Brahmamudi August 21th episode: రాజ్ నాటకం కనిపెట్టిన కళ్యాణ్.. మాస్టర్ ప్లాన్ వేసిన ఇందిరా దేవి!
ధాన్యలక్ష్మి కి కళ్యాణ్ పరిస్థితి చూపించి గొడవపడమని రెచ్చగొట్టి ఇంటికి తీసుకువస్తుంది రుద్రాణి. ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి ఆస్తి ని ముక్కలు చేయమంటు గొడవ పెట్టుకుంటుంది. కళ్యాణ్ తిరిగి వచ్చేవరకు రాజ్ ని కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకోమంటాడు సీతారామయ్య. ఆస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి పిలవడం లేదని కావ్యని కోప్పడతాడు రాజ్. అస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి రానివ్వడం లేదు అని భార్యపై కోప్పడిన భర్తకి చుక్కలు చూపిస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 21వ తేదీ ఎపిసోడ్ 494 లో ఏం జరిగిందంటే..
కావ్య భర్తతో మాట్లాడుతూ నేను పడే కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తున్నారా, భర్తగా మీరే గుర్తించడం లేదు. నేను ఐదు గంటలకి లేచే సమయానికి మీరు గుర్రు పెట్టి నిద్రపోతారు, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏ నిమిషానికి ఏది కావాలో అది అందిస్తూ వస్తున్నాను, ఇంట్లో పని చేసే కోడలు ఉంటే ఇంట్లో వాళ్ళు అక్కడ కప్పు ఇక్కడ పెట్టరు. అవి కూడా నేనే తీసుకు వెళ్ళాలి అంటూ పెద్ద లిస్టు చదువుతుంది కావ్య.

ఆ మాటలు వినలేక రాజ్ ఆపమంటాడు. చేసిన పనులు చెప్తేనే మీకు అంత చికాకుగా ఉంటే చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది. అలాంటి నన్ను పట్టుకొని ఆస్తికోసం ఆశపడుతున్నానంటారా పదండి మీ గురించి ఇంట్లో అందరికీ చెప్తాను అంటుంది కావ్య. నువ్వు మా ఇంటి దీపానివి,మా ఇంటిని ఉద్ధరించడానికి పుట్టిన దేవతవి నీకు ఆస్తి మీద ఆశ లేదు.
నిన్ను అన్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి అంటాడు రాజ్. ఇంకొక మాట మిగిలిపోయింది నాకు కళ్యాణ్ ఇంటికి రావడం ఇష్టం లేదా అని అడుగుతుంది కావ్య. ఈ మాట మాత్రం నిజం,వాడు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు, అయినా పర్వాలేదు ఎలా అయినా నేను ఇంటికి తీసుకు వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. భర్త పరిస్థితి చూసి నిద్రలో కూడా ఇకపై నోరు జారరు అని నవ్వుకుంటుంది కావ్య.

మరోవైపు డబ్బులు ఎలా సంపాదించడం అని ఆలోచిస్తున్న కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీరు షాపింగ్ చేశారు మీకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ వచ్చింది అని చెప్తాడు. నేను షాపింగ్ చేసి గంట కూడా కాలేదు అప్పుడే డ్రా తీయడం విన్ అయిపోవడం కూడా అయిపోయిందా అంటాడు కళ్యాణ్. ఇప్పుడు కాదు నెల క్రితం మీరు షాపింగ్ చేసిన లక్కీ డ్రా ఇది అంటాడు వచ్చిన వ్యక్తి. మీరు చెప్పిన ప్లేస్ లో నేనెప్పుడూ షాపింగ్ చేయలేదు అంటాడు కళ్యాణ్. వచ్చిన వ్యక్తి తడబడతాడు. మరి ఊరికినే ఐదు లక్షలు ఎందుకు తెచ్చాడు అంటుంది అప్పు.

ఇదంతా రాజ్ ఆడిస్తున్న నాటకం అనే గ్రహించిన కళ్యాణ్ వచ్చిన వ్యక్తి ఇయర్ ఫోన్ తీసుకొని అన్నయ్య.. నువ్వు పంపించిన జూనియర్ ఆర్టిస్ట్ దొరికిపోయాడు అంటాడు కళ్యాణ్. షాక్ అయిన రాజ్ తమ్ముడు దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్య ఇది అని అడుగుతాడు కళ్యాణ్. నువ్వు ఇంటికి రమ్మంటే రావడం లేదు, కనీసం నేను అప్పుగా డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోవటం లేదు, మిమ్మల్ని ఇలా చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నాను మరేం చేయమంటావు అంటాడు రాజ్. నా మీద నీకు నమ్మకం లేదా నా భార్యను నేను పోషించుకోలేనా అంటాడు కళ్యాణ్.

