Brahmamudi April 9th Episode : రాజ్ కోసం యామిని - అపర్ణ గొడవ .. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన కావ్య
సీతారాముల కళ్యాణంలో మా వారు నా పక్కనే కూర్చొంటారని, ఇప్పుడే వెళ్లే తీసుకొస్తానని కావ్య వెళ్తుంది. దీంతో ఆమె నిజంగానే రాజ్‌ను తీసుకొస్తుందా అని అంతా ఎదురుచూడగా ఇంతలో రాజ్ ఫోటో తీసుకుని కావ్య వస్తుంది. ఆమెను చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. పూజలు, వ్రతాలు దంపతులు చేయాలని రుద్రాణి గొడవ పడుతుంది. అప్పడు రామాయణంలో బంగారు సీత విగ్రహాన్ని పక్కన పెట్టుకుని రాములవారు యాగం చేశారని కావ్య గుర్తు చేస్తుంది.
కావ్యతో మాట్లాడాలని రాజ్ తహతహలాడిపోతూ ఉంటాడు. ఆపై ఆమెకు కాల్ చేసి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతాడు. తాను ముఖ్యమైన పనిలో ఉన్నానని తర్వాత చేస్తానని చెబుతుంది కావ్య. వాటర్ బాటిల్ తీసుకుని వస్తూ రాజ్‌ను చూస్తాడు ప్రకాశం. ఈ విషయం అందరికీ చెప్పాలని వస్తూ ఓ వ్యక్తికి తగలడంతో అంతా మరిచిపోతాడు. ఇంతలో రుద్రాణికి రాజ్ కనిపించడంతో ఆమె మైక్ అందుకుని రాజ్ బతికే ఉన్నాడని , ఇక్కడే ఉన్నాడని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ కనిపిస్తాడు. తను గతం మరిచిపోవడంతో మీరంతా ఎవరని ప్రశ్నిస్తాడు రాజ్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్ 691లో ఏం జరిగిందంటే?

ఇతను రాజ్ కాదు రామ్ అని.. మా బావ అని చెబుతుంది యామిని. తన చిన్నతనంలోనే వాళ్ల అమ్మానాన్న చనిపోతే మా బావ మా ఇంట్లోనే పెరిగాడని అంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నామని, త్వరలోనే కలిసి జీవితాన్ని కూడా పంచుకోబోతున్నామని చెబుతుంది యామిని. మధ్యలో మీరంతా వచ్చి రాజ్ అంటూ గొడవ చేస్తున్నారని మండిపడుతుంది. అపర్ణ కూడా ఎవరు ఆ అమ్మాయి అని ప్రశ్నిస్తుంది. తను నాకు కాబోయే భార్య యామిని అని చెబుతాడు రాజ్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయేంటీ? నీకు ఆల్రెడీ పెళ్లయ్యింది కదా అని చెబుతుంది అపర్ణ. నీ పెళ్లాంతో నువ్వు ఏడాదిన్నర కాపురం చేశావు.. ఇది కూడా నీకు గుర్తులేదా అని మండిపడుతుంది. నేను చెబితే నువ్వు నమ్మడం లేదా అని కావ్యని తీసుకొచ్చి రాజ్ ముందు నిలబెడుతుంది. ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటీ అంటూ కావ్యపై మండిపడుతుంది. తను నాకు తెలుసు, తన పేరు కళావతి మేమిద్దరం ఫ్రెండ్స్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
రీసెంట్‌గానే మా ఇద్దరికీ పరిచయమైందని రాజ్ అనడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలగొడతానని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. వేద మంత్రాల సాక్షిగా, అందరి ముందు నువ్వు తాళి కట్టిన నీ భార్య కావ్య అని అంటుంది . ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. మీరు అన్నట్లు కావ్య నా భార్య అయితే ఎవరో తెలియనట్లు నాకు ఫ్రెండ్‌గా ఎందుకు పరిచయమైందని ప్రశ్నిస్తాడు రాజ్. మీరు నా భార్య అయితే మళ్లీ కొత్తగా నాతో ఎందుకు పరిచయం చేసుకున్నారని కావ్యని అడుగుతాడు రాజ్.
