Brahmamudi August 17th episode: ఆస్తిని ముక్కలు చేయాలి.. ధాన్య లక్ష్మి మరో కుట్ర

అప్పు ని వదిలేసి కళ్యాణ్ ని మాత్రమే ఇంటికి తీసుకురమ్మని గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మి. అప్పు వాళ్ళకి తన ప్రమేయం ఉందని తెలియకుండా వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేస్తుంది కావ్య. కళ్యాణ్ ఇంటికి వెళ్లిన రాజ్ పిన్ని మీ ఇద్దరినీ ఇంటికి తీసుకురమ్మంది అని తనతో పాటు రమ్మంటాడు. కానీ కళ్యాణ్ దంపతులు అందుకు ఒప్పుకోరు. మరోవైపు ధాన్యలక్ష్మి కి కళ్యాణ్ పరిస్థితి చూపించి గొడవపడమని రెచ్చగొట్టి ఇంటికి తీసుకువస్తుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 17వ తేదీ ఎపిసోడ్ 491 లో ఏం జరిగిందంటే..

రోడ్డు మీద పుస్తకాలు షాపులో తన కవితల పుస్తకం చూసి కొనుక్కోవాలనుకుంటాడు రాజ్. కానీ తన జేబులో డబ్బు లేకపోవడంతో కొనటానికి ఆలోచిస్తాడు. అప్పుడు షాపతను నువ్వు రచయితవని పుస్తకం లో ఉన్న ఫోటో చూస్తే తెలుస్తుంది, నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంది, ఒకప్పుడు నేను పబ్లిషర్ ని కానీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకుంటున్నాను అయినా కూడా ఆనందంగా ఉన్నాను. నువ్వు కుర్రాడివి నీ రచనలు చదివాను చాలా బాగుంటాయి, ప్రయత్నించు తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తావు అని కళ్యాణ్ ని ప్రోత్సహిస్తాడు.

Brahmamudi serial August 17th 2024 Episode of 491 Here is full story

మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, తప్పకుండా మీ డబ్బులు నేను తిరిగి ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు ఆఫీస్ కి వెళ్తున్న రాజ్ ని ఆగమని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది రుద్రాణి. ఎదురొచ్చి మరి అడగాలా చూస్తే అర్థం కావడం లేదా అని రుద్రాణిని కోప్పడుతుంది ఇందిరా దేవి. ఆఫీస్ కి వెళ్తున్నావా అని అడుగుతుంది రుద్రాణి. అవును, నీకేమైనా అభ్యంతరమా అంటాడు రాజ్. అభ్యంతరం నాకు కాదు ధాన్య లక్ష్మికి అంటుంది రుద్రాణి.

అప్పుడు ధాన్యలక్ష్మి మాట్లాడుతూ నువ్వు కాకపోతే ఎవరు ఆఫీస్ కి వెళ్తారు నీకు ఇప్పుడు పోటీ ఎవరూ లేరు కదా అక్కడ నా కొడుకు అష్ట కష్టాలు పడుతుంటే ఇక్కడ రాజ్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు అంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి అపర్ణ కోప్పడుతుంది నీ కొడుకుని ఎవరు ఇంట్లోంచి వెళ్లిపోమన్నారు, ఎవరు ఇంటికి తిరిగి రావద్దన్నారు మధ్యలో నా కొడుకుని అంటావేంటి, నీకు చేతనైతే నీ కొడుకుని తీసుకురా, ఆఫీస్ కి పంపించు ఎవరు వద్దన్నారు అంటుంది.

మా అత్త బయటకు తీసుకువెళ్లి బాగా బ్రెయిన్ వాష్ చేసి తీసుకు వచ్చినట్లు ఉంది అందుకే ఈవిడ ఇలా మాట్లాడుతుంది అంటుంది స్వప్న. నాకు న్యాయం కావాలి అంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ ని ఇంటికి తీసుకురా నీకు న్యాయం చేస్తాను అంటాడు సుభాష్. బయట ఉన్నాడు కదా ఎలా న్యాయం చేస్తాం అంటాడు ప్రకాష్. ఆస్తిని ముక్కలు చేయండి నా కొడుకు వాటా నా కొడుక్కి ఇచ్చేస్తాను అంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి ఇందిరా దేవి కోపంతో రగిలిపోతుంది.

