Brahmamudi April 7th Episode: రేఖ ప్లాన్ తిప్పికొట్టిన ఇందూ.. స్వరాజ్‌కి డబుల్ బొనాంజా
Photo Courtesy: JioHotstar
ఇన్నేళ్లుగా మనిద్దరం ఇందూకి దక్కాల్సిన ఆస్తి గురించి రేఖతో యుద్ధం చేస్తున్నాం.. ఇప్పుడు ఇందూ మనకోసం ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతోందని సుభాష్‌తో చెప్పుకుని బాధపడుతుంది అపర్ణ. ఈ సమయంలో తనకి తన తల్లి గురించి, ఆమె ధైర్యం గురించి తెలియాలని చెప్పి కావ్య గురించి కళ్యాణ్ రాసిన పుస్తకాన్ని బయటకు తీసి సుభాష్‌కి చూపిస్తుంది. గతంలోకి వెళ్లిన సుభాష్.. కావ్య గురించి కళ్యాణ్ రాసిన పుస్తకం గురించి గుర్తుచేసుకుంటాడు.
రుద్రాణి, రాహుల్‌ల ఫోటల వైపు చూస్తూ.. ఇన్నేళ్ల మీ కల, ఆశయం రేపు నెరవేరబోతోందని చెబుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఆ ఇందూ సంతకం పెడుతుందా? అని భ్రమరాంబ అడుగుతుంది. అక్కడ ఉన్నది కావ్య కూతురే కానీ, కావ్య కాదు. ఆ ముసలోళ్లను చూసైనా ఇందూ సంతకం పెడుతుందని చెబుతుంది రేఖ. ఆస్తిని, తల్లిదండ్రుల ఆశయాల్ని ఎలా కాపాడాలా? అని బాధపుడుతున్న ఇందూకి కావ్య గురించి పుస్తకాన్ని ఇస్తుంది అపర్ణ. మీ అమ్మ వ్యక్తిత్వం, ఈ కుటుంబం కోసం చేసిన త్యాగాలు అన్నింటిని తెలుసుకోమని చెబుతుంది. రాత్రంతా అది చదువుతూ కూర్చొన్న ఇందూకి కావ్య ఆత్మ పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 7వ తేదీ ఎపిసోడ్ 1000లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ ముందు కావ్య ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నన్నెందుకు వదిలి వెళ్లిపోయావని ఇందూ అడగ్గా.. నేను ఎక్కడికి వెళ్లలేదు, నీ మనసులోనే ఉన్నాను, ప్రతి ఆలోచనలో ఉన్నానని చెబుతుంది కావ్య. ఎందుకు భయపడుతున్నావని కావ్య అడగ్గా.. ఆ రేఖ తాతయ్య వాళ్లని చంపేస్తానందా? ఆస్తి కోసం సంతకం పెట్టాలని బెదిరిస్తోందని అంటుంది అంతేకదా . వాళ్లను ఎలా కాపాడుకోవాలో అర్ధం కావడం లేదని చెబుతుంది ఇందూ. జవాబు దొరకని ప్రశ్నంటూ ఈ లోకంలోనే లేదు, నువ్వు ప్రయత్నిస్తే ఈ సమస్య కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని చెబుతుంది కావ్య. నీ అంత ధైర్యం కానీ, నీ అంత తెలివికానీ నాకు లేవు.. కష్టమొస్తే నీలాగా యుద్ధం చేయలేనని అంటుంది ఇందూ.
నువ్వు నా రక్తానివి, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని చెబుతుంది కావ్య. నేను ఓడిపోయాను, వాళ్లను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తం ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాను. నీ ఆశయాన్ని నాశనం చేశాను, నీ కూతురిగా ఉండే అర్హత నాకు లేదని చెప్పి కావ్య ఒడిలో పడుకుంటుంది. ప్రతి యుద్ధంలో ఎందుకు గెలవాలని అనుకుంటున్నావు, కొన్నిసార్లు మనకు పోరాడే అవకాశం ఉండదు. కాలం కలిసొచ్చే వరకు ఎదురుచూడాలి. నువ్వు సంతకం పెట్టినంత మాత్రాన ఓడిపోయినట్లు కావు. నువ్వు చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు ఈ ప్రకృతి నీకు అండగా నిలబడి నిన్ను గెలిపిస్తుంది. కానీ అది జరగాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి, నువ్వు అనుకున్నది సాధించగలనని నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుందని చెబుతుంది. ఒక వెలుగులా నీకో మార్గం దొరుకుతుందని చెబుతుంది కావ్య. ఈ యుద్ధంలో గెలిచే వరకు పోరాడతాను, నా సమయం వచ్చే వరకు ఎదురుచూస్తాను, ఆ రేఖను మాత్రం గెలవనివ్వనని అనుకుంటుంది ఇందూ.
ఉదయాన్నే ఇందూకి బర్త్ డే విషెస్ చేయడానికి రేఖ, భ్రమరాంబ, భూషణ్‌లు వచ్చి గట్టిగా అరవడంతో ఇందూ భయపడుతుంది. నీ కోసం మన గెస్ట్ హౌస్‌లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశాను, చాలామంది వీఐపీలు వస్తున్నారని చెబుతుంది రేఖ. ఇదంతా ఏంటీ అంటూ అపర్ణ మండిపడుతుంది. ఇన్ని రోజులు ఈ ప్రేమంతా ఎక్కడికి పోయింది. నువ్వేంటో నాకు తెలుసు అంటుంది. ప్రేమ చూపించకపోతే రాక్షసిని అంటున్నారు, చూపిస్తే నటన అంటున్నారు అని మండిపడుతుంది రేఖ. మా నానమ్మ సంగతి వదిలేయండి.. నేను రెడీ అవ్వాలి అంతే కదా అని అంటుంది ఇందూ. మేమంతా గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాట్లు చూస్తుంటాం.. నువ్వే ఇందూని దగ్గరుండి రెడీ చేసి తీసుకురమ్మని స్వాతికి చెబుతుంది రేఖ.
