Brahmamudi April 8th Episode: ఇందూయే తన అక్క అని తెలుసుకున్న నందూ.. భ్రమరాంబకి బడితపూజ
Photo Courtesy: JioHotstar
రేఖ నుంచి ఆస్తిని, తాతయ్య- నానమ్మలను ఎలా కాపాడుకోవాలో తెలియక బాధపడుతుండగా కావ్య ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నువ్వు నా రక్తం.. దేనికీ భయపడకూడదు, కాలం సహకరించే వరకు ఓపికగా ఎదురుచూస్తూ ఉండమని చెబుతుంది. అమ్మను తలచుకుంటూ అలాగే పడుకున్న ఇందూని ఉదయాన్నే రేఖ, భూషణ్, భ్రమరాంబలు నిద్రలేపి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. త్వరగా లేచి రెడీ అయితే పార్టీకి వెళ్దామని చెబుతుంది రేఖ. ఇదంతా చూసిన అపర్ణ మండిపడుతుంది. నేను ఇందూని హింసిస్తే రాక్షసి అంటున్నారు.. బాగా చూసుకుంటే నటన అంటున్నారని ఫైర్ అవుతుంది రేఖ.
ఆ రేఖకి ఆస్తి ఇచ్చేస్తావా అని అపర్ణ అడగ్గా.. నా ప్లాన్ నాకుందని ధైర్యం చెబుతుంది ఇందూ. స్వాతిని పిలిచి నన్ను నేను కిడ్నాప్ చేసుకుంటాను, కొన్నిరోజులు ఎవరికీ కనిపించనని చెబుతుంది ఇందూ. ఇందుకు సాయం చేయమని అడగ్గా స్వాతి సరేనని అంటుంది. ఇందూని కిడ్నాప్ చేయడానికి స్వరాజ్- లక్కీలు వచ్చి ఐశ్వర్యను కలుస్తారు. ఇలా వెళితే మిమ్మల్ని ఎవరో ఒకరు గుర్తుపట్టేస్తారని చెప్పడంతో వెయిటర్స్‌గా గెటప్ మార్చుకుంటారు స్వరాజ్- లక్కీ. పార్టీకి వచ్చిన అప్పుల వాళ్లు.. మా అప్పు ఎప్పుడు తీరుస్తారని రేఖను నానామాటలు అంటూ ఉంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ 1001లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూని కాపాడటానికి మారువేషాల్లో వెళ్తారు స్వరాజ్- లక్కీ. ఆ మాస్క్‌లు ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో పనివాళ్లపై మండిపడుతుంది భ్రమరాంబ. ఫ్లవర్ డెకరేషన్ కోసం ఎదురుచూస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో దానిని తీసుకుని వస్తుంది నందూ. బొకే షాప్ నడుపుతున్నావు.. మళ్లీ ఇలాంటి ఈవెంట్స్ అవసరమా అని మండిపడతాడు బాబాయ్. నందూని చూసిన స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఇందూ- నందూలు ఫ్రెండ్స్ అనుకుంటానని స్వరాజ్ అంటాడు. ఆరోజు మత్తు పదార్థాల బ్యాగ్ తీసుకెళ్లినప్పుడు మనల్ని చూసిందా అని స్వరాజ్- లక్కీలు కంగారుపడతారు. కిడ్నాప్ పూర్తయ్యే వరకు మాస్క్‌లలోనే ఉందామని అనుకుంటారు.
ఇంతలో అందంగా ముస్తాబై అక్కడికి వస్తుంది ఇందూ. ఆమెను చూసి నందూ షాక్ అవుతుంది. ఆ వెంటనే కోపంగా అక్కడికి వచ్చిన అపర్ణని చూసిన నందూ.. తన నానమ్మ అని, ఇందూనే తన అక్క అని తెలుసుకుని ఎమోషనల్ అవుతుంది. ఆ రేఖ ఇచ్చిన బట్టలు కాబట్టే నాకు నచ్చడం లేదని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. నువ్వు అనుకున్నది జరగాలి, అందరికీ మంచి జరగాలని ఆశీర్వదిస్తుంది అపర్ణ. ఇన్నిరోజులు నేను తిరుగుతున్నది మా అక్కతోనా? అని ఎమోషనల్ అవుతుంది నందూ.
ఇందూ అందాన్ని చూసి ముచ్చటపడతాడు స్వరాజ్. ఇంత అందాన్ని కిడ్నాప్ చేయడంలో తప్పులేదని అనుకుంటాడు. నందూ ఏడుస్తూ ఉండటంతో ఏం జరిగిందని అడుగుతాడు పోలీస్ బాబాయ్. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మా అక్కని చూసేసరికి కన్నీళ్లు ఆగడం లేదు.. ఇందాక కారులో నుంచి దిగిన అమ్మాయే మా అక్క అని చెబుతుంది నందూ. వాళ్లిద్దరినీ కలవడానికి వెళ్తుండగా ఆగిపోతుంది నందూ. నేను ఇంట్లోంచి బయటికొచ్చిందే ఆ రేఖ మీద కోపంతో, పోలీస్ అయి ఎప్పటికైనా తన మీద గెలవాలని మా అక్కకి తోడుగా నిలబడాలని అనుకున్నాను, ఇప్పుడు కనుక నేను వెళ్తే ఆ రేఖ నన్ను పోలీస్ కాకుండా అడ్డుపడుతుందని అంటుంది నందూ.
