్యకు ఏం చేయాలో అర్ధంకాక తలపట్టుకుంటుంది. పదివేల రూపాయల కోసం కక్కుర్తిపడి ఇప్పుడు 10 లక్షల రూపాయల్లో ఇరుక్కుపోయామని లక్కీపై మండిపడతాడు స్వరాజ్. మనం 10 లక్షలు సంపాదించాలంటే మనకి 2 లక్షలు పెట్టుబడి, 10 రోజులు టైం కావాలని అంటాడు. ఇందూ- స్వాతి మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందూని కిడ్నాప్ చేయాలని అనుకుంటుంది ఐశ్వర్య. వెంటనే లక్కీకి ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని చెబుతుంది.

నన్ను, రోజాని కలుపుతానని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్లిపోయావని నందూపై అరుస్తాడు వెంకీ. అది నిన్ను వాడుకుంటోంది, నీకు అది కరెక్ట్ కాదని అంటుంది నందూ. నువ్వు వద్దు, నీ ఫ్రెండ్‌షిప్ వద్దంటూ కోపంగా వెళ్లిపోతుండగా వెంకీని కారు గుద్దేసి వెళ్లిపోతుంది. దాంతో తనకి మందు రాస్తుంది నందూ. రాజ్- లక్కీలను కలిసిన ఐశ్వర్య.. నేను చెప్పినట్లు ఒకరిని కిడ్నాప్ చేస్తే బోల్డెంత డబ్బు వస్తుంది, దానితో మీ కష్టాలు తీరతాయని టెంప్ట్ చేస్తుంది. స్వరాజ్- లక్కీలు మాత్రం ఈ ప్రపోజల్‌కు ఒప్పుకోకుండా కోపంగా వెళ్లిపోతారు. రేఖ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆస్తిని ఎలా కాపాడుకోవాలో అర్ధంకాక ఏడుస్తున్న ఇందూని స్వాతి ఓదారుస్తుంది. స్వరాజ్- లక్కీలు ఇంటికెళ్లి చూసేసరికి సాహూ వాడి మనుషులు లోపల ఉంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్ 998లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 4th 2026 Episode 998 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇంటికొచ్చిన సాహూతో నువ్వేం బిజినెస్ చేస్తున్నావని అడుగుతాడు చలపతి. పౌడర్ బిజినెస్ అని సాహూ చెప్పగా రాజ్, లక్కీలు షాక్ అవుతారు. ఒక్కసారి మా పౌడర్‌కి అలవాటు పడితే, చచ్చే వరకు మా పౌడరే కావాలని అంటారని చెబుతాడు. ఒకసారి ముఖానికి పూసుకుంటే గోడకి కొట్టిన సున్నంలా మెరిసిపోతారని సాహూ గారి ఫీలింగ్ అంటాడు రాజ్. బిజినెస్ గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశా, అయినా కూడా మొదట్లోనే తప్పటడుగులు వేస్తున్నాడని అంటాడు సాహూ. మా వాడి గురించి పూర్తిగా తెలుసుకునే పార్ట్‌నర్‌ని చేసుకున్నావా? మా వాడిని నమ్ముకుంటే రోడ్డు మీద అడుక్కుతినాల్సిందే. అర్ధ రూపాయికి నిన్ను అమ్మేస్తాడు. చివరికి ఏ గల్లీలో తలదాచుకోవాలో తెలియక ఏడుస్తూ కూర్చోవాలని అంటాడు చలపతి.

