Brahmamudi April 9th Episode: ఇందూని హత్తుకుని నందూ ఎమోషనల్.. స్వరాజ్‌ని గుర్తుపట్టిన అపర్ణ
Photo Courtesy: JioHotstar
ఇందూని కిడ్నాప్ చేయడానికి మారు వేషాల్లో వెయిటర్స్‌గా వెళ్తారు స్వరాజ్- లక్కీ. అదే ఈవెంట్‌కు నందూ ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికి వస్తుంది. ఇంతలో ఇందూ కారులోంచి దిగగా, అపర్ణ వచ్చి మండిపడుతుంది. అపర్ణని చూడగానే ఆమె తన నానమ్మ అని, ఇందూయే తన అక్క అని తెలుసుకుని ఎమోషనల్ అవుతుంది నందూ. నేను ఎవరనేది చెబితే ఆ రేఖ ఆంటీ నన్ను పోలీస్ అవ్వకుండా ఆపుతుందని ఆగిపోతుంది నందూ. ఇందూ అందాన్ని చూసి స్వరాజ్ మురిసిపోతాడు.
తనను కిడ్నాప్ చేయడానికి ఎవరైనా మనుషుల్ని మాట్లాడావా? లేదా? అని స్వాతిని అడుగుతుంది ఇందూ. నేను మొత్తం రెడీ చేసి పెట్టా.. నిన్ను కాసేపట్లో కిడ్నాప్ చేస్తారని స్వాతి చెప్పడంతో ఇందూ సంతోషిస్తుంది. స్వాతి ఏర్పాటు చేసిన మనుషులకు, స్వరాజ్- లక్కీలకు గొడవ జరుగుతుంది. ఫంక్షన్ ఏర్పాట్లు చూడకుండా సుభాష్ దగ్గరికి వెళ్తున్న అపర్ణని నానామాటలు అంటుంది భ్రమరాంబ. ఇదంతా చూసిన నందూ రగిలిపోతుంది. ఆమె వెనకాలే వెళ్లి బెడ్‌రూంలో భ్రమరాంబను దుప్పటి ముసుగు వేసి చితకబాదుతుంది. దెబ్బలతో ఒళ్లంతా వాచిపోవడంతో ఏడుస్తున్న భ్రమరాంబ దగ్గరికి శేషం వచ్చి నవ్వుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్ 1002లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూని కిడ్నాప్ చేయడానికి స్వరాజ్- లక్కీలు లోపలికి వస్తారు. ఇంతలో అపర్ణ అడ్డుతగలడంతో అతనిని చూసి షాక్ అవుతుంది. నిన్ను ఎక్కడో చూసినట్లుగా ఉందని.. మాస్క్ తీయమని అడగటంతో స్వరాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఫోన్ రావడంతో స్వరాజ్ ఎస్కేప్ అవుతాడు. బయటికి వెళ్తుండగా నందూకి తగులుతుంది ఇందూ. అక్కడని చూడగానే వెంటనే హత్తుకుని ఎమోషనల్ అవుతుంది నందూ. ఎందుకో మనిద్దరం బాగా తెలుసని నాకు అనిపిస్తోంది.. మన పరిచయం కొన్నాళ్ల ముందు జరిగినా, ఎన్నో ఏళ్లుగా మనం కలిసే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతోందని చెబుతుంది ఇందూ. మనిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నీ మనసు నీకు గుర్తుచేస్తోంది.. కానీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో నేను నిజం బయటపెట్టలేనని అనుకుంటుంది నందూ.
నా చెల్లెలు గుర్తొచ్చి నేను ఎమోషనల్ అయ్యానని అంటుంది ఇందూ. మీ చెల్లి ఎక్కడ? ఇప్పుడేం చేస్తోందని అడుగుతుంది నందూ. చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఇందూ చెప్పడంతో తనకు అంత పొగరా అని నందూ అడగ్గా.. మీరు మనుషుల్ని జడ్జ్ చేయడం ఇంకా ఆగలేదా అని సీరియస్ అవుతుంది ఇందూ. చెల్లెల్ని ఒక్క మాట కూడా అననివ్వడం లేదని నందూ అనగా.. నాకు అదంటే ప్రాణం, నాకంటూ ఈ లోకంలో నన్నుగా ప్రేమించే మనిషి తను మాత్రమే, నేను పడే బాధలు చూడలేక వెళ్లిపోయిందని చెబుతుంది ఇందూ. ఎప్పుడో వెళ్లిపోయిన మనిషి, తిరిగి వస్తుందో లేదో కూడా తెలియదు.. అలాంటప్పుడు ఇంత ప్రేమెందుకు అని ప్రశ్నిస్తుంది నందూ.
