Brahmamudi August 1st Episode: బుడ్డోడి దెబ్బకు రుద్రాణి పరుగులు.. బాబు గురించి నోరు జారిన ఇందిర
Photo Courtesy: JioHotstar
రేవతి కొడుకుని ఇంట్లో వాళ్లంతా ముద్దు చేస్తుంటే రుద్రాణికి అనుమానం వస్తుంది. నేను ప్లాన్ చేస్తే తిరుగులేదని బాబుని అమ్మకి దగ్గర చేశానని అంటాడు రాజ్. మీ ప్లాన్ సగమే వర్కవుట్ అయ్యిందని, ఇంకా సగం బ్యాలెన్స్ ఉందని అంటుంది కావ్య. ఇంతలో ఇందిర వచ్చి మీ నాటకం అపర్ణకి తెలిస్తే చాలా ప్రమాదమని హెచ్చరిస్తుంది. లోపలికి వస్తుండగా ఇందిరను తాతమ్మ అని పిలుస్తాడు స్వరాజ్. దాంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని ఇందిర, కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు.
మా అమ్మ పెద్దవాళ్లని తాతమ్మ అని పిలవాలని.. వాళ్లకు సాయం చేయాలని చెప్పిందని అంటాడు స్వరాజ్. దాంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కావ్యకి ప్రపోజ్ చేసేందుకు రాజ్ దుగ్గిరాల వారి ఇంటి దగ్గరే ఉండిపోయిన విషయాన్ని యామినికి చెబుతాడు. దాంతో ఆమె రగిలిపోతుంది. రాజ్- కావ్యలు విడిపోయేంత వరకు వెయిట్ చేయమని యామిని ఆమె పేరెంట్స్ సలహా ఇస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 1వ తేదీ ఎపిసోడ్ 789లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుండగా ప్రకాశం రావడంతో రాజ్ వెళ్లిపోతాడు. మీరిద్దరూ భార్యాభర్తలే కదా? ఏదో తప్పు చేసినవాడిలా అలా వెళ్లిపోతున్నాడు అని అడుగుతాడు ప్రకాశం. మరిచిపోయింది ఆయన కాదని.. మీరు అని కావ్య చెప్పడంతో ప్రకాశం కంగుతింటాడు. స్వరాజ్ పిల్లాడి గదిలోకి వచ్చి నేను ఇక్కడ పడుకోవచ్చా? లేదా? అని అడుగుతాడు. ఇంతలో సుభాష్ వచ్చి హ్యాపీగా పడుకోవచ్చని చెబుతాడు. నేను హ్యాపీగా పడుకోవాలంటే నాకు కథలు చెప్పాలని అడుగుతాడు స్వరాజ్. నాకు మా అమ్మ రోజూ కథలు చెప్పి పడుకోబెడుతుందని అంటాడు.
అపర్ణ చెప్పిన ఏడు చేపల కథ నచ్చకపోవడంతో దానిపై సెటైర్లు వేస్తాడు స్వరాజ్. కథ చెబితే థ్రిల్లింగ్‌గా ఉండాలని, ఆ కథ చెబితే చాలా భయం వేయాలని.. ఆ భయంతో నేను ఈజీగా నిద్రపోవాలని అంటాడు. దాంతో అపర్ణ ఓ హార్రర్ స్టోరీ చెబుతుంది. ఈ కథ వింటూ స్వరాజ్ నిద్రపోతాడు. పొద్దున్నే నిద్రలేచిన స్వరాజ్ మొక్కలకు నీరు పోస్తూ ఉంటాడు. బాబుని చూసిన రుద్రాణికి ఈ పిల్లాడు ఎవరు? నిజంగానే గుడిలోనే తప్పపోయి అపర్ణకి కనిపించాడా? తప్పిపోయుంటే అప్పుడే అక్కడే గుడి ధర్మకర్తలకి కానీ, పోలీస్ స్టేషన్‌లో కానీ అప్పగించాలి కదా అని డౌట్ పడుతుంది.
ఈ పిల్లాడు ఇంటి వారసుడు అయినట్లు వాడి మీద అంత ప్రేమ చూపించింది ఏంటీ? ఇంకా ఇంట్లోనే పెట్టుకోవడం ఏంటీ? ఏదో తేడాగా ఉందని అనుకుంటుంది రుద్రాణి. బాబుని మచ్చిక చేసుకుని వాడెవడో తెలుసుకోవాలని చిన్నారి దగ్గరికి వెళ్తుంది. రుద్రాణిని చూసిన పిల్లాడు.. ఏంటీ అలా గుడ్లగూబలా చూస్తున్నావ్? విషయం ఏంటో చెప్పమని అంటాడు. ఏం చేస్తున్నావ్ ఇక్కడ? అని అడగటంతో అంత పెద్ద కళ్లున్నాయి కదా కనిపించడం లేదా అని కౌంటర్ ఇస్తాడు స్వరాజ్. మొక్కలకి ఆకలి వేస్తే నీళ్లు పడతున్నానని చెబుతాడు. వాటికి కూడా ప్రాణం ఉంటుందట, వాటికి ఆకలి వేస్తే మనలాగా అడగలేవు కదా అందుకే వాటర్ పడుతున్నానని అంటాడు. ఈ పిల్లాడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడని సైలెంట్‌గా అన్ని కనుక్కోవాలని అనుకుంటుంది రుద్రాణి.
