Brahmamudi August 20th episode: ఆమె ఇంటి కోడలిగా పనికిరాదు.. నిరూపిస్తా.. రుద్రాణి సవాల్

కళ్యాణ్ ఇంటికి వెళ్లిన రాజ్ పిన్ని మీ ఇద్దరినీ ఇంటికి తీసుకురమ్మంది అని తనతో పాటు రమ్మంటాడు. కానీ కళ్యాణ్ దంపతులు అందుకు ఒప్పుకోరు. మరోవైపు ధాన్యలక్ష్మి కి కళ్యాణ్ పరిస్థితి చూపించి గొడవపడమని రెచ్చగొట్టి ఇంటికి తీసుకువస్తుంది రుద్రాణి. ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి ఆస్తి ని ముక్కలు చేయమంటు గొడవ పెట్టుకుంటుంది. కళ్యాణ్ తిరిగి వచ్చేవరకు రాజ్ ని కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకోమంటాడు సీతారామయ్య. ఆస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి పిలవడం లేదని కావ్యని కోప్పడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 20వ తేదీ ఎపిసోడ్ 493 లో ఏం జరిగిందంటే..

భర్తకి భోజనం వడ్డించిన అప్పు వంట బాగోకపోతే తిట్టుకోవద్దు అని చెప్పింది. భోజనం చేస్తున్న కళ్యాణ్ ని వంట ఎలా ఉంది అని అడుగుతుంది అప్పు, బాగుంది అని చెప్తాడు కళ్యాణ్. అనుమానించిన అప్పు భోజనం టేస్ట్ చేసి వంట బాలేక పోతే బాగుందని చెప్తావేమి అని అడుగుతుంది. బాగోలేదంటే కోప్పడతావేమో అని అంటాడు కళ్యాణ్. నేను అంత గయ్యాళినా అంటుంది అప్పు. అబ్బే, నీకు అస్సలు కోపం రాదు చూడు ఎంత శాంతంగా అడుగుతున్నావో అంటాడు కళ్యాణ్. ఇద్దరూ నవ్వుకుంటారు.

Brahmamudi serial August 20th 2024

తర్వాత కళ్యాణ్ తెచ్చిన 6000 సగం సరుకుల కోసం, సగం సేవింగ్స్ కోసం అని ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ఇద్దరూ ఒకరిని ఒకరు పొట్టి, కూచి అని పిలుచుకోవాలని డిసైడ్ అవుతారు. మరోవైపు కూతురు గడప దాటి 24 గంటలు అయింది అది ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అనే ధ్యాస లేదు అని భర్త మీద విరుచుకుపడుతుంది కనకం.

వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అంటాడు కృష్ణమూర్తి. ఇంతలోనే అక్కడికి వచ్చిన బంటి కనకాన్ని భోజనం పెట్టమని అడుగుతాడు. టేబుల్ మీద ఉంది పెట్టుకొని తిను అని కోపం గా అంటుంది కనకం. అంతేలే నన్ను కాబట్టి అలా మాట్లాడుతున్నావు, అదే నీ కూతురు అడిగితే ఇలానే అంటావా అంటూ టేబుల్ దగ్గరికి వెళ్లి వడ్డించుకుంటూ ఉంటాడు బంటి. అప్పు అక్క వాళ్ళని మా రూమ్ లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాను.

తనని నేను సొంత అక్క లాగా చూసుకుంటే మీరు మాత్రం నన్ను కనీసం అద్దె కొడుకు లాగా కూడా చూసుకోవడం లేదు అంటూ భోజనం చేస్తూ ఉంటాడు బంటి. ఆ మాటలు విన్న కనకం దంపతులు ఆనందపడతారు. సంతోషంగా బంటి దగ్గరికి వచ్చి అప్పు గురించి వివరాలు కనుకుంటారు. బంటి రూమ్ లోనే సంతోషంగా ఉన్నారు అని తెలుసుకొని ఆనందపడతారు. బంటి ని సొంత కొడుకువి అంటూ తెగ పొగుడుతారు కృష్ణమూర్తి దంపతులు. మరోవైపు కావ్య టీ తీసుకువచ్చి భర్త ని లేపుతుంది. అలవాటుగా టీ అందుకోబోయిన రాజ్ ని వంద రూపాయలు అడుగుతుంది కావ్య. షాక్ అయిన రాజ్ ఎందుకు అని అడుగుతాడు.

