Brahmamudi August 15th Episode: రుద్రాణికి దొరికిపోయిన కావ్య.. యామిని చేతికి కొత్త అస్త్రం
Photo Courtesy: JioHotstar
అప్పూ ప్రెగ్నెంట్ కావడంతో కళ్యాణ్ పక్కనే ఉండి ఆమెకు అన్ని పనుల్లో సాయం చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు. వారిని చూసిన కావ్య.. రాజ్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది. ఆమెను చూసిన ఇందిర, అపర్ణలు ఓదారుస్తారు. కావ్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమెను ఏ పని చేయొద్దని ఆర్డర్స్ వేస్తుంది అపర్ణ. కావ్యకు బదులుగా పనిమనిషి రత్తాలు కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్య ఇకపై ఏ పని చేయదని అపర్ణ చెప్పడంతో రుద్రాణి ఎందుకని అడుగుతుంది.
కావ్యపై అపర్ణ, ఇందిరలు బాగా ప్రేమ చూపిస్తూ ఉండటంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. కావ్య వేసుకునే టాబ్లెట్ ఏంటో తెలుసుకుంటే అసలు రహస్యం బయట పడుతుందని రుద్రాణి అనుకుంటుంది. కావ్య టాబ్లెట్ వేసుకోగానే ఆ ప్యాకెట్‌ను రాహుల్ దొంగతనంగా ఫోటో తీసి తల్లికి ఇస్తాడు. దాని గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన రుద్రాణి షాకై.. కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది. తన ఫ్రెండ్‌తో మాట్లాడితేనే అన్నం తింటానని స్వరాజ్ మారాం చేయడంతో రేవతి తన తల్లి అపర్ణకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 15వ తేదీ ఎపిసోడ్ 801లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
వరలక్ష్మీ వ్రతానికి స్వరాజ్‌ను తీసుకొస్తున్నట్లు నాటకం ఆడి రాజ్‌ని ఇక్కడికి రప్పించాలని అంటుంది. రాజ్‌కు స్వరాజ్ అడ్రస్ తెలియదు కదా అనగా.. నాకు తెలుసని ఇందిర చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. మీకెలా తెలుసని అపర్ణ ప్రశ్నించడంతో అప్పూ చెప్పింది కదా అని అంటుంది ఇందిర. ఇంతలో కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని యామినికి చెబుతుంది రుద్రాణి. ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న వాడికి బంపరాఫర్ దొరికినట్లు మనకి భలే ఛాన్స్ దొరికిందని అంటుంది యామిని. కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి బావే అన్న విషయం బావకి తెలియదని, ఆ కావ్య ఈ విషయాన్ని బావకి చెప్పే అవకాశమే లేదని సంబరపడిపోతుంది.
వెంటనే ఈ విషయాన్ని బావకి చెప్పి బావ దృష్టిలో దానిని బ్యాడ్ చేయాలని అనుకుంటుంది. దాంతో బావని పూర్తిగా నా వాడిని చేసుకుంటానని చెబుతుంది యామిని. తొందరపడొద్దని.. కావ్య కడుపుతో ఉన్న విషయాన్ని నువ్వు చెప్పడం కన్నా ఆ కావ్య నోటితోనే చెప్పిస్తే సాలీడ్‌గా ఉంటుందని చెబుతుంది రుద్రాణి. ఇప్పుడు ఆ కావ్యతో పాటే అప్పూ కూడా ప్రెగ్నెంట్ అయ్యిందని, మా ధాన్యలక్ష్మీ వదిన తన కోడలు ప్రెగ్నెంట్ అయ్యిందని, తనకి వారసుడిని ఇవ్వబోతుందని తెగ సంబరపడిపోతోందని ఈ టైమ్‌లో అప్పూ ప్రెగ్నెన్సీకి ఇబ్బందులు వచ్చేలా మనం క్రియేట్ చేసి ఆ తప్పుని కావ్య మీద వేస్తే చాలని చెబుతుంది రుద్రాణి.
ఆ దెబ్బతో మా ధాన్యలక్ష్మీ వదిన ఇల్లు పీకి పందిరేస్తుందని.. మా వదిన మాటలు భరించలేక తన నోటితోనే కావ్య తాను ప్రెగ్నెంట్ అన్న విషయం చెబుతుందని అంటుంది రుద్రాణి. అప్పుడు ఈ విషయాన్ని రాజ్‌కి తెలిసేలా చేశామంటే కావ్య నన్ను చీట్ చేసిందని తనని చీ కొడతాడని చెబుతుంది. ప్లాన్ సూపర్‌గా ఉందని వెంటనే అమలు చేయమని రుద్రాణితో అంటుంది యామిని. రాజ్‌కు ఇందిర ఫోన్ చేసి అపర్ణకి స్వరాజ్‌ను చూడాలని ఉందని వెంటనే తీసుకురమ్మని చెబుతుంది. స్వరాజ్‌ను తీసుకొచ్చి మీ మనవరాలిని పడేస్తానని అంటాడు రాజ్. ఈ మాటలను యామిని విని ఏంటీ సంగతని అడుగుతుంది.
