Brahmamudi April 7th Episode : ఒకే గుడికి రాజ్ - దుగ్గిరాల ఫ్యామిలీ .. షాకిచ్చిన కావ్య, రుద్రాణిలో అనుమానం
నాకు పిచ్చి పట్టిందని అప్పూ- స్వప్నలు ఏడిపిస్తున్నారని ధాన్యం- ప్రకాశంలను సాక్ష్యం చెప్పమని అడుగుతుంది రుద్రాణి. దీంతో వారిద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అప్పూ- స్వప్నలను అడుగుతారు. మా అత్తయ్యకి చేపల పులుసు, చికెన్ ఫ్రై పచ్చిగా కనిపిస్తున్నాయని చెబుతుంది స్వప్న. దీంతో ప్రకాశం వాటిని చెక్ చేసి చూడగా చేపల పులుసు, చికెన్ కర్రీలు ఉంటాయి. దీంతో ప్రకాశం - రుద్రాణిపై మండిపడతారు. వంటగదిలో బిజీగా ఉన్న కావ్యకి రాజ్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ఎవరో చూడమని అపర్ణకి చెబుతుంది కావ్య.
అత్తగారు ఫోన్ దగ్గరికి రాబోతుండగా పొరపాటున ఆయన కనుక చేస్తే బాగోదని భయపడ్డ కావ్య.. పరుగు పరుగున వచ్చి ఫోన్ అందుకుని బెడ్‌రూంలోకి వెళ్లి మాట్లాడుతుంది. తలనొప్పికి తన వద్ద చిట్కా ఉందని వేడి కొబ్బరి నూనెను తలకు రాసుకోమని చెబుతాడు రాజ్. కావ్య అలాగే చేస్తుండగా తన భర్తే వచ్చి తనకు మసాజ్ చేసినట్లుగా ఊహించుకుంటుంది. ఉదయం నుంచి సిటీ మొత్తం తిరుగుతున్నా టీనా కనిపించకపోవడంతో ఆమెకు ఫోన్ చేస్తాడు రాహుల్. ఫోన్ లిఫ్ట్ చేసిన స్వప్న ఇంటికి ఎలా రావాలో చెబుతుంది. ఆమె చెప్పిన అడ్రస్‌కి వచ్చేసరికి అది తన ఇల్లే కావడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఆ వెంటనే వెదవ వేషాలు వేస్తావా అంటూ రాహుల్‌ను చావబాదుతుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 7వ తేదీ ఎపిసోడ్ 689లో ఏం జరిగిందంటే?

ఉదయాన్నే అందరికీ హారతి తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. ఇంకా ఎవ్వరూ రెడీ అవ్వలేదు ఎందుకని అని అడుగుతుంది. ఎందుకు రెడీ అవ్వాలని ఇందిర అడగ్గా.. ఈ రోజు శ్రీరామనవమి అని ప్రతి సంవత్సరం మనం గుడికి వెళ్లి పూజలు చేయిస్తున్నాం కదా అని అంటుంది. ప్రతి సంవత్సరం రాజ్ చేతుల మీదుగానే పూజలు చేయించాం.. గతేడాది మీ ఇద్దరి చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం చేయించామని అంటుంది రుద్రాణి. ఇప్పుడు రాజ్ లేకుండా ఆ గుడికి వెళితే మీ కొడుకు ఎక్కడ? కళ్యాణానికి ఎందుకు రాలేదని అడిగితే వదిన ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తుంది రుద్రాణి.
ఆ సమాధానాలేవో నేను చెప్పుకుంటానని అంటుంది కావ్య. గుడిలో పూజారి గారికి మనం వస్తున్నట్లు చెప్పానని, అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతుంది కళావతి. ఇప్పటి వరకు మన మధ్యలోనే ఉన్న రాజ్ విషయం ఇప్పుడు నలుగురిలోకి వెళితే మన ఇంటి పరువు సమస్య అవుతుంది కదా అని అంటుంది ధాన్యలక్ష్మీ. రాజ్ ఏమయ్యాడని నలుగురు అడిగితే మన దగ్గర సమాధానం లేదని, యాక్సిడెంట్‌లో ఇలా జరిగిందని చెప్పే ధైర్యం కూడా లేదని అంటాడు ప్రకాశం.
అందరికీ సమాధానం నేను చెప్పుకుంటానని అంటుంది కావ్య. ఏం చెబుతావ్.. అక్కడ కూడా రాజ్ బతికే ఉన్నాడని అంటావా అని నిలదీస్తాడు రాహుల్. నువ్వు ఇంట్లో వాళ్లని పిచ్చోళ్లని చేసినట్లు బయటివాళ్లని కూడా చేస్తానంటే నిన్ను పిచ్చిదానిలా చూస్తారని అంటుంది రుద్రాణి. రాజ్ లేకుండా గుడికి వెళ్లి ఉన్న పరువు కూడా తీయాలని నీ కోడలు చూస్తుందని అపర్ణతో చెబుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే సీతారాముల కళ్యాణం జరిపిద్దామని అంటుంది ఇందిర. అసలు ఈ కళ్యాణం జరిపిస్తున్నదే ఆయన ఇంటికి తిరిగి రావాలని అని చెబుతుంది కావ్య.
