Brahmamudi August 13th Episode: నా జీవితం నా ఇష్టం.. కనకంను ఎదిరించిన కావ్య
Photo Courtesy: JioHotstar
కావ్యకి క్యాన్సర్ లేదని తెలుసుకున్న రాజ్.. అసలు ఆమె ఎందుకు తన ప్రేమను రిజెక్ట్ చేసిందో తెలుసుకుంటానని ఇందిర, అపర్ణలతో చెబుతాడు. కళ్యాణ్ దగ్గరికి వచ్చిన అప్పూ తనకి పుల్లగా తినాలనిపిస్తోంది అని చెప్పడంతో అతను సంతోషించి అప్పూని గాల్లో తిప్పేస్తాడు. వెంటనే ఇంట్లో వాళ్లందరికీ ఈ విషయం చెబుతాడు. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషిస్తుంది. ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఉన్న కావ్య ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ కాలేదని.. అసలు రాజ్- కావ్యలు కలుస్తారో లేదోనని రుద్రాణి నానామాటలు అంటుంది. దీంతో అంతా ఆమెకు గడ్డిపెడతారు.
రుద్రాణి అన్న మాటలతో కావ్య బాధపడుతుండటంతో అపర్ణ, ఇందిరలు ఓదారుస్తారు. నా దురదృష్టాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని అంటుంది కావ్య. ఒంటరిగా కూర్చొన్న కావ్య దగ్గరికి అప్పూ వచ్చి మామిడికాయ ముక్కలు ఇస్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి .. నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి మామిడికాయ ముక్కలు తింటున్నావ్, మరి కావ్య ఎందుకు తింటుందని అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 13వ తేదీ ఎపిసోడ్ 799లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య ప్రెగ్నెన్సీపై రుద్రాణి డౌట్ పడటంతో పుల్లని మామిడికాయల్ని తియ్యగా ఉన్నాయని చెబుతారు కావ్య, అప్పూ. ఇంతలో అటు ఇందిర రావడంతో ఆమె చేత కూడా తినిపిస్తారు. ఇందిర కూడా మామిడికాయలు చాలా తియ్యగా ఉన్నాయని అనడంతో రుద్రాణికి డౌట్ వచ్చి మరో ముక్క తిని చూసి పులుపు దెబ్బకి పారిపోతుంది. కనకానికి స్వప్న ఫోన్ చేసి అప్పూ ప్రెగ్నెంట్ అయ్యిందని చెబుతుంది. నీకు కొద్దిరోజుల్లో మనవడినో, మనవరాలినో ఇస్తుందని అంటుంది స్వప్న. మీ ఇద్దరి గురించి నాకు ఏ బెంగ లేదని.. నా బాధంతా కావ్య గురించేనని చెబుతుంది కనకం. అది కావాలనే తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుందని అంటుంది స్వప్న. ఇన్ని రోజులు రాజ్ ప్రపోజ్ చేయాలి.. ప్రపోజ్ చేయాలని కూర్చొని .. తీరా రాజ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అడిగితే కావ్య ప్లేట్ తిప్పేసి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పిందని అంటుంది స్వప్న.
ఆ మాటలు విన్న కనకం టెన్షన్ షాక్ అవుతుంది. అప్పూని ధాన్యలక్ష్మీ పిలిచి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది. అలాగే ఏడు వారాల నగల్ని అప్పూకి ఇచ్చి ఇక నుంచి ఇవి నీవేనని చెప్పడంతో అప్పూ సహా అంతా సంతోషిస్తారు. అమ్మగా ప్రమోషన్‌తో పాటు మా వదిన నగల్ని కూడా కొట్టేశావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. తనేమి కొట్టేయలేదని.. నేనే నా కోడలికి ప్రేమగా ఇస్తున్నానని చెబుతుంది ధాన్యలక్ష్మీ. అసలు అప్పూని మనిషిగానే చూసేదానివి కాదు.. ఇప్పుడేంటీ కోడలంటూ ప్రేమగా పిలుస్తున్నావని అడుగుతుంది రుద్రాణి. పైగా నీ ఏడువారాల నగల్ని ఇచ్చేస్తున్నావ్.. సడెన్‌గా నీలో ఇంత ఛేంజ్ ఏంటీ అని ప్రశ్నిస్తుంది.