ఇది తరతరాల నుంచి వస్తున్న ఆస్తి దీన్ని అనుభవించడమే కానీ అమ్ముకోవడానికో, పంచుకోడానికో ఎవరికి హక్కులు లేవు, కళ్యాణ్ ని ఇంటికి రమ్మను ఆస్తిని అనుభవించమను ఎవరు వద్దన్నారు అని కోడలిపై ఫైర్ అవుతుంది. నా కొడుకు తిరిగి వచ్చే లోపు ఈ అక్క చెల్లెల్లు ఇద్దరూ ఆస్తిని హరించేస్తే అప్పుడు వాడి గతి ఏంటి అని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. ఈ వయసులో నీకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని కోప్పడతారు అపర్ణ, ఇందిరా దేవి, ఈవిడ అనామిక కి అమ్మమ్మ లాగా తయారయింది అని కోప్పడుతుంది స్వప్న.

ప్రకాష్ అయితే కోపంతో భార్య మీద చెయ్యెత్తుతాడు కానీ సుభాష్ వారిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సీతారామయ్య ఆస్తిని ముక్కలు చేసే సమస్య లేదు, నేను బ్రతికి ఉండగా ఇంట్లో ఇలాంటి ముసలం చూడాల్సి వస్తుంది అనుకోలేదు అసలు దీని అంతటికి కారణం ఎవరు అంటాడు. ఇంకెవరు తాతయ్య, మా అత్తయ్యే, ధాన్యలక్ష్మి ఆంటీని బయటకు తీసుకువెళ్లి వచ్చింది, అప్పటినుంచి ధనలక్ష్మి ఆంటీ ఇలా మాట్లాడుతున్నారు అంటుంది స్వప్న.

కన్నతల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను అందుకే నీకు ఒక మాట ఇస్తున్నాను కళ్యాణ్ తిరిగి వచ్చేవరకు రాజ్ ఆఫీసు బాధితుల నుంచి తప్పుకుంటాడుఅని ధాన్యలక్ష్మి తో అంటాడు సీతారామయ్య. అలా చేస్తే కంపెనీ దివాలా తీస్తుంది అంటారు ఇంట్లో వాళ్ళు. అయినా పర్వాలేదు, కుటుంబం ఈ పరిస్థితికి రావటానికి కారణమైన వాళ్లు అనుభవిస్తారు, నా ఈ నిర్ణయం పట్ల ఇంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉందా ఉంటాడు సీతారామయ్య. ఇంట్లో వాళ్ళందరూ ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తే కావ్య మాత్రం నాకు అభ్యంతరం ఉంది అంటుంది.

కేవలం చిన్న అత్తయ్య ఆవేశాన్ని చల్లార్చడం కోసం మన కుటుంబం మూల స్తంభాన్ని విరిచేయ్యడం మంచిది కాదు, మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మనకి ఉన్న పేరు ప్రతిష్టలు పోతాయి అంతేకాదు ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అంటుంది కావ్య. తాతయ్య నిర్ణయాన్ని తప్పు పడుతున్నావా అని భార్య మీద కేకలు వేస్తాడు రాజ్. తాతయ్య నిర్ణయం మంచిదైతే నేనెందుకు అభ్యంతరం చెప్తాను కానీ చిన్నత్తయ్య బాధ చల్లార్చడం కోసం మిమ్మల్ని ఆధిపత్యం వదులుకోమనటం ఎంతవరకు భావ్యం అంటుంది కావ్య.

తరువాయి భాగంలో తాతయ్యకి ఇల్లు ముక్కలు చేయటం ఇష్టం లేదు కాబట్టి, కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ పిన్ని గారికి మాటిచ్చారు. కవి గారిని రమ్మనే వారు లేరు, రావాలని ఆయన కి కూడా లేదు. ఆయన ఎప్పుడు రావాలి, కంపెనీ పరిస్థితి ఎప్పుడు చక్కబడాలి అంటుంది కావ్య. మధ్యలో నీకేంటి బాధ అంటాడు రాజ్. నేను మీ భార్యని అడిగే హక్కు నాకు ఉంది అంటుంది కావ్య. నీకు కూడా ఆస్తుల మీద అంతస్తుల మీద మోజు పెరిగిపోయిందా అందుకేనా కళ్యాణ్ ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావు అంటాడు రాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X