ఎవరు నువ్వు? అని రుద్రాణి అడగ్గా.. ఈ ఇల్లు నాది కాబట్టి, నువ్వు నా ఇంటికి వచ్చావు కాబట్టి అని అంటుంది రుద్రాణి. ఈ ఇంటి మీద మీ పేరు లేదు కదా.. అలాంటప్పుడు ఈ ఇల్లు మీది ఎలా అవుతుంది అని అడుగుతాడు స్వరాజ్. ఆ మాటలతో రుద్రాణి కంగు తింటుంది. ఊరికే ఏ పని చేయకూడదని మా నాన్న చెప్పాడని.. ఏం చేసినా దానికి ఫలితం ఉండాలి అంటాడు. చాక్లెట్ ఆశ చూపి బాబు దగ్గర నిజాలు రాబట్టాలని అనుకుంటుంది రుద్రాణి. తెలియని వారికి మన విషయాలు చెప్పకూడదని మా అమ్మ చెప్పిందని అంటాడు బాబు. తిక్క తిక్క సమాధానాలు చెబితే ఊరుకునేది లేదని కొట్టబోతుండగా రుద్రాణిని వాటర్‌తో తడిపేస్తాడు స్వరాజ్. దాంతో కోప్పడిన రుద్రాణి పిల్లాడిని కొట్టబోతుండగా అపర్ణ అడ్డుకుంటుంది. నాకు ఈ ఆంటీ నచ్చలేదని అన్ని పిచ్చి పిచ్చిగా అడుగుతుందని అందుకే తడిపేశానని చెబుతాడు స్వరాజ్.
రాజ్ ప్రపోజ్ చేయడానికి వస్తుండటంతో అతని కోసం అందంగా రెడీ అవుతుంది కావ్య. ఆమెను చూసిన ఇందిర ఆటపట్టిస్తుంది. వాడు రోజూ ఇక్కడికి వస్తున్నాడు కదా? ఎప్పుడూ లేనిది ఈరోజు మాత్రమే ఎందుకు ఇంత శ్రద్ధ అని అడుగుతుంది. ఈరోజు నాకు ఆయన ప్రపోజ్ చేయబోతున్నాడని చెబుతుంది కావ్య. ఆ మాటలతో ఇందిర చాలా సంతోషిస్తుంది. ఆయన ప్రపోజ్ చేయగానే నేను ఆయన ప్రేమను అంగీకరిస్తానని అంటుంది కావ్య. నీ ప్రేమ సినిమాకు ఈరోజుతో తెరపడబోతోందని సంతోషిస్తుంది అపర్ణ.
దీని దగ్గర ఫోన్ లాక్కొని ఇంటిల్లిపాది సపోర్ట్ చేయాలని ఇందిరకు చెబుతుంది అపర్ణ. వాడు ప్రపోజ్ చేసే సమయంలోనే అర్జెంట్ పనులు పడుతున్నాయని అంటుంది. ఇన్నిరోజులకు నాకు కావాల్సి దక్కబోతోందని అపర్ణ సంతోషిస్తుంది. నాకు ఆకలి బాగా వేస్తుందని టిఫిన్ పెట్టమని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. రేవతిని, అపర్ణని దేవుడు కలిపిస్తే అంతే చాలని అంటుంది ఇందిర. అతి త్వరలోనే ఈ ఇల్లు బృందావనంలా మారిపోతుందని చెబుతుంది కావ్య.
స్వరాజ్ రేవతి కొడుకని తెలుసుకున్న కళ్యాణ్.. టెన్షన్ పడతాడు. వాడు రేవతి అక్క కొడుకని నీకు తెలిస్తే వెంటనే వాడిని తీసుకెళ్లొచ్చు కదా అని అంటాడు. అపర్ణ అత్తయ్యని రేవతిని కలపడానికి కావ్య అక్క, బావగారు ప్లాన్ చేశారని చెబుతుంది అప్పూ. వాడు రేవతి అక్క కొడుకని తెలిస్తే మనల్ని ఇంట్లో నుంచి పంపించేస్తుందని అంటాడు కళ్యాణ్. నాకే తెలియకుండా నేను కూడా బాబుతో ట్రావెల్ అయ్యానని.. నాకు తెలియకుండానే మీ ప్లాన్‌లో ఇరుక్కుపోయానని చెబుతాడు. ఆ బాబుని అత్తయ్య నుంచి వాడి ఇంటికి తీసుకెళ్లాలని చెబుతుంది అప్పూ. దానికి నీ హెల్ప్ కావాలని తన ప్లాన్ చెబుతుంది.
అప్పూ ఎంత చెబుతున్నా కళ్యాణ్ వినిపించుకోకపోవడంతో నేనే ఏదో ఒక ప్లాన్ చేసి స్వరాజ్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. టిఫిన్ చేస్తుండగా కళ్యాణ్ దగ్గరికి వచ్చిన స్వరాజ్.. నా చైర్ నాకు ఇస్తావా? లేదా? అని గొడవ పడతాడు. దాంతో కళ్యాణ్ చైర్ ఖాళి చేసి ఇచ్చేస్తాడు. వాడు చాలా ఇంటెలిజెంట్ అని అపర్ణతో అంటాడు ప్రకాశం. ఈ ఇంటి బిడ్డ కాబట్టే అన్ని తెలివితేటలు ఉన్నాయని ఇందిర చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో కావ్య కవర్ చేసే ప్రయత్నం చేయడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











