Brahmamudi August 14th Episode: కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్రాణి.. యామిని మాస్టర్ ప్లాన్
Photo Courtesy: JioHotstar
అప్పూతో పాటు కావ్య కూడా మామిడికాయలు తినడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. అయితే అప్పూ డ్రామా ఆడి రుద్రాణి ప్లాన్ తిప్పికొడుతుంది. అప్పూ ప్రెగ్నెంట్ అని కనకానికి ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అప్పూని పిలిచి 7 వారాల నగలు ఇచ్చేస్తుంది ధాన్యలక్ష్మీ. అది చూసి రుద్రాణి షాక్ అవుతుంది. నువ్వు పూర్తిగా మారిపోయావంటూ ధాన్యలక్ష్మీని నానామాటలు అంటుంది.
ఇంతలో కనకం వచ్చి అప్పూని అభినందిస్తుంది. ఆ వెంటనే నువ్వు అల్లుడుగారిని ఎందుకు పెళ్లి చేసుకోను అన్నావని కావ్యని నిలదీస్తుంది కనకం. నా జీవితం నా ఇష్టమని కావ్య తేల్చిచెబుతుంది. దాంతో రాజ్, కనకం బాధపడతారు. కావ్య మాటలకు బాధపడుతున్న కనకాన్ని ఇందిర, అపర్ణలు బయటికి తీసుకెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అని అందుకే రాజ్‌తో పెళ్లికి నో చెప్పిందని జరిగనది చెబుతారు. ఆ వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి ఆమెను హత్తుకుని ఏడుస్తుంది కనకం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 14వ తేదీ ఎపిసోడ్ 800లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నాకు కూతురు పుట్టేంత వరకు ఏ పనిచేయడానికి వీల్లేదని.. కావాలనుకుంటే లైట్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేసుకోమని అప్పూకి చెబుతాడు కళ్యాణ్. నా కడుపులో ఉన్న నీ కూతురికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని కళ్యాణ్‌తో చెబుతుంది అప్పూ. నీ కూతురితో మీ నాన్న నిన్ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో చూశావా? అని చెబుతానని అంటుంది. వీరిద్దరి బంధాన్ని చూసి కావ్య మురిసిపోతుంది. గతంలో తాను వాంతులు చేసుకున్నప్పుడు రాజ్ చేసిన హడావుడిని గుర్తుచేసుకుంటుంది. అప్పుడు కావ్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఆమె తల్లి కాబోతోందని సుభాష్, అపర్ణలతో అంటాడు రాజ్. ఈ దుగ్గిరాల కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతున్నావని.. మనమెంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలో చెబుతాడు రాజ్.
సుభాష్‌ను మార్కెట్ నుంచి పెద్ద ఊయల తీసుకురమ్మని చెబుతాడు. నువ్వు నా బిడ్డకి వన్ ఇయర్‌కి సరిపోయేలా డ్రెస్‌లు తీసుకురమ్మని చెబుతాడు. రాజ్ కంగారుతో టెన్షన్ పడ్డ కావ్య.. ఇవి ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన వాంతులు కాదని, మీరు చేసిన వంట వల్ల వచ్చిన వాంతులని చెబుతుంది. ఈ విషయం గుర్తుచేసుకుని బాధపడుతున్న కావ్యని అపర్ణ, ఇందిరలు ఓదార్చేందుకు ప్రయత్నించగా కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. నా మనవడు ఈ టైంలో తనతో పాటే ఉంటే బాగుండని ఆశపడుతోందని అపర్ణతో అంటుంది ఇందిర. తల్లి కాబోయే ఏ ఆడపిల్ల అయినా భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుందని చెబుతుంది అపర్ణ. వాడు పక్కన లేని లోటును ఎలాగూ తీర్చలేమని, కనీసం దానిని సంతోష పెట్టే ప్రయత్నమైనా చేద్దామని అంటుంది.
కావ్య వంట గదిలో కాఫీ పెడుతుండగా అపర్ణ, ఇందిరలు మండిపడతారు. ఇన్ని రోజులు వేరు, ఇప్పటి నుంచి వేరు.. త్వరలోనే దుగ్గిరాల కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతున్నావ్ ఇలాంటి పనులు చేయడం ఏంటని అంటుంది ఇందిర. కడుపుతో ఉన్నంత మాత్రాన కాఫీ పెడితే ఏమవుతుందని కావ్య ప్రశ్నిస్తుంది. పనిచేసే నీకేం కాదేమో కానీ మాకు అవుతుంది.. డెలివరీ అయ్యే వరకు కాఫీ కాదు కదా కనీసం మంచినీళ్లు ఇవ్వడానికి వీళ్లేదని చెబుతుంది అపర్ణ. వెంటనే పనిమనిషిని పిలిచి రేపటి నుంచి కావ్య కిచెన్‌లో కనిపించకూడదని ఆర్డర్స్ వేస్తుంది. రత్తాలు బతిమలాడటంతో కావ్య కిచెన్‌లో నుంచి వెళ్లిపోతుంది.
