Brahmamudi August 15th episode: రాజ్ కోరికను తిరస్కరించిన కల్యాణ్.. కంగారులో ధాన్యలక్ష్మీ

అప్పు ని తీసుకుని కళ్యాణ్ అందర్నీ వదిలి వెళ్ళిపోతాడు. అప్పు ఫ్రెండ్స్ రూమ్ లో ఇద్దరూ తల దాచుకుంటారు. అప్పు ని వదిలేసి కళ్యాణ్ ని మాత్రమే ఇంటికి తీసుకురమ్మని గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మి. అప్పు వాళ్ళకి తన ప్రమేయం ఉందని తెలియకుండా షెల్టర్ ఏర్పాటు చేస్తుంది కావ్య. రుద్రాణి ఇచ్చిన సలహాతో కళ్యాణ్ ని, అప్పు నీ ఇద్దరినీ ఇంటికి తీసుకురమ్మని రాజ్ తో చెప్తుంది ధాన్య లక్ష్మి ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 15 వ తేదీ ఎపిసోడ్ 489 లో ఏం జరిగిందంటే..

కళ్యాణ్ వాళ్ళని తీసుకురావడానికి కావ్య ని తన తో పాటు రమ్మంటాడు రాజ్. రానని కచ్చితంగా చెప్తుంది కావ్య. ఎందుకు వెళ్లవు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. మీవల్లే, రేపు ఇంట్లో ఏం జరిగినా కావ్య నే మధ్యలోకి లాగుతారు అదంతా అవసరమా, మీ నిర్ణయాలు మీరే అమలుపరచుకోండి అంటుంది స్వప్న. ఇన్నాళ్లు కవి గారు అని వెనకేసుకొచ్చేది కదా ఇప్పుడు నాతో పాటు రావడానికి ఏమిటి అంటాడు రాజ్. తనని ఎందుకు బలవంతం చేస్తావు, తనకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది.

Brahmamudi serial August 15th 2024

నువ్వు వెళ్లి కళ్యాణ్ వాళ్ళని తీసుకుని రా అని కొడుకుతో చెప్తుంది అపర్ణ. నేనే వెళ్లి తీసుకు వస్తాను అంటూ ఒంటరిగా బయలుదేరుతాడు రాజ్. మరోవైపు అప్పు వాళ్ళని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు బంటి. చిందర వందరగా గా ఉన్న రూమ్ ని చూసిన అప్పు రూమ్ ని చాలా నీట్ గా పెట్టుకున్నావు అని వెటకారంగా మాట్లాడుతుంది. బ్యాచిలర్ రూమ్ కదా అక్క అంటాడు బంటి. మగవాళ్ళు తప్పించుకోవటానికి ఈ ఒక్క మాట భలే చెప్తారు అంటూ షాపుకి వెళ్ళు లేదంటే నాన్నగారు ఇబ్బంది పడతారు అంటుంది అప్పు.

మీకు ప్రైవసీ కావాలి అని చెప్పొచ్చు కదా అని నవ్వుతూ అంటాడు బంటి. షాప్ కి వెళ్తూ నా బట్టలన్నీ సర్దేయ్ అక్క అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పు రూమ్ క్లీన్ చేస్తాను అంటే నేను కూడా సాయం చేస్తాను అని కళ్యాణ్ కూడా కలిసి ఇద్దరూ రూమ్ క్లీన్ చేస్తారు. మరోవైపు పరధ్యాన్నంగా ఉన్న అపర్ణ పాలు పొంగిపోవడం గమనించదు, పాలు పొంగిపోవడం గమనించిన ఇందిరా దేవి అక్కడికి వచ్చి స్టవ్ కట్టేసి ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని కోడల్ని అడుగుతుంది.

Brahmamudi serial August 15th 2024 Episode of 489 Here is full story

కావ్య ప్రవర్తన ఏమీ అర్థం కావడం లేదు, తనకి కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అలాంటిది తనని తీసుకురావడానికి ఎందుకు ఇష్టపడటం లేదు అర్థం కావటం లేదు అంటుంది అపర్ణ. అర్థం కాకుండానే తనకి సపోర్ట్ చేశావా అంటుంది ఇందిరా దేవి. తను ఏం చేసినా దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అందుకే సపోర్ట్ చేశాను అంటుంది అపర్ణ. నువ్వు నీ కోడల్ని సపోర్ట్ చేసి మంచి పనే చేశావు, బలమైన కారణం లేకుండా కావ్య ఏ పని చేయదు అంటుంది ఇందిరా దేవి. మరోవైపు ఇల్లంతా ఖాళీగా ఉందని అంటుంది అప్పు.

మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి కొనుక్కుందాం అంటాడు కళ్యాణ్. కవితలు చదివితే డబ్బులు రావు అందుకే నేను మళ్ళీ పిజ్జా డెలివరీ కి వెళ్దాం అనుకుంటున్నాను అంటుంది అప్పు. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, నిన్ను పోషించే బాధ్యత నాది అంటాడు కళ్యాణ్. ఎలా అంటుంది అప్పు. రాత్రి షెల్టర్ దొరికింది, ఇప్పుడు ఈ రూమ్ దొరికింది అలాగే మనకు కావాల్సిన వస్తువులు కూడా అవే వస్తాయి అంటాడు కళ్యాణ్. వచ్చేసాం అంటూ అప్పు ఫ్రెండ్స్ చాలా సామాన్లు గిఫ్ట్లుగా తీసుకొని వస్తారు.

Brahmamudi serial August 15th 2024 Episode of 489 Here is full story

ఇదేనా మీ ఫ్రెండ్ గెస్ట్ హౌస్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే కదా వచ్చేసారు అంటారు ఆ ఫ్రెండ్స్. అవును మీరు చలి లో పడుకోవటం మాకు ఇబ్బంది అనిపించింది అంటుంది అప్పు. పోనీలెండి ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు మీకు కూడా ప్రైవసీ కావాలి కదా అంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటి అంటుంది అప్పు, మీ పెళ్లికి గిఫ్ట్లు అంటారు ఫ్రెండ్స్. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి రాజ్ వస్తాడు. రాజ్ రావడం చూసి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు.

తర్వాత రాజ్ మాట్లాడుతూ పిన్ని మీ ఇద్దరినీ ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంది పదండి ఇంటికి వెళదాం అంటాడు. అమ్మ నా మీద ప్రేమతో ముందు నన్ను మాత్రమే తీసుకురమ్మని ఉంటుంది, మీ అందరూ మందలించడంతో మా ఇద్దరిని తీసుకురమ్మని చెప్పి ఉంటుంది అంటాడు కళ్యాణ్.ఆ ఇంట్లో మీ అమ్మ మాత్రమే ఉండదు మేమందరం ఉంటాం కదా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే మేము చూస్తూ ఊరుకుంటామా అంటూ కళ్యాణ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు రాజ్. కానీ కళ్యాణ్ ఇంటికి రావడానికి ఒప్పుకోడు.

Brahmamudi serial August 15th 2024 Episode of 489 Here is full story

నీది కూడా ఇదే అభిప్రాయమా అని అప్పు ని అడుగుతాడు రాజ్. భార్య భర్తలకి రెండు అభిప్రాయాలు ఉండవు కదా బావ అంటుంది అప్పు. ఆ కళావతి మిమ్మల్ని బాగా చెడగొట్టింది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు రాజ్ కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఒంటరిగా వచ్చిన రాజ్ ని కళ్యాణ్ ఏడి అని అడుగుతారు ప్రకాష్ దంపతులు. తను రాలేదు, నువ్వు ఇద్దర్నీ రమ్మని పిలిచావు అంటే కళ్యాణ్ నమ్మడం లేదు అంటాడు రాజ్.

తరువాయి భాగంలో ఆఫీసుకు వెళ్తున్న రాజ్ ని చూసి కల్యాణ్ అక్కడ కష్టాలు పడుతుంటే ఇక్కడ రాజ్ మాత్రం రాజభోగాలు వెలగబెడుతున్నాడు అంటుంది ధాన్యలక్ష్మి. వాడు బయట ఉంటే న్యాయం ఎలా చేస్తాం అంటాడు ప్రకాష్. ఈ ఆస్తిని ముక్కలు చేయండి అంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ ఈ ఇంటికి తిరిగి వచ్చేవరకు రాజ్ కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకుంటాడు అని ఆర్డర్ వేస్తాడు సీతారామయ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X