ఆ వెంటనే సాహూకి అన్నం పెడుతుంది లక్ష్మీ. మీ చేతి చేపల పులుసు అదిరిపోయిందని అంటాడు సాహూ. ఇంతలో దెబ్బలతో ఇంటికొచ్చిన వెంకీని చూసి రాజ్ షాకై.. ఏం జరిగిందని అడుగుతాడు. రోడ్డు మీద ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా ఎవరో కారుతో ఫాస్ట్‌గా వచ్చి అలా తగిలించి వెళ్లిపోయాడు. కొంచెం అయ్యుంటే పెద్ద యాక్సిడెంటే అయ్యేది, కానీ ఆ డ్రైవర్ డ్రైవింగ్ చూస్తే ఎవరో కావాలని చేసినట్లుగా ఉందని చెబుతాడు వెంకీ. నా మీద ఎప్పుడూ కోప్పడతావు.. ఈరోజు ఇంత ప్రేమ చూపిస్తున్నావని అంటాడు వెంకీ. అన్నాదమ్ముల ప్రేమ అలాగే ఉంటుంది.. ఎప్పుడూ గొడవ పడుతున్నట్లే కనిపిస్తుంది, కానీ కష్టం వచ్చిందంటే ఇలా కంగారుపడిపోయి.. కన్నీళ్లు పెట్టుకుంటారని అంటాడు సాహూ.

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. టైంకి పనులు చేయాల్సిన వాళ్లు చేయకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. రాజు ఉన్నంత వరకు మీకేం కాదు.. జాగ్రత్తగా చూసుకుంటాడు అంటాడు సాహూ. అనంతరం రాజుని బయటకి తీసుకెళ్లి, ఈరోజు వీడి తమ్ముడికి లక్ బాగుంది కాబట్టి బతికిపోయాడు అనుకుంటున్నావా? అదే లక్ అమ్మానాన్నలకు ఉంటుందా? కామెడీగా మాట్లాడుతుంటే కమెడియన్ అనుకోకు. నేను కామెడీ చేస్తేనే తమ్ముడు గాయాలతో ఇంటికొచ్చాడు, నేను సీరియస్ అయితే ఏం చేస్తానో నీ ఊహాకే వదిలేస్తున్నాను. నీ ఇంటిదాకా వచ్చిన వాడిని, ఎక్కడిదాకా అయినా వెళ్తా. ఫ్యామిలీకి బాగా వాల్యూ ఇచ్చేవాడిలా ఉన్నావు.. నాలాంటి వాడితో డీలింగ్స్ ఉండటం మీ ఫ్యామిలీకి మంచిది కాదు. ఈ రోజు మీ తమ్ముడి మీదకి కారొచ్చింది.. రేపు మీ ఫ్యామిలీ మీదకి బుల్డోజర్ వస్తే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు సాహూ. నా డబ్బు నాకు కావాల్సిందే అంటాడు.

దాంతో ఐశ్వర్యకి ఫోన్ చేయమని స్వరాజ్ చెప్పడంతో లక్కీ షాక్ అవుతాడు. నేను ఈరోజు ఇంటికి ఏం చేయలేదు.. నా వల్ల వాళ్లకు ఏమైనా జరిగితే తట్టుకోలేను, నా కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తానని అంటాడు స్వరాజ్. కోట్లు ఇచ్చినా అలాంటి పనులు చేయమని వెళ్లిపోయారు కదా? అలాంటిది మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తుంది ఐశ్వర్య. మేం ఎవరినీ ఎప్పుడు? ఎక్కడ కిడ్నాప్ చేయాలో అది చెప్పమని స్వరాజ్ సీరియస్ అవుతాడు. దాంతో ఇందూ ఫోటో చూపించి కిడ్నాప్ చేయమని ఐశ్వర్య చెప్పడంతో రాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఈ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది కదా? అంటాడు స్వరాజ్. కిడ్నాప్ చేస్తే పగ ఎలా తీరుతుందని అడుగుతాడు.

దాని దగ్గర చిల్లిగవ్వ కూడా ఉండదు.. నిజం చెప్పాలంటే దానికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదని చెబుతుంది ఐశ్వర్య. బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే.. మాకేం వస్తుందని అంటాడు స్వరాజ్. ఇది ఒక్క సంతకం పెడితే మా ఆంటీకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిసొస్తుంది. అంటే దీని కోసం మా ఆంటీ ఎంత డబ్బయినా ఖర్చుపెడుతుంది. ఇప్పుడు దీనిని మీరు కిడ్నాప్ చేసి మా ఆంటీని బ్లాక్‌మెయిల్ చేస్తే మనం అడిగినంత డబ్బులు ఇస్తుందని చెబుతుంది ఐశ్వర్య.

