Brahmamudi August 10th episode: కల్యాణ్ విషయంలో.. రాజ్‌కు ఎదురు తిరిగిన కావ్య

కల్యాణ్, అప్పు పెళ్లి చేసుకొన్న వ్యవహారం ఇంటిలో పెద్ద గొడవకు కారణమైంది. అంతేకాకుండా వారిద్దరూ పెళ్లి చేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం మరో సమస్యగా మారింది. వారిద్దరూ చేసిన పనికి రాజ్ తీవ్ర మనస్తాపం చెందాడు. బాధ పడుతూ ఎందుకు ఇలా చేశాడు? అని మదన పడ్డారు. ఇంకా తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

రాజ్ గదిలో ఆలోచనల్లో ఉంటే కావ్య వచ్చి.. భోజనం చేద్దామని అడిగింది. అయితే నేను భోజనం చేయను అంటూ రాజ్ కోపంగా అన్నాడు. ఎందుకు అంటే.. నాకు ఇష్టం లేదు. కల్యాణ్, అప్పును తీసుకొచ్చే బాధ్యత నీదే అని అన్నాడు. కల్యాణ్‌ పెళ్లికి నాకు సంబంధం ఏమిటి? నేను చేసుకోమని చెప్పానా? అని కావ్య బదులిచ్చింది.

Brahmamudi serial August 10th 2024 Episode of 485 Here is full story

కవి (కల్యాణ్)ని నేను చేసుకోమని చెప్పానా? నాకు చెప్పి చేసుకొన్నారా? అని కావ్య అంటే..వాడు పెళ్లి చేసుకొని బయటకు వెళ్లాడు. కల్యాణ్‌కు బయటి ప్రపంచంలో బతకడం తెలియదు. ఎలా బతుకాడో అర్ధం కాదు. కాబట్టి నువ్వే వాడిని ఇంటికి తీసుకు రావాలి అని రాజ్ అన్నాడు. దాంతో కావ్య నాతో కాదు అని చేతులెత్తేసింది.

ఇదిలా ఉంటే.. తర్వాత ఆకలిగా ఉందని తల్లిని రాజ్ అడిగాడు. ఇంట్లో ఏమి లేవు. అంతా నీ భార్య ఊడ్చేసింది. నీ భార్య మొత్తం ఖాళీ చేసింది. ఇప్పుడు తినడానికి ఏమీ లేవని చెప్పింది. దాంతో రాజ్ అసహనాన్నివ్యక్తం చేశాడు.

Brahmamudi serial August 10th 2024 Episode of 485 Here is full story

ఇదిలా ఉండగా, కల్యాణ్, అప్పు ఇద్దరు తన ఫ్రెండ్స్ రూమ్‌లో సెటిల్ అయ్యారు. ముగ్గురు బ్యాచ్‌లర్స్ మధ్య ఉన్నారు. అయితే వంట గురించి మాట్లాడుతూ.. బ్యాచ్‌లర్ లైఫ్‌లో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. నువ్వు రైస్ పెట్టు.. నేను కర్రీస్ బయట నుంచి తెస్తాను అంటూ ఫ్రెండ్ అనడంతో నవ్వుల్లో మునిగిపోయారు. అయితే వారిద్దరికి ఏకాంతం ఇవ్వాలని ఫ్రెండ్స్ అనుకొని మరో ఫ్రెండ్‌తో మాట్లాడుతూ.. మనం సెకండ్ షో సినిమాకు వెళ్దాం. ప్రభాస్ సినిమా చూద్దాం అని అంటే.. ఇంత రాత్రి ఎందుకు అంటే.. మధ్యాహ్నం కుదరదు. అందుకే రాత్రి సినిమాకు వెళ్తాం అని ఫ్రెండ్ బదులు ఇచ్చాడు.అయితే నేను అల్రెడీ ప్రభాస్ సినిమా చూశాను.. నేను రాను అంటే..అరేయ్ ప్రభాస్ సినిమా ఎన్ని సార్లైనా చూడొచ్చు.. పద అంటూ కోపాన్ని మనసులోనే దాచేసుకొంటూ అరిచాడు.

అయితే కల్యాణ్‌తో అప్పు మాట్లాడుతూ... నన్ను పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నావు. నీవు గొప్ప ఇంటి వాడివి. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నా కోసం ఇలా జీవితం గడపడం ఎందుకు? అనామిక నీతో బాగా ఉంటే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను మీ జీవితంలోకి వచ్చి ఉండే దానిని కాదు అని అప్పు అంది. అయితే ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది అని కల్యాణ్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X