భార్యవి అయ్యుండి ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్నావా? అసలు ఏం జరుగుతోంది మీ మధ్య అని అపర్ణని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని అంటుంది ఇందిర. ఇన్ని రోజులుగా నువ్వు వాడితో మాట్లాడుతున్నా ఇంట్లో వాళ్లకి ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. ఆయనకు మనమెవరో తెలియదని అంటుంది కావ్య. ఇంతలో రుద్రాణి జోక్యం చేసుకుని ట్విస్ట్ అదిరిపోయింది.. తను రాజ్ కాదన్నమాట, ఆ యామిని చెబుతున్నట్లు తన పేరు రామ్ అన్న మాట అని అంటుంది. రాజ్‌లా ఉన్నాడని తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి.
తను రామ్ కాదు రాజే.. మా ఆయన రాజ్ అని అరిచి చెబుతుంది కావ్య.. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. తను రాజ్ అయితే ఇంత జరుగుతుంటే మనమెవరో తెలియనట్లు ఇలా బిహేవ్ చేస్తున్నాడని అడుగుతుంది రుద్రాణి. ఎందుకు సైలెంట్‌గా ఉన్నావ్ కావ్య .. రాజ్ ఏమైనా తప్పు చేశాడా అని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నిలదీస్తుంది. ఆయన గతం మరిచిపోయారని నేను మీకు ఏం చెప్పలేదని అంటుంది కావ్య. శ్రీశైలంలో జరిగిన యాక్సిడెంట్‌లో ఆయన గతం మరిచిపోయాడని చెబుతుంది. ఏదో ఒక రోజు ఆయనను మామూలు మనిషిని చేసి ఇంటికి తీసుకొద్దామని అనుకున్నానని చెబుతుంది కావ్య.
అందుకే ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచానని అంటుంది. వాడికి గతం గుర్తులేకపోతే మనింటికి తీసుకొచ్చి గతం గుర్తుచేయాలి కదా అని అంటాడు సుభాష్. ఈ యామిని ఆడిన నాటకంలో ఆయన పావులా మారిపోయాడని , గతం గుర్తుచేస్తే డాక్టర్ గారు ఆయన ప్రాణానికే ప్రమాదమని చెప్పారని అంటుంది కావ్య. ఇప్పటి వరకు మీరు చాలా చెప్పారని, మేం కూడా చాలా బాగా విన్నామని మండిపడుతుంది యామిని. తను రాజ్ కాదు రామ్ .. నా బావ అని అంటుంది. ఇలాంటి కట్టుకథలు చెప్పి ఆయన మనసుని మార్చాలని చూస్తున్నారా అని మండిపడుతుంది .
ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లి తన గతం మరిచిపోయారని , దానిని అనువుగా తీసుకుని నాటకం ఆడాలని చూస్తున్నారా అని నిలదీస్తుంది. మా అబ్బాయి ఉన్న పరిస్ధితిని అనుకూలంగా మార్చుకుని మీ అమ్మాయి తప్పు చేస్తుందని తెలిసి కూడా కూతురిని సమర్ధిస్తున్నారా అని వైదేహిపై మండిపడుతుంది అపర్ణ. గొడవలొద్దు.. సైలెంట్‌గా ఉండండి మనం ఏమాత్రం ప్రెజర్ ఇచ్చినా అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తుంది కావ్య. అది కూడా ఈ యామినియే చెప్పి ఉంటుందని, ఈ రోజు నా కొడుకుతోనే ఇంటికెళ్తానని అంటుంది అపర్ణ.
గతం మరిచిపోయిన పేషెంట్‌ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని.. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని రాజ్‌తో అంటుంది యామిని. ఎక్కడికి వెళ్లేది తను రాజ్ అనడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆధార్, పాన్‌కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ అని చూపెడతాడు సుభాష్. మరి తను రామ్ అనడానికి మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయని చెబుతాడు. ఈరోజు వీళ్ల అంతు తేల్చి మన రాజ్‌ని మనింటికి తీసుకెళ్లాలని చెబుతుంది అపర్ణ. అందరి మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా కావ్య కలగంటుంది. అక్షింతలు తీసుకోమని అపర్ణ పిలుస్తుంది.
ఇదంతా నా కల అని ఉలిక్కిపడుతుంది .. ఇదంతా జరగకుండా ఉండాలంటే నేనే యామిని ముందుకు వెళ్లాలని అనుకుంటుంది కావ్య. ఆమెను చూసిన యామిని వెంటనే కళావతి అనగా రాజ్ ఫేస్ సంతోషంతో వెలిగిపోతుంది. మీరొక్కరే వచ్చారా అని రాజ్ అడగ్గా మా ఫ్యామిలీ అంతా వచ్చిందని చెబుతుంది కావ్య. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











