Brahmamudi August 22th episode: రాజ్ మాస్టర్ ప్లాన్.. ఇంట్లో సునామీనే అంటున్న కావ్య!

ధాన్యలక్ష్మి ఆస్తి ని ముక్కలు చేయమంటు గొడవ పెట్టుకుంటుంది. కళ్యాణ్ తిరిగి వచ్చేవరకు రాజ్ ని కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకోమంటాడు సీతారామయ్య. ఆస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి పిలవడం లేదని కావ్యని కోప్పడతాడు రాజ్. అస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి రానివ్వడం లేదు అని భార్యపై కోప్పడిన భర్తకి చుక్కలు చూపిస్తుంది కావ్య. కళ్యాణి ఇంటికి రప్పించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్.పండక్కి ఒక ఫోటో పూజ కోసం నేను పిలుస్తాను వాళ్ళని శాశ్వతంగా ఇంట్లో ఉంచే బాధ్యత నీది అని కాస్త అంటుంది ఇందిరా దేవి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 22వ తేదీ ఎపిసోడ్ 495 లో ఏం జరిగిందంటే..

ధాన్య లక్ష్మీ పిన్ని కూడా ఒప్పుకుంది కాబట్టి ఇక ఇంట్లో అందరూ కలిసిపోవచ్చు అంటాడు రాజ్. కావ్య కంగారు పడటం చూసి ఇక్కడ కొందరికి కళ్యాణ్ వాళ్ళు రావడం ఇష్టం లేనట్లుంది అంటాడు రాజ్. మధ్యలో నన్ను ఎందుకు అంటారు, రేపు ఎవరైనా అప్పు వాళ్ళు రావడానికి కారణం నేనే అంటే అని ప్రశ్నిస్తుంది కావ్య. దుమ్ము దులిపేయమని సలహా ఇస్తుంది అపర్ణ. వియ్యాలవారిని కూడా పిలుద్దాము అంటాడు ప్రకాష్. ఇప్పుడు వాళ్లు ఎందుకు అంటుంది ధాన్యలక్ష్మి. మా వియ్యంకులుగా వస్తారులే అంటుంది అపర్ణ. అయినా కళ్యాణ్ వాళ్ళు ఒప్పుకొని పూజకు రావాలి కదా అంటుంది ధాన్యలక్ష్మి.

Brahmamudi serial August 22nd 2024 Episode of 495 Here is full story

నువ్వే వెళ్లి పిలువు అంటుంది అపర్ణ. చచ్చినా ఆ పని చేయను అంటుంది కావ్య. మేము వెళ్లి పిలుస్తాము అంటారు సీతారామయ్య దంపతులు పెద్దవాళ్లుగా మీరు వెళ్లి పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది ధాన్యలక్ష్మి. ఆమె ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది ధాన్యలక్ష్మి. మరోవైపు కావ్య తల్లిదండ్రులకి ఫోన్ చేసి వ్రతం విషయం చెప్పి తల్లిదండ్రులని ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఆ ఇంటికి రావడం ఏమిటి అని కంగారుగా అడుగుతుంది కనకం.

అదంతా నాకు తెలియదు మా అత్తయ్య గారు మిమ్మల్ని పిలవమని చెప్పారు అంటుంది కావ్య. కావ్య దగ్గర ఫోన్ తీసుకుని అపర్ణ కనకం వాళ్ళతో మాట్లాడుతూ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. కనకం ఏవో సాకులు చెప్పాలని చూస్తుంది కానీ అపర్ణ కచ్చితంగా వచ్చి తీరాలి అని చెప్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంటయ్యా ఇది, అప్పు ని ఇంటికి పిలవటం ఏమిటి అని భర్తతో అంటుంది కనకం. ఒకవేళ అప్పుని కోడలుగా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారేమో అంటాడు కృష్ణమూర్తి.

