Brahmamudi August 1st episode: కళ్యాణ్ ని పెళ్ళికి రావద్దన్న కనకం.. అత్తగారి ప్రవర్తనని తప్పుపడుతున్న రాజ్!

కావ్య తన చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందని కావ్య తో గొడవపడుతుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని అందరి ముందు చెప్తాడు రాజ్. అప్పు మనసులోకి ఏముందో తెలుసుకోవడానికి ఆమె ఇంటికి కూడా వెళతాడు రాజ్. కానీ అక్కడ అతనికి చేదు అనుభవం ఎదురవుతుంది. రాజ్ కళ్యాణ్ ని తీసుకొని అప్పు దగ్గరికి వెళ్లాడని భ్రమపడిన ధాన్యలక్ష్మి కావ్య పై విరుచుకుపడుతుంది. తన భార్య జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 1వ తేదీ ఎపిసోడ్ 477లో ఏం జరిగిందంటే..

పెళ్లి కార్డు ధాన్య లక్ష్మీ చేతిలో పెట్టి అనామిక లాగా నిందలు వేయకుండా అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అంటుంది కనకం. తర్వాత సీతారామయ్య దంపతుల దగ్గరికి వెళ్లి కుటుంబం మొత్తానికి ఒక కార్డు ఇచ్చి ఆహ్వానించవలసిన దాన్ని మూడు కార్డులు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అంటూ రుద్రాణి చేతిలో కూడా ఒక కార్డు పెట్టి మీరు అనుమానించినట్లు కాకుండా, మీరు అనుకున్న వాడితో కాకుండా నా కూతురు పెళ్లి జరుగుతుంది పెళ్లికి వచ్చి చెడగొట్టే ఆలోచన చేయకుండా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అంటుంది కనకం.

Brahmamudi serial August 1st 2024 Episode of 477 Here is full story

ఆ తర్వాత సీతారామయ్య దంపతుల దగ్గరికి వెళ్లి ఆదిదంపతులు లాంటి మీరు ఈ పేదరాలి ఇంటి పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తే నేను ఆనందిస్తాను అంటూ వాళ్ల చేతిలో పెళ్లి కార్డు పెడుతుంది. ఈ పెళ్లి అయిన సవ్యంగా జరుగుతుందా అని వెటకారంగా అడుగుతుంది రుద్రాణి. మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికే వచ్చాను అంటూ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి దయచేసి మీరు ఈ పెళ్లికి రావద్దు, నేను ఇలా ఎందుకు చెప్తున్నానో, అందుకు కారణం ఏమిటో మీకు తెలుసు అంటుంది కనకం. బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.

సీతారామయ్య దంపతులు, అపర్ణ కనకంతో మాట్లాడుతూ మీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్తారు. మరోవైపు అర్ధరాత్రి ఏడుస్తూ కూర్చుంటుంది అప్పు. ఆమె దగ్గరికి వచ్చిన అప్పు తల్లిదండ్రులు ఆమెకి ధైర్యాన్ని చెప్తారు. జీవితంలో ప్రతి ఆడపిల్లకి ఈ సందర్భం వస్తుంది, కొత్త ఇంట్లోకి, కొత్త మనుషులు మధ్యలోకి వెళ్ళినప్పుడు భయంగానే అనిపిస్తుంది కానీ రాను రాను పిల్లలు, భర్త, సంసారం అంటూ తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు రేపు నువ్వు కూడా అంతే అంటుంది కనకం.

ఆడదానికి పెళ్లి పిల్లలు ఇదేనా అమ్మ జీవితం అంటుంది అప్పు. ఈ తరం పిల్లలు ఇలాగే ఆలోచించి పెళ్లి మీద విముఖత చూపిస్తున్నారు మా రోజుల్లో కూడా ఆడవాళ్లు చదువుకున్నారు పెద్దపెద్ద పదవులు అలంకరించారు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా వాళ్లకి ఏం కావాలో బలంగా నిర్ణయించుకున్నప్పుడు అన్ని సాధించగలుగుతారు అని కూతురికి దైర్యం చెప్తాడు కృష్ణమూర్తి.

