Brahmamudi August 11th Episode: మలుపు తిరిగిన బ్రహ్మముడి.. కావ్యకి క్యాన్సర్.. దేవదాసులా మారిన రాజ్

Photo Courtesy: JioHotstar

రేవతి ఇంటి నుంచి రాజ్‌ను ఇంటికి తీసుకొస్తుంది కావ్య. రాజ్ క్షేమంగా తీసుకురావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో యామిని వచ్చి కావ్యతో గొడవకు దిగుతుంది. నువ్వు రిజెక్ట్ చేశావన్న బాధలో బావ ఏమైనా చేసుకుంటే.. ఆయన ప్రాణాలు పోయుంటే అని యామిని అనడంతో కావ్య ఆమెను లాగికొడుతుంది. ఆయన గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఎక్కడున్న సంతోషంగా ఉండాలి.. ఇందుకోసం అవసరమైతే నా ప్రాణాలైనా పణంగా పెడతానని చెబుతుంది.

తన ప్రేమను తిరస్కరించిన మనిషి.. తనపై అంతటి ఇష్టాన్ని చూపెడుతుండటంతో రాజ్ పొంగిపోతాడు. యామిని ఇంటికి వెళ్దామని అడగ్గా రాజ్ తర్వాత వస్తానని, నువ్వు వెళ్లిపోమని చెబుతాడు. యామిని కారు ఎక్కబోతుండగా కావ్య ఆమెను అడ్డుకుని ఆయన జోలికి వస్తే క్షమించనని వార్నింగ్ ఇస్తుంది. ఇంటికొచ్చిన రాజ్‌ మనసు విరిచేయాలని యామిని అనుకుంటుంది. తన ప్లాన్‌లో భాగంగా నీ మీద కావ్యకి ప్రేమ లేదని చెబుతుంది యామిని. దాంతో రాజ్ కోప్పడతాడు. నా మీద కళావతి గారికి సముద్రమంత ప్రేమ ఉందని.. నా ప్రేమను రిజెక్ట్ చేయడానికి ఏదో బలమైన కారణం ఉందని అంటాడు. ఉదయాన్నే బయల్దేరిన కావ్యని అపర్ణ ఎక్కడికి అని అడుగుతుంది. తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్తున్నానని చెబుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 11వ తేదీ ఎపిసోడ్ 797లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 11th 2025 Episode 797 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఈ గొడవల్లో పడి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మరిచిపోయామని అంటుంది అపర్ణ. రేపు రాజ్‌కి గతం గుర్తొచ్చాక వీడే నీ వారసుడని వాడికి అప్పగించాలి కదా? ఆసుపత్రికి వెళ్లి నీ బిడ్డ గురించి అన్ని వివరాలు కనుక్కుని రమ్మని చెబుతుంది అపర్ణ. అన్నీ సక్రమంగా ఉండుంటే పండుగ చేసుకోవాల్సిన సమయమని, కానీ ఏం చేస్తాం ఆ దేవుడు నీ తలరాతని ఎందుకు ఇలా రాశాడో అర్ధం కావడం లేదని బాధపడుతుంది. కాలంతో పాటే అన్ని సమస్యలు తొలగిపోతాయి, మళ్లీ మనకి మంచి రోజులు వస్తాయని చెబుతుంది కావ్య.

కావ్య ఆసుపత్రికి వెళ్తుండగా ఆమె కారుని చూసిన రాజ్ ఫాలో అవుతాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతాడు. నేను కొంచెం బయటకి వచ్చానని కావ్య చెబుతుంది. ఆర్జెంట్‌గా ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చిందని, అందుకే చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నానని ఫోన్ పెట్టేస్తుంది కావ్య. కళావతి గారు నా దగ్గర ఏదో దాస్తున్నారని, అది చెప్పడం ఇష్టం లేకే... ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్లీగా ఉన్న కళావతి గారు సడెన్‌గా మారిపోయారని మనసులో అనుకుంటాడు రాజ్. ముందు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే.. నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఈజీగా తెలుసుకోవచ్చని అనుకుంటాడు.

కావ్య ఆఫీసుకు కాకుండా, ఆసుపత్రికి వెళ్తుండటంతో కళావతి గారికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అని రాజ్‌కి అనుమానం వస్తుంది. ఆసుపత్రిలో గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఏవో పనులు ఉండటంతో ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో వెయిట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి కావ్య వస్తుంది. ఆమెను ఫాలో అవుతూ వచ్చిన రాజ్.. కావ్య ఆంకాలజీ డాక్టర్‌ను కలవడానికి రావడంతో అనుమానం వస్తుంది. ఆంకాలజీ అంటే క్యాన్సర్ కదా? కళావతి ఎందుకు ఇక్కడికి వచ్చిందని అనుకుంటాడు.