Brahmamudi serial August 22nd 2024 Episode of 495 Here is full story

పెళ్లిలో ధాన్యలక్ష్మి ఎంత గొడవ చేసిందో చూశారు కదా, అలాంటిది అప్పు రేపు ఇంటికి వెళ్తే ధాన్యలక్ష్మి ఎన్ని మాటలు అంటుందో, దానికి అప్పు ఎలా రియాక్ట్ అవుతుందో, ఏంటో ఇవన్నీ చూస్తూ నేనేం మాట్లాడతానో అందుకే నేను ఆ ఇంటికి రేపు రాలేను రేపు నాకు అన్ని రకాల జబ్బులు వచ్చేస్తాయి అంటుంది కనకం. మరోవైపు ఒంటరిగా కూర్చున్న ధాన్య లక్ష్మీ దగ్గరికి వచ్చిన రుద్రాణి ఈ ఏటి మేటి అత్తగారిగా నీకు అవార్డు ఇవ్వవచ్చు అంటుంది.

అప్పుని ఇంటికి రావడానికి ఒప్పుకున్నానని దాన్ని కోడలుగా ఒప్పుకుంటాను అనుకుంటున్నావా, అది ఇక్కడ నుంచి వెళ్లే లోపు అప్పు ఇంటికోడలుగా అస్సలు పనికిరాదని అందరికీ నిరూపిస్తాను. అందరూ అప్పు కి సపోర్ట్ గా ఉన్నారు నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావు అంటుంది రుద్రాణి. నువ్వు బయట ముత్తయిదువులని కూడా ఆహ్వానించు, ఇంట్లో వాళ్ళ ముందు అవమానపరిస్తే మనవాళ్లే అని సర్దుకుంటారు కానీ బయట వాళ్ల ముందు అవమానపరిస్తేనే ఇంట్లో వాళ్ళందరూ నిజం అని ఒప్పుకుంటారు అంటుంది ధాన్యలక్ష్మి.

నీకు ఎన్ని తెలివితేటలు అని ధాన్యలక్ష్మిని పొగుడుతుంది రుద్రాణి. మరోవైపు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వచ్చిన సీతారామయ్య దంపతులు పూజ విషయం చెప్పి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అమ్మ, రుద్రాణి అత్త అప్పుని అవమానిస్తారు అంటాడు కళ్యాణ్. కారణాలు ఏవైనా ఉండొచ్చు అందుకని బంధాలని వదిలేసుకుంటామా, నీకు నచ్చిన పెళ్లి చేసుకున్నావు అయినా మేము మీ దగ్గరికి వచ్చాం కదా దేనికైనా పట్టు విడుపు ఉండాలి అంటాడు సీతారామయ్య.

Brahmamudi serial August 22nd 2024 Episode of 495 Here is full story

మొత్తానికి కళ్యాణ్ వాళ్ళని ఇంటికి రావడానికి ఒప్పిస్తారు సీతారామయ్య దంపతులు. మరోవైపు ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటాడు రాజ్. అప్పుడే లోపలికి వచ్చిన భార్యని పూజ వ్యవహారాలు ఎంతవరకు వచ్చాయని కనుక్కుంటాడు తర్వాత షాకింగ్ విషయం చెప్తాను అంటూ కళ్యాణ్ వాళ్ళు రేపు పూజ కోసం మాత్రమే రావటం లేదు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి వస్తున్నారు అంటాడు. అందుకు కవి గారు ఒప్పుకున్నారా అంటుంది కావ్య.

నేను మాస్టర్ ప్లాన్ వేస్తే తిరుగుండదు రేపు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అంటాడు రాజ్. ఇంట్లో సునామీ సృష్టించేలాగా ఉన్నారు రేపు ఏం జరుగుతుందో అని కంగారు పడుతుంది కావ్య. మరోవైపు కళ్యాణ్ దగ్గరికి వచ్చిన అప్పు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నానమ్మ వాళ్ళు ఎంత అడ్డుకున్నా రుద్రాణి అత్త వాళ్ళు నిన్ను ఏదో ఒకటి అని అవమానిస్తారు అంటాడు కళ్యాణ్.

తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన కళ్యాణ్ దంపతులని హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించమని ధాన్యలక్ష్మితో చెప్తుంది ఇందిరా దేవి. అప్పు ఫాంట్ షర్ట్ లో రావడం చూసిన రుద్రాణి వస్తున్నది పూజకని తెలుసు కదా, పబ్బుకో, పార్టీకో వెళ్తున్నట్లు అలా రావటం ఏమిటి అని వెటకారంగా మాట్లాడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X