సరే పొద్దుపోయింది పడుకో మళ్ళీ రేపు పొద్దున్నే మంగళ స్నానాలు ఉన్నాయి త్వరగా లేపేసావు అంటూ గొడవ పెట్టకు, వెళ్లి పడుకో అని చెప్పి వెళ్ళిపోతారు కనకం దంపతులు. మరోవైపు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి మీ అమ్మ ఏమనుకుంటుంది పెళ్లికి పిలిస్తే వచ్చిన వాళ్ళు వస్తారు లేదంటే లేదు అంతేగాని పెళ్లికి రావద్దు అని చెప్పటం ఏమిటి అని కేకలు వేస్తాడు. దానికి కారణం మీకు కూడా తెలుసు కదా అంటుంది కావ్య.

మీ మూర్ఖత్వంతో అప్పు, కల్యాణ్ ల జీవితాలు నాశనం చేస్తున్నారు, అప్పు కళ్యాణ్ ని ప్రేమిస్తుంది అంటాడు కళ్యాణ్. అది ఒకప్పటి మాట అంటుంది కావ్య. కాదు ఇప్పటికీ ప్రేమిస్తుంది మీరందరూ ఆ ఇద్దరికి జీవితాంతం శిక్ష వేస్తున్నారు అంటూ కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోతుంది ఏమో అని ఇంకా అనుమాన పడుతూనే ఉంటుంది రుద్రాణి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావేమో అంటాడు రాహుల్.

లేదు పెళ్లి అయిన వరకు ఎవరినీ నమ్మటానికి లేదు కళ్యాణ్ అసలు ఈ ఊర్లోనే ఉండకుండా చేయాలి అంటూ ధాన్య లక్ష్మి దగ్గరికి వెళుతుంది రుద్రాణి. తన ఆత్రం తో తనే కళ్యాణ్ పెళ్లి దగ్గరుండి చేసేలాగా ఉంది అనుకుంటాడు రాహుల్. మరోవైపు రుద్రాణి ధాన్య లక్ష్మీ దగ్గరికి వెళ్లి కళ్యాణ్ ఇక్కడే ఉంటే కావ్య పెళ్లి పీటల మీద పెళ్లి ఆపైనా అప్పు తో కళ్యాణ్ పెళ్ళి చేసేస్తుంది అందుకే కళ్యాణ్ ని ఊరి నుంచి పంపించేయ్ అని సలహా ఇస్తుంది.

రుద్రాణి మాటలు నమ్మిన ధాన్య లక్ష్మి కొడుకు దగ్గరికి వెళ్లేసరికి అప్పు పెళ్లి కార్డు చూస్తూ బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. పెళ్లి కార్డు తీసుకొని చింపేస్తుంది ధాన్యలక్ష్మి. కోప్పడతాడు కళ్యాణ్. నీకోసం ఆలోచించే నీ తల్లి బాధని అర్థం చేసుకో నువ్వు ఇలా నాలుగు గోడల మధ్య ఉండి బాధపడటం చూడలేకపోతున్నాను నువ్వు కొద్ది రోజులు బెంగుళూరు వెళ్ళు పరిస్థితులు చక్కబడతాయి అంటుంది ధాన్యలక్ష్మి. నేను వెళ్ళను అంటూ తల్లి పై కోప్పడతాడు కళ్యాణ్.

తరువాయి భాగంలో కళ్యాణ్ ఫోటోలు చూస్తున్న అప్పు దగ్గరికి వచ్చిన స్వప్న నువ్వు కళ్యాణ్ ని ఇంకా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. తర్వాత కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడుతూ అప్పు నిన్ను ప్రేమిస్తుంది మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకొని పెద్ద తప్పు చేసింది అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న రాజ్ ఇంక వాళ్ళిద్దర్నీ నమ్ముకుని లాభం లేదు నేనే ఏదో ఒకటి చేసే వాళ్ళిద్దర్నీ ఒకటి చేయాలి అనుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X