యామిని కూడా సీతారాముల కళ్యాణం జరిపించాలని ఇంటి దగ్గర హడావుడి చేస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి ఇంత ట్రెడిషనల్‌గా రెడీ అయ్యావ్ ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తాడు రాజ్. ఇన్ని రోజులుగా ఎప్పుడూ నన్ను పొగడలేదని అంటుంది యామిని. ఈ చీరలో చాలా బాగున్నావని అంటాడు రాజ్. గుడిలో సీతారాముల కళ్యాణం జరిపిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పెళ్లి జరుగుతుందని చెబుతుంది యామిని. తనకు వేరే పని ఉందని రాజ్ చెబుతున్నా వినిపించుకోకుండా రావాల్సిందేనని పట్టుబడుతుంది.
మీకు నిశ్చితార్ధం అయ్యాక , పెళ్లి జరుగుతుందన్న సమయంలో యాక్సిడెంట్ జరిగిన కోమాలోకి వెళ్లారని అలాంటి ప్రమాదాలు జరగకుండా దేవుడికి మొక్కుకున్నానని అంటుంది వైదేహి. అందరూ బతిమలాడటంతో రాజ్ గుడికి రావడానికి ఒప్పుకుంటాడు. రాజ్ కుటుంబం ఆలయం దగ్గరికి వస్తుంది. రాహుల్ కనిపించకపోవడంతో ఎక్కడ అని రుద్రాణిని అడుగుతారు. ఈ మాత్రం దానికి ఎందుకని నేనే వద్దు అన్నానని అంటుంది రుద్రాణి. గుడిలో పంతులుగారు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పి అందరూ బాగున్నారా అని అడుగుతారు.
మనం ఎక్కడ బాగున్నామని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. గతేడాది రాజ్ - కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపించారు కదా ఇప్పుడు మీ అబ్బాయి కనిపించడం లేదని పూజారి అడగటంతో అంతా షాక్ అవుతారు. రాజ్ రాలేడు.. ఎక్కడికో వెళ్లాడు.. అసలు వస్తాడో లేదో కూడా తెలియదని అంటుంది రుద్రాణి. దాంతో అంతా కలిసి ఆమెకు గడ్డిపెడతారు. ఆయన రాలేకపోవడానికి కారణం ఉందని.. ఆయన ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి రాములవారి దర్శనం చేసుకుంటామని చెబుతుంది కావ్య.
ఆ శ్రీరాముడిని నమ్ముకున్న వారికి ఆయన ఏనాడూ అన్యాయం చేయడని, ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరికి అందరినీ ఒక్కటి చేస్తాడని చెబుతారు పంతులు గారు. త్వరలోనే మీరు కోరుకుంటున్నట్లుగా మీ అబ్బాయి మీ కళ్ల ముందుకు వస్తాడని అంటాడు. ఇంతలో రాజ్ కూడా యామిని కుటుంబంతో కలిసి గుడికి వస్తాడు. కావ్య ఎక్కడుంది? ఏం చేస్తుంది? అని ఆలోచిస్తుంటాడు రాజ్. యామిని ఏదో చెబుతున్నా దానిని పట్టించుకోడు.. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని అన్నాడని , ఇంకా ఎందుకు రాలేదా అని వెయిట్ చేస్తున్నానిన చెబుతాడు రాజ్.
మన కాలేజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారని రాజ్ చెప్పడంతో యామినికి డౌట్ వస్తుంది. కారులో వాటర్ బాటిల్ మరిచిపోయానని తీసుకుని వస్తానని బయటికి వస్తాడు ప్రకాశం. సీతారాముల కళ్యాణానికి రాహుల్‌ని రానివ్వకపోవడంతో రుద్రాణిపై మండిపడుతుంది స్వప్న. పీటల మీద కూర్చోవడానికి వెళ్లబోతున్న కావ్యని రుద్రాణి అడ్డుకుని దంపతులు మాత్రమే అక్కడ కూర్చోవాలని అంటుంది. నేను ఫూల్‌ని కాదని జంటగానే పీటల మీద కూర్చొంటానని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
కొంపదీసి ఇప్పుడు రాజ్ వచ్చి కూర్చుంటాడని చెబుతావా ఏంటి అంటూ కావ్యని నిలదీస్తుంది రుద్రాణి. మా వారు వస్తారు నా పక్కన కూర్చొంటారని చెబుతుంది కావ్య. మీకెవ్వరికీ నమ్మకం కలగడం లేదు కదా ఇప్పుడే వెళ్లి తీసుకొస్తానని బయటికి వెళ్తుంది కావ్య. దాంతో అంతా టెన్షన్ పడతారు. వెంటనే రాజ్ ఫోటో తీసుకుని గుడిలోకి వస్తుంది కావ్య. అది చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