బేబీ హెల్దీగానే ఉందని, రేపు మరికొన్ని టెస్టులు చేయాలని కావ్యతో అంటుంది డాక్టర్. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లమ్ కాకముందే జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతుంది డాక్టర్. వీరి మాటలు దొంగచాటుగా విన్న రాజ్.. కళావతి గారికి ఖచ్చితంగా క్యాన్సర్ అని అనుకుంటాడు. కన్ఫర్మ్ అయి 2 నెలలు కావొస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేశావని కావ్యపై మండిపడుతుంది డాక్టర్. దీంతో రాజ్ ఓ శాలువా వేసుకుని బాధపడిపోతాడు. ఆసుపత్రిలో రాజ్‌ను చూసిన కావ్య టెన్షన్ పడుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుని పారిపోతుండగా రాజ్ ఆగమంటాడు.

నాకు కనిపించకుండా నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా? ఇంకా ఎన్ని రోజులు నాకు విషయం తెలియకుండా దాచిపెడతారని రాజ్ అడగటంతో కావ్య షాక్ అవుతుంది. నాకు నిజం చెప్పకుండా ఎందుకు దాచారు? నాకు నిజం చెబితే మిమ్మల్ని అపార్ధం చేసుకుంటారని భయపడ్డారా? అని నిలదీస్తాడు రాజ్. మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఉండే ఉంటుందని ఆరోజే డౌట్ వచ్చిందని అంటాడు. కానీ అది ఇంత బలమైన కారణమని ఇప్పుడే తెలిసిందని చెబుతాడు. మీరు ఆ గదిలో నుంచి వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్ధమైంది.. మీకు క్యాన్సర్ అని అనడంతో కావ్య అవాక్కవుతుంది.

కావ్య ఆంకాలజీ బోర్డ్ వంక చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ గదిలో నుంచి రావడంతో నాకు క్యాన్సర్ వచ్చిందని బాధపడుతున్నాడా? అని అనుకుంటుంది. మిమ్మల్ని నేను కాపాడుకుంటానని.. అందరిలాగా మధ్యలో వదిలేసే ప్రేమ కాదని .. చివరి వరకు తోడుగా ఉంటానని చెబుతాడు రాజ్. ఇన్ని రోజులు ఈ బాధను మీ గుండెల్లో దాచుకుని, ఈ బరువుని ఒంటరిగా అనుభవిస్తున్నారా అని అంటాడు. నాకు క్యాన్సర్ అని మీకు ఎలా తెలుసు? అని కావ్య నిలదీస్తుంది. ప్రేమించిన వాడికి మనసులో ఉన్న బాధ మొత్తం కనిపిస్తుందని చెబుతాడు. మీరు కొద్దిరోజుల్లో చనిపోతారు? నన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కడ నా జీవితం అన్యాయం అయిపోతుందోనని ఆలోచించి నా ప్రేమను తిరస్కరించారని పిచ్చిపిచ్చిగా మాట్లాడతాడు రాజ్.

నాకు క్యాన్సర్ కాదు కదా.. కనీసం బీపీ, షుగర్ కూడా లేవని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. దాంతో రాజ్ బాధపడతాడు. కావ్య కోసం అపర్ణ ఎదురుచూస్తూ ఉండగా ఇందిర వచ్చి అడుగుతుంది. కావ్య ఆసుపత్రికి వెళ్లిందని, దాని కోసమే వెయిట్ చేస్తున్నానని అంటుంది అపర్ణ. ఆసుపత్రికి వెళ్లడం ఏంటీ? ఏమైంది తనకి అని అడుగుతుంది ఇందిర. కడుపుతో ఉంది కదా బిడ్డకి టెస్టులు చేయించి, ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్లిందని చెబుతుంది అపర్ణ. ఇంతలో కావ్య రావడంతో డాక్టర్ ఏమన్నారు? బిడ్డ బాగానే ఉందా? అని అడుగుతుంది అపర్ణ. అంతా బాగానే ఉందని, ప్రాబ్లమ్ ఏం లేదని కావ్య చెబుతుండగా రాజ్ వచ్చి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారని అంటాడు.

నిజం నిప్పులాంటిది.. కళావతి గారే అనుకున్నా మీరు కూడా నన్ను చీట్ చేశారని మండిపడతాడు రాజ్. మీరు చెప్పకపోయినా నాకు నిజం తెలిసిపోయిందని, కళావతి గారు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశారో తెలిసిపోయిందని చెబుతాడు రాజ్. ఆ మాటలతో ఇందిర, అపర్ణలు షాకై నిజం చెప్పబోతుండగా.. ఆయనకి ఏం తెలియలేదు మీరేం చెప్పొద్దని వాళ్లిద్దరినీ అలర్ట్ చేస్తుంది కావ్య. అసలు నీకు తెలిసిన నిజం ఏంటని ఇందిర అడగ్గా.. కళావతి గారికి క్యాన్సర్ అని చెప్పడంతో అత్తాకోడళ్లు షాక్ అవుతారు. నేనుండగా కళావతి గారిని సుమంగళిగానే పంపిస్తానని అంటాడు రాజ్. మీకు క్యాన్సర్ ఉందని.. అది తెలిసి నేను ఎక్కడ బాధపడతానో అని కళావతి గారు అబద్ధం చెబుతున్నారని అంటాడు. మీరు క్యాన్సర్ డాక్టర్‌తో మాట్లాడటం చూశానని రాజ్ చెప్పడంతో తను నా ఫ్రెండ్ అని అంటుంది కావ్య. మీకు ఇప్పుడే నిజం చెబుతానని డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X