దాని నక్క తెలివితేటలకు మోసపోవద్దు.. అసలు ఆ బర్త్ డే పార్టీకే వెళ్లొద్దని ఇందూకి చెబుతుంది అపర్ణ. నేనేం చేయాలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, దానిని ఎవ్వరూ మార్చలేరని చెబుతుంది ఇందూ. నువ్వు ఏమైనా చేయ్.. కానీ ఆస్తి మాత్రం ఆ రేఖ చేతిలోకి వెళ్లనీయొద్దు, దానిని నమ్ముకున్న వాళ్లకి అన్యాయం చేయొద్దని అంటుంది అపర్ణ. నువ్వు ఏం చేయబోతున్నావు.. సంతకం పెడతావా? అని స్వాతి అడగ్గా.. నేను పార్టీకి వెళ్తాను, కేక్ కట్ చేస్తాను, కానీ సంతకం మాత్రం పెట్టనని చెబుతుంది ఇందూ. పార్టీలో నుంచి మాయం అయిపోతానని అంటుంది
నన్ను నేనే కిడ్నాప్ చేసుకుంటాను, అందరిముందు నన్ను కిడ్నాప్ చేస్తే నానమ్మ, తాతయ్యలని ఆ రేఖ ఆంటీ ఏం చేయకుండా నా కోసం వెతుకుతూ ఉంటుంది. ఆస్తి సేఫ్ నానమ్మ, తాతయ్యలు సేఫ్ అని చెబుతుంది ఇందూ. నువ్వే కిడ్నాప్ చేయాలని చెప్పడంతో స్వాతి షాక్ అవుతుంది. ఇద్దరు ఉన్నారు.. వాళ్లతో నేను మాట్లాడతానని చెబుతుంది స్వాతి. కిడ్నాప్ ఓకే.. మరి ఏదో ఒక రోజు సంతకం పెట్టాలి కదా అని అడుగుతుంది స్వాతి. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో రేఖని ఎదిరించలేను, ఈ ఆస్తిని, తాతయ్య- నానమ్మలని కాపాడాలంటే నాకు కొంచెం టైం కావాలి. దాని కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నానని చెబుతుంది ఇందూ.
ఇందూ బర్త్ డే జరిగే గెస్ట్ హౌస్ దగ్గరికి స్వరాజ్- లక్కీలు వస్తారు. మీరిద్దరూ ఇక్కడికి వస్తే మిమ్మల్ని అంతా గుర్తుపడతారు. తర్వాత మీరు కనిపించకపోతే అందరికీ మీ మీదే అనుమానం వస్తుంది, అప్పుడు అందరం ఇరుక్కుంటామని చెబుతుంది ఐశ్వర్య. ఇంతలో వెయిటర్స్‌గా వెళ్లాలని స్వరాజ్ ప్లాన్ చేస్తాడు. వెయిటర్‌గా వద్దు.. ఏదైనా సినిమా హీరో గెటప్ ప్లాన్ చేయమని అంటాడు లక్కీ. పార్టీకి వచ్చిన వారిలో అప్పులు వాళ్లు ఎక్కువ ఉంటారు. ఇన్నిరోజులు మనం తీసుకున్న అప్పులు ఎక్కడ ఎగ్గొడతామేమోనని వాళ్లు యుద్ధం ప్రకటించేలా ఉన్నారు. వాళ్లు అలా దాడి చేయకుండా ఉండాలంటే మన మీద పోయిన పూర్తి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.
ఇన్నిరోజులు మాటలతో మేనేజ్ చేశాం. ఇప్పుడు వాళ్లకి ప్రూఫ్స్ కావాలి, అందుకే అప్పుల వాళ్లనే ఇన్వైట్ చేశానని చెబుతుంది రేఖ. వాళ్ల కళ్లముందే ఆస్తి పేపర్ల మీద ఆ ఇందూ సంతకం పెడితే అందరూ నమ్ముతారని అంటుంది. కొత్త అప్పూ ఇవ్వడానికి క్యూ కడతారని చెబుతుంది రేఖ. ఇందులో చక్రీ వచ్చి నా డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు. కాసేపట్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఛైర్మన్‌ని కాబోతున్నాను, ఒక్కసారి నేను ఛైర్మన్ అయ్యాక స్వరాజ్ కంపెనీ చేసే ప్రతి ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్‌తో పోలిస్తే నీ అప్పు ఎంత అని ప్రశ్నిస్తుంది రేఖ. అందరూ వార్నింగ్ ఇస్తున్నారు.. ఆ ఇందూ సంతకం పెట్టడంలో తేడా రాదు కదా అని అడుగుతాడు భూషణ్. ఇంతలో స్వరాజ్, లక్కీలు వెయిటర్స్ గెటప్‌లో ఇందూని కిడ్నాప్ చేయడానికి లోపలికి వెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