రిస్క్ చేయాల్సింది మేము.. కానీ మీ పక్కన నేనున్నాను అంటుంది ఐశ్వర్య. మీరు ఇందూని కిడ్నాప్ చేసి డబ్బులు అడగాల్సింది మా రేఖ ఆంటీనే. నేను కూడా అదే ఇంట్లో తన పక్కనే ఉంటాను, మా ఆంటీ ఏం చేసినా మీకు చెబుతానని అంటుంది. రేపు దాని పుట్టినరోజు.. అది సంతకం పెట్టడానికి ముందే దానిని కిడ్నాప్ చేయాలని అంటుంది ఐశ్వర్య. సంతకం పెట్టాక ఈ ఇందూ బతికున్నా చచ్చినా మా రేఖ ఆంటీ అస్సలు పట్టించుకోదని చెబుతుంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇందూ సంతకం పెట్టదు, ఎవరొచ్చినా సరే తనని నేను ఎత్తుకెళ్లిపోతానని చెబుతాడు స్వరాజ్.

వంటగదిలోకి ఎందుకెళ్లావని ఇందూపై మండిపడుతుంది భ్రమరాంబ. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదని భూషణ్ సీరియస్ అవుతాడు. రేపటితో మీ జీవితాలే మారిపోతాయని అంటుంది ఐశ్వర్య. ఈ ఇంట్లో రేఖ ఆంటీ మాట కాదని, ఎవరూ ఏది చేయరు. కానీ నా కోసం ఒక పనిచేసి పెట్టమని అడుగుతుంది. ఆ మాటలతో భ్రమరాంబకు అనుమానం వస్తుంది. ఇంతలో రేఖ వచ్చి ఐశ్వర్యపై సీరియస్ అవుతుంది. అలాగే ఇందూకి కొత్తబట్టలు తీసుకొచ్చి, ఫాంహౌస్‌లో బర్త్ డే చేద్దామని అంటుంది. ఈ నాలుగు గోడల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తన దగ్గర వేలిముద్ర వేయించుకుంటే ఏం బాగుంటుంది, అందరి ముందు తన అంగీకారంతోనే ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలని చెబుతుంది రేఖ. ఆ ముసలోళ్లు ఇద్దరూ మన గుప్పిట్లో ఉన్నంత కాలం ఆ ఇందూ మనం చెప్పినట్లు చేయాల్సిందే. ఒకవేళ చేస్తే మన చేతుల్లో చస్తారని అంటుంది రేఖ.

ఆ రేఖ అందరిముందు నీ మీద గెలవాలని అనుకుంటోందని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. రేపు నేను సంతకం పెట్టడానికి ఫాంహౌస్‌కి వెళ్తున్నాను, మీకంటే నాకు ఆస్తి ఎక్కువ కాదు. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. మా అమ్మనాన్నల సంకల్పం మీద విశ్వాసం ఉంది.. దీనిని ఆపడానికి ఏదో ఒక రూపంలో ఆ దేవుడు నాకు తోడు పంపిస్తాడని చెబుతుంది ఇందూ. ఇందూని ఎలా కిడ్నాప్ చేయాలి? ఎక్కడ దాచాలి? అని స్వరాజ్- లక్కీలు ఆలోచిస్తూ ఉంటారు. ఇందూని కిడ్నాప్ చేస్తే మనల్ని తర్వాత వదిలిపెడుతుందా అని లక్కీ టెన్షన్ పడతాడు. ఇంతలో ఐశ్వర్య ఫోన్ చేసి ఇందూని ఫాంహౌస్‌లో కిడ్నాప్ చేయమని చెబుతుంది. ఇందూ కోసం ఇన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం.. ఇప్పుడు అది మనకోసం ఆస్తిని వదులుకోవడానికి సిద్ధమైందని సుభాష్‌తో అంటుంది ఇందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X