కళావతి గారికి దగ్గరయ్యే అవకాశం దొరికిందని రాజ్ చెప్పడంతో శాశ్వతంగా తన దగ్గరే ఉండిపోవాలనే ప్లాన్ వేయమని అంటుంది యామిని. పాతికేళ్లు అమ్మానాన్నల దగ్గర అపురూపంగా పెరిగి పెళ్లి తర్వాత ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్లడం చాలా కష్టంగా ఉంటుందని చెబుతుంది యామిని. కళావతికి ఆ కుటుంబాన్ని వదిలేసి రాలేక నీతో ఇలా ఉంటుందేమో అని చెబుతుంది. అయితే నేనే దుగ్గిరాల వారింటికి వెళ్లిపోతానని అంటాడు రాజ్. దాని జీవితం నుంచి తప్పుకునేలా చేయబోతున్నానని మనసులో అనుకుంటుంది యామిని.
వరలక్ష్మీ వ్రతానికి వంట చేస్తున్న కావ్యని చూసి మండిపడుతుంది అపర్ణ. వ్రతానికి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావని అడుగుతుంది. వ్రతం చేసేది అప్పూ అయితే నేనెందుకు రెడీ అవ్వడం అని అడుగుతుంది కావ్య. ఈరోజు వ్రతం నువ్వు కూడా చేస్తున్నావని ఇందిర చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే ఆయన అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కదా అని అంటుంది కావ్య. మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? నా నెత్తి మీదున్న సమస్యలు చాలు.. ఇంకా వ్రతాలు, పూజలు చేయిస్తూ ఆయన చేత కొత్త తలనొప్పులు తీసుకురావొద్దని అడుగుతుంది. అమ్మవారి వ్రతం చేస్తే అంతా మంచే జరుగుతుందని, త్వరలో బావ నువ్వు ఒక్కటి అవుతారని చెబుతుంది అప్పూ.
ఇదంతా చూసిన రుద్రాణి.. వ్రతాన్ని చెడగొడతానని మనసులో అనుకుని వెంటనే ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్తుంది. అప్పూ వంట చేస్తున్న విషయాన్ని ధాన్యానికి చెప్పి రెచ్చగొడుతుంది. ఖాళీగా ఉన్నవారికి రెస్ట్ ఇచ్చి కడుపుతో ఉన్న వారికి పనులు చెప్పడం మంచిది కాదని చెబుతుంది రుద్రాణి. అప్పూలా తనకి తల్లయ్యే అదృష్టం లేదు కాబట్టి నీ కోడలి మీద ఈర్ష్య మొదలయ్యిందని చెబుతుంది. అందుకే అపర్ణ వదిన ముందు డ్రామాలాడి కిచెన్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుందని అంటుంది రుద్రాణి. అప్పూ ప్రెగ్నెంట్ అని తెలిశాకే ఎందుకు మానేసిందని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు కూడా ప్రసాదాలు చేయకుండా వ్రతానికి అందంగా ముస్తాబు కావడానికి వెళ్లిందని అంటుంది.
ఇప్పుడు నేను వెళ్లి కావ్యని నిలదీయలని అంటావా? అని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. ఇలా నన్ను మానిప్యూలేట్ చేసి కావ్యకి నాకు గొడవలు పెట్టాలని చూస్తున్నావా? నీ బుట్టలో పడటానికి నాకంత టైమ్, ఓపిక లేవని చెప్పడంతో తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని బాధపడుతుంది రుద్రాణి. కడుపు పట్టుకుని బాధపడుతుంది కావ్య. ఇంతలో కనకం వచ్చి.. వ్రతం అయ్యాక నీకు అల్లుడుగారి చేత అక్షింతలు వేయించబోతున్నామని చెబుతుంది. అందరూ కలిసి మళ్లీ ఏం ప్లాన్ చేయబోతున్నారని మండిపడుతుంది కావ్య.
వరలక్ష్మీ వ్రతానికి స్వరాజ్‌ను తీసుకొస్తాడు రాజ్. దీంతో అపర్ణ తనకెం తెలియదు అన్నట్లుగా నటిస్తుంది. అయితే పిల్లాడు మాత్రం అందరినీ ఇరికించేస్తాడు. ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.. ఏంటీ సంగతని రాజ్ అడుగుతాడు. ఈరోజు వరలక్ష్మీ వ్రతమని చెప్పడంతో కళావతి కూడా చేస్తుందా అని ప్రశ్నిస్తాడు. తన చేత కూడా చేయించాలనే కదా నిన్ను పిలిపించింది అని ధాన్యలక్ష్మీ నోరు జారుతుంది. కనకంను చూసి అప్పుడే మీ కూతురి మీద కోపం పోయిందా అని అడుగుతాడు రాజ్. మొన్న అందరి ముందు మీ మీద అరిచేసింది కదా? కోపంగా ఉన్నారని అనుకున్నా అంటాడు. ఇంతలో కావ్య అందంగా రెడీ అయి కిందకి రావడంతో ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