నేను ఆస్తి కోసమే కదా ఈ ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత నాకు రూపాయి కూడా ముట్టలేదు అందుకే ఆస్తి సంపాదిద్దామని డిసైడ్ అయ్యాను. టీ కావాలంటే 100 ఇవ్వండి అంటుంది కావ్య. నీకేమైనా తిక్కా అంటాడు రాజ్. మరి ఆస్తి కోసమే వచ్చాను అని ఎందుకు అన్నారు, నాకేమైనా మీరు ఆస్తులు రాసిచ్చారా అని గొడవ పడుతుంది కావ్య. తర్వాత టీ కనీ, సోప్ కనీ బ్రష్ మీద పేస్ట్ అని 500 భర్త దగ్గర వసూలు చేస్తుంది. ఇలాగే సంపాదిస్తే బోలెడన్ని ఆస్తులు కొనుక్కోవచ్చు అంటూ కిందికి టిఫిన్ కి రండి అక్కడ కూడా భారీ మూల్యం చెల్లించి టిఫిన్ తినండి అని కిందికి వెళ్ళిపోతుంది.

మరోవైపు వంట చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పు. కళ్యాణ్ ఆమె దగ్గరికి వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి బట్టలు ఆమె చేతిలో పెడతాడు. సరుకులు తెమ్మంటే ఇవి తెచ్చావ్ ఏంటి అంటుంది అప్పు. నీకు బట్టలు లేవు కదా అందుకే బట్టలు తెచ్చాను, నీ దగ్గర ఉన్న డబ్బులతో సరుకులు తెచ్చుకుందాం ఆ డబ్బులు ఇవ్వు అంటాడు కళ్యాణ్.

అప్పు ఇంట్లోకి వెళ్లి బట్టలు తీసుకువస్తుంది. డబ్బులు తెమ్మంటే ఇవి తెచ్చావ్ ఏంటి అంటాడు కళ్యాణ్. నువ్వు ఎలాగూ సరుకులు తెస్తావు కదా అని నేను నీకు బట్టలు కొనేశాను అంటుంది అప్పు. ఇప్పుడు మనకి కపడా, మఖాన్ దొరికాయి ఇక రోటి దొరకాలి అనుకుంటారు ఇద్దరూ. మరోవైపు వంట చేస్తున్న కావ్యని కాఫీ అడుగుతుంది ఇందిరా దేవి. సరే అన్న కావ్య భర్త రావటం గమనించి వంద రూపాయలు అడుగుతుంది. షాక్ అవుతుంది ఇందిరా దేవి.

పక్కనే ఉన్న రుద్రాణి అదేంటి 100, ఇదేం కొత్త కాన్సెప్ట్ అని అడుగుతుంది. మీకు తెలియదు కదా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతోంది కావ్య. ఆమెని చెప్పకుండా ఆపుతూ ఉంటాడు రాజ్. ఇంట్లో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది మీకు ఏం టిఫిన్ కావాలో చెప్పండి అని రుద్రాణి అని అడుగుతుంది కావ్య. ఉప్మా పెసరట్టు కావాలి అన్న రుద్రాణి తో 500 డిమాండ్ చేస్తుంది కావ్య. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర టి అడిగితే ఆమెను కూడా 100 రూపాయలు అడుగుతుంది.కావ్య ప్రవర్తన అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు సుమిత్ర వాళ్లు.

కారణం చెప్పబోతున్న కావ్యని ఆపి మొన్న హోటల్ కి వెళ్ళినప్పుడు ఆ రేట్లు తెలుసుకుంది అవి మీకు చెప్తుంది అని కవర్ చేసి కావ్యని బయటకు తీసుకుపోతాడు రాజ్. ఏం చేస్తున్నావు అంటూ భార్యని కోప్పడతాడు. మరి మీరు ఎందుకు నన్ను అలా అన్నారు, ఏరోజైనా మీ దగ్గర నుంచి నేను రూపాయి ఆశించానా, నా పుట్టింటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు డబ్బులు ఇస్తానంటే వద్దన్నాను, అలాంటి మీరు నన్ను అంత మాట ఎలా అనగలిగారు అంటుంది కావ్య

తరువాయి భాగంలో కళ్యాణ్ కి కూడా పెళ్లయింది కాబట్టి మూడు జంటలతోని వరలక్ష్మీ వ్రతం చేయించాలనుకుంటున్నాను అంటుంది ఇందిరా దేవి. కళ్యాణ్ ఒప్పుకొని రావాలి కదా అంటుంది ధాన్యలక్ష్మి. నేను, చిట్టి వెళ్లి తీసుకొని వస్తాము అంటాడు సీతారామయ్య. తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాణి తో మాట్లాడుతూ అప్పుని కోడలుగా ఎప్పటికీ ఒప్పుకోను, తను ఇంటి నుంచి తిరిగి వెళ్లే లోపు తను ఈ ఇంటికి తగిన కోడలు కాదు అని నిరూపించి పంపిస్తాను అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X