కావ్యకు బదులుగా ఇంట్లో వాళ్లందరికీ రత్తాలు కాఫీ ఇవ్వడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఈ రోజే కాదు.. ప్రతిరోజూ తనే కాఫీ ఇస్తుందని అపర్ణ తేల్చిచెబుతుంది. మరి వంట ఎవరు చేస్తారని సుభాష్ అడగటంతో నేనే చేస్తానని అపర్ణ చెప్పడంతో సుభాష్, ప్రకాశంలు షాక్ అవుతారు. ఇంతలో రుద్రాణి వచ్చి కావ్యకి ఏమైంది? సడెన్‌గా పనులన్నీ మానేసిందని అడుగుతుంది. ఇప్పుడు తను పనులు చేయకూడదు కాబట్టి అని అపర్ణ అనడంతో అంతా ఉలిక్కిపడతారు. తనేమైనా ప్రెగ్నెంటా? తనకి ఎందుకు రెస్ట్ ఇస్తున్నారు అని రుద్రాణి అడుగుతుంది. నా కోడలు ఇన్ని రోజులు కష్టపడటం చూసి నాకే జాలి వేసిందని, ఇంట్లో ఇంతమంది పనివాళ్లు ఉండగా తను పనిచేయాల్సిన అవసరం లేదని అనిపించిందని అంటుంది అపర్ణ.
కిచెన్‌లో చేసే పనులకు కూడా రిటైర్‌మెంట్ ఉంటుందా? అని ప్రకాశం అడగ్గా.. వంటింటి కుందేలులాగా పడి ఉండాలా? అని అడుగుతుంది ఇందిర. వాళ్లకి కూడా రెస్ట్ తీసుకురావాలని ఉండదా? హాయిగా ఉండాలని అనుకోరా? అని ప్రశ్నిస్తుంది ఇందిర. కూర్చొని తినేవాళ్లకి ఆడవాళ్ల సంగతి ఏం తెలుస్తుందని అపర్ణ క్లాస్ పీకుతుంది. మరోవైపు.. ఆరిపోయిన బట్టలు తీసుకుని వస్తున్న రాహుల్‌ని చూసి మండిపడుతుంది రుద్రాణి. ఆ స్వప్న నన్ను ఆడుకుంటోందని, నీకేం కావాలని తల్లితో అంటాడు రాహుల్. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని.. అపర్ణ వదిన, అమ్మా కలిసి ఆ కావ్య మీద తెగ ప్రేమ చూపిస్తున్నారని అంటుంది. అసలు కావ్య ఏ పనిచేయదని అపర్ణ చెప్పేసిందని, దీని వెనుక ఏదో ఉందని రుద్రాణికి అనుమానం వస్తుంది.
గత కొద్దిరోజులుగా కావ్య ఏదో టాబ్లెట్ వేసుకుంటూ కనిపిస్తోందని.. దాని గురించి ఇంత కేర్ తీసుకుంటే అనుమానంగా ఉందని చెబుతుంది రుద్రాణి. ఆ కావ్య వాడుతున్న టాబ్లెట్ ఏంటో తెలుసుకుంటే అసలు రహస్యం బయటపడుతుందని అంటుంది. అపర్ణ, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉండగా.. ధాన్యలక్ష్మీ వచ్చి అప్పూ చేత వరలక్ష్మీ వ్రతం చేయించాలని అనుకుంటున్నానని చెబుతుంది. అప్పూ ఒక్కదానినే ఎందుకు కావ్య, స్వప్నల చేత కూడా చేయిద్దామని అపర్ణ అనగా.. ధాన్యలక్ష్మీ సైలెంట్ అవుతుంది. వ్రతంలో తోడుగా కూర్చొని ఆశీర్వదించడానికి భర్త కావాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మీ. కావ్యతో పూజని ఎలా చేయిస్తావని అపర్ణని అడుగుతుంది ఇందిర.
కావ్య వాడుతున్న టాబ్లెట్ ఏంటో తెలుసుకోవడానికి రాహుల్, రుద్రాణిలు మాటు వేస్తారు. కావ్య బయటికి వెళ్లగానే ఆమె వేసుకున్న టాబ్లెట్ కవర్‌ని ఫోన్‌లో ఫోటో తీసుకుని వస్తాడు రాహుల్. ఆ టాబ్లెట్ ఎందుకు వాడతారు? అనేది గూగుల్‌లో వెతికి కనుక్కుని షాక్ అవుతుంది రుద్రాణి. కావ్య ప్రెగ్నెంట్ అని అందుకే కావ్య మీద ఓవర్ కేరింగ్ చూపిస్తున్నారని కొడుకుతో అంటుంది. నా ఫ్రెండ్‌తో మాట్లాడిస్తేనే భోజనం తింటానని రేవతితో స్వరాజ్ గొడవ పడతాడు. మీ అమ్మతో బాబుతో ఫోన్‌లో మాట్లాడించమని రేవతితో జగదీష్ చెబుతాడు. మీతో ఫోన్‌లో మాట్లాడితేనే భోజనం చేస్తానని చెప్పడంతో అపర్ణ సంతోషిస్తుంది. స్వరాజ్‌తో మాట్లాడుతూ మురిసిపోతుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











