Brahmamudi August 12th episode: సక్సెస్ అయిన కావ్య ప్లాన్.. తనని ఇబ్బంది పెట్టొద్దంటున్న కళ్యాణ్!
అప్పు ని అనామిక కిడ్నాప్ చేస్తుంది. అది చూసిన బంటి విషయం కళ్యాణ్ కి చెప్తాడు. అప్పుడే ఆమె కుటుంబాన్ని నానా మాటలు అని అక్కడినుంచి వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు అతని బంధువులు, అప్పుని కాపాడి తీసుకొచ్చిన కళ్యాణ్ ఆమె మెడలో తాళి కడతాడు. కళ్యాణ మండపంలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పు ని తీసుకుని కళ్యాణ్ అందర్నీ వదిలి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ని ఇంటికి పిలవమని కావ్య తో చెప్తాడు రాజ్. కావ్య పిలవడానికి ఇష్టపడకపోవడంతో భోజనం మానేస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 12 వ తేదీ ఎపిసోడ్ 486 లో ఏం జరిగిందంటే..
ఆకలికి ఆగలేని రాజ్ కిచెన్ లోకి వెళ్లి పాలు కలుపుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో చేయి కాల్చుకొని పాలు వలకబోస్తాడు. అదే సమయంలో కావ్య అక్కడికి వస్తుంది. ఆకలిగా ఉంటే భోజనం చేయవచ్చు కదా వడ్డిస్తాను రండి అంటుంది. నీ చేతి వంట నేను తినను అని చెప్పాను కదా అంటాడు రాజ్. అందుకే శాంత చేత వండించాను అంటుంది కావ్య. ఆ విషయం ముందే చెప్పాలి కదా త్వరగా వడ్డించు అంటాడు రాజ్. ఆకలి విలువ తెలియాలని చెప్పలేదు, అయినా మీ సంపాదనతో వండిన వంట మీకు ఈ భోజనం మీద హక్కు ఉంది అని చెప్పి అతనికి వడ్డిస్తుంది కావ్య.

అప్పుడే మంచినీళ్ల కోసం బయటకు వచ్చిన అపర్ణ భోజనం చేస్తున్న కొడుకుని చూసి నవ్వుతుంది,ఎవరో ఆకలి లేదన్నారు అంటుంది. వంట శాంత చేసింది మమ్మీ చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. నా కొడుకు ఆకలికి ఉండలేడని తెలిసి మంచి ప్లాన్ వేసావు అని కోడలిని మెచ్చుకుంటుంది అపర్ణ. తర్వాత నిద్ర పట్టక కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్న రాజ్ భార్యని చూసి కళ్యాణ్ ని పిలవలేదని, శుభ్రంగా పడుకుందని తిట్టుకుంటాడు.
నేనేమి పడుకోలేదు అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు వాళ్ళు పిలవొచ్చు కదా, అయినా నేను పిలిచాను అంటే మా ముగ్గురు అక్కచెల్లెళ్లని కలిసి ఇంట్లో వాళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటారు. మీకు అంత బాధగా ఉంటే త్వరగా రమ్మని ఒక పేపర్ ప్రకటన ఇవ్వండి అంటుంది కావ్య. పేపర్ ప్రకటన ఎందుకు నేనే ఫోన్ చేస్తాను అంటాడు రాజ్. మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అంటుంది కావ్య.

వాడు నా తమ్ముడు, లక్ష్మణుడు లాంటివాడు నేను ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పి కళ్యాణ్ కి ఫోన్ చేస్తాడు రాజ్. ఫోన్ లిఫ్ట్ చేసి కళ్యాణ్ ని ఇంటికి రమ్మని పిలుస్తాడు. నేను రాలేను అన్నయ్య నీ పెళ్లి అయ్యి సంవత్సరం అయింది అయినా వదినని ఇంట్లో ఎలా చూస్తున్నారో నాకు తెలుసు,అప్పుని ఆ ఇంటికి తీసుకువచ్చి నేను ఇబ్బంది పెట్టలేను, కట్టుకున్నందుకు తనని చూసుకునే బాధ్యత నాది, దయచేసి నన్ను ఇంటికి రమ్మని పిలిచి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్.
ఈ మాటలు అన్నీ విన్న కావ్య విన్నారుగా మీ లక్ష్మణుడి సమాధానం ఇప్పుడు నేను దున్నపోతులా పడుకుంటాను మీరు మేకపోతులా పడుకోండి అని వెటకారంగా అంటుంది కావ్య. మరోవైపు చలిలో పడుకున్న ఫ్రెండ్స్ ని చూసే బాధపడతాడు కళ్యాణ్. మనకి ప్రైవసీ ఇవ్వటం కోసం చలిలో పడుకున్నారు ఇంకొక రోజు మనం ఇక్కడ ఉన్నా కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది అందుకే మనం రేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అప్పు తో అంటాడు. నీ ఇష్టమే అంటుంది అప్పు.

మరుసటి రోజు పొద్దున్న ఫ్రెండ్స్ మనం ఇక్కడే పడుకున్నామని తెలిస్తే అప్పు వాళ్ళు బాధపడతారు అందుకే ఫ్రెండ్ రూములో పడుకున్నామని చెబుదాము అనుకుంటారు. అప్పుడే బయటి నుంచి వచ్చినట్లుగా వచ్చి డోర్ కొడతారు. డోర్ ఓపెన్ చేసిన కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారు అంటే రాత్రి సినిమా చూసి ఫ్రెండ్ రూములో పడుకున్నాము అని అబద్ధం చెప్తారు. మీ కోసమే చూస్తున్నాము, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అంటుంది అప్పు.
తరువాయి భాగంలో అసలు కళ్యాణ్ ని ఇంటికి తీసుకురావాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే కదా అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. నేను వెళ్లి వాళ్ళిద్దర్నీ తీసుకొని వస్తాను అంటాడు రాజ్. ఇద్దరూ ఎవరు, నాకున్నది ఒక్కడే కొడుకు వాడు మాత్రమే ఇంటికి రావాలి అంటుంది ధాన్యలక్ష్మి . ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు వాళ్ళని రమ్మని పిలవటం లేదో అని కోపంగా భర్తతో అంటుంది కావ్య.


Click it and Unblock the Notifications