నీ మీద నమ్మకం లేక కాదు అయినా నిన్ను కాదు ఆ కళావతిని అనాలి, తనే నిన్ను ఇలా తయారు చేసింది అని భార్యని తిడుతూ ఉంటాడు రాజ్. అదే సమయంలో భోజనం చేస్తున్న కావ్య పొలమారుతుంది అపర్ణ వచ్చి మంచినీళ్లు ఇచ్చి నెమ్మదిగా భోజనం చేయవచ్చు కదా అంటుంది. ఇది భోజనం వల్ల వచ్చింది కాదు మీ అబ్బాయి ఎక్కడో గట్టిగా నన్ను తలుచుకుంటున్నారు అంటుంది. ఇంతలోనే స్వప్న వచ్చి అత్తా కోడలు ఒకటైపోయి నన్ను పట్టించుకోవడం లేదు అంటుంది.
నిన్ను పట్టించుకోవటం ఏమిటి నువ్వే మీ అత్తగారిని ఒక ఆట ఆడుకుంటున్నావు. రుద్రాణి ఈ ఇంట్లో ఒక్క పని కూడా చేయటం నేనెప్పుడూ చూడలేదు అలాంటి తనని టిష్యూ పేపర్ లాగా వాడేస్తున్నావు అంటుంది అపర్ణ. మీరు నన్ను తిడుతున్నారాంటీ అంటుంది స్వప్న. మా అత్తగారి ప్రేమ కూడా తిట్లు లాగే ఉంటాయి అయినా నిన్ను ఏం పట్టించుకోలేదు అంటుంది కావ్య హాస్పిటల్ కి వెళ్దాం అనుకున్నాం కదా అంటుంది స్వప్న. అవును కదా మర్చిపోయాను అంటూ తింటున్న ప్లేట్ సింక్ లో పడేసి అక్కతో పాటు వెళ్ళిపోతుంది కావ్య.

పిచ్చి పిల్ల కష్టాన్ని కూడా కామెడీ చేస్తూ ఆనందంగా బ్రతికేస్తుంది అని కావ్య గురించి అనుకుంటుంది అపర్ణ. మరోవైపు కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు రాజ్. అక్కడికి వచ్చిన అపర్ణాదేవి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. కళ్యాణ్ గురించి చెప్తాడు రాజ్. వాడు శాశ్వతంగా రాకపోవచ్చు కానీ ఒక్కరోజు ఉండే ఏర్పాట్లు చేస్తాను వచ్చిన వాడిని ఇక్కడే ఉంచే ఏర్పాట్లు నువ్వు చేయాలి అంటుంది ఇందిరాదేవి. ఎలా నానమ్మ అంటాడు రాజ్.
ఎల్లుండి వరలక్ష్మీ వ్రతం ఉంది కొత్త కోడలతో వ్రతం చేయించాలని నియమం పెడతాను, అప్పుడు కళ్యాణ్ భార్యని తీసుకొని తప్పకుండా ఇక్కడికి రావాలి. వచ్చిన వాళ్ళని శాశ్వతంగా ఇక్కడే ఉండేలా నువ్వు చూడాలి అంటుంది ఇందిరా దేవి. సరే అంటాడు కళ్యాణ్. మరుసటి రోజు తన ఆలోచన ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది ఇందిరా దేవి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ధాన్యలక్ష్మి మనసు మార్చేసేలా ఉన్నారు అనుకుంటుంది రుద్రాణి.
తరువాయి భాగంలో సీతారామయ్య దంపతులు ఇద్దరూ వెళ్లి కళ్యాణ్ దంపతులని పూజకి ఆహ్వానిస్తారు. మరోవైపు రుద్రాణి తో మాట్లాడుతున్న ధాన్యలక్ష్మి పూజ కోసం హడావుడి పడుతున్న కావ్య ని చూసి ఇక్కడ చెల్లెలికి జరగబోయే అవమానం గురించి తెలియక హడావుడి చేస్తుంది. ఆ అప్పు ఈ ఇంటి కోడలుగా పనికిరాదని రుజువు చేసి తీరుతాను అంటుంది.


Click it and Unblock the Notifications











