Brahmamudi August 13th episode: రాజ్ ని కన్నీటితో బ్రతిమాలుకుంటున్న ప్రకాష్.. కొడుకు మాత్రమే కావాలంటున్న
అప్పు కుటుంబాన్ని నానా మాటలు అని అక్కడినుంచి వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు అతని బంధువులు, అప్పుని కాపాడి తీసుకొచ్చిన కళ్యాణ్ ఆమె మెడలో తాళి కడతాడు. కళ్యాణ మండపంలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పు ని తీసుకుని కళ్యాణ్ అందర్నీ వదిలి వెళ్ళిపోతాడు.అప్పు ఫ్రెండ్స్ రూమ్ లో ఇద్దరూ తల దాచుకుంటారు. రాజ్ తనని ఇంటికి రమ్మని పిలిస్తే ఇంటికి రావటానికి నిరాకరిస్తాడు కళ్యాణ్.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 13 వ తేదీ ఎపిసోడ్ 487 లో ఏం జరిగిందంటే..
అప్పు, కళ్యాణ్ ఇద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళకి అబద్ధం చెప్పి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. మరోవైపు ఇంట్లో అందరికీ టీ తీసుకుని వస్తుంది కావ్య. అక్కడ ధాన్యలక్ష్మి లేకపోవడంతో ధాన్యలక్ష్మి రాలేదా అని అడుగుతుంది ఇందిరా దేవి. అయినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఎలా వస్తుంది అంటుంది రుద్రాణి. అయిన వాళ్లంటే అని అడుగుతుంది అపర్ణ. ఇంకెవరు రాజ్, కావ్య అంటుంది రుద్రాణి. మధ్యలో వాళ్ళేం చేశారు, నీకు ఎంత గడ్డి పెట్టినా నీ బుద్ధి మార్చుకోవు అని కోప్పడుతుంది అపర్ణ. ధాన్యలక్ష్మి వస్తే ఆమెకి కాఫీ ఇస్తుంది కావ్య.

విషమా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. విషం అక్కడుంది అని రుద్రాణి ని చూపిస్తుంది కావ్య. నాకు కాఫీ వద్దు అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే వచ్చిన ప్రకాష్ నాకు ఇవ్వు అని అడిగి కాఫీ తీసుకుంటాడు. తర్వాత కళ్యాణ్ ని కూడా కాఫీ తాగటానికి రమ్మంటాడు. కళ్యాణ్ లేడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు మీరు మతిమరుపుతో అంతా మర్చిపోయి హాయిగా నిద్రపోయారు కానీ రాత్రంతా నేను ఏడుస్తూ కూర్చున్నాను అంటుంది ధాన్యలక్ష్మి.
అసలు నా కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయాడని బాధ ఎవరికి లేదు వాడిని తిరిగి తీసుకువద్దామన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు ఉంటుంది. ఎందుకు లేదు పిన్ని, వాళ్ళిద్దర్నీ ఒప్పిచి నేను తీసుకు వస్తాను అంటాడు రాజ్. ఇద్దరెవరు, నాకున్నది కొడుకు మాత్రమే అంటుంది ధాన్యలక్ష్మి. వాడికి పెళ్లయింది వాడితో పాటు పెళ్ళాం ఉందన్న మాట మర్చిపోయినట్లు ఉన్నావు అంటుంది అపర్ణ.
ఇష్టం లేని కోడల్ని ఎలా తీసుకువస్తుంది అంటుంది రుద్రాణి. అలా అని అప్పుని వదిలేసి కళ్యాణ్ ఒక్కడినే తీసుకొస్తే చూస్తూ ఊరుకునేది లేదు, వస్తే ఇద్దరూ కలిసి రావాలి అంటుంది స్వప్న. వాళ్ల మాటలు పక్కన పెట్టు నా కొడుకు నాకు కావాలి వెళ్ళి తీసుకొని రా అని రాజ్ ని ఏడుస్తూ బ్రతిమాలుకుంటాడు ప్రకాష్. అప్పు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది కావాలంటే తనకి ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం కళ్యాణ్ ఒక్కడినే తీసుకొని రా అంటుంది ధాన్యలక్ష్మి.

నిన్ను వదిలేయటానికి నీకెంత కావాలి, అసలు నీకు, ఆ రుద్రాణి కి భయపడే నా కొడుకు ఈ ఇంటికి రావడం మానేశాడు అని భార్య మీద కోప్పడతాడు ప్రకాష్. రాజ్ కూడా ధాన్యలక్ష్మిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ధాన్యలక్ష్మీ మాత్రం నాకు నా కొడుకు మాత్రమే కావాలి ఆ అప్పుని ఎప్పటికి నేను కోడలుగా అంగీకరించను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు గదిలోకి వచ్చిన భార్యతో కళ్యాణ్ ని పిలవమంటే పిలవలేదని గొడవ పడతాడు రాజ్.
మీ పిన్ని అప్పు ని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోదు, ఒకవేళ నేను పిలిచినా మీ ఇంట్లో నేను సర్దుకుపోయినట్లు అప్పు సర్దుకుపోలేదు, తను తిరగబడే రకం అంటుంది కావ్య. అలా అని వాళ్ళిద్దర్నీ అలానే వదిలేయమంటావా అంటాడు రాజ్. వదిలేయకపోతే మీ పిన్ని గారిని ఇద్దరిని కలిపి ఇంటికి తీసుకురావడానికి ఒప్పించండి అంటుంది కావ్య. భార్య మీద కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఎందుకు ఈ విషయంలో ఇంత మొండిగా ఉంటున్నానో అర్థమైన రోజు మీకు నేనంటే ఏమిటో తెలుస్తుంది అనుకుంటుంది కావ్య.

తరువాయి భాగంలో నా కొడుకుని వదిలేసి నేను ఉండలేను కళ్యాణ్ తో పాటు అప్పు ని కూడా ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను, నేను వెళ్లి పిలిస్తే రారు, అందుకే నువ్వు వెళ్లి తీసుకురా అని రాజ్ ని అడుగుతుంది ధాన్యలక్ష్మి. రాజ్ ఆనందపడుతూ కావ్యని కూడా తనతో పాటు రమ్మంటాడు. కావ్య రాను అంటుంది.


Click it and Unblock the Notifications