అందరూ నీలా ఉండరు కదా అని ఇందిర సెటైర్లు వేస్తుంది. మా ధాన్యానికి తన కోడలి మీద ప్రేమ పుట్టింది అందుకే నగలు ఇస్తోంది, తప్పేముంది అంటుంది అపర్ణ. మొత్తానికి ధాన్యలక్ష్మీ అప్పూని కోడలిగా యాక్సెప్ట్ చేసిందని అంటాడు సుభాష్. ఇప్పుడు తన కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు కదా అని ఎంట్రీ ఇస్తుంది కనకం. నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావ్.. నీకు కొంచమైనా బుద్ధి ఉందా? అని కావ్యపై మండిపడుతుంది కనకం. అల్లుడుగారు ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అన్నావట ఎందుకు అని నిలదీస్తుంది. అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అని కావ్య అడగ్గా.. నాకు ఇక్కడే, ఇప్పుడే తెలియాలని కనకం పట్టుబడుతుంది.
ఇంతలో రాజ్ వచ్చి అలా అడగాలంటూ మండిపడతాడు. మీతో పెళ్లికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపొవడం అనేది నా పర్సనల్ విషయమని.. మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేస్తుంది కావ్య. అప్పూని చూడటానికి వచ్చావా? ఇలా అందరి ముందు నన్ను దోషిని చేస్తూ తిట్టడానికి వచ్చావా అని కావ్య ప్రశ్నిస్తుంది. అల్లుడుగారితో పెళ్లి ఎందుకు వద్దు అన్నావో నాకు తెలియాల్సిందేనని అంటుంది కనకం. నాకు చేసుకోవాలని అనిపించలేదు... చేసుకోను అన్నాను అది తప్పా నా జీవితం నా ఇష్టం అని చెబుతుంది కావ్య. ఆ మాటలతో కనకం బాధపడుతుంది. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని అంటుంది కావ్య.
కావ్య మాటలతో బాధపడుతున్న కనకాన్ని ఇందిర, అపర్ణలు బయటికి తీసుకెళ్తారు. నా ఇద్దరు కూతుళ్ల లాగే కావ్య జీవితం కూడా బాగుండాలని ఆశపడ్డానని చెబుతుంది కనకం. నేనేమైనా పరాయివాడిని పెళ్లి చేసుకోమన్నానా? తన భర్తనే కదా పెళ్లి చేసుకోమని చెప్పిందని అంటుంది కనకం. నా కావ్య ఇష్టం లేకుండా నా మనవడిని వద్దు అనడం లేదు.. తను కడుపుతో ఉండటం వల్లే వద్దు అని చెబుతుంది ఇందిర. ఆ మాటలతో కనకం సంతోషిస్తుంది. మరి పెళ్లి వద్దు అనడానికి కారణం ఏంటీ అని అడుగుతుంది కనకం. తన కడుపులో ఉన్న బిడ్డే కారణమని.. ఆ బిడ్డకు తండ్రి వాడేనని చెప్పలేక కావ్య బాధపడుతుంది. నా కూతురి మనసు గురించి తెలుసుకోకుండా దానిని బాధపెట్టానని కనకం అంటుంది.
గదిలో ఒంటరిగా బాధపడుతున్న కావ్యని కనకం హత్తుకుని ఓదారుస్తుంది. 9 నెలలు నిన్ను కడుపులో మోసిన నిన్ను నీ మనసుని అర్ధం చేసుకోలేకపోయానని అంటుంది కనకం. మనసులో ఇంత బాధను పెట్టుకుని కడుపులో బిడ్డను ఎలా మోయగలుగుతున్నావని అడుగుతుంది. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో విందామని రుద్రాణి దొంగచాటుగా నిలబడుతుంది. దానిని చూసిన స్వప్న అత్తగారిని తిడుతుంది. కావ్య దగ్గరి నుంచి వస్తున్న కనకాన్ని రాజ్ ఆపి కళావతి గారితో పెళ్లి గురించి మాట్లాడారా? నాతో పెళ్లి ఎందుకు వద్దు అని చెప్పిందా అని అడుగుతాడు. అంతా మీ చేతుల్లోనే ఉందని రాజ్ చేతులు పట్టుకుని అంటుంది కనకం. రాజ్‌కి ఏం అర్ధం కాకపోవడంతో ఇందిర వచ్చి .. ఏం జరిగినా నా కూతురి చేయి వదలొద్దు అని కనకం చెప్పిందని అంటుంది.
అప్పూ బట్టలు మడత పెడుతుండగా కళ్యాణ్ చూసి ఆమెపై కోప్పడతాడు. ఇలాంటి పనులేమీ చేయొద్దని చెప్పాను కదా? నీకు ఏమైనా పనులుంటే నాకు చెప్పు నేనే చేస్తానని అంటాడు కళ్యాణ్. నా కూతురు ఈ భూమ్మీదకు వచ్చేంత వరకు నువ్వు కాలు తీసి కింద పెట్టొద్దని అంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని అంటుంది అప్పూ. ఇదంతా చూసిన కావ్య బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