తను వెళ్లిపోయి ఇన్నిరోజులు గడిచినా తనను రోజు గుర్తుచేసుకునే ఉంటాం. తన ప్రేమ ముందు నాది చాలా చిన్నది, తిడుతూనే ఇష్టపడుతుంది. నిన్ను చూస్తే నా చెల్లెలిగా అనిపిస్తోంది.. అది కూడా నీలాగే తిడుతూ ఉంటుందని చెబుతుంది. నన్ను చూస్తే నీ చెల్లెల్ని చూసినట్లే ఉంది కదా? నీ చెల్లెలు దొరికే వరకు నన్నే నీ చెల్లెలు అనుకోమని చెబుతుంది నందూ. మా చెల్లెలు తిరిగొచ్చినా సరే.. నిన్ను ఆ దేవుడిచ్చిన చెల్లెలు అనుకుంటానని అంటుంది ఇందూ. నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని అడగ్గా.. ఫ్లవర్ డెకరేషన్ కోసం వచ్చానిన చెబుతుంది నందూ. ఇంతలో నందూకి పోలీసుల నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోతుంది.
ఇందూని కిడ్నాప్ చేయడానికి స్వరాజ్- లక్కీలు ప్లాన్ చేస్తుండగా అక్కడి వస్తుంది ఇందూ. ఆమెను చూసి ఇద్దరూ షాక్ అవుతారు. మీ వాయిస్‌లు ఎక్కడో విన్నట్లుగా ఉందని ఇందూ డౌట్‌గా పడుతుంది. ఈ పిల్ల అందరితో గొడవ పడటం లేదు.. నీతో మాత్రమే గొడవ పడుతోంది. మాస్క్ వేసుకున్నా సరే వెతికి మరి వచ్చి గొడవ పడిందంటే.. మీ ఇద్దరి మధ్య ఉన్న మేజిక్ ఏంటో అర్ధం కావడం లేదని అంటాడు లక్కీ. స్వాతి పంపించిన మనుషులు కూడా ఇందూని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తూ.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలుపుతారు. ఇంతలో ఇందూ అక్కడికి వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతుంది.
జ్యూస్‌లో మత్తు మందు కలిపి అందరికి ఇస్తున్నాం.. టైం చూసి ఇక్కడున్న అందరితో తాగిస్తాం. వాళ్లు మూడు గంటలు మత్తుగా పడుకున్నాక.. మిమ్మల్ని ఎత్తుకెళ్లిపోతామని చెబుతారు కిడ్నాపర్స్. అది వినగానే ఇందూ సంతోషిస్తుంది. మీరు కేక్ కట్ చేసిన వెంటనే మా డెన్‌లో ప్రత్యక్షం అవుతారని కిడ్నాపర్స్ చెబుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఐశ్వర్యను చూసి ఇందూ షాక్ అవుతుంది. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసి కూడా అంత సంతోషంగా ఎలా ఉంటున్నావని అడుగుతుంది ఐశ్వర్య. ఆ దేవుడు నీ నుదిటిన అలా రాశాడు.. నువ్వేం చేస్తావులే అని నానామాటలు అంటుంది. దేవుడు ఎప్పుడూ ఎవరికీ ఏది రాయడు, మన ప్రయత్నంలో, మన కష్టంతో గెలుచుకోవాలని చెబుతుంది ఐశ్వర్య.
ఈరోజు మా రేఖ ఆంటీ అనుకున్నదే చేస్తుంది. సంతకం పెట్టడానికి ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు, అనవసరంగా నీ మీద ఓవర్‌గా ఆలోచిస్తున్నానని చెబుతుంది ఐశ్వర్య. ప్రస్తుతం రాయిగా ఉన్నది, భవిష్యత్తులో శిల్పంగా మారుతుంది.. దానిని కళ్లతో కాదు మనసుతో చూడాలని చెబుతుంది. నువ్వు సంతకం పెట్టకపోతే రేఖ ఆంటీ నిన్ను చంపేస్తుందని అంటుంది ఐశ్వర్య. నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా.. పరిస్ధితులు అనుకూలించకపోతే అని ఇందూ అనడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. నాకు సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంది ఐశ్వర్య.
స్వాతి పంపిన మనుషులు.. మత్తుమందు కలిపిన జ్యూస్ అందరికీ ఇస్తుండగా స్వరాజ్- లక్కీలకు ఎదురొస్తారు. మీ మిషన్ ఏంటో మాకు తెలుసు.. ఇందాక మా జ్యూస్ కౌంటర్ దగ్గర 5 కేజీల షుగర్ కొట్టేసింది మీరేనని నాకు బాగా తెలుసు అంటారు. ఆ మాటలతో లక్కీ- స్వరాజ్‌లు షాక్ అవుతారు. ముసుగు దొంగల్లా ఆ మాస్క్‌లు ఏంటీ అని స్వాతి మనుషులు అడగటంతో లక్కీ- స్వరాజ్‌లు ఉలిక్కిపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











