Brahmamudi August 12th Episode: తల్లి కాబోతున్న అప్పూ.. మామిడికాయలతో రుద్రాణికి దొరికిన కావ్య

Photo Courtesy: JioHotstar

కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కునేందుకు కావ్య ఆసుపత్రికి వెళ్తుండగా రాజ్ ఫాలో అవుతాడు. అయితే డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉండటంతో కావ్య అక్కడికి వెళ్తుంది. అది చూసిన రాజ్.. కావ్యకి క్యాన్సర్ అనుకుంటాడు. ఆమె బయటికి రాగానే మీరు నా ప్రేమను రిజెక్ట్ చేసిన కారణం తెలిసిపోయిందని.. నా కోసమే మీ గుండెను రాయిలా మార్చుకున్నారని అంటాడు. మీకు క్యాన్సర్ అన్న నిజం తెలిసిపోయిందని బాధపడతాడు. నాకు క్యాన్సర్ లేదని కావ్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేస్తాడు.

ఇంటి దగ్గర కావ్య కోసం అపర్ణ ఎదురుచూస్తుండగా ఎవరి కోసమని ఇందిర అడుగుతుంది. కడుపులో బిడ్డను డాక్టర్ దగ్గర చూపించి వస్తామని వెళ్లిందని చెబుతుంది అపర్ణ. ఇంతలో కావ్యను ఫాలో అవుతూ రాజ్ వస్తాడు. కావ్య ఎందుకు నా ప్రేమను కాదని చెప్పిందో కారణం తెలిసిపోయిందని అంటాడు. కావ్యకి క్యాన్సర్ అని, ఆ నిజం నాకు తెలిస్తే తట్టుకోలేనని త్యాగం చేసిందని అంటాడు రాజ్. ఆ మాటలతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. దీంతో డాక్టర్‌కు ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పిస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 12వ తేదీ ఎపిసోడ్ 798లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 12th 2025 Episode 798 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యకి క్యాన్సర్ లేదని తెలియడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఇకనైనా కాస్త పనికొచ్చే పనులు చేయమని ఇందిర, అపర్ణలు రాజ్‌కు క్లాస్ తీసుకుంటారు. కళావతి గారికి క్యాన్సర్ లేదని తేలిపోయిందని కానీ నా ప్రేమను రిజెక్ట్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని, అదేంటో కనుక్కుంటానని అనుకుంటాడు రాజ్. కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉండగా అప్పూ వస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది.. కవితలు రాసుకుంటున్నా కనిపించడం లేదా అని విసుక్కుంటాడు కళ్యాణ్. నాకు పుల్లగా తినాలని అనిపిస్తోందని చెబుతుంది అప్పూ. ఇది వర్షాకాలం .. మామిడికాయలు దొరకవు, ఒకవేళ దొరికినా అన్ని పురుగులే ఉంటాయి తింటావా అని అడుగుతాడు కళ్యాణ్.

మామిడికాయలు దొరక్కపోతే ఏంటీ చింతకాయలు దొరుకుతాయి తీసుకురావొచ్చు కదా అని అంటుంది అప్పూ. దానికి తెచ్చిపెట్టడం ఎందుకు కిచెన్‌లోకి వెళితే కిలోలు కిలోలు చింతపండు ఉంటుందని చెబుతూ ఆగిపోతాడు కళ్యాణ్. ఆ తర్వాత అప్పూ ప్రెగ్నెంట్ అని అర్ధమై ఆమెను గాల్లో తిప్పుతాడు. ఈ విషయాన్ని అందరికీ చెబుతానని కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని పిలుస్తాడు. ఏదైనా పెద్ద సినిమాకు పాటలు రాసే అవకాశం దొరికిందా? అంత సంతోషపడుతున్నావ్ అని అడుగుతాడు సుభాష్. ఎలా చెప్పాలో తెలియక అప్పూని చెప్పమని కళ్యాణ్ సిగ్గుపడతాడు.