ఇన్నేళ్లు గడిచిన తర్వాత కూడా మనుషులు ఒకేలా ఎందుకుంటారని అడుగుతాడు పోలీస్ బాబాయ్. ఆ రేఖ గురించి నీకు తెలియదు, నన్ను మా అక్కని చదివించకూడదని .. మా నానమ్మని ఎంతో టార్చర్ చేసింది. నువ్వే చెల్లెలిని అని ఎప్పుడు చెబుతావని బాబాయ్ అడగ్గా.. అది ఈరోజు కాదు, మరో రోజని చెబుతుంది నందూ. కిడ్నాపర్స్‌తో మాట్లాడావా? కిడ్నాప్ చేయడానికి వస్తున్నారా? అని స్వాతిని అడుగుతుంది ఇందూ. నీ కోసం ఎంతో రిస్క్ తీసుకున్నానని చెబుతుంది స్వాతి. ఆ వెంటనే కిడ్నాపర్లతో మాట్లాడుతుంది స్వాతి. ఆ అమ్మాయి మీద చిన్న గీత కూడా పడకుండా చూసుకుంటామని చెబుతుంది.
వాళ్లు, వాళ్ల మాటల్ని చూస్తుంటే జోకర్స్‌లా ఉన్నారు.. వీళ్లు కిడ్నాప్ చేస్తారా? అని స్వాతిని అడుగుతుంది ఇందూ. వాళ్లు జోకర్స్‌లా ఉన్నా.. పని విషయంలో మాత్రం పక్కాగా ఉంటారని చెబుతుంది స్వాతి. స్వరాజ్- లక్కీలు లోపలికి ఎలా వెళ్లాలా? అని ఆలోచిస్తుండగా.. స్వాతి పంపిన కిడ్నాపర్స్ ఎదురవుతారు. రెండు గ్యాంగ్‌లు ఒకరిపై ఒకరు డౌట్ పడతారు. మీ పేర్లెంటీ అని స్వరాజ్ అడగ్గా.. బంటీ, బబ్లూ అని చెబుతారు. ఇంతలో మేనేజర్ పిలిచి ముచ్చట్లు ఆపి పనిచూసుకోమని వార్నింగ్ ఇస్తాడు.
ఫ్లవర్ డెకరేషన్ చేస్తుండగా.. అపర్ణ కనిపించడంతో నందూ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో భ్రమరాంబ వచ్చి పనులన్నీ ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావని మండిపడుతుంది. మా ఆయనకి టాబ్లెట్ ఇచ్చే టైం అయ్యింది, మంచినీళ్ల కోసం వెళ్తున్నానని చెబుతుంది. ప్రపంచంలో నీకు ఒక్కదానికే మొగుడు ఉన్నాడా? మాకు లేడా అని నానామాటలు అంటుంది భ్రమరాంబ. ఇంత ఖర్చుపెట్టి.. ఇంతమందిని పిలిచి పార్టీ చేస్తుంటే ఇందూ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. నువ్వు కానీ, నీ మొగుడు కానీ నీ మనవరాలికి ఖరీదైన బట్టలు కొనిచ్చారా? మా రేఖ కొనిచ్చింది.. అందుకు కొంతైనా కృతజ్ఞత చూపించమని నానామాటలు అంటుంది భ్రమరాంబ.
ఇదంతా చూసిన నందూ.. దీని సంగతి చెబుతానంటూ కోపంగా భ్రమరాంబ వెనకే వెళ్లి దుప్పటి ముసుగు వేసి చితకబాదుతుంది. ఆ దెబ్బతో భ్రమరాంబ విలవిలలాడిపోతుంది. ఇంతలో శేషం వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. నన్ను ఎవరో ఈ ముసుగు వేసి కొట్టారని భ్రమరాంబ చెప్పడంతో శేషం షాక్ అవుతుంది. మనసులో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న పగతో కొట్టినట్లుగా ఉందని చెబుతుంది భ్రమరాంబ. నువ్వు చేసిన పాపాల చిట్టా ఏమైనా చిన్నదా? కృష్ణానది బ్యారేజ్ అంత ఉంటుందని అంటాడు శేషం. నిన్ను కొట్టిన వ్యక్తికి 100 కొబ్బరికాయలు కొడతానని అనుకుని మురిసిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











