Brahmamudi August 19th: రాజకీయాలతో బలిపెట్టకు.. అదే జరిగితే ఎవరు సహించరు.. రాజ్ వార్నింగ్
అప్పు వాళ్ళకి తన ప్రమేయం ఉందని తెలియకుండా వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేస్తుంది కావ్య. కళ్యాణ్ ఇంటికి వెళ్లిన రాజ్ పిన్ని మీ ఇద్దరినీ ఇంటికి తీసుకురమ్మంది అని తనతో పాటు రమ్మంటాడు. కానీ కళ్యాణ్ దంపతులు అందుకు ఒప్పుకోరు. మరోవైపు ధాన్యలక్ష్మి కి కళ్యాణ్ పరిస్థితి చూపించి గొడవపడమని రెచ్చగొట్టి ఇంటికి తీసుకువస్తుంది రుద్రాణి. ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి ఆస్తి ని ముక్కలు చేయమంటు గొడవ పెట్టుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 19వ తేదీ ఎపిసోడ్ 492 లో ఏం జరిగిందంటే..
చిన్న అత్తయ్య అహాన్ని చల్లార్చడం కోసం అంత పెద్ద సంస్థ ని చిక్కుల్లో పెట్టడం మంచిది కాదు అంటుంది కావ్య. తను చెప్పింది కూడా కరెక్టే కదా బావ ఇప్పుడు రాజ్ కంపెనీకి వెళ్లకపోతే కంపెనీని ఎవరు చూస్తారు అంటుంది చిట్టి. నా కొడుకులు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు, రాజ్ కంటే ముందు, నా తరువాత కంపెనీని వాళ్ళే చూసుకున్నారు కదా అంటాడుసీతారామయ్య.

ఇప్పటి యువతకి కావలసిన మోడల్స్ మేము క్రియేట్ చేయలేమేమో, ఎవరైనా యువతని అపాయింట్ చేసుకుందామా అంటాడు సుభాష్. నా కొడుకు ఉన్నాడు కదా అంటుంది రుద్రాణి. అదీ అసలు విషయం, చిన్న అత్తయ్యకి కీ ఇచ్చి పెద్ద ఇంటి తాళం తెరిచారు రుద్రాణి గారు, రాహుల్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటే కంపెనీ నాశనం అయిపోతుంది అంటుంది కావ్య. ధాన్యలక్ష్మి చెప్పింది కరెక్టే ఎక్కడ నీ మొగుడు నుంచి పవర్ పోతుందో అని నీకు భయం అంటుంది రుద్రాణి.
తర్వాత తండ్రి తో మాట్లాడుతూ వీళ్ళందరూ నా కొడుకు టాలెంట్ ని తొక్కేస్తున్నారు అతనికి అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది రుద్రాణి. అందుకు ఒప్పుకుంటాడు సీతారామయ్య. మరోవైపు కళ్యాణ్ తన కవితల పుస్తకం అచ్చువేసిన పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడు, తనని పరిచయం చేసుకొని రచయితగా తనకి అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు కవితలు ఎవరూ చదవడం లేదు, కథలు రాయండి నచ్చితే పబ్లిష్ చేస్తాము అంటాడు పబ్లిషర్.

తర్వాత గతంలో కళ్యాణ్ రాసిన కవితలకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని చెప్పి 6000 కళ్యాణ్ చేతిలో పెడతాడు. సరైన సమయంలో డబ్బు దొరికినందుకు ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్. కథలు రాయటానికి ప్రయత్నిస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భర్త దగ్గరికి వస్తుంది చిట్టి, ధాన్య లక్ష్మీ మాటలకి భయపడి పోయావా, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని భర్తని అడుగుతుంది.
బంధాలకి బందీ అయిపోయాను చిట్టి, ఆ నిమిషంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే ధాన్యలక్ష్మి ఆస్తిని ముక్కలు చేసేయమంటుంది, ఏదైనా సమస్య వస్తే విడిపోవడమే పరిష్కారం అనుకుంటున్న వీళ్ళకి మళ్ళీ కలవటం చేతకాదు నేను ఉన్నంతవరకైనా వీళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ విషయంలో నీ సహకారం నాకు ఉంటుంది కదా అంటాడు సీతారామయ్య. కుటుంబం ముక్కలైపోకుండా చూసుకునే బాధ్యత తనది అని భర్తకి మాటిస్తుంది చిట్టి. మరోవైపు గదిలోకి వచ్చిన కావ్య భర్తపై కోప్పడుతుంది.
వంటింటి రాజకీయాలకి కంపెనీని బలిపెట్టడం మంచిది కాదు, వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది మన ఇంటి సమస్య కోసం కంపెనీ వర్కర్లని బాధపెడతామా అంటుంది. అంతవరకు రాదు ఒకవేళ వస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు, అయినా అవన్నీ నీకెందుకు అని అడుగుతాడు రాజ్. మీ భార్యగా నాకు అడిగే హక్కు ఉంది అయినా సమస్యని ఎవరు తీరుస్తారు మీరా, కళ్యాణ్ గారా.. కళ్యాణ్ గారు ఎప్పుడు తిరిగి వస్తారు, కంపెనీ ఎప్పుడు బాగుపడుతుంది ఇదంతా జరిగే పనేనా అంటుంది కావ్య.

రాజకీయాలతో బలిపెట్టకు.. అదే జరిగితే ఎవరు సహించరు.. రాజ్ వార్నింగ్
నువ్వేంటి ఇంతలా మాట్లాడుతున్నావు అంటే నీకు కూడా ఆస్తులు అంతస్తుల మీద ఆశ పుడుతుందా మన వాటా పోతుందని బాధపడుతున్నావా అందుకే కళ్యాణ్ ని పిలవడానికి ఇష్టపడటం లేదా అంటాడు రాజ్. ఆ మాటలకి బాధపడుతుంది కావ్య. మీకు నిజం తెలిసిపోయిందా, మనసులో మాటలు అలా ఎలా తెలిసిపోతాయి అని వెటకారంగా అంటుంది. చూద్దాం మీ ఆస్తుల కోసం నేను ఆశ పడుతున్నానో, నా శ్రమని మీరు దోచుకుంటున్నారో రేపటి నుంచి చూపిస్తాను అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు ఇంటికి వచ్చిన భర్తకి వంట చేసి వడ్డిస్తుంది అప్పు, రుచిగా లేకపోయినా ఏమి అనొద్దు అంటుంది. పర్వాలేదు ఇదైనా దొరికింది మా ఇంట్లో చాలాసార్లు భోజనం ముందు నుంచి లేచిపోయాను, అప్పుడు ఆకలి విలువ తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది అంటాడు కళ్యాణ్. పని ఏమైనా దొరికిందా అంటుంది అప్పు. లేదు కానీ జీతం దొరికింది అంటూ జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్. కథలు రాయటం ప్రారంభించు నువ్వు తలచుకుంటే ఏదైనా చేయగలవు అంటూ భర్తని ఎంకరేజ్ చేస్తుంది అప్పు.


Click it and Unblock the Notifications