ఇద్దరూ అంత సిగ్గుపడే పనేం చేశారని రుద్రాణి అడుగుతుంది. అందరూ నీలాగా పనికిరాని పనులు చేస్తారని అనుకున్నావా అని ఇందిర ఆమెకు గడ్డిపెడుతుంది. ఇద్దరూ ఎందుకలా మెలికలు తిరుగుతున్నారని ఇందిర అడుగుతుంది. దాంతో కళ్యాణ్ ఆమెకు చెవిలో చెప్పడంతో ఇందిర షాక్ అవుతుంది. కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడని చెప్పడంతో ఫ్యామిలీ అంతా కళ్యాణ్ - అప్పూలకి కంగ్రాట్స్ చెబుతారు. ధాన్యలక్ష్మీ మాత్రం కొడుక్కి కంగ్రాట్స్ చెప్పి అప్పూని పట్టించుకోదు. నా చెల్లెలు తల్లి కాబోతోందని తలచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది కావ్య. మనకి ఇంత పేరు రావడానికి కారణమైన ఈ కుటుంబానికి మంచి వారసుల్ని ఇవ్వాలని.. అదే మనం తీర్చుకోగలిగే రుణమని చెబుతుంది కావ్య.

అయితే అప్పూ, అపర్ణ, ఇందిరలు మాత్రం కావ్యని చూసి బాధపడతారు. నా వదిన ముఖం చూస్తుంటే అంత సంతోషించాల్సిన విషయం కాదేమోనని అనిపిస్తోందని అంటుంది రుద్రాణి. ఆమె ఫేస్‌లో సంతోషం కనిపించడం లేదని అంటుంది. ఒక అత్తగా నీ మనసులో నీ కోడలి గురించి ఏమనుకుంటున్నావో? ఆ మాత్రం తెలుసుకోలేనా అని అంటుంది రుద్రాణి. ఈ ఇంట్లో మొదటగా పెళ్లి జరిగింది రాజ్‌కి.. కోడలిగా అడుగుపెట్టింది కూడా నీ కోడలే, మొదట ప్రెగ్నెంట్ కావాల్సింది కూడా కావ్యే, వారసుడిని ఇవ్వాల్సింది కూడా కావ్యేనని నానామాటలు అంటుంది.

కావ్యను నువ్వు, నీ కొడుకు మొదట దూరం పెడుతూ వచ్చారని చెబుతుంది రుద్రాణి. రాజ్‌కి యాక్సిడెంట్ అయి గతం మొత్తం మరిచిపోయాడని, అదృష్టం బాగుండి రాజ్ తిరిగి కావ్యని ప్రేమించాడని అంటుంది. మళ్లి వాళ్లిద్దరికీ పెళ్లి చేసేయాలని నువ్వు ఆశపడ్డావ్.. కానీ కావ్య మొహమాటం లేకుండా రాజ్‌ని పెళ్లి చేసుకోనని చెప్పేసిందని చెబుతుంది రుద్రాణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వాళ్లు కలుస్తారో? లేదో? కూడా తెలియదు.. ఇలాంటి సమయంలో నీకు వారసుడు వస్తాడో లేదోనన్న భయం ఉంటుంది కదా అని అంటుంది. నీ కోడలికి బదులు ధాన్యలక్ష్మీ కోడలు ప్రెగ్నెంట్ అయ్యిందంటే నీ మనసులో బాధ ఉంటుంది కదా అని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో ఇందిర మండిపడుతుంది.

అప్పూ ప్రెగ్నెంట్ అయినందుకు నాకు బాధగా లేదని కోపంగా చెబుతుంది అపర్ణ. ఆమె ఏదో చెప్పబోతుండగా కావ్య అడ్డుకుంటుంది. నా కోడలు తల్లి అయితే ఎంత సంతోషిస్తానో, అప్పూ తల్లికాబోతున్నదని అంతే సంతోషంగా ఉందని చెబుతుంది. ఏదో ఒకరోజు కావ్య ప్రెగ్నెంట్ అవుతుందని అంటుంది అపర్ణ. నీ తలరాతలోనే ఏదో ప్రాబ్లమ్ ఉందని కావ్యని నానామాటలు అంటుంది రుద్రాణి. ఆమె మాటలతో కావ్య లోపలికి వెళ్లి బాధపడుతుంది. నిన్ను తల్లిని చేసిన అప్పూకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావని అడుగుతాడు సుభాష్. తల్లి అవుతున్న విషయం చెప్పగానే సరిపోదని, దానికి తగ్గ బాధ్యతలు కూడా తీసుకోవాలని అంటుంది ధాన్యలక్ష్మీ. నువ్వేం చెబితే దానిని అప్పూ ఫాలో అవుతుందని చెబుతాడు కళ్యాణ్. పొద్దున్నే లేస్తే డ్యూటీకి వెళ్లిపోతావ్.. క్రిమినల్స్ అంటూ తిరుగుతావ్, ఎలా జాగ్రత్తగా ఉండాలని అంటుంది ధాన్యలక్ష్మీ. బిడ్డపుట్టే వరకు ఉద్యోగానికి వెళ్లొద్దని చెబుతుంది.

ధాన్యలక్ష్మీ మాటలతో బాధపడ్డ అప్పూ.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటికి వచ్చే వరకు ఉద్యోగం మానేస్తానని చెబుతుంది. ఇంట్లో ఉండగానే సరిపోదు.. నేను చెప్పినట్లు ఉండాలని అంటుంది ధాన్యం. రుద్రాణి అన్న మాటలతో ఏడుస్తున్న కావ్యని ఇందిర, అపర్ణలు ఓదారుస్తారు. నా దురదృష్టాన్ని తలచుకుని బాధపడుతున్నానని చెబుతుంది కావ్య. అప్పూ ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్ కానీ అప్పూ ఆ విషయాన్ని కవి గారితో చెప్పుకుని ఇంటిల్లిపాదితో సంబరాలు చేసుకుంటోందని.. నేను మాత్రం నాలోనే దాచుకోవాల్సి వస్తోందని బాధపడుతుంది కావ్య. బిడ్డ పుట్టేంత వరకు ఏ ఆడపిల్ల అయినా తన భర్త పక్కనే ఉండాలని ఆశపడుతుందని, కానీ నాకు ఆ అదృష్టం లేదని చెబుతుంది కావ్య.

అప్పూకి పాలు తీసుకొచ్చి ఇస్తాడు కళ్యాణ్. నాకు కూతురే పుడుతుందని దానికి చిన్నప్పుడే అన్ని విషయాలు నేర్పించి మంచి రచయితగా మార్చేస్తానని అంటాడు కళ్యాణ్. నాకు అబ్బాయే కావాలని, వాడిని ఐపీఎస్ చదివించి పెద్ద పోలీస్ ఆఫీసర్‌ను చేస్తానని చెబుతుంది అప్పూ. ఇద్దరూ అబ్బాయి, అమ్మాయి పుడతారని కొట్టుకుంటూ ఉంటారు. గార్డెన్‌లో ఒంటరిగా ఉన్న కావ్య దగ్గరికి అప్పూ వచ్చి మామిడికాయలు ఇస్తుంది. కళ్యాణ్ నీకోసం ప్రేమగా తీసుకొచ్చాడు కదా నువ్వు తినేశాయ్ అని చెబుతుంది కావ్య. కళ్యాణ్ నీకు మరిది.. కొడుకుతో సమానం. మరి కొడుకు తీసుకొచ్చిన దాని మీద తల్లికి కూడా హక్కు ఉంటుంది కదా అని అంటుంది.

ఇంతలో రుద్రాణి వచ్చి మామిడికాయలు కడుపుతో ఉన్న వాళ్లే తినాలని.. అంటే కావ్య కూడా ప్రెగ్నెంటా? అని అడుగుతుంది. ఆ మాటలతో కావ్య, అప్పూ షాక్ అవుతారు. కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి రాజ్‌ ప్రేమని రిజెక్ట్ చేసిందా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. మామిడికాయలు మా అక్కకి ఇష్టమని తీసుకొచ్చానని.. కావాలంటే మీరు కూడా తినమని రుద్రాణికి ఇస్తుంది అప్పూ. అవి పుల్లటి మామిడికాయలని నాకొద్దని రుద్రాణి చెప్పగా.. అది స్వీట్ మాంగో అని అంటుంది అప్పూ. రుద్రాణి వాటిని తిని చూడగా పుల్లగా ఉంటాయి. అప్పూ వాటిని కొరికి ఇంత తియ్యగా ఉంటే ఎందుకు తినలేదని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X